Spokesperson
-
గుండెపోటుతో కన్నుమూసిన బీజేపీ కీలక నేత
భోపాల్: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో మధ్యప్రదేశ్ యూనిట్ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి 'గోవింద్ మాలూ' గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని స్థానిక పార్టీ నాయకుడు గురువారం తెలిపారు. బుధవారం భోపాల్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత రాత్రి భోజనం చేశారు. ఆ తరువాత ఇంటి వద్ద గుండెపోటుకు గురయ్యారని సన్నిహితులు పేర్కొన్నారు.గుండెపోటు రావడంతోనే హుటాహుటిగా గోవింద్ మాలూను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మాలూ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గురువారం ఉదయం ఇండోర్ చేరుకున్నారు.గోవింద్ మాలూ బీజేపీకి పెద్ద ఆస్తి అని మోహన్ యాదవ్ అన్నారు. కార్డియాక్ అరెస్ట్‌తో మాలూ ఆకస్మిక మృతి పట్ల చాలా బాధపడ్డాను. పార్టీకి సంబంధించిన అనేక బాధ్యతలు ఆయన నిర్వహించారని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విష్ణు దత్ శర్మ, పార్టీ రాష్ట్ర సంస్థ ప్రధాన కార్యదర్శి హితానంద్, ఇతర సీనియర్ నేతలు కూడా మాలూ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.మాలూ బీజేపీ రాష్ట్ర విభాగానికి మీడియా ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. అంతేకాకుండా రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు స్థానిక వార్తాపత్రికల్లో స్పోర్ట్స్ రివ్యూలు రాశారు. ఆయనకు తల్లి, భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
సాక్షి,తాడేపల్లి: విద్యారంగంలో మార్పులు చూసి పెత్తందార్లు, వారి పాలేర్ల కడుపుమండుతోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్న్నారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.– పేద విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదగాలని, గవర్నమెంట్ స్కూల్స్‌లో చదువుతున్న పిల్లలు గ్లోబల్ స్టేజ్‌కి ఎదగాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.– అమ్మ ఒడితో ఆర్థిక సాయం అందించినా, నాడు–నేడుతో స్కూల్స్ భవనాలు బాగుచేసినా గోరుముద్దతో ఆకలి తీర్చినా అది జగనన్నకే సాధ్యమైంది.– ఐఎఫ్‌పీ ప్యానళ్లు ఇచ్చినా, స్మార్ట్ టీవీలిచ్చినా, 8వ తరగతి నుంచి ట్యాబ్‌లు ఇచ్చినా మనసున్న జగనన్నకే చెల్లింది. – ప్రపంచ ప్రమాణాలతో మన రాష్ట్రంలోని బడుగు బలహీనవర్గాల విద్యార్థులు చదువుకుంటున్న తీరు కళ్లముందే కనిపిస్తోంది. – భారత దేశమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా జగన్మోహన్రెడ్డి గారు 5 ఏళ్ళ పరిపాలన చేశారు.– సీఎం జగన్ రూ.73వేల కోట్లు వెచ్చించి విద్యారంగంలో ప్రపంచస్థాయి విప్లవాత్మక మార్పులు తెచ్చారు.– దీంతో, పెత్తందారుల ప్రతినిధి చంద్రబాబు, వారి వద్ద పాలేరుగా పనిచేస్తున్న పవన్ కల్యాణ్‌లకు కడుపు మండిపోయింది.– మేం అధికారంలోకి వస్తే ఇంగ్లీషు మీడియం రద్దు చేస్తాం..కేజీ టు పీజీ విద్యను రివ్యూ చేస్తామని చంద్రబాబు కూటమి బాహాటంగానే చెప్తుంది.– నాడు–నేడు, విద్యాదీవెన, వసతి దీవెన వంటివన్నీ రద్దు చేస్తామని నిస్సిగ్గుగా చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నాయి.– మొన్నటికి మొన్న అమిత్‌షా ధర్మవరం సభలో మాట్లాడుతూ, చంద్రబాబు- పవన్ కల్యాణ్ లను పక్కనపెట్టుకుని ఇంగ్లీషు మీడియంపై తన అక్కసు వెళ్ళగక్కారు. దీనినిబట్టి, వీరంతా, పేద పిల్లల ఇంగ్లీషు మీడియం చదువులకు వ్యతిరేకం అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. మీ బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్లు ఏ మీడియంలో చదివారు?– చంద్రబాబూ.. నువ్వు నారా లోకేశ్‌ను ఇంగ్లీషు మీడియంలో చదివించలేదా? – పవన్ కల్యాణ్..1984లో నువ్వు నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీషు మీడియం స్కూళ్లో చదువుకోలేదా?– 40 ఏళ్ల క్రితం పవన్ కల్యాణ్‌ని ఆయన తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియంలో చదివించారు.– సరే ఆయనకు చదువు అబ్బలేదు..గాలికి తిరిగాడు..అది ఆయన వ్యక్తిగతం.– 2024లో బడుగు బహీనవర్గాలు, దళితులు, బీసీలు, మైనార్టీలు వాళ్ల బిడ్డల్ని ఇంగ్లీషు మీడియంలో చదివించుకోవాలని కోరుకోవడంలో తప్పేంటి?– ఈనాడు రామోజీరావు కొడుకులు, మనవళ్లు, మనవరాళ్లు అందరూ ఇంగ్లీషు మీడియంలోనే చదువుకున్నారు కదా..!– ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.., నీ కుమారుడు, కుమార్తె ఇంగ్లీషు మీడియంలోనే చదువుకున్నారు కదా.– ప్రపంచ స్థాయిలో ఉన్న అన్ని సదుపాయాలు మీ బిడ్డలకు, మనవళ్లకు, మనవరాళ్లకు అందించారే..పేద ప్రజలకు అందితే ఎందుకంత కంటగింపు? – జగన్ గారు నాడు-నేడు ద్వారా గవర్నమెంటు బడుల రూపురేఖలు పూర్తిగా మార్చారు. 3వ తరగతి నుంచి టోఫల్, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ తో ప్రపంచస్థాయి మేటి విద్యను ఆంధ్రప్రదేశ్ లో పేద పిల్లలకు అందిస్తున్నారు. – ఏపీలోని బడుగు బలహీనవర్గాల ఆత్మగౌరవాన్ని ఐక్యరాజ్యసమితిలో ఎగరేస్తే..మీకెందుకు అంత కడుపుమంట?ఇంటికో ఉద్యోగం అని, తన ఇంట్లో లోకేశ్‌కు మాత్రమే ఉద్యోగం ఇచ్చుకున్నాడు– చంద్రబాబు తన మేనిఫెస్టోలో 20లక్షల ఉద్యోగాలిస్తాను. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు.– 2014లోనూ చంద్రబాబు ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి అన్నాడు.– ఆయన అధికారంలోకి రాగానే, తన ఇంట్లో ఉన్న దద్దమ్మ లోకేశ్‌కు మాత్రం ఉద్యోగం ఇచ్చుకున్నాడు. ఇంకెవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు.– చంద్రబాబు 2014–19 కాలంలో 34,108 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశాడు.– జగన్ గారు సీఎం అయ్యేటప్పటికీ ఏపీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 3.97లక్షలు. – జగన్ గారి ఐదేళ్ల పరిపాలన పూర్తైన తర్వాత శాశ్వత ప్రాతిపదికన 2.31లక్షల ఉద్యోగాలిచ్చారు.– కాంట్రాక్టులో 43,923 మందికి, ఔట్ సోర్సింగ్‌లో 3.73లక్షల ఉద్యోగాలు ఇచ్చారు.– మొత్తం కలిపితే 6.38లక్షల మందికి కేవలం ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు ఇచ్చారు.– చంద్రబాబునాయుడు నేను ఉద్యోగాల సృష్టి చేస్తాను అంటున్నాడు.– తన హయాంలో చంద్రబాబు ప్రైవేటు రంగంలో కల్పించిన ఉద్యోగాలు కేవలం 38వేలు మాత్రమే. ఇది కేంద్ర వాణిజ్య శాఖ వద్ద ఉన్న సమాచారం. – సీఎం జగన్ ప్రైవేటు రంగంలో ఈ ఐదేళ్లలో 6.07లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. – చంద్రబాబు కియా కారు తీసుకొచ్చాడు.. జాకీ డ్రాయర్ తీసుకొచ్చాడు అని ఎల్లో మీడియా ఊదరగొడుతోంది.– జగన్ గారు తన ఐదేళ్ల తర్వాత ఏపీలో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు, దాని ద్వారా 3.47 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి.– ఇక జగన్ గారి తెచ్చిన కంపెనీలు చూస్తే ఇన్ఫోసిస్, విప్రో, డైకిన్, అమేజాన్, బ్లూస్టార్, టీసీఎల్ వంటివి అనేకం ఉన్నాయి.– విశాఖ, దావోస్ ఒప్పందాలన్నీ కలుపుకుంటే రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి.– వాటిలో ఐదారు లక్షల కోట్ల వరకూ పెట్టబడులు కార్యరూపం దాల్చాయి. వీటివల్ల సుమారు 6లక్షల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది.– వీటన్నిటినీ రాష్ట్రంలో ఉన్న యువత, అభివృద్ధి కోరుకునే వారు గమనించాలని కోరుకుంటున్నా.– 2019లో బడిలో ఓటు వేసి ఉంటారు. ఇప్పుడు అదే బడికి ఓటు వేయడం కోసం వెళ్తున్నారు.– ఇప్పుడు ఆ ప్రభుత్వ బడి రూపురేఖలు ఎలా ఉన్నాయో చూడండి. జగన్ గారి నాయకత్వంలో ప్రభుత్వ బడి- ఒక గుడి గా మారింది. సీఎం జగన్ పేద, బడుగు, పిల్లలు చదువుకునే బడిని సరస్వతీ నిలయమైన గుడిలా మార్చారు. ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ సీఎం జగన్ చేసిన సంక్షేమాన్ని - అభివృద్ధిని గుర్తు చేసుకుని విజ్ఞతతో ఓటు వేయండి’ అని కోరారు. -
Lok sabha elections 2024: బీజేపీలో చేరిన రోహన్ గుప్తా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి రోహన్ గుప్తా బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఐఏఎస్ మాజీ అధికారి పరంపల్ కౌర్, ఆమె భర్త, శిరోమణి అకాలీదళ్ సీనియర్ నేత సికందర్ బీజేపీలో చేరారు. జాతీయవాదం, సనాతన ధర్మం వంటి అంశాలపై సంప్రదాయ వైఖరి నుంచి వైదొలిగిన కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను కోల్పోయిందని గుప్తా పేర్కొన్నారు. -
సమావేశాలు విజయవంతం.. ఆ క్రెడిట్ మొత్తం భారత్‌దే
వాషింగ్టన్: భారత దేశంలో జరిగిన 18వ జీ20 సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. తొలిసారి నిర్వహించినా భారత్ ఈ సమావేశాలను అద్భుతంగా నిర్వహించిందని సభ్య దేశాలు అభినందిస్తున్నాయి. ఈ సందర్బంగా అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ భారత్ నిర్వహించిన ఈ సమావేశాలు సూపర్ సక్సెస్ అయ్యినట్లు నమ్ముతున్నామన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ ఛానల్ ప్రతినిధి జీ20 సమావేశాలు విజయవంతమైనట్టేనా అని అడిగిన ప్రశ్నకు మాథ్యూ మిల్లర్ సమాధానమిస్తూ.. భారత్ జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించిందని విశ్వసిస్తున్నానన్నారు. జీ20 అనేది చాలా పెద్ద సంస్థ. రష్యా చైనాలు కూడా ఇందులో భాగస్వాములే. సమావేశాలకు రష్యా గైర్హాజరు కావడంపై ప్రశ్నించగా రష్యా ఉక్రెయిన్ అంశంపై సభ్యులందరివీ భిన్నకోణాలు అయినప్పటికీ భారత్ సిద్ధం చేసిన డిక్లరేషన్‌లో ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన సూత్రాలను ఉల్లంఘించరాదని వారు రాసిన ఆ మాట రష్యా ఉక్రెయిన్‌పై చేసిన దాడిని సూటిగా స్ఫురించి సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడానికి దోహదపడిందన్నారు. #WATCH | On the question of the absence of Russia word from the New Delhi Leaders’ Declaration and whether the G20 Summit was successful, US State Department Spokesperson Matthew Miller says, "We absolutely believe it was a success. The G20 is a big organisation. Russia is a… pic.twitter.com/NgQGhC5iAM — ANI (@ANI) September 11, 2023 అణ్వాయుధాలను చూపించి భయపెట్టడం కానీ వాటిని ప్రయోగించడం కానీ ఆమోదయోగ్యం కాదని యుద్ధాన్ని గురించి వారు ప్రస్తుతించిన విధానం అద్భుతమన్నారు. డ్రాఫ్ట్‌లో ఎక్కడా రష్యా పేరెత్తకుండా ఉక్రెయిన్‌లో సమగ్రమైన, న్యాయమైన, మన్నికైన శాంతిని నెలకొల్పాలని అంతిమంగా అంతర్జాతీయ ఆర్ధిక సహకారం అందించడమే ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశ్యమని వారు చెప్పిన విధానం బాగుందన్నారు. మొత్తంగా డిక్లరేషన్‌పై సభ్యదేశాల ఏకాభిప్రాయం సాధించడమే భారత్ సాధించిన గొప్ప విజయమన్నారు. బిల్ గేట్స్ కూడా.. జీ20 సమావేశాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి భారత్ చూపించిన చొరవ అనిర్వచనీయమన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాత్రపై ఏకాభిప్రాయం సాధించి ప్రాపంచిక సంక్షేమానికి పెద్దపీట వేశారు. సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎక్స్(ట్విటర్)లో రాశారు. The #G20 reached a groundbreaking consensus on the role of digital public infrastructure as a critical accelerator of the Sustainable Development Goals. I'm optimistic about the potential of DPI to support a safer, healthier, and more just world. Kudos to PM @narendramodi.… — Bill Gates (@BillGates) September 11, 2023 ఇది కూడా చదవండి: ఆ విషయంలో భారత్‌ను మెచ్చుకోవాల్సిందే.. చైనా -
బీజేపీ 40 సీట్లుకె పరిమితం
-
పట్టాభీ.. ఏంటిది?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు కోపం వచ్చింది. అన్నీ ఇలాగే చేస్తున్నాడంటూ అసహనం వ్యక్తం చేయడంతో పాటు ముందే దూరం పెట్టి ఉంటే పార్టీ ఇంతగా భ్రష్టుపట్టింది కాదని కూడా అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. అంతేనా! గన్నవరం విధ్వంసంపై చంద్రబాబు పేరిట ప్రజలకు విడుదలచేసిన నాలుగు పేజీల బహిరంగ లేఖలో మాటవరసకైనా పట్టాభి పేరును ప్రస్తావించకపోవడం పరిశీలనాంశం. గన్నవరం సంఘటన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాలో పార్టీ పరిస్థితి పూర్తిగా అయిపోయిందని జిల్లా నాయకులతో నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఆగ్రహావేశాలు వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. నాయకుల పనితీరునూ తూర్పారపట్టిన ఆయనకు ఆ తరువాత పలు విషయాల గురించి తెలియవచ్చింది. జిల్లాకు చెందిన ముఖ్యనాయకులు కొందరు కొన్ని నెలలుగా చోటుచేసుకుంటున్న అంశాలను, అంతకు ముందు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దారుణ పరిణామాలను ఏకరువు పెట్టడంతో పాటు సీనియర్లుగా తాము కూడా ఏమీ చేయలేకపోతున్నామని వాపోయారనేది అత్యంత విశ్వసనీయ సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు మీకిలాంటివి ఏమీ పట్టలేదని, అప్పుడే కొంతయినా సరిచేసి ఉంటే ఇంతలా పరిస్థితులు ఇప్పుడు తలెత్తేవి కావని అనడంతో చంద్రబాబు కూడా మౌనం వహించారని తెలిసింది. ముఖ్యమంత్రిని ఇతర నాయకులను ఇష్టానుసారం పరుషపదజాలంతో మాట్లాడటం సరికాదని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని చెప్పడంతో తమ నాయకుడు మారుమాట్లాడలేదని సమాచారం. అలా చేయడం ముమ్మాటికీ తప్పే.. బీసీ వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడు గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండగా పార్టీ ఆదేశిస్తే తానే పోటీచేస్తానంటూ పట్టాభి ఇష్టానుసారం మాట్లాడటంతో నియోజకవర్గానికి చెందిన వారు కూడా అంటీముట్టనట్లు ఉన్నారని విశ్లేషించారు. తనంతట తాను గొప్ప నాయకునిగా పోల్చుకుంటూ రాష్ట్ర, జిల్లాలోని సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడం, కేశినేని నాని కార్యాలయంలో ఉంటూ పలు ఆరోపణలను ఎదుర్కోవడం, వివాదాలకు కారకుడనే గుర్తింపు తెచ్చుకోవడం తదితరాలతో పాటు పట్టాభి గతంలో అమెరికాకు వెళ్లి ఎన్ఆర్ఐల వద్ద పార్టీపేరు చెప్పి స్వీయ ప్రయోజనాలు పొందారని వివరించడంతో, అవునా అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారని తెలిసింది. ‘పట్టాభి గురించి తెలియాల్సిన అంశాలన్నీ మా సార్‌కు ఇప్పటికి తెలిసొచ్చాయి. అతను అంత యూజ్లెస్ నా అంటూ మండిపడ్డారు. ఇలాంటి వారి విషయంలో ముందే జాగ్రత్తపడి ఉంటే బాగుండేది. అతని మాటలవల్లే కదా మంగళగిరి, గన్నవరంలో పార్టీ ఆఫీసులపై దాడులు జరిగాయి’ అని ప్రస్తావనకు వచ్చిందని ఓ సీనియర్ నాయకుడు ‘సాక్షి’కి తెలిపారు. లోకేష్ పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఇలాంటివన్నీ అవసరమా? మొత్తం డైవర్ట్ అయిపోయిందిగా. పార్టీ కూడా బాగా బదనాం అయ్యింది. అన్నింటికన్నా ముఖ్యంగా పట్టాభికి సంబంధించిన ఆ పాత ఫొటోలు ఎవరు పోస్ట్ చేశారో.. అన్నివిధాలా చాలా డ్యామేజ్ అయ్యిందని ముఖ్యనాయకుల వద్ద బాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పట్టాభి పేరు కూడా లేదాయె... ‘గన్నవరం విధ్వంసం– ప్రజలకు బహిరంగ లేఖ’ అంటూ చంద్రబాబు పేరిట ఇదివరకే పార్టీ విడుదల చేసింది. నాలుగు పేజీల ఆ లేఖలో పట్టాభి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. గన్నవరం టీడీపీ బీసీ నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా పేరు మాత్రం రెండు చోట్ల ప్రముఖంగా ఉంది. దీన్నిబట్టి పట్టాభి విషయంలో పార్టీ ఎలాంటి అభిప్రాయానికి వచ్చి ఉంటుందో స్పష్టమైపోతోందని విజయవాడకు చెందిన మరో నాయకుడు అభిప్రాయపడ్డారు. పట్టాభి వ్యవహార శైలిని జిల్లా నాయకుల ద్వారా స్పష్టంగా తెలుసుకున్న నేపథ్యంలోనే గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేషన్ కమిటీని అధిష్టానం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నేతృత్వంలో తక్షణం నియమించినట్లు స్పష్టమవుతోంది. -
‘సీబీఎన్’ అంటే కొత్త అర్థం చెప్పిన వైఎస్సార్సీపీ నేత కొండా రాజీవ్
సాక్షి, అమరావతి: ప్రజా జీవితంలో ఉండేందుకు లోకేష్‌కు అర్హత లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసలు లోకేష్ బాడీ లాంగ్వేజ్ ఏంటి? లోకేష్ భాష ప్రపంచంలోనే ఎవరూ మాట్లాడరు. లోకేష్‌కు వచ్చేంది పచ్చి బూతుల భాష మాత్రమే. సీబీఎన్.. అంటే చంద్ర బూతుల నాయుడు అని పెట్టుకోండి’’ అంటూ దుయ్యబట్టారు. లోకేష్.. ఐరన్ లెగ్ ఆఫ్ ఏపీ. లోకేష్ బతుకంతా ఫెయిల్. సీఎంపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇలాగే మాట్లాడితే లోకేష్‌కు గుణపాఠం తప్పదు. సీఎం జగన్ పెట్టిన అభ్యర్థిపై లోకేష్ ఓడిపోయారు. మంగళగిరిలో ఆర్కే పులి.. లోకేష్ పిల్లి. పాతికేళ్ల డీఎస్సీ సమస్య పరిష్కరించిన ప్రభుత్వం మాది. లక్షలాది గ్రామ, వార్డు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే. విశాఖ అన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు అనువైన ప్రాంతం. కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల వద్ద చలి కాచుకోవడం చంద్రబాబుకు అలవాటు’’ అని కొండా రాజీవ్ ధ్వజమెత్తారు. చదవండి: బెజవాడలో టీడీపీ గూండాల బరితెగింపు -
చావు ఇంటికి వెళ్లి నవ్వుతావా? ఇదేం పద్ధతి? రాహుల్‌పై బీజేపీ ఫైర్..
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, జేయూయూ నేత శరద్ యాదవ్ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ సందర్భంలో నవ్వుతూ కన్పించారు. ఈ పొటోను షేర్ చేసిన బీజేపీ అధికార ప్రతినిధి షహ్జాద్ పూనావాలా రాహుల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓ వైపు శరద్ యాదవ్ కుటుంబసభ్యులు తీవ్ర దుఃఖంలో ఉంటే, వాళ్ల మధ్యన కూర్చున్న నీకు ఎలా నవ్వు వస్తుందని ధ్వజమెత్తారు. ఓ తపస్విగా చెప్పుకునే రాహుల్ ఇలా ప్రవర్తించడం సరికాదని సెటైర్లు వేశారు. అంతేకాదు 2018లో కర్ణాటక మాజీ సీఎం ఎన్ ధారం సింగ్ సంతాప సభలోనూ రాహుల్ నవ్వుతూ కన్పించారని షెహ్జాద్ పూనావాలా పేర్కొన్నారు. పుల్వామా అమరులకు శ్రద్ధాంజలి ఘటించే సమయంలోనూ రాహుల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నారని ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. Rahul Gandhi smiling while Sharad Yadav’s family is in tears- certainly not how a Tapasvi would behave Sensitivity demands one acts maturely but then in 2018 Rahul was laughing during Dharam Singh's condolence meet; was busy in phone during Pulwama Shraddhanjali Some tapasvi! pic.twitter.com/axj2CwS4fR — Shehzad Jai Hind (@Shehzad_Ind) January 13, 2023 చదవండి: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం -
Congress Party: గాంధీ భవన్లో కళ్లు, చెవులు, నోరు ఎక్కడికెళ్లాయి?
రాజకీయ పార్టీ ఏదైనా కళ్ళు, చెవులు, నోరు అధికార ప్రతినిధులు. ఏ సందర్భమైనా, ఏ సమస్య అయినా పార్టీ మీడియా ముందు వాయిస్ వినిపించేది వారే. కాని తెలంగాణ కాంగ్రెస్ బలంగా వాయిస్ వినిపించాల్సిన స్పోక్స్ పర్సన్స్ గొంతు మూగపోయింది. పార్టీకి బలంగా ఉండాల్సినవారే భారంగా మారారు. గాంధీభవన్‌లో అసలు ఏం జరుగుతోంది? అధికారం లేని ప్రతినిధులేరి? ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు రాజకీయ పార్టీల్లో వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడేది అధికార ప్రతినిధులే. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేది, ప్రత్యర్థి పార్టీల విమర్శలను ఎదుర్కొనేది, తిప్పి కొట్టేది వీరే. అన్ని పార్టీల్లోనూ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కీలక పాత్ర పోషిస్తారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ గురించి మాట్లాడేవారే కరువయ్యారు. ఉండటానికి డజన్‌గా పైగా ప్రతినిధులున్నా.. ప్రజా సమస్యల మీద, రాజకీయాల మీద స్పందించేవారు కనిపించడంలేదు. అసలు స్పోక్స్ పర్సన్స్ ఎవరో కూడా పార్టీ నాయకులకు తెలియదంటూ అతిశయోక్తి కాదు. పార్టీలో జరిగిన కొన్ని ఘటనలతో తమకెందుకీ గొడవ అనుకుంటున్న అధికార ప్రతినిధులు సైలంట్ అయినట్లు సమాచారం. నోరు మెదపరా? కాలు కదపరా? పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వచ్చాక పార్టీలో ఏవైనీ నియామకాలు జరిగాయంటే... అది అధికార ప్రతినిధులను అపాయింట్ చేయడం మాత్రమే. కొత్త అధికార ప్రతినిధుల నియామకం జరిగి ఏడాదిన్నర అవుతున్నా... సగం మంది కూడా గాంధీ భవన్ వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. రాష్ట్రంలో జరుగుతున్న ఏ ఒక్క పరిణామం మీదా ఈ స్పోక్ పర్సన్స్ స్పందించిన దాఖలాలే లేవు. టీ.కాంగ్రెస్‌కు అసలు అధికార ప్రతినిధులు ఉన్నారా అనే సందేహం కలిగేవిధంగా వారి ప్రవర్తన ఉందంటున్నారు. పార్టీకి అండగా ఉండాల్సిన అధికార ప్రతినిధులు సైలెంట్ గా ఉంటూ తమ సొంత పనులు చేసుకుంటూ పార్టీకి టైమ్ కేటాయించడంలేదనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. కండీషన్స్ అప్లై ఎందుకు? కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంటే అధికార ప్రతినిధుల తీరు చర్చనీయాంశంగా మారింది. టీ.కాంగ్రెస్‌లోని ఐదుగురు సీనియర్ అధికార ప్రతినిధుల్లో ఒకరైన బెల్లయ్య నాయక్ భారత్ జోడోయాత్రలో పాదయాత్ర చేస్తున్నారు. అద్దంకి దయాకర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై కామెంట్స్ చేసినప్పటి నుండి గాంధీ భవన్లో మీడియా సమావేశాలు బంద్ చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా...పార్టీ నాయకుల వైఖరితో విసిగిపోయి కొందరు. వివిధ పనుల్లో బీజీ అయిపోయి మరికొందరు పార్టీలో తమ విధులకు దూరంగా ఉంటున్నారు. 8 మంది కొత్త వాళ్ళలో ఇద్దరు ముగ్గురు ప్రతినిధులు మాత్రమే అప్పుడప్పుడు పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. మిగతా వారు పార్టీ గొంతు వినిపించడంలో ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. అంతేకాదు ప్రజా సమస్యలపై ఏదైనా విషయం పై సమీక్ష జరిగేటప్పుడు...పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకోవడానికి కూడా వారు ఇష్టపడటం లేదు. ఏ ఒక్క సమావేశానికి అధికార ప్రతినిధులు పూర్తిస్థాయిలో హాజరుకావడం లేదు. సార్ వారి సమావేశానికి డుమ్మా పార్టీ నిర్వహించే సమావేశాలకు, మీడియా సమావేశాలకి డుమ్మా కొడుతూ ఏదో ఒక సాకు చెబుతున్నారట ఆ అధికార ప్రతినిధులు. కిసాన్ కాంగ్రెస్ సమీక్ష సమావేశానికి అధికార ప్రతినిధులందరికీ ఆహ్వానం పంపించినప్పటికీ అందరూ డుమ్మా కొట్టారు. దీంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలంటూ పీసీసీ తరపున నోటీసులు జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడుతూ పార్టీ పైన , పీసిసి చీఫ్ రేవంత్ తో పాటు ఏఐసీసీ అగ్రనేతలపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంత జరిగిన తర్వాత కూడా మర్రి వ్యాఖ్యల మీద పార్టీలో ఏ ఒక్క అధికార ప్రతినిధి కూడా స్పందించలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కామెంట్స్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలతో అధికార ప్రతినిధులు సీనియర్ల మీద స్పందించడానికి భయపడుతున్నారట. అందరూ అద్దంకి దయాకర్‌ను ఉదాహరణగా తీసుకుని జాగ్రత్త పడుతున్నారని టాక్ నడుస్తోంది. పార్టీకి అండగా నిలవాల్సిన అధికార ప్రతినిధులు భారంగా మారడంతో... వారిపై వేటు వేసేందుకు పీసీసీ సిద్ధమవుతోందట. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Sakshi Cartoon: ఆయనలా నోటికొచ్చినట్లు తిడుతున్నా అలా మౌనంగా..
ఆయనలా నోటికొచ్చినట్లు తిడుతున్నా అలా మౌనంగా ఉంటున్నారేంటి సార్! -
నూపుర్ వ్యవహారం.. బీజేపీ దిద్దుబాటు చర్యలు
న్యూఢిల్లీ: ఓ టీవీ డిబేట్లో ముహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల తాలుకా ప్రభావం.. బీజేపీని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. దేశంలో రాజకీయ విమర్శలు ఎదురుకాగా.. ముఖ్యంగా ఇస్లాం దేశాల అభ్యంతరాలతో వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. ఈ తరుణంలో.. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) దిద్దుబాటు చర్యలకు దిగింది. నూపుర్ శర్మ వ్యాఖ్యల వ్యవహారం లాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఆచితూచి వ్యవహరించాలని ఆదేశించింది. బీజేపీ అధికార ప్రతినిధులు, ప్యానెలిస్టులు మాత్రమే టీవీ డిబేట్లలలో పాల్గొనాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వాళ్లను ఎంపిక చేసి పంపించే బాధ్యతను మీడియా సెల్‌కు అప్పజెప్పింది. అంతేకాదు.. టీవీ డిబేట్లను వెళ్లే ప్రతినిధులు ఎవరైనా సరే.. మతపరమైన చర్చ జరపకూడదని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ‘‘నిగ్రహ భాష ఉపయోగించండి. ఉద్రేకంగా మాట్లాడొద్దు. ఆందోళన చెందొద్దు. ఎవరి ప్రోద్బలంతో కూడా పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను ఉల్లంఘించవద్దు’’ అని స్పష్టం చేసింది. అంతేకాదు పార్టీ లైన్‌కు అనుకూలంగా నడుచుకోవాలని, డిబేట్లకు వెళ్లే ముందు అంశంపై పూర్తిస్థాయి పరిజ్ఞానంతోనే ముందుకు వెళ్లాలని సూచించింది. తాజా రూల్స్ ప్రకారం.. టీవీ డిబేట్లో పాల్గొనే ప్రతినిధులు పార్టీ ఎజెండా నుంచి పక్కదారి పట్టకూడదు. ఎవరు రెచ్చగొట్టినా ఉచ్చులో పడి వ్యాఖ్యలు చేయొద్దు అని పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఓ టీవీ డిబేట్లో వ్యాఖ్యలు చేసినందుకే నూపుర్ శర్మపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత, బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే ఆమెను పార్టీని నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. అదే విధంగా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు మరో నేత నవీన్ కుమార్ జిందాల్‌ను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ. ఖతర్, కువైట్, యూఏఈ, పాకిస్థాన్, మాల్దీవ్, ఇండోనేషియా.. ఇలా దాదాపు పదిహేను దేశాలు నూపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశాయి. చదవండి: అలా చేయకుంటే.. నూపుర్ శర్మ అంతుచూస్తాం -
‘ఎల్లో మీడియా దుష్ప్రచారాలకు హద్దు లేకుండా పోతోంది’
సాక్షి, అమరావతి: ఎల్లో మీడియా దుష్ప్రచారాలకు హద్దు లేకుండా పోతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నారమిల్లి పద్మజ ధ్వజమెత్తారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దిశ చట్టం గురించి కూడా చంద్రబాబు తప్పుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలకు సీఎం జగన్ ఇచ్చిన ప్రాధాన్యత ఎవరూ ఇవ్వలేదన్నారు. చదవండి: డైనమిక్ సీఎం వైఎస్ జగన్.. కేంద్రమంత్రి గడ్కరీ ప్రశంసలు ‘‘టీడీపీ మహిళా నేత అనిత నోరు అదుపులో పెట్టుకోవాలి. దళితులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. వనజాక్షి మీద దౌర్జన్యంపై అనిత ఎందుకు మాట్లాడలేదు. కుప్పంలో బీసీ మహిళపై దౌర్జనం మీకు కనిపించలేదా?’’ అంటూ పద్మజ ప్రశ్నించారు. ‘‘చంద్రబాబుకి ఎలాంటి సెంటిమెంట్లు ఉండవు. పట్టాభితో బోసిడీకే అని తిట్టించారు. దళిత మహిళతో సీఎం జగన్ కుటుంబాన్ని తిట్టిస్తున్నారు. వివేకా హత్య విషయంలో చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. సీఎం జగన్ డ్వాక్రా మహిళలకు న్యాయం చేస్తున్నారు. చంద్రబాబు రాష్టానికి శాపంలా మారారు. దేశంలో సీఎం జగన్ చేసే కార్యక్రమాల్ని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని’’ నారమిల్లి పద్మజ అన్నారు. -
World Voice Day 2021: మీ గళం మీ మార్గం
స్త్రీల గళాల వల్లే ఈ ప్రపంచం సంగీతమయం అయ్యిందంటే ఎవరూ కాదనకపోవచ్చు. భారతీయ మహిళ తన గొంతు వినిపించడం, తన మాటకు విలువ తెచ్చుకోవడం, తన గళంతో ఉపాధి పొందడం ఇంకా సంపూర్ణంగా సులువు కాలేదు. యాంకర్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు, అనౌన్సర్లు, గాయనులు, రిసెప్షనిస్టులు, కాల్ సెంటర్ ఉద్యోగినులు... మంచి గొంతు వల్లే ఉపాధి పొందుతున్నారు. నిత్య జీవితంలో గొంతు పెగల్చకుండా జీవనం సాగదు. ‘ప్రపంచ గళ దినోత్సవం’ మన గొంతును జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. అంగీకారానికైనా అభ్యంతరానికైనా గొంతును సవరించమని కోరుతుంది. గొంతు నొప్పి వస్తే తప్ప గొంతును పట్టించుకోని మనం మన గళానికి ఏం ఇస్తున్నాం? మన గళంతో ఏం పొందుతున్నాం? సీనియర్ నటి లక్ష్మితో నటుడు కమల హాసన్ ఒకసారి ‘మీరు రోజూ గుడ్ మార్నింగ్ చెప్తే చాలు... మీ గొంతు విని ఆ రోజంతా ఉత్సాహంగా గడిపేయగలను’ అన్నాడట. ఇది ప్రేమ ప్రకటన కాదు. ఒక మంచి గొంతు వింటే వచ్చే ఉత్సాహం గురించి. మంచి గొంతు కలిగి, అందులో ఉత్సాహం నిండి ఉంటే మనకు మనం పొందే వెలుగు సరే. జగానికి కూడా వెలుగు ఇవ్వవచ్చు. గొంతు పై ఆంక్ష భారతీయ సమాజంలో ‘ఆడది గడప దాటకూడదు. ఇంట్లో నోరు మెదపకూడదు’ అనే భావన అనేక శతాబ్దాలు రాజ్యమేలింది. ‘ఇంట్లో ఆడపిల్లా ఉందా లేదా అన్నట్టు ఆమె గొంతు వినిపించాలి’ అని అనేవారు. ఆడపిల్ల తనకో నోరు ఉన్నట్టు, ఆ నోటి నుంచి మాట రాగలదు అన్నట్టు ఉండటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. అబ్బాయిలకు. ఆ అబ్బాయి పెద్దయ్యి పురుషుడు అయితే అతని గొంతు అన్ని విధాలా అనుమతి ఉంటుంది. కాని స్త్రీకి మాత్రం కాదు. గొంతు ‘వాడిన’ స్త్రీని ‘గయ్యాళి’ అనడానికి సమాజం రెడీగా ఉండేది. అది కాదు ఆ గొంతును ప్రదర్శనకు పెట్టడం నామోషీగా దిగువ రకం స్త్రీలు చేసే పనిగా ప్రచారం చేశారు. పాటలు పాడేవాళ్లను, నలుగురూ వినేలా కవిత్వం పలికే వారిని, వేదిక ఎక్కి ఏదైనా అభిప్రాయం చెప్పేవారిని సమాజం న్యూనత పరిచేలా చూసింది. సరిగా చెప్పాలంటే న్యూనతతో చూసింది. ఆడేపాడే స్త్రీలకు ఒక కులాన్ని, ఒక సమూహ స్వభావాన్ని ఏర్పాటు చేసింది. స్త్రీలు మెదడు ఉపయోగించరాదు. శారీరక బలాన్ని ఉపయోగించరాదు. మాటను కూడా ఉపయోగించరాదు. భర్తకు, కుటుంబానికి తప్ప తమ గొంతు ఎలా ఉంటుందో తెలుపకనే... వినిపించకనే గతించిపోయిన స్త్రీలు కోట్లాది మంది. పేరంటం పాటలు పాడటాన్ని కూడా చాలా బిడియంతో నిండిన విషయంగా సగటు స్త్రీలు భావించేవారంటే గొంతు విప్పడం గురించి ఎన్ని ఆంక్షలు ఉండేవో అర్థం చేసుకోవచ్చు. మీ గొంతు మీ హక్కు మనిషి మనుగడకు, ఉపాధికి గొంతు ఒక ప్రధాన సాధనం. అయితే ఆ గొంతుతో అవకాశం పొందే హక్కుదారు మొదట మగవాడే అయ్యాడు. స్త్రీల గొంతు ఇంటికే పరిమితమైంది. పెళ్లికి ముందు ఎంతో అద్భుతమైన గాయనులుగా గుర్తింపు పొందినవారు పెళ్లి తర్వాత ‘భర్తకు ఇష్టం లేదని చెప్పి’ తమ కెరీర్లను వదులుకున్నారు. మొదటి రేడియో అనౌన్సర్‌గా పని చేసే మహిళలు, మొదటి టీవీ అనౌన్సర్‌గా పని చేసే మహిళలు, ఆ తర్వాత టెలిఫోన్ ఆపరేటర్లు, రైల్వే అనౌన్సర్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు, యాంకర్లు, ఇప్పుడు కాల్‌సెంటర్ ఉద్యోగినులు తమ గొంతు ను ఒక ఉపాధి చేసుకోవడానికి సుదీర్ఘ పయనం చేయాల్సి వచ్చింది. ఇవాళ రాజకీయ పార్టీలకు స్పోక్స్‌పర్సన్స్ దగ్గరి నుంచి విదేశాంగ వ్యవహారాలను తెలియచేసే ప్రతినిధుల వరకు స్త్రీలు తమ గొంతును, మాటను సమర్థంగా ఉపయోగించే స్థాయికి ఎదిగారు. హేళనా బుద్ధి స్త్రీలు చాడీలు చెప్పుకుంటారని, గోడకు ఈ పక్క ఆ పక్క నిలబడి గంటల కొద్దీ ఊసుపోని కబుర్లు చెప్పుకుంటారని హేళన చేసే కార్టూన్లతో జోకులతో వారిని పలుచన చేసే భావజాలం కొనసాగుతూనే ఉంది. బయట మాట్లాడే వీలు లేనప్పుడు, ఆఫీసుల్లో మాట్లాడే వీలులేనప్పుడు, చాయ్ హోటళ్లలో మాట్లాడే వీలు లేనప్పుడు, స్నేహబృందాలుగా కూచుని మాట్లాడుకునే వీలు లేనప్పుడు, ఇంట్లోనే ఉండక తప్పనప్పుడు స్త్రీలు గోడకు ఈ పక్క ఆ పక్క మాట్లాడక ఎక్కడ మాట్లాడతారు? మాటకు ముఖం వాచిపోయేలా చేసి ఆ తర్వాత వారు గంటల తరబడి మాట్లాడతారనడం ఎంత వరకు సబబో ఆలోచించాలి. గొంతు ఆరోగ్యం స్త్రీలు వయసు పెరిగే కొద్ది గొంతులో వచ్చే మార్పులను గమనించుకోవాలని ‘ప్రపంచ గళ దినోత్సవం’ సూచిస్తోంది. వినోద రంగంలో ఉండే స్త్రీలు, గొంతు ఆధారంగా ఉపాధి పొందే స్త్రీలు తమ గొంతు గురించి చైతన్యం కలిగించుకోవాల్సిన రోజే ‘ప్రపంచ గళ దినోత్సవం. పిల్లల గొంతు సమస్యలు గాని, స్త్రీల గొంతు సమస్యలు కాని నిర్లక్ష్యం చేయకుండా వైద్య సహాయం పొందాలని కోరుతుంది. 1999లో బ్రెజిల్ దేశంలో మొదలైన ప్రపంచ గళ దినోత్సవం నేడు ప్రపంచమంతా జరుపుకుంటోంది. ఇంట్లో ఆడపిల్ల అల్లరి చేస్తుంటే ‘ఏంటా గొంతు’ అని గద్దించే భావధారకు ఇవాళైనా స్వస్తి పలకాల్సిన అవసరాన్ని ఈ దినం ప్రత్యేకంగా గుర్తు చేస్తోంది. – సాక్షి ఫ్యామిలీ -
సంస్కారహీనంగా మాట్లాడితే సహించం..
సాక్షి, తాడేపల్లి: రాజధానిలో ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి ఎన్.పద్మజ ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కుల రాజకీయాలకు ప్రతిపక్ష నేత చంద్రబాబు తెర లేపుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధానికి చంద్రబాబు అనుకులమో? వ్యతిరేకమో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు మెప్పు కోసమే సుంకర పద్మ సంస్కారహీనంగా మాట్లాడుతుందని నిప్పులు చెరిగారు. సుంకర పద్మ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మహిళలపై అరాచకాలు, అత్యాచారాలు విపరీతంగా జరిగాయన్నారు. సీఎం వైఎస్ జగన్‌పై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. రాజధాని భూ కుంభకోణంలో లోకేష్, సుజానాచౌదరికి బినామీ పేర్లతో భూములు లేవా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మహిళలపై దాడులు జరిగితే.. ఈ వంకర పద్మశ్రీ ఎక్కడ ఉందని ఎద్దేవా చేశారు. -
ప్రణబ్ కుమార్తెకు కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వాదనను బలంగా వినిపించేదుకు ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధులుగా శర్మిష్ట ముఖర్జీ, అన్షుల్ మీరా కుమార్‌లను నియమించింది. వీరి నియామకానికి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోద ముద్ర వేశారు. వీరిలో షర్మిష్ట మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె కాగా, అన్షుల్ లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడు అన్న సంగతి విదితమే. కాగా, తొలుత ఢిల్లీ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న షర్మిష్ట.. ఆ తర్వాత ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. తాజాగా తనను కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. అలాగే సోనియాకు కృతజ్ఞతలు తెలిపిన శర్మిష్ట.. అన్షుల్‌కు అభినందనలు తెలియజేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత పలువురు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధులు తమ పదవుల నుంచి వైదొలగారు. అలాగే లోక్‌సభ ఫలితాలు వెలువడిన తరువాత.. నెల రోజులపాటు తమ పార్టీ నుంచి టీవీ డిబెట్లకు ఎవరిని పంపడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీలో పలు కీలక నియామకాలు చేపడుతున్నారు. ఇటీవలే హర్యానా కాంగ్రెస్‌కు కొత్త సారథిగా కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జాను నియమించిన సంగతి తెలిసిందే. INC COMMUNIQUE Appointment of following persons as National Spokesperson, AICC. pic.twitter.com/fg0UGRFjp1 — INC Sandesh (@INCSandesh) September 9, 2019 -
ప్రతిపక్షాలు పాక్ ప్రతినిధులు
జముయ్(బిహార్): బాలాకోట్ ఉగ్రశిబిరాలపై ఐఏఎఫ్ దాడికి రుజువులు చూపాలంటూ డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు భారతీయ రాజకీయ పార్టీల కంటే మించి పాక్ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. బిహార్‌లోని జముయ్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ‘పాక్‌కు సాయపడేవారు, ఆధారాలు చూపాలంటూ మన సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే వారు కావాలో వద్దో తేల్చాల్సింది ప్రజలే’ అని తెలిపారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రధాని పదవిని పునరుద్ధరించాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్‌పై ఆయన స్పందిస్తూ.. ‘ఏ దేశంలోనైనా ఒకరి కంటే ఎక్కువమంది ప్రధానులుంటారా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో మహాకూటమి ప్రధాన పార్టీలు కాంగ్రెస్, ఆర్జేడీలు తమ వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ‘కాంగ్రెస్ తన సొంతంగా లేదా కూటమి పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారీ దేశంలో పాలన తిరోగమనంలో సాగుతుంది. అభివృద్ధి పడిపోతుంది. హింస, ఉగ్రచర్యలు, నల్లధనం పేరుకుపోవడం మితిమీరుతాయి’ అని ఆరోపించారు. సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్ పేరుతో పదవీ ప్రమాణం చేసే లాలూ ప్రసాద్ వంటి నేతలు ఇప్పుడు కాంగ్రెస్ చంకనెక్కారు అంటూ ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్ అజెండాను అనుసరిస్తున్న బీజేపీ దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోందన్న ఆర్జేడీ ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన మా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల జోలికి పోలేదు’ అని వివరించారు. ప్రతిపక్షాల నుంచి అవరోధాలు ఎదురైనప్పటికీ ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించినట్లు తెలిపారు. ‘రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జీవించి ఉన్న కాలంలో ఆయన్ను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయనంటే ఎంతో అభిమానం ఉన్నట్లు నటిస్తోంది. మా ప్రభుత్వం అంబేడ్కర్ సేవలను గుర్తిస్తూ భారతరత్న ప్రకటించింది. ఆయనకు సంబంధించిన ఐదు ప్రాంతాలను తీర్థయాత్రా స్థలాలుగా గుర్తించి, అభివృద్ధి చేస్తోంది’ అని తెలిపారు. ప్రసంగం చివరలో ఆయన ‘మై భీ చౌకీదార్’ అంటూ ప్రజలతో నినాదం చేయించారు. -
‘సీబీఐని నీరుగార్చిన మోదీ’
సాక్షి, న్యూఢిల్లీ : మోదీ సర్కార్ సీబీఐ ప్రతిష్టను, విశ్వసనీయతను దెబ్బతీస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. దర్యాప్తు ఏజెన్సీలో సంక్షోభానికి నరేంద్ర మోదీ సర్కార్ బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిని మోదీ సర్కార్ నీరుగార్చిందని, వ్యూహాత్మకంగా దర్యాప్తు ఏజెన్సీని ధ్వంసం చేసిందని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా అన్నారు. ప్రతిష్టాత్మక దర్యాప్తు ఏజెన్సీ విశ్వసనీయత, సమగ్రత, స్వతంత్రతలను ప్రధాని మోదీ నాశనం చేశారని వరుస ట్వీట్లలో ఆరోపించారు. సీబీఐలో అనారోగ్యకర పరిస్థితికి బీజేపీ ప్రభుత్వమే కారణమని అన్నారు.రాజకీయ ప్రయోజనాల కోసం సీబీఐని దుర్వినియోగం చేయడంతో సీరియస్ క్రిమినల్ కేసుల్లో పారదర్శకమైన దర్యాప్తు కొరవడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఐ డైరెక్టర్‌ను తొలగించడంలో ప్రధాని నరేంద్ర మోదీ మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. సీబీఐ పనితీరులో ప్రధాని నేరుగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. సీబీఐ, రా ఉన్నతాధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీబీఐ ఉన్నతాధికారులపై వచ్చిన ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాల్సి ఉండగా, వారిని కాపాడేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మొత్తం వ్యవహారంలో ప్రధాని పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని సుర్జీవాలా అన్నారు. -
మోదీ అపజయాలు.. : పరీక్షలో ప్రశ్న
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో వినూత్న ప్రయత్నం మొదలైంది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(యూపీసీసీ) గురువారం ఇందుకు శ్రీకారం చుట్టింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా పని చేయాలనుకునే ఆశావాహులకు పరీక్షను నిర్వహించింది. పార్టీలో ప్రొఫెషనలిజం కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ మార్పును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రయత్నాలు చేయడం కాంగ్రెస్‌కు శుభపరిణామనే చెప్పాలి. ‘యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఫల్యాలను పేర్కొనండి. ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యాలను, మన్మోహన్ సింగ్ విజయాలను రాయండి’వంటి ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పరీక్షా ప్రశ్నాపత్రంలో కనిపించాయి. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 70 మంది నాయకులు(ప్రస్తుతం అధికార ప్రతినిధులు పని చేస్తున్నవారు కూడా) పరీక్షకు హాజరయ్యారు. 30 నిమిషాల్లో 14 ప్రశ్నలకు జవాబులు రాయమన్నారు. అయితే, ఇందుకు ఇంటర్నెట్ వినియోగాన్ని అనుమతించారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధులు ప్రియాంక చతుర్వేది, రోహన్ గుప్తాలు ఇంటర్వూలు నిర్వహించారు. -
అబ్బబ్బో మా డబ్బా టాకీసు!
ఎర్రటి ఎండాకాలంలో తప్పక గుర్తుకు వస్తుంది.... విశ్వరూపం. ‘విశ్వరూపం’ అనేది కమలాసన్ సినిమా పేరు కాదు... ఒకప్పటి మా ఊరి డబ్బా టాకీస్ పేరు. ఓనరు ఏ కాన్సెప్ట్‌తో ‘విశ్వరూపం’ అని తన టాకీస్‌కు పేరు పెట్టుకున్నాడోగానీ... ఆ టాకీస్ ప్రేక్షకులకు అక్షరాల విశ్వరూపం చూపించేది.మండే ఎండాకాలంలో మ్యాట్నీ షో.పైన రేకుల వేడి. కింద ఇసుక వేడి. మధ్యలో ‘గిర్ర్ర్ర్ర్ర్’ అని తిరిగే పాత సీలింగ్ ఫ్యాన్లు.‘ఫ్యాన్’ అనగా ‘గాలి వీచు సాధనం’. కానీ పైన తిరిగే పాతఫ్యాను రెక్కల నుంచి వేడి వేడి మంటలు వీచేవి. రేకుల వేడి + ఇసుక వేడి+ ఫ్యాన్ వేడి = ఇత్తడి.అయినా సరే, ప్రేక్షక మహాశయులకు ఇదేమీ పెద్ద ఇబ్బంది కాదు. అసలు సిసలు ఇబ్బంది.... ఈ ‘కరెంటు’ అనేది ఉంది చూశారు... దాని గురించే.ఆరోజు సినిమా మాంచి రంజులో ఉంది. క్లైమాక్స్‌కు కాస్త ముందు సీన్లో ముసలి తండ్రి కొడుకు కళ్లలోకి చూస్తూ ఇలా డైలాగ్ కొట్టాడు...‘చూడు రాజా! ఇన్నాళ్లూ ఒక రహస్యాన్ని నా గుండె గుహలో దాచాను’‘రహస్యమా? ఏమిటది?’ అని మూడు అడుగులు ముందుకు గెంతి... తండ్రిని సూటిగా అడిగాడు కొడుకు.‘నువ్వు నా కొడుకువి కాదు’ అన్నాడు ఆ తండ్రి చుట్ట వెలిగిస్తూ కూల్‌గా.‘నాన్న.... గారూ’ అంటూ చెవులకు చేతులు అడ్డం పెట్టుకొని అరిచాడు రాజా.‘చెవులకు చేతులు అడ్డం పెట్టుకున్నంత మాత్రాన... నిజం అబద్ధమైపోదు మై డియర్ రాజా’ చుట్ట పొగను రింగులు రింగులుగా గాల్లోకి వదులుతూ అన్నాడు తండ్రి.‘ఇంతకీ నేను ఎవరి కొడుకును?’ దీనంగా అడుగుతాడు రాజా.‘నువ్వు కలలో కూడా ఊహించని ఆ వ్యక్తి ఎవరంటే...’ అని ఆ తండ్రి చెప్పబోయాడో లేదో..కరెంట్ పోయింది!ఎండాకాలంలో వేడి వేడి వర్షం... అది ప్రేక్షక మహాశయుల తిట్ల వర్షం!‘ఒరే నా కొడక ఎయ్యరా సిన్మా’‘ఒరేయ్ గాడిద మనవడా... ఎయ్యరా బొమ్మ’ నాన్‌స్టాప్‌గా తిట్లే తిట్లు! ఈలోపు గేటు పరదా తీసి...‘కరెంటు గంట వరకు రాదు. బయటకొచ్చేయండి’ అని గట్టిగా అరిచాడు గేట్‌కీపర్.నానా బూతులు తిట్టుకుంటూ ప్రేక్షక మహాశయులందరూ బయటకు వచ్చారు.గంట గడుస్తుంది.రెండు గంటలు గడుస్తాయి.... అలా గంటలు గడుస్తూనే ఉంటాయి. ఆ టైమ్‌లో డబ్బా టాకీస్ స్పోక్స్‌పర్సన్ రంగంలోకి దిగి ‘మ్యాట్నీ షో క్యాన్సిల్. పాసులు ఇస్తున్నాం. అందరూ రాత్రి ఫస్ట్ షోకు రండీ’ అంటూపాసులు పంచుకుంటూ పోయాడు. ఇప్పుడు ఫస్ట్ షో సంగతి.ఇంటర్వెల్‌కు ముందు ఒక సీన్లో హీరో హీరోయిన్ కళ్లలోకి చూస్తూ...‘ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నావు. నీ పేరు కందిపప్పా? అయ్యుండదులే... మరి నీ పేరు ఏమిటి?’ అని అడిగాడో లేదో... ‘చచ్చాన్రో’ అని పెద్దగా సౌండ్ వినిపించింది.‘హీరోయిన్ పేరు చచ్చాన్రో. చాలా కొత్తగా ఉంది’ అని ఒక ప్రేక్షకుడు తన పక్కన కూర్చున్న ఫ్రెండ్ ప్రేక్షకుడితో అన్నాడో లేదో...‘హీరోయిన్ పేరా పాడా! ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు’ అన్నాడు ఫ్రెండ్ ప్రేక్షకుడు.‘వామ్మో! వాయ్యో! చచ్చాన్రో’ అనే అరుపులు వినిపిస్తున్నాయి.ఇంతకీ ఏం జరిగిందంటే...పైన తిరుగుతున్న శాతవాహనుల కాలం నాటి పాత సీలింగ్ ఫ్యాన్ ఒకటి విరిగి ఒక ప్రేక్షక మహాశయుడి నెత్తి మీద పడి తల పగిలింది. దీంతో పెద్ద లొల్లి. బాధితుడికుటుంబసభ్యులతోపాటు చుట్టాలుపక్కాలు, కులసంఘం వాళ్లు రంగంలోకి దిగి టాకీస్ ముందు ఆందోళన చేయడం మొదలు పెట్టారు.ఈ దెబ్బకు ఫస్ట్ షో కూడా క్యాన్సిల్! శాంతిభద్రతల దృష్ట్యా సినిమా హాలు రెండు రోజులు మూతపడింది. మూడో రోజు...‘ఈ రోజు అయినా హీరోగాడు ఎవరి కొడుకో తెలుసుకోవాలి’ అనుకున్నారు ప్రేక్షక మహాశయులు. ఆరోజు మ్యాట్నీ షో మొదలైంది... అర్ధగంట గడిచిన తరువాత ఒక కన్నీటిభరిత సీన్...‘నాన్నా! నా పెళ్లి చేయడం కోసం కిడ్నీ అమ్ముకున్నావా? త్యాగం చేయడం నీకే కాదు... నీ రక్తం పంచుకొని పుట్టిన నాకూ చేతనవుతుంది... అన్నయ్య కాలేజీ ఫీజు కోసం నేను నా కిడ్నీ అమ్మేసుకున్నాను నాన్నా!’ అని లీటర్ కన్నీళ్లతో నాన్న కాళ్ల మీద పడింది కూతురు. ఈలోపు ఆ ఇంటి ఇల్లాలు పరుగెత్తుకొచ్చి...‘‘ఏమండీ ఆ అప్పులవాడు మిమ్మల్ని నానామాటలు అంటుంటే... తట్టుకోలేకపోయాను. అప్పు తీర్చడానికి, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నా కిడ్నీని అమ్ముకున్నాను’’ అని గొల్లుమంటుంది.ఫ్యామిలికీ ఫ్యామిలీ కిడ్నీలు అమ్ముకున్న ఈ ట్రాజెడీ సీన్‌కు ప్రేక్షకులు భోర్మని ఏడ్వక పోగా, భళ్లుమని నవ్వుతున్నారు. డొక్కుటాకీస్లో ప్రేక్షకులు మాత్రమే ఉండరు. శ్రీ నల్లులు, పిల్లులు, కుక్కలు కూడా ఉంటాయి. సినిమా చూస్తున్న మత్తులో ప్రేక్షకులు వీటి ఉనికిని పట్టించుకోరు.ఏడ్చే సీన్లో ప్రేక్షకులు పగలబడి ఎందుకు నవ్వారంటే...‘కిడ్నీల సీన్’ చూస్తూ కన్నీళ్లు కారుస్తున్న ఒక ప్రేక్షక మహాశయుడి లుంగీని, సీటు కింద ఉన్న కుక్కలాగి బెంచి క్లాసులోకి పరుగులు తీసింది... అక్కడి నుంచి నేల క్లాసుకు పరుగులు తీసి తెర ముందు అటూ ఇటూ పరుగులు తీస్తుంది. మరోవైపు ‘నా లుంగో... లుంగో’ అంటూ అండర్వేర్ మీద పరుగులు తీస్తున్నాడు బాధితుడు. ఇది చూసి ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. ఈ ఎపిసోడ్ తరువాత కరెంట్ పోయింది.ఆరోజంతా రాలేదు! మరుసటి రోజు సినిమా ప్రొజెక్టర్ కాలిపోయింది... అది రిపేర్ కోసం పట్నానికి వెళ్లింది. రెండు నెలల విరామం. ఆ తరువాత ఏమైందోగానీ.... ఆ డబ్బాటాకీస్ మూతపడింది. ఇప్పుడు అక్కడ టాకీస్ లేదు. కళ్యాణమండపం ఉంది. దీన్ని చూస్తే డొక్కు టాకీస్ గుర్తుకు వస్తుంది. దీంతో పాటు ‘ఇంతకీ ఆ హీరో ఎవరి కొడుకు?’ అనే ప్రశ్న కూడా గుర్తుకు వస్తుంది. మీకేమైనా తెలుసా!! – యాకుబ్ పాషా -
నమ్ముకున్నవాళ్లకు చేసే న్యాయం ఇదేనా?
-
వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా గౌతంరెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా విజయవాడ (సెంట్రల్)కు చెందిన పూనూరు గౌతంరెడ్డి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అనంతపురం (అర్బన్)కు చెందిన బుర్రా సురేష్‌గౌడ్ నియమితులయ్యారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు పార్టీ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆ నటి క్షేమమేనట
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ , ఆదిత్య చోప్రా భార్య రాణి ముఖర్జీ ఆరోగ్యంగానే ఉన్నారని ఆమె ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. రాణి ఇటీవల దీపావళి సంబరాల సందర్భంగా అస్వస్థతకు గురయ్యారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నివాసంలో జరిగిన వేడుకల్లో రాణి ముఖర్జీ తీవ్రంగా అలసిపోయి, కళ్లు తిరిగి పడిపోయారనే వార్తలు బాలీవుడ్ లో షికారు చేశాయి. దీనిపై ఆమె ప్రతినిధి స్పందిస్తూ... ప్రస్తుతం రాణీ ముఖర్జీ క్షేమంగానే ఉన్నారని, అంతా బాగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటున్నారని, మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణ అవసరమన్నారు. ఆమెకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమన్న వైద్యుల సలహాపై గురువారం వరకు ఆమె ఆసుపత్రిలోనే ఉంటారన్నారు. కాగా కుచ్ కుచ్ హోతా హై హీరోయిన్ గత ఏడాది దర్శకుడు ఆదిత్య చోప్రాని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాణి ముఖర్జీ గర్భవతి. 2016 జనవరిలో ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వనుంది.