![YSRCP Spokesperson Naramalli Padmaja Comments On Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/17/Naramalli-Padmaja.jpg.webp?itok=9zKjkDuh)
సాక్షి, అమరావతి: ఎల్లో మీడియా దుష్ప్రచారాలకు హద్దు లేకుండా పోతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నారమిల్లి పద్మజ ధ్వజమెత్తారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దిశ చట్టం గురించి కూడా చంద్రబాబు తప్పుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలకు సీఎం జగన్ ఇచ్చిన ప్రాధాన్యత ఎవరూ ఇవ్వలేదన్నారు.
చదవండి: డైనమిక్ సీఎం వైఎస్ జగన్.. కేంద్రమంత్రి గడ్కరీ ప్రశంసలు
‘‘టీడీపీ మహిళా నేత అనిత నోరు అదుపులో పెట్టుకోవాలి. దళితులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. వనజాక్షి మీద దౌర్జన్యంపై అనిత ఎందుకు మాట్లాడలేదు. కుప్పంలో బీసీ మహిళపై దౌర్జనం మీకు కనిపించలేదా?’’ అంటూ పద్మజ ప్రశ్నించారు.
‘‘చంద్రబాబుకి ఎలాంటి సెంటిమెంట్‌లు ఉండవు. పట్టాభితో బోసిడీకే అని తిట్టించారు. దళిత మహిళతో సీఎం జగన్ కుటుంబాన్ని తిట్టిస్తున్నారు. వివేకా హత్య విషయంలో చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. సీఎం జగన్ డ్వాక్రా మహిళలకు న్యాయం చేస్తున్నారు. చంద్రబాబు రాష్టానికి శాపంలా మారారు. దేశంలో సీఎం జగన్ చేసే కార్యక్రమాల్ని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని’’ నారమిల్లి పద్మజ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment