జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్‌ | Ysrcp Spokesperson Nagarjuna Yadav Press Meet | Sakshi
Sakshi News home page

జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్‌

Published Wed, May 8 2024 7:58 PM | Last Updated on Wed, May 8 2024 8:30 PM

Ysrcp Spokesperson Nagarjuna Yadav Press Meet

సాక్షి,తాడేపల్లి: విద్యారంగంలో మార్పులు చూసి పెత్తందార్లు, వారి పాలేర్ల కడుపుమండుతోందని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌న్నారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
– పేద విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదగాలని, గవర్నమెంట్‌ స్కూల్స్‌లో చదువుతున్న పిల్లలు గ్లోబల్‌ స్టేజ్‌కి ఎదగాలని ఏపీ సీఎం  వైఎస్‌ జగన్‌ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.
– అమ్మ ఒడితో ఆర్థిక సాయం అందించినా, నాడు–నేడుతో స్కూల్స్‌ భవనాలు బాగుచేసినా గోరుముద్దతో ఆకలి తీర్చినా అది జగనన్నకే సాధ్యమైంది.
– ఐఎఫ్‌పీ ప్యానళ్లు ఇచ్చినా, స్మార్ట్‌ టీవీలిచ్చినా, 8వ తరగతి నుంచి ట్యాబ్‌లు ఇచ్చినా మనసున్న జగనన్నకే చెల్లింది. 
– ప్రపంచ ప్రమాణాలతో మన రాష్ట్రంలోని బడుగు బలహీనవర్గాల విద్యార్థులు చదువుకుంటున్న తీరు కళ్లముందే కనిపిస్తోంది. 
– భారత దేశమే ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసే విధంగా జగన్‌మోహన్‌రెడ్డి గారు 5 ఏళ్ళ పరిపాలన చేశారు.
– సీఎం జగన్‌ రూ.73వేల కోట్లు వెచ్చించి విద్యారంగంలో ప్రపంచస్థాయి విప్లవాత్మక మార్పులు తెచ్చారు.
– దీంతో, పెత్తందారుల ప్రతినిధి చంద్రబాబు, వారి వద్ద పాలేరుగా పనిచేస్తున్న పవన్‌ కల్యాణ్‌లకు కడుపు మండిపోయింది.
– మేం అధికారంలోకి వస్తే ఇంగ్లీషు మీడియం రద్దు చేస్తాం..కేజీ టు పీజీ విద్యను రివ్యూ చేస్తామని చంద్రబాబు కూటమి బాహాటంగానే చెప్తుంది.
– నాడు–నేడు, విద్యాదీవెన, వసతి దీవెన వంటివన్నీ రద్దు చేస్తామని నిస్సిగ్గుగా చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నాయి.
– మొన్నటికి మొన్న అమిత్‌షా ధర్మవరం సభలో మాట్లాడుతూ, చంద్రబాబు- పవన్ కల్యాణ్ లను పక్కనపెట్టుకుని ఇంగ్లీషు మీడియంపై తన అక్కసు వెళ్ళగక్కారు.  దీనినిబట్టి, వీరంతా, పేద పిల్లల ఇంగ్లీషు మీడియం చదువులకు వ్యతిరేకం అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి.

 మీ బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్లు ఏ మీడియంలో చదివారు?
– చంద్రబాబూ.. నువ్వు నారా లోకేశ్‌ను ఇంగ్లీషు మీడియంలో చదివించలేదా? 
– పవన్‌ కల్యాణ్‌..1984లో నువ్వు నెల్లూరులోని సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లీషు మీడియం స్కూళ్లో చదువుకోలేదా?
– 40 ఏళ్ల క్రితం పవన్‌ కల్యాణ్‌ని ఆయన తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియంలో చదివించారు.
– సరే ఆయనకు చదువు అబ్బలేదు..గాలికి తిరిగాడు..అది ఆయన వ్యక్తిగతం.
– 2024లో బడుగు బహీనవర్గాలు, దళితులు, బీసీలు, మైనార్టీలు వాళ్ల బిడ్డల్ని ఇంగ్లీషు మీడియంలో చదివించుకోవాలని కోరుకోవడంలో తప్పేంటి?
– ఈనాడు రామోజీరావు కొడుకులు, మనవళ్లు, మనవరాళ్లు అందరూ ఇంగ్లీషు మీడియంలోనే చదువుకున్నారు కదా..!
– ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.., నీ కుమారుడు, కుమార్తె ఇంగ్లీషు మీడియంలోనే చదువుకున్నారు కదా.
– ప్రపంచ స్థాయిలో ఉన్న అన్ని సదుపాయాలు మీ బిడ్డలకు, మనవళ్లకు, మనవరాళ్లకు అందించారే..పేద ప్రజలకు అందితే ఎందుకంత కంటగింపు? 
– జగన్‌ గారు నాడు-నేడు ద్వారా గవర్నమెంటు బడుల రూపురేఖలు పూర్తిగా మార్చారు. 3వ తరగతి నుంచి టోఫల్, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ తో ప్రపంచస్థాయి మేటి విద్యను ఆంధ్రప్రదేశ్ లో పేద పిల్లలకు అందిస్తున్నారు. 
– ఏపీలోని బడుగు బలహీనవర్గాల ఆత్మగౌరవాన్ని ఐక్యరాజ్యసమితిలో ఎగరేస్తే..మీకెందుకు అంత కడుపుమంట?

ఇంటికో ఉద్యోగం అని, తన ఇంట్లో లోకేశ్‌కు మాత్రమే ఉద్యోగం ఇచ్చుకున్నాడు
– చంద్రబాబు తన మేనిఫెస్టోలో 20లక్షల ఉద్యోగాలిస్తాను. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు.
– 2014లోనూ చంద్రబాబు ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి అన్నాడు.
– ఆయన అధికారంలోకి రాగానే, తన ఇంట్లో ఉన్న దద్దమ్మ లోకేశ్‌కు మాత్రం ఉద్యోగం ఇచ్చుకున్నాడు. ఇంకెవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు.
– చంద్రబాబు 2014–19 కాలంలో 34,108 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశాడు.
– జగన్‌ గారు సీఎం అయ్యేటప్పటికీ ఏపీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 3.97లక్షలు. 
– జగన్‌ గారి ఐదేళ్ల పరిపాలన పూర్తైన తర్వాత శాశ్వత ప్రాతిపదికన 2.31లక్షల ఉద్యోగాలిచ్చారు.
– కాంట్రాక్టులో 43,923 మందికి, ఔట్‌ సోర్సింగ్‌లో 3.73లక్షల ఉద్యోగాలు ఇచ్చారు.
– మొత్తం కలిపితే 6.38లక్షల మందికి కేవలం ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు ఇచ్చారు.
– చంద్రబాబునాయుడు నేను ఉద్యోగాల సృష్టి చేస్తాను అంటున్నాడు.
– తన హయాంలో చంద్రబాబు ప్రైవేటు రంగంలో కల్పించిన ఉద్యోగాలు కేవలం 38వేలు మాత్రమే. ఇది కేంద్ర వాణిజ్య శాఖ వద్ద ఉన్న సమాచారం. 
– సీఎం జగన్‌ ప్రైవేటు రంగంలో ఈ ఐదేళ్లలో 6.07లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. 
– చంద్రబాబు కియా కారు తీసుకొచ్చాడు.. జాకీ డ్రాయర్‌ తీసుకొచ్చాడు అని ఎల్లో మీడియా ఊదరగొడుతోంది.
– జగన్‌ గారు తన ఐదేళ్ల తర్వాత ఏపీలో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు, దాని ద్వారా 3.47 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి.
– ఇక జగన్‌ గారి తెచ్చిన కంపెనీలు చూస్తే ఇన్ఫోసిస్, విప్రో, డైకిన్, అమేజాన్, బ్లూస్టార్, టీసీఎల్‌ వంటివి అనేకం ఉన్నాయి.
– విశాఖ, దావోస్‌ ఒప్పందాలన్నీ కలుపుకుంటే రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి.
– వాటిలో ఐదారు లక్షల కోట్ల వరకూ పెట్టబడులు కార్యరూపం దాల్చాయి. వీటివల్ల  సుమారు 6లక్షల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది.
– వీటన్నిటినీ రాష్ట్రంలో ఉన్న యువత, అభివృద్ధి కోరుకునే వారు గమనించాలని కోరుకుంటున్నా.
– 2019లో బడిలో ఓటు వేసి ఉంటారు. ఇప్పుడు అదే బడికి ఓటు వేయడం కోసం వెళ్తున్నారు.
– ఇప్పుడు ఆ ప్రభుత్వ బడి రూపురేఖలు ఎలా ఉన్నాయో చూడండి. జగన్ గారి నాయకత్వంలో ప్రభుత్వ బడి- ఒక గుడి గా మారింది. సీఎం జగన్‌  పేద, బడుగు, పిల్లలు చదువుకునే బడిని సరస్వతీ నిలయమైన గుడిలా మార్చారు. ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ సీఎం జగన్ చేసిన సంక్షేమాన్ని - అభివృద్ధిని గుర్తు చేసుకుని విజ్ఞతతో ఓటు వేయండి’ అని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement