సాక్షి,తాడేపల్లి:రాష్ట్రంలో ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం(ఫిబ్రవరి4) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విరూపాక్షి మీడియాతో మాట్లాడారు.‘కొంతమంది ఐఏఎస్,ఐపీఎస్‌లు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ బద్దంగా గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న నాకు అధికారులు గౌరవం ఇవ్వడం లేదు. ఓడిపోయిన టీడీపీ నాయకులు చెప్పినట్టు అధికారులు చేయకడం ఏంటి?
ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి విలువ లేకుండా చేశారు. ప్రోటోకాల్ పాటించాలని కూడా ఈ అధికారులకు తెలియదా? ఎమ్మెల్యే మాటలకు గౌరవం ఇవ్వరా? మేము ప్రజలు ఓట్లేస్తే గెలిచాం. ఎమ్మెల్యేగా ప్రజాసమస్యలను చెబితే అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారుల్లో మార్పు రావాలి. అధికారులు కూటమి నేతల మోచేతి నీళ్లు తాగొద్దు.
ఎప్పుడూ కూటమి ప్రభుత్వమే ఉండదన్న విషయాన్ని అధికారులు గ్రహించాలి.ఎమ్మెల్యేగా గెలిచిన మేము అసెంబ్లీకి వెళ్తామే తప్ప టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు వెళ్లరు. ఎవరి విలువ ఏంటో అధికారులు గుర్తించి వ్యవహరిస్తే మంచిది. ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులదే.
పరిటాల శ్రీరామ్‌కు ప్రాణరక్షణ కావాలని అడిగితే అదనంగా మరో ఇద్దరు గన్‌మెన్‌లను వైఎస్ జగన్ కేటాయించారు. పార్టీలు చూడకుండా వైఎస్ జగన్ అందరికీ న్యాయం చేశారు. గత 8 నెలలుగా రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. చంద్రబాబు సీఎంగా ఉంటే ఏపీలో మర్డర్లు జరుగుతుంటాయి. వైఎస్ జగన్ ఇలాంటి అరాచకాలకు వ్యతిరేకం.
చంద్రబాబు పాలనలో మహిళలు,ఆడపిల్లలకు రక్షణే లేదు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ఇప్పుడు ఏ వీధిలోకి వెళ్లినా మందుబాబులే కనిపిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో కరోనా వచ్చినా సంక్షేమ పథకాలను ఆపలేదు.చంద్రబాబు ఏ పథకాన్నీ అమలు చేయడం లేదు.లోకేష్,పవన్ కళ్యాణ్ కాలర్‌ను ప్రజలు పట్టుకునే రోజు దగ్గర్లోనే ఉంది’అని విరూపాక్షి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment