YSRCP Spokesperson Konda Rajiv Key Comments On Lokesh - Sakshi
Sakshi News home page

‘సీబీఎన్‌’ అంటే కొత్త అర్థం చెప్పిన వైఎస్సార్‌సీపీ నేత కొండా రాజీవ్‌

Published Mon, Feb 13 2023 1:35 PM | Last Updated on Mon, Feb 13 2023 2:24 PM

Ysrcp Spokesperson Konda Rajiv Comments On Lokesh - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజా జీవితంలో ఉండేందుకు లోకేష్‌కు అర్హత లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసలు లోకేష్‌ బాడీ లాంగ్వేజ్‌ ఏంటి? లోకేష్‌ భాష ప్రపంచంలోనే ఎవరూ మాట్లాడరు. లోకేష్‌కు వచ్చేంది పచ్చి బూతుల భాష మాత్రమే. సీబీఎన్‌.. అంటే చంద్ర బూతుల నాయుడు అని పెట్టుకోండి’’ అంటూ దుయ్యబట్టారు.

లోకేష్.. ఐరన్‌ లెగ్‌ ఆఫ్‌ ఏపీ. లోకేష్‌ బతుకంతా ఫెయిల్‌. సీఎంపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇలాగే మాట్లాడితే లోకేష్‌కు గుణపాఠం తప్పదు. సీఎం జగన్ పెట్టిన అభ్యర్థిపై లోకేష్ ఓడిపోయారు. మంగళగిరిలో ఆర్కే పులి.. లోకేష్ పిల్లి. పాతికేళ్ల డీఎస్సీ సమస్య పరిష్కరించిన ప్రభుత్వం మాది. లక్షలాది గ్రామ, వార్డు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే. విశాఖ అన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు అనువైన ప్రాంతం. కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల వద్ద చలి కాచుకోవడం చంద్రబాబుకు అలవాటు’’ అని కొండా రాజీవ్‌ ధ్వజమెత్తారు.
చదవండి: బెజవాడలో టీడీపీ గూండాల బరితెగింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement