
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి రోహన్ గుప్తా బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
ఐఏఎస్ మాజీ అధికారి పరంపల్ కౌర్, ఆమె భర్త, శిరోమణి అకాలీదళ్ సీనియర్ నేత సికందర్ బీజేపీలో చేరారు. జాతీయవాదం, సనాతన ధర్మం వంటి అంశాలపై సంప్రదాయ వైఖరి నుంచి వైదొలిగిన కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను కోల్పోయిందని గుప్తా పేర్కొన్నారు.