కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పార్టీకి గుడ్ బై.. గుడ్ లక్ అంటూ కామెంట్స్ చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాకర్ మరో ట్విస్ట్ ఇచ్చారు. జాకర్.. గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జాకర్.. బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా సునీల్ జాకర్ మాట్లాడుతూ.. పంజాబ్‌లో కొంతమంది కాంగ్రెస్ నేతలు తనపై అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించారని అన్నారు. అందుకు గానూ తనపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకున్నందుకు చాలా బాధపడ్డానని చెప్పారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంచి వ్యక్తి అంటూ జాకర్ ప్రశంసించారు. భజనపరుల్ని దూరం పెట్టి శత్రువులెవరో, మిత్రులెవరో ఆయన తెలుసుకోవాలని హితవు పలికారు.
అంతుకు ముందు జాకర్.. ‘‘నా గుండె బద్దలైంది. అందుకే పార్టీలో 50 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నాను. కాంగ్రెస్‌కు నేను చెప్పే ఆఖరి మాటలివే. గుడ్ లక్. అండ్ గుడ్‌బై కాంగ్రెస్’’ అని శనివారం ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రకటించారు. చింతన్ శిబిర్‌కు బదులు కాంగ్రెస్ ‘చింతా’ శిబిర్ నిర్వహించాలన్నారు. కొందరు ఢిల్లీలో కూర్చొని పంజాబ్‌ను నాశనం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత అంబికా సోనిపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా.. బుధవారం గుజరాత్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ హార్ధిక్ పటేల్ కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కూడా పార్టీ నేతల తీరుపై తీవ్ర వ్యాఖ‍్యలు చేశారు.
ఇది కూడా చదవండి: పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్‌కు ఊహించని షాక్
Comments
Please login to add a commentAdd a comment