Rohan
-
గుండెపోటుతో ప్రముఖ పారిశ్రామికవేత్త మృతి
ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు 'రోహన్ మిర్చందానీ' (Rohan Mirchandani) డిసెంబర్ 21 రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఎపిగామియా మాతృ సంస్థ డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ ధృవీకరించింది.అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన తన ప్రియతమ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ అకాల మరణం చెందారని డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ ధృవీకరిస్తూ.. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రోహన్ లేకపోయినప్పటికీ.. ఆయన విలువలు మాకు మార్గదర్శకంగా కొనసాగుతాయి. అయన కలలను నిజం చేయడానికి, సంస్థను అభివృద్ధి చేయడానికి మేము కలిసి పని చేస్తామని కంపెనీ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.అంకుర్ గోయెల్ (సీఓఓ & వ్యవస్థాపక సభ్యుడు), ఉదయ్ థాక్కర్ (కో-ఫౌండర్ & డైరెక్టర్) నేతృత్వంలో కంపెనీ రోజువారీ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఇందులో రోహన్ కుటుంబం కూడా ఉంటుంది. రోహన్ మా గురువు, స్నేహితుడు.. నాయకుడు. అతని విజన్‌ని ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నామని అంకుర్ గోయెల్ & ఉదయ్ థాక్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
డీడీసీఏ అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ..
న్యూఢిల్లీ: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డీడీసీఏ)అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ మూడోసారి ఎన్నికయ్యాడు. తాజా ఎన్నికల్లో భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్‌పై రోహన్ జైట్లీ విజయం సాధించాడు. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన రోహన్ డీడీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం.డీడీసీఏలో మొత్తం 3,748 ఓట్లకు గానూ... 2,413 మంది ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయానికి 1207 ఓట్లు అవసరం కాగా... 35 ఏళ్ల రోహన్ జైట్లీ 1,577 ఓట్లతో ఘన విజయం సాధించాడు. 1983లో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్‌కు 777 ఓట్లు వచ్చాయి.రోహన్ జైట్లీ తండ్రి దివంగత అరుణ్ జైట్లీ గతంలో 14 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడిగా కొనసాగారు. 2020లో రజత్ శర్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో తొలిసారి డీడీసీఏ అధ్యక్షుడిగా ఏకగీవ్రంగా ఎన్నికైన రోహన్ జైట్లీ... ఏడాది తర్వాత జరిగిన ఎన్నికల్లో వికాస్ సింగ్‌పై విజయం సాధించి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.బీసీసీఐ మాజీ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా సహకారంతో రోహన్ సులువుగా ఈ ఎన్నికల్లో విజయం సాధించాడు. సీకే ఖన్నా కూతురు శిఖా తాజా ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా ఘనవిజయం సాధించింది. కార్యదర్శిగా అశోక్ శర్మ, కోశాధికారిగా హరీశ్ సింగ్లా జాయింట్ సెక్రటరీగా అమిత్ గ్రోవర్ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం మూడేళ్ల పాటు కొనసాగనుంది. -
BCCI: బీసీసీఐ కొత్త కార్యదర్శి అతడే!?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి కాబోయే చైర్మన్ అంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన నిజంగానే ఈ పదవిని చేపడితే.. బీసీసీఐ సెక్రటరీగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎవరన్న అంశంపై భారత క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.తెర మీదకు కొత్త పేరుఇప్పటికే జై షా వారసులుగా ముగ్గురు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సంయుక్త కార్యదర్శి ఆశిష్ షెలార్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్లలో ఒకరు జై షా స్థానాన్ని భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రేసులో తాజాగా మరో పేరు తెర మీదకు వచ్చింది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడు రోహన్ జైట్లీ కూడా పోటీలో ఉన్నట్లు వార్తా సంస్థ దైనిక్ భాస్కర్ వెల్లడించింది. రోహన్ జైట్లీ మరెవరో కాదు. దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడు. రోహన్ నియామకం దాదాపుగా ఖరారైపోయిందని.. బీసీసీఐ కొత్త కార్యదర్శిగా అతడిని చూడబోతున్నామంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి.జై షా ఎన్నిక ఏకగ్రీవమే?మరోవైపు.. ఐసీసీ చైర్మన్‌గా జై షా ఎన్నిక ఏకగ్రీవం కానుందని తెలుస్తోంది. ఐసీసీలోని మొత్తం 16 మంది సభ్యుల్లో 15 మంది జై షాకు అనుకూలంగా ఉండటం ఇందుకు కారణం. ఇక కొత్త చైర్మన్ ఎన్నిక కోసం ఈ నెల 27తో నామినేషన్ల గడువు ముగుస్తుంది.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా ఉన్న గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30 వరకు ఉంది. కాబట్టి.. కొత్తగా ఎన్నికైన వ్యక్తి డిసెంబర్ 1 తర్వాతే పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఫలితంగా జై షా ఇంకో మూడు నెలల పాటు బీసీసీఐ కార్యదర్శిగానే కొనసాగే అవకాశం ఉంది. అప్పటిలోగా అతడి వారసుడి ఎంపిక పూర్తి చేయాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు.చదవండి: రిటైర్మెంట్ తర్వాత.. అభిమానులకు శుభవార్త చెప్పిన ధావన్ -
Lok sabha elections 2024: బీజేపీలో చేరిన రోహన్ గుప్తా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి రోహన్ గుప్తా బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఐఏఎస్ మాజీ అధికారి పరంపల్ కౌర్, ఆమె భర్త, శిరోమణి అకాలీదళ్ సీనియర్ నేత సికందర్ బీజేపీలో చేరారు. జాతీయవాదం, సనాతన ధర్మం వంటి అంశాలపై సంప్రదాయ వైఖరి నుంచి వైదొలిగిన కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను కోల్పోయిందని గుప్తా పేర్కొన్నారు. -
సాధారణ వ్యక్తి ప్రేమలో 'పూజా హెగ్డే'.. ఫోటోలు వైరల్
రెండేళ్ల క్రితం వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్ పూజా హెగ్డే (33).. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అగ్ర హీరోలతో నటించి మెప్పించిన ఈ పొడుగు కాళ్ల సుందరి ఇప్పుడు మరోసారి సినిమాలతో బిజీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఫస్ట్ టైం తన బాయ్ ఫ్రెండ్‌తో కెమెరా కంటికి చిక్కింది ఈ బ్యూటీ. గతేడాది, పూజా హెగ్డే ఒక క్రికెటర్‌తో డేటింగ్లో ఉందని, త్వరలో అతనితో పెళ్లి చేసుకోనుందని ఊహాగానాలు వచ్చాయి. కొంత కాలం తర్వాత ఆ ఊహాగానాలు కేవలం పుకార్లు మాత్రమే అని తేలింది. దీంతో ఆమె అభిమానులకు ఉపశమనం కలిగింది. అయితే, పూజా హెగ్డే రొమాంటిక్ లైఫ్ గురించి ఇప్పుడు తాజాగా మళ్లీ పుకార్లు వ్యాపించాయి. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న ప్రకారం.. బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో (33) ఆమె డేటింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిద్దరూ కలిసి కారులో ప్రయాణిస్తున్న దృశ్యాలతో పాటుగా ముంబైలోని హోటల్లు, రెస్టారెంట్లకు తరచూ వెళ్లడం కనిపించిందని చెబుతున్నారు. రోహన్ మెహ్రా కూడా ఇది వరకే స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 ఫేమ్ 'తారా సుతారియా'తో రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికీ వారిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. అతను ఇప్పుడు పూజా హెగ్డేతో ప్రేమాయణం సాగిస్తున్నాడని ఆరోపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త పూజా హెగ్డేను అభిమానించే వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరీ రోహన్ మెహ్రా ఉత్తరాంచల్‌కు చెందిన రోహన్ మెహ్రా ఇంకా బాలీవుడ్లో చెప్పుకోదగిన సినిమాల్లో నటించలేదు. అతని నటించిన రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. కానీ 200 కంటే ఎక్కువ టీవీ వాణిజ్య ప్రకటనలతో పాటు ప్రింట్ యాడ్స్ చేశాడు. హిందీ బిగ్ బాస్ 10వ సీజన్లో సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా ప్రవేశించిన రోహన్ 5వ స్థానంలో నిలిచాడు. ఆయన ఎక్కువగా టీవీ షోల వరకే పరిమితం అయ్యాడు. అలా బాలీవుడ్లో మంచి గుర్తింపు పొందాడు. అంతటి సాధారణ వ్యక్తిని పూజా హెగ్డే ప్రేమించడం జరగదని ఆమె అభిమానులు తెలుపుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పూజా హెగ్డే స్పందించలేదు. మరి అతను నిజంగానే బుట్టబొమ్మ బాయ్ ఫ్రెండా? లేక వారిద్దరూ జస్ట్ ఫ్రెండ్సా అనేది పూజా రివీల్ చేస్తే కానీ ఎవరికీ తెలియదు. సల్మాన్‌తో రిలేషన్.. అప్పుడు పూజా రియాక్షన్ ఇదే బాలీవుడ్ బడా హీరో సల్మాన్‌ఖాన్‌తో పూజా హెగ్డే ప్రేమలో ఉందంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.. వాటిపై గతేడాది ఆమె ఇలా రియాక్ట్ అయింది. 'నా గురించి తరచూ ఎన్నో వార్తలు వస్తుంటాయి. వాటన్నింటినీ నేను చదువుతూనే ఉంటాను. వాటిని పెద్దగా పట్టించుకోను. ప్రస్తుతానికి నేను సింగిల్‌నే. నాకు సింగిల్‌గా ఉండటమే ఇష్టం. అలాగే, నా ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది. వేర్వేరు భాషల్లో మరెన్నో చిత్రాల్లో నటించాలని ఉంది. అదే నా లక్ష్యం. ఇలాంటి వదంతులపై స్పందించే సమయం కూడా నాకు లేదు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను.' అని ఆమె స్పష్టం చేశారు. #Poojahegde with her boy friend 💔pic.twitter.com/JhtUYaISm8 — Kolly Censor (@KollyCensor) March 31, 2024 -
యువ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ: ఎప్పుడూ అవే పాటలా.. పాకెట్ ప్రపంచంలోకి
ప్రయాణంలో, తీరిక వేళల్లో ఎఫ్ఎంలో పాటలు వినడం సహజమే. ‘ఎప్పుడూ అవే పాటలు, అవే మాటలేనా’ అనుకుంటారు కొద్దిమంది. వారిలో రోహన్ నాయక్ ఒకరు. ఈ యువ ఇంజనీర్ తన స్నేహితులతో కలిసి బెంగళూరు కేంద్రంగా ప్రారంభించిన ‘పాకెట్ ఎఫ్ఎం’ వివిధ జానర్స్, వివిధ భాషలలో ఆకట్టుకునే ఆడియో సిరీస్‌లతో దూసుకుపోతుంది... కొన్నిసార్లు ఐడియాల కోసం వెదుక్కుంటూ వెళ్లనక్కర్లేకుండానే... అవే మనల్ని వెదుక్కుంటూ వస్తాయి. రోహన్ నాయక్ విషయంలోనూ అలాగే జరిగింది. ఇంటి నుంచి ఆఫీసుకు చేరుకోవడానికి చాలా టైమ్ పట్టేది. టైమ్‌పాస్ కోసం ఎఫ్‌ఎంలలో మ్యూజిక్ వినేవాడు. అయితే ఆ మ్యూజిక్ అదేపనిగా రిపీట్ కావడంతో బోర్‌గా ఉండేది. ‘భారతీయ భాషల్లో ఆడియో స్టోరీ టెల్లింగ్ ప్లాట్‌ఫామ్ ఉంటే బాగుండేది’ అనుకునేవాడు. ‘మనం కావాలనుకుంటున్నది కాలమే మన చేత చేయిస్తుంది’ అన్నట్లుగా ఆ ప్రయత్నానికి తానే శ్రీకారం చుట్టాడు రోహన్ నాయక్. ఐఐటీ–ఖరగ్‌పూర్ ఫ్రెండ్స్ ప్రతీక్ దీక్షిత్, నిశాంత్ కేఎస్లతో కలిసి ‘పాకెట్ ఎఫ్.ఎం’కు శ్రీకారం చుట్టాడు. మ్యూజిక్ కాకుండా ‘ఆడియో ఎంటర్టైన్మెంట్’ లక్ష్యంగా మొదలైన ఈ ఆడియో సిరీస్ ప్లాట్‌ఫామ్ అన్యూవలైజ్డ్ రెవెన్యూ రన్‌రేట్(ఏఆర్ఆర్)తో దూసుకుపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘ప్రస్తుతం శ్రోతలు సగటున రోజుకు వంద నిమిషాల సమయాన్ని వినడానికి వెచ్చిస్తున్నారు. మా యాప్ టోటల్ మంత్లీ ఆడియో స్ట్రీమింగ్‌లో ఎప్పటికప్పుడు వృద్ధి కనిపిస్తోంది’ అంటున్నాడు పాకెట్ ఎఫ్.ఎం. ఫౌండర్లలో ఒకరైన నిశాంత్. రొమాన్స్, హారర్, థ్రిల్లర్, ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్...అనేవి పాకెట్ ఎఫ్.ఎం.లో టాప్ జానర్లుగా ఉన్నాయి. ఎపిసోడ్లు 10–15 నుంచి 25–30 నిమిషాల వరకు ఉంటాయి. ‘పాకెట్ ఎఫ్.ఎం’ ఆడియో సెగ్మెంట్ సిరీస్‌లో కొన్ని హిట్ టైటిల్స్... యే రిష్తా కైసా హై(400 మిలియన్), లవ్ కాంట్రాక్ట్(200 మిలియన్), యక్షిణీ (195 మిలియన్), షూర్వీర్(129 మిలియన్)...మొదలైనవి. ‘పాకెట్ఎఫ్ఎం’లో 733 ఆడియో సిరీస్‌లతో పాటు ఆడియో బుక్స్ కూడా ఉన్నాయి. గత అక్టోబర్‌లో ఆన్లైన్ రీడింగ్ ప్లాట్‌ఫామ్ ‘పాకెట్ నావెల్’కు శ్రీకారం చుట్టారు. ఇక శ్రోతల విషయానికి వస్తే 15 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరు, ముంబై, దిల్లీ, పుణె, హైదరాబాద్‌లు టాప్ 5 సిటీస్‌గా ఉన్నాయి. మరోవైపు చిన్న పట్టణాలలో కూడా ‘పాకెట్ఎఫ్ఎం’ పాపులర్ అవుతుంది. లాంగ్ ఫార్మట్ ఆడియో ఎంటర్టైన్మెంట్ సిరీస్ ద్వారా ఒటీటీ స్పేస్‌ను పునర్నిర్వచించే ప్రయత్నం చేస్తున్న ‘పాకెట్ ఎఫ్ఎం’ యాడ్–టెక్ ప్లాట్‌ఫామ్ ‘రియల్ టైమ్ యాడ్స్’ను తీసుకువచ్చింది. ‘పాకెట్ ఎఫ్ఎం విజయవంతం కావడంలో ఎఐ, ఎంఎల్ సాంకేతికత కీలక పాత్ర పోషించింది. శ్రోతల నాడి పసిగట్టడం, సంక్లిష్టమైన విషయాలను సరళం చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం... ఇలా ఎన్నో విషయాల్లో సాంకేతికత ఉపయోగపడింది’ అంటున్నాడు కంపెనీ సీటీవో ప్రతీక్ దీక్షిత్. కంపెనీకి లైట్‌స్పీడ్, టెన్సెంట్, టైమ్స్ ఇంటర్నెట్లాంటి కీ ఇన్వెస్టర్లు ఉన్నారు. ఇప్పుడు పాకెట్ ఎఫ్.ఎం. యూఎస్ మార్కెట్లోకి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ‘టీమ్ మెంబర్స్‌కు అద్భుతమైన శక్తి,సామర్థ్యాలు, అంకితభావం ఉన్నాయి’ అంటున్నాడు టాంగ్లిన్ వెంచర్ పార్ట్నర్స్కు చెందిన సంకల్ప్ గుప్తా. పాకెట్ ఎఫ్.ఎం.ను ‘నెట్‌ఫ్లిక్స్ ఆఫ్ ఆడియో వోటీటీ ప్లాట్‌ఫామ్స్’ గా తీర్చిదిద్దాలనేది ముగ్గురు విజేతల లక్ష్యం. పాకెట్ ఎఫ్.ఎం. విజయవంతం కావడంలో ఎఐ, ఎంఎల్ సాంకేతికత కీలక పాత్ర పోషించింది. శ్రోతల నాడి పసిగట్టడం, సంక్లిష్టమైన విషయాలను సరళం చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం... ఇలా ఎన్నో విషయాల్లో సాంకేతికత ఉపయోగపడింది. – ప్రతీక్ దీక్షిత్ -
టాప్ సింగర్స్ జంట.. విడాకుల బాట పట్టనుందా?
బాలీవుడ్ టాప్ సింగర్ లిస్ట్‌లో నేహా కక్కడ్ కూడా ఉంటుంది. ఆమె పాడిన ప్రతి పాట సూపర్ హిట్టే! తన గాత్రంతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకుందీ సింగర్. అక్టోబర్ 24, 2020న బాలీవుడ్ సింగర్ రోహన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇండియన్ ఐడల్ సీజన్ 12 షోకు జడ్జీలుగా ఉన్న సమయంలో వీరద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని అప్పట్లోనే తెలిపారు. తాజాగా నేహా కక్కడ్ తన 35వ పుట్టినరోజు బాష్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. బర్త్‌డే పార్టీలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఫుల్ ఎంజాయ్ చేసింది. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. (ఇదీ చదవండి: ప్రభాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి) తన తల్లిదండ్రులతో పాటు స్నేహితులతో కలిసి శాండ్విచ్లు తింటూ పోజులిచ్చిన ఫోటోలు మాత్రమే అక్కడ కనిపించాయి. కానీ ఏ ఫోటోలోనూ నేహా భర్త రోహన్ కనిపించలేదు. దీంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. రోహన్ క్షేమంగానే ఉన్నాడా? అని ఒకరు అడిగితే, మీ ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? అని మరొకరు ప్రశ్నించారు. భర్త లేకుండా పార్టీలు చేసుకుందంటే గొడవలు ఉన్నట్లే కదా! అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. ఈ విషయంపై నేహ కక్కడ్‌తో పాటు రోహన్ కూడా నోరు మెదపక పోవడంతో బాలీవుడ్లో మరో జంట కూడా విడాకుల బాట పడుతుందేమో అనే రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. (ఇదీ చదవండి: తండ్రికి రెండో పెళ్లి చేస్తున్న బుల్లితెర నటి.. వధువుకు కూడా రెండోదే!) -
రన్నరప్ సిక్కి రెడ్డి జోడీ
Sikki Reddy: స్లొవేనియా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 12–21, 13–21తో మూడో సీడ్ జెస్పర్ టాఫ్ట్–క్లారా గావర్సన్ (డెన్మార్క్) ద్వయం చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో సిక్కి–రోహన్ 21–15, 21–19తో మాడ్స్ వెస్టర్‌గార్డ్–క్రిస్టిన్ బుష్ (డెన్మార్క్)లపై గెలిచారు. ఇది కూడా చదవండి: ‘డ్రా’తో గట్టెక్కిన భారత్ అడిలైడ్: ఆస్ట్రేలియా మహిళల జట్టుతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ను భారత జట్టు ‘డ్రా’తో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయిన భార త్ ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. మాడిసన్ బ్రూక్స్ (25వ ని. లో) చేసిన గోల్‌తో ఆస్ట్రేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లగా... దీప్ గ్రేస్ ఎక్కా (42వ ని.లో) గోల్‌తో భారత్ స్కోరును సమంచేసింది. ఈ మ్యాచ్‌తో భారత కెప్టెన్ సవితా పూనియా, డిఫెండర్ నిక్కీ ప్రధాన్ తమ కెరీర్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నారు. -
ప్రియుడితో స్విమ్మింగ్ పూల్‌లో స్టార్ హీరో చెల్లెలు.. ఇంట్రెస్టింగ్ పోస్ట్
ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కూతురు, హీరో అర్జున్ కపూర్ చెల్లెలు అన్షులా కపూర్ ప్రేమలో పడింది. స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు కొంతకాలంగా బీటౌన్‌లో జోరుగా వినిపిస్తుంది. తాజాగా ఇదే విషయాన్ని అన్షులా అధికారికంగా ప్రకటించింది. ప్రియుడితో స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఓ రొమాంటిక్ ఫోటోను షేర్ చేస్తూ..హార్ట్ ఎమోజితో 366 అని క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాకుండా మాల్దీవుల్లో ఉన్నట్లు లొకేషన్ ట్యాగ్‌ని కూడా యాడ్ చేసింది. ఈ పోస్టు చేసి జాన్వీ, ఖుషీ కపూర్లతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేశారు. తమ ప్రేమను అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో త్వరలోనే అన్షులా కపూర్ పెళ్లిపీటలు ఎక్కనుందని టాక్ వినిపిస్తుంది. కాగా గతంలో అధిక బరువుతో ఇబ్బంది పడిన అన్షులా ఇటీవలి కాలంలో బరువు తగ్గి నాజుగ్గా మారిపోయింది. ఇదిలా ఉంటే బోనీకపూర్‌కు తొలుత మోనా కపూర్‌తో వివాహమైంది. బోనీకపూర్ శ్రీదేవిని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఆయనకు మోనా కపూర్‌తో వివాహమైంది. మొదటి భార్య సంతానమే అర్జున్ కపూర్, అన్షులా కపూర్. ఇరు కుటుంబాలకు వివాదాలు ఉన్నా శ్రీదేవి మరణం తర్వాత అర్జున్ కపూర్.. జాన్వీ, ఖుషీలను దగ్గరకు తీసుకున్నారు. అప్పట్నుంచి పలు పార్టీలు, ఫంక్షన్లకు కలిసే హాజరవుతుంటారు. -
గూగుల్ విధానాలు .. భారత ఎకానమీకి హానికరం
న్యూఢిల్లీ: దేశీ పోటీదారులను అణగదొక్కేలా టెక్ దిగ్గజం గూగుల్ పాటిస్తున్న పోటీ వ్యతిరేక విధానా లు భారత వినియోగదారులు, ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తున్నాయని మ్యాప్‌మైఇండియా సీఈవో, ఈడీ రోహన్ వర్మ వ్యాఖ్యానించారు. ‘గూగుల్ పోటీ వ్యతిరేక విధానాల ద్వారా కొత్త మార్కెట్లలో గుత్తాధిపత్యాన్ని చలాయిస్తుందని, తయారీ సంస్థలు.. యూజర్లలో ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్ట మ్స్, యాప్ స్టోర్స్, యాప్స్ విస్తరణను అసాధ్యం చేస్తుందని పరిశ్రమ, ప్రభుత్వం, నియంత్రణ సంస్థలకు.. ఈ వ్యవహారాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసిన వారందరికీ తెలుసు. గూగుల్ పోటీ వ్యతిరేక విధానాలనేవి మ్యాప్‌మైఇండియా వంటి స్వదేశీ పోటీ సంస్థలను గొంతు నొక్కడం ద్వారా భారతీ య వినియోగదారులు, ఎకానమీకి చేటు చేస్తాయి‘ అని వర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌లకు సంబంధించి గుత్తాధిపత్యం చలాయిస్తోందంటూ సీసీఐ రూ. 1,338 కో ట్ల జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ, ఎన్సీఎల్ఏటీని గూగుల్ ఆశ్రయించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ), ప్రభుత్వం, పార్లమెంటు తీసుకుంటున్న అద్భుతమైన చర్యలు అమలు కాకుండా నిరోధించేందుకు, తనకు అనుకూలంగా వ్యవహరించేలా అందర్నీ ప్రభావితం చేసేందుకు, ఒత్తిడి తెచ్చేందుకు గూగుల్ ప్రయత్నాలు మొదలుపెట్టిందని వర్మ చెప్పారు. 2020లో కోవిడ్ విజృంభించినప్పుడు మ్యాప్‌మైఇండియా యాప్ కోవిడ్ కంటైన్మెంట్ జోన్లు, టెస్టింగ్.. ట్రీట్మెంట్ సెంటర్లు మొదలైన వివరాలన్నీ అందించేదని, గూగుల్ మ్యాప్స్‌లో ఇవేవీ ఉండేవి కావని వర్మ చెప్పారు. అలాంటి తమ యాప్‌ను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించిందని, అనేకానేక ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత గానీ పునరుద్ధరించలేదని వివరించారు. మరోవైపు, సీసీఐ ఆదేశాలతో భారతీయ యూజర్లు, వ్యాపారవర్గాలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతోనే తాము ఎన్సీఎల్ఏటీలో అప్పీలు చేసినట్లు గూగుల్ ప్రతినిధి తెలిపారు. -
Vietnam Open: భారత్‌కు నిరాశ.. సిక్కిరెడ్డి- రోహన్ కపూర్ జోడీకి తప్పని ఓటమి
Vietnam Open 2022- హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్ బరిలో మిగిలిన ఏకైక జోడీ సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) సెమీఫైనల్లో వెనుదిరిగింది. 37 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ రెహాన్ నౌఫల్–లీసా కుసుమవతి (ఇండోనేసియా) ద్వయం 21–16, 21–14తో సిక్కి రెడ్డి–రోహన్ జోడీపై గెలిచి ఫైనల్ చేరింది. సెమీస్‌లో ఓడిన భారత జంటకు 1,050 డాలర్ల (రూ. 85 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 3,850 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Vietnam Open 2022: సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ జోడీ జోరు
హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ జోరు కొనసాగుతోంది. గతవారం ఛత్తీస్‌గఢ్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో టైటిల్ నెగ్గిన సిక్కి–రోహన్ ద్వయం వియత్నాం ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి, ఢిల్లీ ప్లేయర్ రోహన్ కపూర్ 21–19, 21–17తో మూడో సీడ్ చాన్ పెంగ్ సూన్–చెయ యీ సీ (మలేసియా) జోడీపై సంచలన విజయం సాధించారు. 34 ఏళ్ల చాన్ పెంగ్ సూన్ 2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో రజత పతకం సాధించడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్ రెహన్ నౌఫల్–లీసా కుసుమవతి (ఇండోనేసియా) జోడీతో సిక్కి రెడ్డి–రోహన్ తలపడతారు. Tel Aviv Tennis Tournament: టైటిల్‌కు గెలుపు దూరంలో... టెల్ అవీవ్: భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న ఈ ఏడాది మూడో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. టెల్ అవీవ్ ఏటీపీ–250 టోర్నీలో బోపన్న (భారత్)– మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 4–6, 7–6 (7/3), 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో డూంబియా–రెబూల్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. 42 ఏళ్ల బోపన్న ఈ ఏడాది పుణే ఓపెన్, అడిలైడ్ ఓపెన్లలో డబుల్స్ టైటిల్స్ సాధించాడు. -
Vietnam Open Badminton: ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ జోడీ
హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ ద్వయం 14–21, 21–9, 21–12తో హరిహరన్–లక్ష్మి ప్రియాంక (భారత్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, 40వ ర్యాంకర్ సాయిప్రణీత్ రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన రెండో సీడ్ సాయిప్రణీత్ 21–17, 18–21, 13–21తో 225వ ర్యాంకర్ సతీశ్ కుమార్ (భారత్) చేతిలో ఓడిపోయాడు. తెలంగాణ ప్లేయర్ మేకల కిరణ్ కుమార్ వరుసగా రెండు విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. తొలి రౌండ్లో కిరణ్ 21–10, 15–21, 21–10తో ప్రపంచ 68వ ర్యాంకర్ శుభాంకర్ డే (భారత్)పై నెగ్గి...రెండో రౌండ్లో 16–21, 21–14, 21–19తో ఫోన్ ప్యా నైంగ్ (మయాన్మార్)ను ఓడించాడు. -
చిన్న సినిమాలకు ఇదే సరైన సమయం
‘‘7 డేస్ 6 నైట్స్’ డీసెంట్ ఫిల్మ్.. యువతరంతో పాటు ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. మార్చి తర్వాత ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలు విడుదలై, మంచి హిట్టయ్యాయి. చిన్న సినిమాలు రావడానికి సరైన సమయం ఇదేనని భావిస్తున్నాను’’ అన్నారు దర్శక–నిర్మాత ఎంఎస్ రాజు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతున్న సందర్భంగా కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. చిత్రదర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూపించాలనుకుంటున్నాం. మా చిత్రాన్ని యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూడాలని తక్కువ టికెట్ రేట్స్ పెడుతున్నాం. ఈ సినిమాతో నిర్మాతలుగా మారిన మా అబ్బాయి సుమంత్, అమ్మాయి రిషితా దేవికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’ అన్నారు రిషితా దేవి. ‘‘7 డేస్ 6 నైట్స్’ నాకు ఒక మాస్టర్ పీస్‌లా అనిపిస్తోంది’’ అన్నారు సుమంత్ అశ్విన్. నిర్మాత రజనీకాంత్ .ఎస్, కో ప్రొడ్యూసర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
మంగళం పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది: రోహన్
‘‘7 డేస్ 6 నైట్స్’లో నా పాత్ర పేరు మంగళం. తర్వాత ఏమవుతుందో అని ఆలోచించకుండా జీవితంలో అనుకున్నది చేస్తాడు. స్నేహితుడు ఆనంద్ (సుమంత్ అశ్విన్)తో కలిసి మంగళం బ్యాచిలర్ ట్రిప్‌కి గోవా వెళతాడు. ఆ ట్రిప్‌లో ఏం జరిగింది? అనేది ‘7 డేస్ 6 నైట్స్’ కథ’’ అని రోహన్ అన్నారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, కృతికా శెట్టి, మెహర్ చాహల్ హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న రిలీజవుతోంది. (చదవండి: వాళ్లను విశ్లేషించడం మూర్ఖత్వం!) ఈ సందర్భంగా రోహన్ మాట్లాడుతూ– ‘‘నా షో రీల్ చూసిన సునీల్‌గారు ఎంఎస్ రాజుగారికి చూపించారట. రెండు ఆడిషన్స్ తర్వాత నన్ను ఫైనలైజ్ చేశారు రాజుగారు. తొలి సినిమాకే కామెడీ చేయడం కష్టం అనుకున్నాను. అయితే ఎంఎస్ రాజుగారు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో చేశాను. మంగళం పాత్ర తెలంగాణ యాసలో మాట్లాడాలి.. అందుకోసం ఈ మధ్య వచ్చిన తెలంగాణ యాస చిత్రాలు చూశాను. నా నిజజీవితానికి ఆపోజిట్‌గా ఉండే మంగళం పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. హీరోగానే చేయాలనుకోవడం లేదు.. కథలో ఇంపార్టెన్స్ ఉంటే ముఖ్య పాత్రలు కూడా చేస్తాను’’ అన్నారు. -
ప్రియుడితో బ్రేకప్ తర్వాత తొలిసారి పోస్ట్ చేసిన శ్రద్దా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ బ్రేకప్ ఇప్పుడు బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నాలుగేళ్లుగా ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో ప్రేమలో మునిగి తేలుతున్న శ్రద్దా ఊహించని విధంగా బ్రేకప్ చెప్పేయడం ఆమె అభిమానులకు షాకింగ్‌గా అనిపింస్తుంది. బాలీవుడ్లో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఏంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీనిపై ఇంతవరకు వీరిద్దరు స్పందించకపోయినా వీరి బ్రేకప్ నిజమేనని బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.చదవండి: ప్రియుడితో స్టార్ హీరోయిన్ బ్రేకప్!.. నాలుగేళ్ల బంధానికి ముగింపు గత నాలుగేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ఊహించని విధంగా బ్రేకప్‌తో తమ లవ్‌స్టోరికి ఎండ్‌కార్డ్ వేసేశారు. గోవాలో జరిగిన శ్రద్దా కపూర్ బర్త్‌డే పార్టీ ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూర్చింది. కాగా సోషల్ మీడియాలో శ్రద్దా బ్రేకప్‌పై జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె తొలిసారిగా స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ఔర్ సునావో( ఇంకా వినిపించండి)అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సాహో చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైన శ్రద్దా రణబీర్ కపూర్ సరసన ఓ సినిమా చేస్తుంది. వీటితో పాటు`చాల్ బాజ్`..`నాగిన్` లాంటి సినిమాలు చేతిలో ఉన్నాయి. చదవండి: 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ వాడిన బైక్ కోసం అంత ఖర్చయిందా? -
ప్రియుడితో స్టార్ హీరోయిన్ బ్రేకప్!.. నాలుగేళ్ల బంధానికి ముగింపు
Shraddha Kapoor Rohan Shrestha Break Up: చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోవడం చూస్తుంటాం. ఇటీవలి కాలంలో బ్రేకప్ కహానీలు మరీ ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది. బాయ్‌ఫ్రెండ్ రోహన్ శ్రేష్టతో నాలుగేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ అతడి నుంచి విడిపోయింది. దీనిపై ఇంతవరకు ఇద్దరూ స్పందించలేదు. గత కొన్నాళ్లుగా సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోషన్ శ్రేష్ట- శ్రద్దా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. పార్టీలు, పబ్‌లు, టూర్స్ అంటూ పలుమార్లు మీడియాకు చిక్కిన వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. అయితే అనూహ్యంగా నాలుగేళ్ల లవ్‌స్టోరీకి ఫుల్స్టాప్ పెట్టేశారు. అయితే విడిపోవడానికి గల కారణాలు ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇటీవలె గోవాలో శ్రద్దాకపూర్ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్నేహితుల,సన్నిహితులు అంతా హజరయ్యారు. కానీ ప్రియుడు రోహన్ మాత్రం హాజరు కాలేదు. సోషల్ మీడియాలో కూడా రోహాన్ బర్త్‌డే విషెస్ చెప్పలేదు. దీంతో వీరిద్దరి బ్రేకప్ నిజమేనని బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. -
Rohan Jaitley: డీడీసీఏ అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ
Rohan Jaitley Elected As DDCA President: ప్రతిష్టాత్మక ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ మళ్లీ ఎన్నికయ్యారు. గురువారం వెలువడిన ఫలితాల్లో ఆయన సమీప ప్రత్యర్థి, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్‌పై 753 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇక ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సిద్ధార్థ్ సింగ్ వర్మ కార్యదర్శి పదవిని సొంతం చేసుకున్నారు. మాజీ క్రికెటర్ అయిన సిద్ధార్థ్, మాజీ ముఖ్యమంత్రి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు, ప్రస్తుత పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మకు సోదరుడు. చదవండి: T20 World Cup 2021 Aus Vs SL: కప్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆసీస్... వరుస విజయాలు -
అది నా జీవితాన్నే మార్చేసింది: సింగర్
ఈ మధ్యే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ప్రముఖ సింగర్లు నేహా కక్కర్- రోహన్‌ప్రీత్‌సింగ్ ఇండియన్ ఐడల్ సీజన్ 12 షోకు జంటగా వెళ్లారు. అక్కడ రోహన్.. నేహాను కలిశాక తన జీవితం ఎలా మారిపోయిందో చెప్తూ ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు తన స్పీచ్‌తో అక్కడున్న జడ్జిలతో పాటు సతీమణికి సైతం కంటతడి పెట్టించారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే.. 'నేను తలపాగా కట్టుకుంటున్న సమయంలో నేహా మేనేజ్మెంట్ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేహా తర్వాతి సాంగ్‌లో మీరు నటిస్తారా అని! అసలు దానికోసం ప్రత్యేకంగా అడగాలా? అని బదులిచ్చాను' (చదవండి: సమంతకు నో చెప్పిన నాగచైతన్య!) 'అలా నేను ఓ రోజు గదిలో అడుగు పెట్టగానే నేహూ తల తిప్పి నావైపు చూసింది. ఆ క్షణం నా జీవితాన్నే మార్చేసింది. ఆమె 'నేహు కా వ్యాహ్' అనే పాట రాసిందని మీరంటారు, కానీ నా తలరాతను కూడా ఆమె రాసిందని నేనంటాను. నేను ఇప్పుడు ఇలా స్టేజీ మీద నిలబడటానికి కారణం నేహూనే అని సగర్వంగా చెప్తాను' అని ముగించడంతో నేహా కక్కర్ కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్‌ను 'నన్ను ఏడిపించారు' అన్న క్యాప్షన్‌తో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా నేహు దా వ్యాహ్ సాంగ్ రిలీజైన నెల రోజులకే నేహా కక్కర్- రోహన్ ప్రీత్‌సింగ్ ముంబైలో రోకా ఫంక్షన్ జరుపుకున్నారు. తర్వాత ఢిల్లీలో హల్దీ, మెహందీ వేడుకలతో పాటు అక్టోబర్ 23న సంగీత్ కూడా ఏర్పాటు చేశారు. తర్వాతి రోజే వేలు పట్టుకుని ఏడడుగులు నడిచారు. (చదవండి: తాగి ప్రపోజ్ చేశాడు: సింగర్) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) -
తాగి ప్రపోజ్ చేశాడు: సింగర్
బాలీవుడ్ ప్రముఖ సింగర్లు నేహా కక్కర్-రోహన్‌ప్రీత్ సింగ్ వివాహం అక్టోబర్ 24న స్వల్ప అతిథుల మధ్య ఘనంగా జరిగింది. అయితే మరీ ఇంత తొందరగా పెళ్లి చేసుకునేందుకు రోహన్ రెడీగా లేరట. కానీ ఓ రోజు మాత్రం పూటుగా మద్యం తాగి పెళ్లి చేసుకుందాం అని తన ప్రియురాలు నేహాకు మెసేజ్ పెట్టాడట. మొదట దీన్ని నేహా నమ్మలేదట, కానీ తర్వాత నమ్మక తప్పలేదు. మరి ఇంతలోనే అంత మార్పు రావడానికి కారణమేంటో నేహా మాటల్లోనే తెలుసుకుందాం.. పెళ్లి కుదరదన్నాడు "ఓ రోజు షూటింగ్ పూర్తయ్యాక రోహన్ నా స్నాప్‌చాట్ ఐడీ అడిగాడు. అలా మా మధ్య మాటలు కలిశాయి. ప్రేమ పాఠాలు కూడా నడిచాయి. జీవితంలో సెటిల్ అవ్వాల్సిన సమయం వచ్చిందనిపించి పెళ్లి చేసుకుందాం అని అడిగాను. దీనికి అతడు ససేమీరా ఒప్పుకోలేదు. నాకింకా పాతికేళ్లే.. అప్పుడే పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేనని తేల్చి చెప్పాడు. దీంతో ఇద్దరం మాట్లాడుకోవడమే మానేశాం. అలా కొంతకాలం గడిచింది. సడన్‌గా ఓ రోజు నేహూ, మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు లేకుండా నేను బతకలేను అని చెప్పాడు. నాకెందుకో నమ్మాలనిపించలేదు" (చదవండి: రాథోర్ పాటలకు పడి పోవాల్సిందే!) తాగిన మత్తులో ప్రపోజ్ చేశాడనుకున్నా "ఎందుకంటే అప్పుడే రెండు, మూడు బీర్లు తాగాడు. తాగిన మత్తులో ఇలాంటి డైలాగులు కొడుతున్నాడు, కానీ తెల్లారేసరికి మర్చిపోతాడు అని లైట్ తీసుకున్నాను. తర్వాతి రోజు నేను షూటింగ్ కోసం ఛండీఘర్ వెళ్లాను. రోహన్ అక్కడ నా రూమ్‌కు వచ్చి నిన్న రాత్రి ఏం జరిగిందో గుర్తుందా? అని అడిగాడు. నువ్వు తాగితే నేనెందుకు మర్చిపోతాను అని చెప్పాను. కానీ ఆ క్షణమే అర్థమైంది. రోహన్ నిజంగానే పెళ్లికి రెడీ అయ్యాడని! వెంటనే నేను మా అమ్మతో మాట్లాడమని చెప్పాను. వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు" అని నేహా చెప్పుకొచ్చారు. కాగా ఈ మధ్య నెట్టింట నేహా బేబీ బంప్ ఫొటోలు దర్శనమివ్వడంతో ఆమె తల్లి కాబోతుందంటూ కొన్ని వార్తలు షికార్లు చేశాయి. అయితే అదంతా లేటెస్ట్ సాంగ్ 'ఖ్యాల్ రఖ్యా కర్' కోసమేనని తెలియడంతో అభిమానులు అవాక్కయ్యారు. డిసెంబర్ 22న విడుదలైన ఈ సాంగ్ జనాలను ఆకట్టుకుంటోంది. (చదవండి: నేహా కక్కర్-రోహాన్ ప్రీత్‌సింగ్‌ల పెళ్లి) -
కీలక పదవికి జైట్లీ కుమారుడు ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహాన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2021 జూన్ 30 వరకు ఆయన డీసీసీఏ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. వృత్తిరిత్యా న్యాయవాది అయిన రోహాన్.. తన తండ్రి బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక అధికారులు, నేతల సూచనల మేరకు డీడీసీఏ బరిలో నిలిచి విజయం సాధించారు. ఈ సందర్భంగా రోహాన్ జైట్లీకి పలువురు ఆటగాళ్లు, ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. జైట్లీ నేతృత్వంలోనే ఢిల్లీ క్రికెట్ సంఘం మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా అవినీతి ఆరోపణలు రావడంతో రజత్ శర్మ రాజీనామా చేయగ.. ఆ పదవిక ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రోహాన్ ఎన్నికయ్యారు. ఢిల్లీ క్రికెట్ సంఘానికి కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎంతో సేవ చేసిన విషయం తెలిసిందే. 1999 నుంచి 2013 వరకు ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్‌కు అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. ఆయన సారథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లు జాతీయ జట్టుకు సైతం ఎంపికయ్యారు. ఆయన సేవలను గుర్తించిన డీసీఏ జైట్లీ మరణాంతరం ఢిల్లీలోని ప్రముఖ ఫిరోజ్ షా కోట్ల మైదానానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టి ఘనంగా సత్కరించింది. -
కీలక పదవిలో అరుణ్ జైట్లీ కుమారుడు!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహాన్ జైట్లీ ఓ కీలక పదవి కోసం పోటీపడుతున్నారు. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ మేరకు రోహాన్ జైట్లీ బుధవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సభ్యులంతా ఆయననే మద్దతు తెలుపుతుండటంతో ఎన్నికల లాంఛనం కానున్నట్లు సమాచారం. ఇక డీసీసీఏ పదవికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పలువురు ప్రముఖలు జైట్లీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ దావన్ ట్విటర్ వేదికగా విషెష్ తెలియజేశాడు. అతను విజయం సాధించాలని, డీడీసీఏ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించాడు. మరోవైపు రోహాన్ ఎన్నికకు తామంతా సహకరిస్తామని డీసీఏ సభ్యులు తెలిపారు. ఢిల్లీ క్రికెట్ సంఘానికి కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎంతో సేవ చేసిన విషయం తెలిసిందే. 1999 నుంచి 2013 వరకు ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్‌కు అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. ఆయన సారథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లు జాతీయ జట్టుకు సైతం ఎంపికయ్యారు. ఆయన సేవలను గుర్తించిన డీసీఏ జైట్లీ మరణాంతరం ఢిల్లీలోని ప్రముఖ ఫిరోజ్ షా కోట్ల మైదానానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టి ఘనంగా సత్కరించింది. అయితే తండ్రి వారసత్వంలో కొనసాగాలి అనుకున్న రోహాన్.. స్థానిక పెద్దల సహకారంతో డీడీసీఏ పదవికి నామినేషన్ వేశారు. అయితే రోహాన్ ఎన్నికకు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఎన్నిక నల్లేరు మీద నడకే కానుంది. మరోవైపు డీడీసీఏలో తారాస్థాయిలో అంతర్యుద్దం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొంతకాలంగా ముఖ్య కార్యదర్శి వినోద్ తిహారాతో అధ్యక్షుడు రజత్ శర్మకు పొసగటం లేదు. అరుణ్ జైట్లీ మరణం తర్వాత డీడీసీఏ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావడం అంతేకాకుండా రజత్ శర్మపై అన్ని వైపులా ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా తమ నిర్ణయాలకు అధ్యక్షుడు వ్యతిరేకించడంతో సంఘం సభ్యులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్ష పదవికి గత ఏడాది నవంబర్‌లో సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. -
ఔరా.. ఏమి నటన!
పిట్ట కొంచెం కూత ఘనం అన్న నానుడిని తలపిస్తున్నాడు ఆ బాలుడు. ఇటు బుల్లి తెరపై.. అటు వెండి తెరపై అసమాన నటనా చాతుర్యంతో అబ్బురపరుస్తున్నాడు. ఏడేళ్ల ప్రాయంలోనే టీవీ సీరియల్స్‌లో అరంగ్రేటం చేసిన రోహన్ రాయ్తనదైన ప్రతిభతోదూసుకెళ్తున్నాడు. డైలాగ్‌లను అలవోకగా చెబుతూ తనకు తానే సాటిఅని నిరూపిస్తున్నాడు. సాక్షి, హైదరాబాద్ : గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్‌లో నివసిస్తున్న చిన్న సుబ్బారాయుడు, రాధా మాధవి దంపతుల కుమారుడు రోహన్ రాయ్. స్థానికంగా ఉన్న కేంద్రీయ విద్యాలయలో రెండో తరగతి చదువుతున్నాడు. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే అచ్చంగా వారి గొంతును అనుకరించి మాట్లాడేవాడు. సినీనటుడు రజనీకాంత్ డైలాగ్‌లను చెబుతుండేవాడు. గోన గన్నారెడ్డి సినిమా డైలాగ్‌లు అలవోకగా చెప్పేవాడు. కుమారుడి ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు 2016లో జీ తెలుగు సీజన్ –1 డ్రామా జూనియర్స్‌కు దరఖాస్తు చేశారు. ఆ పోటీలతో బుల్లితెరపై రోహన్ రాయ్ కేరీర్ మొదలైంది. అప్పటి నుంచి టీవీ సీరియల్స్, సినిమాలో రోహన్‌కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. టీవీ సీరియళ్లలో.. మా టీవీ సీరియల్ ‘కథలో రాజకుమారీ’లో అభి పాత్రలో హీరో అన్న కొడుకుగా నటిస్తున్నాడు. జీ తెలుగులో ప్రసారమయ్యే గుండమ్మ కథ సీరియల్లో గుండమ్మ మేనల్లుడుగా నటిస్తున్నాడు. నెలలో రెండు షెడ్యూల్స్‌లో షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ టీవీలో అభిరుచి అనే చెఫ్ ప్రోగ్రాంలో రోహన్ యాంకర్‌గా 40 ఎపిసోడ్లు చేశాడు. జీ తెలుగులో కామెడీ షో, బోనాలు, హోలీ, ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నాడు. అంతే కాకుండా గోల్డెన్ అవార్డ్స్, అప్సర అవార్డు ఫంక్షన్లలో పాల్గొన్నాడు. అవార్డుకు ఎంపికయ్యింది ఇలా.. జీ తెలుగులో డ్రామా జూనియర్ పోటీల్లో భాగంగా 2016లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 3000 మంది చిన్నారుల్లో 25 మందిని ఎంపిక చేశారు. వీరిలో రోహన్ 6వ స్థానంలో నిలిచాడు. జూనియర్ డ్రామా పోటీల్లో గోన గన్నారెడ్డి, రజనీకాంత్, రాంగోల్‌వర్మ, ప్రకాశ్‌రాజ్ నటనలను నాటిక రూపంలో ప్రదర్శించాడు. యమధర్మరాజు పాత్రతో ఆకట్టుకున్నాడు. ఫైనల్ పోటీలలో అమ్మాయి గెటప్‌లో అమెరికా కోడలుగా నటించాడు. డైనమెట్ ఆఫ్ డ్రామా జూనియర్స్– 2017అవార్డ్ అందుకున్నారు. అంతే కాకుండా తత్వపీఠం ఉగాది పుస్కారాన్ని రోహన్‌కు అందించింది. సినిమా అవకాశాలు.. 2017లో రాజుగారి గది– 2లో హీరోయిన్ సమంత ట్యూషన్ స్టూడెంట్‌గా రోహన్ కనిపిస్తాడు. ఈ సినిమాతో రోహన్ కేరీర్ ప్రారంభమైంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన రంగుల రాట్నం సినిమాలో రోహన్ బర్త్ డే ఈవెంట్‌కు మేనేజర్‌గా హీరోయిన్ చిత్ర శుక్లా వ్యవహరిస్తుంది. ఈ సన్నివేశంలో బాలనటుడు రోహన్ హీరోయిన్ను ఏడ్పిస్తాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న సినిమాలో హీరో రామ్‌చరణ్ చిన్ననాటి పాత్రలో రోహన్ రాయ్ నటిస్తున్నాడు. మా ఊరిలో మా ప్రేమ కథ చిత్రం హీరో విజయ్ చిన్ననాటి పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే గుంటూరు టాకీస్– 2లో నటుడు నరేష్ కొడుకుగా నటిస్తున్నాడు. హీరో కావాలనుంది.. పెద్దయ్యాక సినిమాల్లో హీరోగా నటించాలని ఉంది. నటనలో మంచి పేరు తెచ్చుకోవాలనుంది. అమ్మా నాన్న నన్నెంతగానే ప్రోత్సస్తున్నారు. హీరో అల్లు అర్జున్ ఎంతో ఇష్టం. అతను స్టైలిష్‌గా ఉంటాడు. డ్యాన్స్ బాగా చేస్తాడు. – రోహన్ రాయ్ -
లెక్కలు చేయలేదని విద్యార్థి గొంతులోకి ...
అహ్మద్‌నగర్, ముంబై : లెక్కలు సరిగా చేయలేదనే ఆగ్రహంతో విద్యార్థి గొంతులో కర్ర ముక్క (బెత్తం) ను దూర్చాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఈ సంఘటన మహారాష్ట్ర కర్జత్ జిల్లాలోని పింపల్గాన్ జిల్లా పరిషత్ పాఠశాలలో చోటుచేసుకుంది. రోహన్ డీ జంజీర్(8) జిల్లా పరిషత్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు. ఇదే పాఠశాలలో లెక్కల మాష్టారుగా పని చేస్తున్న చంద్రకాంత్ సోపాన్ షిండే ఓ లెక్క చేయమని రోహన్‌కు ఇచ్చాడు. కానీ రోహన్ ఆ లెక్కను చేయలేకపోయాడు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు చంద్రకాంత్.. రోహన్ నోటిలోకి కర్రను దూర్చాడు. దాంతో రోహన్ ఆహార, వాయు నాళాలు దెబ్బతిన్నాయి. నొప్పిని తట్టుకోలేని రోహన్ నేలమీద పడిపోయాడు. విద్యార్థి నోటి నుంచి రక్తం కారసాగింది. ఇది చూసిన పిల్లలు భయంతో బయటకు పరుగులు తీశారు. అక్కడ కింది పడివున్న రోహన్‌ని స్కూల్ యాజమాన్యం హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆస్పత్రి వారు రోహన్‌ని పూణేకి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం అతడు పూణెలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ఈ ఘటనకు కారణమైన ఉపాధ్యాయుడిని పాఠశాల యాజమాన్యం విధుల నుంచి సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించింది. రోహన్ తల్లి సునితా జంజీరే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ ఉపాధ్యాయుడిని అరెస్టు చేయలేదు. రోహన్ కోలుకున్నాక అతని వాంగ్మూలాన్ని తీసుకుని, ఆ తర్వాత ఉపాధ్యాయుడిని అరెస్టు చేస్తామని కర్జత్ పోలీసు స్టేషన్ అధికారి ఎస్బీ మిత్రే తెలిపారు. -
క్వార్టర్స్‌లో బోపన్న జోడి
ఎస్ హెర్టోజెన్‌బాష్ (నెదర్లాండ్స్): రికో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న జోడీ క్వార్టర్‌ఫైనల్స్‌లో ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న, నికోలస్ మహత్ (ఫ్రాన్స్) జోడీ 6-1, 6-4తో రాబిన్ హస్సే, గిలెర్మో గార్సియా లోపెజ్ జంటపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో బోపన్న జోడీ గిల్స్ ముల్లర్, ఫ్రెడెరిక్ నీల్సన్ జంటతో తలపడుతుంది.