ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు 'రోహన్ మిర్చందానీ' (Rohan Mirchandani) డిసెంబర్ 21 రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఎపిగామియా మాతృ సంస్థ డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ ధృవీకరించింది.
అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన తన ప్రియతమ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ అకాల మరణం చెందారని డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ ధృవీకరిస్తూ.. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రోహన్ లేకపోయినప్పటికీ.. ఆయన విలువలు మాకు మార్గదర్శకంగా కొనసాగుతాయి. అయన కలలను నిజం చేయడానికి, సంస్థను అభివృద్ధి చేయడానికి మేము కలిసి పని చేస్తామని కంపెనీ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.
అంకుర్ గోయెల్ (సీఓఓ & వ్యవస్థాపక సభ్యుడు), ఉదయ్ థాక్కర్ (కో-ఫౌండర్ & డైరెక్టర్) నేతృత్వంలో కంపెనీ రోజువారీ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఇందులో రోహన్ కుటుంబం కూడా ఉంటుంది. రోహన్ మా గురువు, స్నేహితుడు.. నాయకుడు. అతని విజన్‌ని ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నామని అంకుర్ గోయెల్ & ఉదయ్ థాక్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment