Neha Kakkar and Rohanpreet Singh Marriage Break up - Sakshi
Sakshi News home page

భర్త లేకుండా పార్టీ.. సింగర్స్‌ జంట విడాకులు తీసుకోనుందా?

Published Fri, Jun 9 2023 2:54 PM | Last Updated on Fri, Jun 9 2023 3:27 PM

Neha Kakkar and Rohan Preet Singh Marraige Break up - Sakshi

బాలీవుడ్‌ టాప్‌ సింగర్‌ లిస్ట్‌లో నేహా కక్కడ్‌ కూడా ఉంటుంది.  ఆమె పాడిన ప్రతి పాట సూపర్‌ హిట్టే! తన గాత్రంతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ను ఏర్పాటు చేసుకుందీ సింగర్‌. అక్టోబర్ 24, 2020న బాలీవుడ్‌ సింగర్‌ రోహన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇండియన్ ఐడల్ సీజన్ 12 షోకు జడ్జీలుగా ఉన్న సమయంలో వీరద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని అప్పట్లోనే తెలిపారు. తాజాగా నేహా కక్కడ్‌ తన 35వ పుట్టినరోజు బాష్‌ వేడుకలను సెలబ్రేట్‌ చేసుకుంది. బర్త్‌డే పార్టీలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఫుల్‌ ఎంజాయ్‌ చేసింది. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసుకుంది.  

(ఇదీ చదవండి:  ప్రభాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి)

తన తల్లిదండ్రులతో పాటు స్నేహితులతో కలిసి శాండ్‌విచ్‌లు తింటూ పోజులిచ్చిన ఫోటోలు మాత్రమే అక్కడ కనిపించాయి. కానీ ఏ ఫోటోలోనూ నేహా భర్త రోహన్ కనిపించలేదు. దీంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. రోహన్‌ క్షేమంగానే ఉన్నాడా? అని ఒకరు అడిగితే, మీ ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? అని మరొకరు ప్రశ్నించారు. భర్త లేకుండా పార్టీలు చేసుకుందంటే గొడవలు ఉన్నట్లే కదా! అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. ఈ విషయంపై నేహ కక్కడ్‌తో పాటు రోహన్‌ కూడా నోరు మెదపక పోవడంతో బాలీవుడ్‌లో మరో జంట కూడా విడాకుల బాట పడుతుందేమో అనే రూమర్స్‌ స్టార్ట్‌ అయ్యాయి.

(ఇదీ చదవండితండ్రికి రెండో పెళ్లి చేస్తున్న బుల్లితెర నటి.. వధువుకు కూడా రెండోదే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement