Anshula Kapoor Makes Her Relationship With Rohan Thakkar Official - Sakshi
Sakshi News home page

Anshula Kapoor : ప్రేమ విషయాన్ని బయటపెట్టిన జాన్వీ కపూర్‌ సోదరి.. ఫోటో వైరల్‌

Published Tue, Mar 28 2023 3:43 PM | Last Updated on Tue, Mar 28 2023 4:20 PM

Anshula Kapoor Makes Her Relationship With Rohan Thakkar Official - Sakshi

ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ కూతురు, హీరో అర్జున్‌ కపూర్‌ చెల్లెలు అన్షులా కపూర్ ప్రేమలో పడింది. స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్‌తో ఆమె డేటింగ్‌ చేస్తున్నట్లు కొంతకాలంగా బీటౌన్‌లో జోరుగా వినిపిస్తుంది. తాజాగా ఇదే విషయాన్ని అన్షులా అధికారికంగా ప్రకటించింది. ప్రియుడితో స్విమ్మింగ్‌ పూల్‌లో దిగిన ఓ రొమాంటిక్‌ ఫోటోను షేర్‌ చేస్తూ..హార్ట్ ఎమోజితో 366 అని క్యాప్షన్‌ ఇచ్చింది. అంతేకాకుండా మాల్దీవుల్లో ఉన్నట్లు లొకేషన్‌ ట్యాగ్‌ని కూడా యాడ్‌ చేసింది.

ఈ పోస్టు చేసి జాన్వీ, ఖుషీ కపూర్‌లతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్‌ చేశారు. తమ ప్రేమను అఫీషియల్‌గా అనౌన్స్‌ చేయడంతో త్వరలోనే అన్షులా కపూర్‌ పెళ్లిపీటలు ఎక్కనుందని టాక్‌ వినిపిస్తుంది. కాగా గతంలో అధిక బరువుతో ఇబ్బంది పడిన అన్షులా ఇటీవలి కాలంలో బరువు తగ్గి నాజుగ్గా మారిపోయింది. ఇదిలా ఉంటే బోనీకపూర్‌కు తొలుత మోనా కపూర్‌తో వివాహమైంది.

బోనీకపూర్ శ్రీదేవిని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఆయనకు మోనా కపూర్‌తో వివాహమైంది. మొదటి భార్య సంతానమే అర్జున్‌ కపూర్‌, అన్షులా కపూర్‌. ఇరు కుటుంబాలకు వివాదాలు ఉన్నా శ్రీదేవి మరణం తర్వాత అర్జున్‌ కపూర్‌.. జాన్వీ, ఖుషీలను దగ్గరకు తీసుకున్నారు. అప్పట్నుంచి పలు పార్టీలు, ఫంక్షన్లకు కలిసే హాజరవుతుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement