Anshula Kapoor
-
హీరో బర్త్‌డే.. అందరూ ఉన్నా ఒకరు మాత్రం మిస్సింగ్!
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ బర్త్‌డే నేడు (జూన్ 26). అన్నయ్య బర్త్‌డే అంటే ఎలా ఉండాలి? ఆ రోజు తనను ఎంత సంతోషంగా ఉంచాలి? అని ఆలోచించినట్లుంది అన్షులా కపూర్. అందుకే అర్ధరాత్రి అర్జున్‌తో కేక్ కట్ చేయించింది. ఈ బర్త్‌డే పార్టీకి సంజయ్ కపూర్, వరుణ్ ధావన్ సహా తదితర సెలబ్రిటీలు హాజరయ్యారు.ఈ ఫోటోలను అన్షులా షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే మై నెంబర్ 1. ఎంతో పెద్ద మనసున్న నువ్వు అన్నింటినీ దాటుకుని ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. నువ్వు అనుకున్నది సాధించాలి. నీ కష్టాలు తగ్గిపోవాలి. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి.. లవ్ యూ అన్నయ్య అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఇక ఈ బర్త్‌డే పార్టీలో బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా మిస్సయింది. ప్రియుడి పుట్టినరోజు అనగానే అందరికన్నా ముందుగానే విషెస్ చెప్పే ఆమె ఈసారి మాత్రం సైలెంట్‌గానే ఉండిపోయింది. పార్టీలో సైతం కనిపించలేదు. దీంతో వీళ్లిద్దరూ విడిపోయిన మాట వాస్తవమేనని అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor)చదవండి: పొరపాటు దిద్దుకున్న నాగార్జున, వీడియో వైరల్ -
ప్రియుడితో స్విమ్మింగ్ పూల్‌లో స్టార్ హీరో చెల్లెలు.. ఇంట్రెస్టింగ్ పోస్ట్
ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కూతురు, హీరో అర్జున్ కపూర్ చెల్లెలు అన్షులా కపూర్ ప్రేమలో పడింది. స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు కొంతకాలంగా బీటౌన్‌లో జోరుగా వినిపిస్తుంది. తాజాగా ఇదే విషయాన్ని అన్షులా అధికారికంగా ప్రకటించింది. ప్రియుడితో స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఓ రొమాంటిక్ ఫోటోను షేర్ చేస్తూ..హార్ట్ ఎమోజితో 366 అని క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాకుండా మాల్దీవుల్లో ఉన్నట్లు లొకేషన్ ట్యాగ్‌ని కూడా యాడ్ చేసింది. ఈ పోస్టు చేసి జాన్వీ, ఖుషీ కపూర్లతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేశారు. తమ ప్రేమను అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో త్వరలోనే అన్షులా కపూర్ పెళ్లిపీటలు ఎక్కనుందని టాక్ వినిపిస్తుంది. కాగా గతంలో అధిక బరువుతో ఇబ్బంది పడిన అన్షులా ఇటీవలి కాలంలో బరువు తగ్గి నాజుగ్గా మారిపోయింది. ఇదిలా ఉంటే బోనీకపూర్‌కు తొలుత మోనా కపూర్‌తో వివాహమైంది. బోనీకపూర్ శ్రీదేవిని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఆయనకు మోనా కపూర్‌తో వివాహమైంది. మొదటి భార్య సంతానమే అర్జున్ కపూర్, అన్షులా కపూర్. ఇరు కుటుంబాలకు వివాదాలు ఉన్నా శ్రీదేవి మరణం తర్వాత అర్జున్ కపూర్.. జాన్వీ, ఖుషీలను దగ్గరకు తీసుకున్నారు. అప్పట్నుంచి పలు పార్టీలు, ఫంక్షన్లకు కలిసే హాజరవుతుంటారు. -
అతని రాకతో నాకు మరింత ధైర్యం వచ్చింది: జాన్వీ కపూర్
Janhvi Kapoor On Gaining Siblings Arjun And Anshula Kapoor Secure Stronger: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తనదైన నటనతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ధడక్' సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చి ప్రశంసలు దక్కించుకుంది. నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో తన తోబుట్టువులు అర్జున్ కపూర్, అన్షులా కపూర్ గురించి చెప్పుకొచ్చింది. 'అమ్మ మరణం తర్వాత అర్జున్ అన్నయ్య, అన్షులా మా జీవితాల్లోకి వచ్చారు. వాళ్ల రాకతో మేము (జాన్వీ, ఖుషీ కపూర్) మరింత ధైర్యంగా, సురక్షితంగా ఉన్నామనే భావన కలిగింది. మాకు మరో ఇద్దరు తోబుట్టువులు దొరికారు. ఇలా ఎవరైనా చెబుతారో లేదో తెలియదు కానీ, మేము చాలా అదృష్టవంతులం. ఇంతకన్న గొప్పగా మాకు ఏం లభించదు.' అని చెప్పుకొచ్చింది జాన్వీ. తర్వాత వాళ్ల నాన్న బోనీ కపూర్ గురించి చెబుతూ 'నిజాయితీగా చెప్పాలంటే నాన్నతో ఇలా కొత్తగా ఉంది. ఆయన మాతో ఒక స్నేహితుడిలా ఉంటున్నారు. మేము నలుగురం కలిసి ఉన్నందుకు నాన్న కూడా ఎంతో ఆనందిస్తున్నారు.' అని జాన్వీ కపూర్ తెలిపింది. అర్జున్ కపూర్, అన్షులా కపూర్ ఇద్దరు బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీకు పుట్టిన పిల్లలనే విషయం తెలిసిందే. చదవండి: తెలుగులో జాన్వీ కపూర్ ఎంట్రీ ?.. ఫేవరెట్ హీరోతో చదవండి: శ్రీదేవి కూతుళ్లకు కరోనా !.. జాన్వీ పోస్ట్ ఏం చెబుతోంది var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో సిస్టర్!
సినిమా కోసం లావెక్కడం లేదంటే సన్నబడటం మనం తరచూ చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అయితే స్టార్స్ మాత్రమే కాదు వారి ఫ్యామిలీలోని వారు కూడా జిమ్ముల వెంట తిరుగుతూ బాడీని ఫిట్‌గా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ తన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ లుక్‌ను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. బొద్దుగా ఉండే అన్షులా ఇప్పుడు సన్నగా మారిపోయింది. సాధారణంగా చాలామంది ఆదివారం వర్కవుట్కు కూడా సెలవు పెట్టేస్తుంటారు. కానీ అన్షులా మాత్రం సండే కూడా మరింత కష్టపడుతూ జిమ్‌లో చెమటలు చిందిస్తుంటుంది. తాజాగా ఆమె వెయిట్ లాస్ జర్నీని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్ పోస్ట్ పెట్టింది. బాడీని ఇలా మార్చడం అంత సులువు కాలేదని చెప్తూ ఎమోషనలైంది. ఇది రెండేళ్ల లాంగ్ జర్నీ అని, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, కన్నీళ్లు దిగమింగుకున్నానని చెప్పుకొచ్చింది. ఈ జర్నీ ఇంకా కొనసాగుతుందని పేర్కొంది. ఈ పోస్ట్‌పై జాన్వీ కపూర్, శాన్యా కపూర్ సహా పలువురు ప్రముఖులు, ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన మేకోవర్ లుక్‌ను చూసి కపూర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో పాటు నెటిజన్లు సైతం అబ్బురపడుతున్నారు. View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor) -
అర్జున్ కపూర్‌కి కరోనా.. ఇల్లుకు సీల్ వేసిన బీఎంసీ
బాలీవుడ్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇటీవల బీటౌన్‌కు చెందిన ప్రముఖుల కరోనా బారిన పడిన తెలిసిందే. తాజాగా హీరో అర్జున్ కపూర్‌కు బుధవారం (డిసెంబర్ 29) కొవిడ్ పాజిటివ్ అని తేలింది. అర్జున్ కపూర్‌తోపాటు అతని సోదరి అన్షులా కపూర్‌కు మహ్మమారి సోకింది. కరీనా కపూర్ ఖాన్ కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వీరిద్దర కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తమను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు. అర్జున్ కపూర్ ప్రేయసీ మలైక అరోరా కొవిడ్ పరీక్షలు చేసుకోగా ఆమెకు నెగెటివ్ వచ్చింది. ఇటీవల వారిద్దరూ ఓ డిన్నర్ డేట్‌కు వెళ్లినట్లు సమాచారం. అలాగే రియా కపూర్, తన భర్త కరణ్ బూలానీకి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని రియా కపూర్ తన ఇన్‌స్టా గ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసింది. 'ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ నేను నా భర్త కరోనా బారిన పడ్డాం. ఇది మహమ్మారి స్వభావం. మేమిద్దరం ఐసోలేట్ అవుతున్నాం. వైద్యులు సూచించిన మెడిసిన్ తీసుకుంటున్నాం.' అని తెలిపారు. అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కరోనా రావడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అప్రమత్తమైంది. ముంబైలోని అర్జున్ కపూర్ నివాసానికి సీల్ వేసింది. ఇంటి పరిసరాలను శానిటైజ్ చేస్తుంది బీఎంసీ. ఇదిలా ఉంటే గతేడాది సెప్టెంబర్‌లో అర్జున్ కపూర్ తొలిసారిగా కరోనా బారిన పడ్డాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
హాలీవుడ్ నటుడితో పోటీపడుతున్న కఫూర్ ఫ్యామిలీ
ఢిల్లీ : బోనీ కపూర్ ఫ్యామిలీ హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ పాత్రకు గట్టి పోటీ ఇస్తున్నారట ! అదేంటి.. కపూర్ ఫ్యామిలీ హాలీవుడ్ సినిమాలో నటించడంమేంటని అనుకుంటున్నారా.. అయితే ఈ వార్తను మొత్తం చదివితే విషయం మీకే అర్థమవుతుంది. జార్జ్ క్లూనీ 2009లో తాను నటించిన 'అప్ ఇన్‌ది ఎయిర్' సినిమాలో చివరి వరకు తన ఇంట్లో కన్నా విమాన ప్రయాణాల్లోనే ఎక్కువగా కనిపిస్తాడు. అదే సంఘటన గురువారం కపూర్ ఫ్యామిలీలోనూ చోటుచేసుకుంది. గురువారం కపూర్ ఫ్యామిలీ ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమవుతూ విమానంలో ప్రయాణం చేశారు. ఇదే విషయాన్ని తాజాగా అన్షులాకపూర్ వారి కుటుంబసభ్యులు వాట్సప్ గ్రూప్‌లో చేసిన చాట్‌ను స్క్రీన్‌షాట్ రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో తన ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్‌లో ఎవరు ఎక్కడ ఉన్నారని చేసిన సంభాషణను పంచుకున్నారు. ప్రస్తుతం దోస్తానా 2 షూటింగ్లో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ తన తండ్రి బోనీ కపూర్, సోదరుడు అర్జున్ కపూర్లకు తాను అమృత్‌సర్‌లో సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు మెసేజ్ చేశారు. అదే విధంగా అన్షులా కపూర్ కూడా ' నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరాను' అంటూ మెసేజ్ పెట్టారు. ఇదంతా గమనించిన బోనీ కపూర్ తాను కూడా ఇప్పుడే చెన్నెనుంచి ముంబయికి బయలుదేరడానికి ఎయిర్పోర్ట్ లాంజ్‌లో వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో అన్షులా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ' ఓ మైగాడ్ ! ఏంటో ఈరోజు అందరం విమానాల్లోనే ప్రయాణం చేస్తున్నామా' అంటూ సంతోషం వ్యక్తం చేసింది. వీరి సంభాషణను స్ర్కీన్ షాట్ రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'మాకు డాడ్ కిడ్స్ అనే పేరుతో వాట్సప్ గ్రూఫ్ ఒకటి ఉంది. ఆ గ్రూపులో నాతో పాటు అన్షులా, అర్జున్ కపూర్, ఖుషీ కపూర్, మా నాన్న సభ్యులుగా ఉన్నాము. మేము ప్రతీ విషయాన్ని ఒక మొమొరీగా గుర్తుంచుకునేందుకు ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకుంటామని' మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో జాన్వీ కపూర్ వెల్లడించారు. -
ఆనందం.. విరాళం
తమ అభిమాన స్టార్స్‌ని కలవాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. అలా స్టార్స్‌ను ఫ్యాన్స్‌ను కలిపేలా ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి దాన్ని చారిటీకి ఉపయోగించాలనుకుంటున్నారు అన్షులా కపూర్. ఇంతకీ అన్షులా కపూర్ ఎవరంటే.. నిర్మాత బోనీ కపూర్ మొదటి భార్య కుమార్తె. నటుడు అర్జున్ కపూర్ చెల్లెలు. నాన్న, అన్నలా సినిమాల్లోకి రాలేదు అన్షులా. అయితే సేవా కార్యక్రమాలు చేయడం తనకి చాలా ఇష్టం. ఇందులో భాగంగానే ‘ఫ్యాన్ కైండ్’ అనే ఆన్లైన్ ఫండ్ రైజింగ్ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించారామె. మన అభిమాన స్టార్స్‌తో క్రికెట్, బేకింగ్, పింట్ బాల్.. ఇలా సరదాగా గేమ్స్ ఆడుకోవచ్చు. ఇందుకోసం 300 పెట్టి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్స్‌తో వచ్చిన డబ్బులో ఎక్కువ మొత్తం విరాళాలకు ఉపయోగిస్తారట. బాలీవుడ్ యాక్టర్స్ వరుణ్ ధవన్, ఆలియా భట్, సోనాక్షి సిన్హాలు ఈ ఫ్యాన్‌కైండ్ సంస్థతో అనుబంధమయ్యారు. ‘‘నీటి కొరత వల్ల ఈ ఏడాది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఈవెంట్‌తో వచ్చిన డబ్బుని వాళ్లకు ఉపయోగపడేలా చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు వరుణ్. ‘‘అభిమానులకు వాళ్ల ఆనంద క్షణాలు ఇస్తూనే అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు అన్షులా కపూర్. -
‘ఆరేళ్లు పెద్దవాడు...అస్సలు చర్చించను’
తనకు తల్లైనా, తండ్రైనా అన్నీ అన్నయ్యేనని బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆపన్నులకు హస్తం అందించేందుకు అన్షులా ఇటీవలే ‘ఫ్యాన్‌కైండ్’ అనే ఆన్లైన్ ఫండ్‌రైజింగ్ వెంచర్‌ను ప్రారంభించారు. చారిటీ కార్యక్రమాల గురించి చర్చించుకునేందుకు సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య ‘ఫ్యాన్‌కైండ్’ వారధిగా ఉంటుంది. ఈ క్రమంలో ఓ మీడియా సమావేశానికి హాజరైన ఆమెకు తన అన్న అర్జున్ కపూర్ గురించి వివిధ ప్రశ్నలు ఎదురయ్యాయి. అన్నింటికీ ఓపికగా సమాధానం ఇచ్చిన అన్షులా.. అర్జున్ రిలేషన్షిప్ స్టేటస్ గురించి అడగగానే ఒకింత అసహానికి గురయ్యారు. మలైకాతో అర్జున్ను ముడిపెట్టి మాట్లాడటం తనకు ఇబ్బంది కలిగిస్తుందని పేర్కొన్నారు. వారిద్దరి గురించి వస్తున్న వదంతుల గురించి తానేమీ మాట్లాడదలచుకోవడం లేదని చెప్పారు. తన కంటే ఆరేళ్లు పెద్దవాడు, తండ్రిలా చూసుకునే అన్నతో ఇటువంటి విషయాలు చర్చించనని చెప్పుకొచ్చారు. కాగా అర్జున్ కపూర్, అన్షులా.. నిర్మాత బోనీ కపూర్ మొదటి భార్య మోనా పిల్లలు అన్న సంగతి తెలిసిందే. శ్రీదేవితో ప్రేమలో పడిన తర్వాత మోనాకు విడాకులిచ్చిన బోనీ.. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి అర్జున్, అతడి చెల్లి అన్షులా తండ్రికి దూరంగానే ఉన్నారు. అయితే శ్రీదేవి మరణానంతరం తండ్రి, చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలతో కలిసి పోయిన అర్జున్.. ప్రతీ విషయంలోనూ వారికి అండగా నిలుస్తున్నాడు. ఇక అర్జున్ కపూర్- మలైకా అరోరా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
అమ్మ మళ్లీ రావొచ్చుగా!
‘సంతోషమే సగం బలం అంటారు. కానీ ఆ సంతోషానికి కారణమైన నువ్వే మా పూర్తి బలం. అమ్మ వీలుంటే మళ్లీ రా’ అంటూ బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, అతని సోదరి అన్షులా పెన్ తమ తల్లి గుర్తు చేసుకున్నారు. మోనా వర్ధంతి సందర్భంగా ఆమెతో దిగిన ఫోటోలను పోస్టు చేసి.. తమ తల్లిని స్మరించుకున్నారు. ‘నా చిరునవ్వుకి కారణం నువ్వు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలమ్మా. వీలుంటే మళ్లీ రావొచ్చుగా’ అంటూ అర్జున్ కపూర్ భావోద్వేగంగా పోస్టు చేశారు. ‘కాలం అన్నింటినీ మారుస్తుందంటారు. కానీ ఏదీ మారలేదు. నువ్వు మమ్మల్ని వదిలేసి 7 సంవత్సరాలవుతున్నా ఇప్పటికీ మేము నీ ప్రేమలోనే ఉన్నామనిపిస్తుంది. ఇంకా నీ చేయి పట్టుకున్నట్టుగానే ఉంది. నిన్నెంతగా ప్రేమిస్తున్నామో అంతగా మిస్ అవుతున్నాం’ అంటూ అన్షులా పేర్కొన్నారు. మోనా షౌరీ కపూర్, బోనీ కపూర్ మొదటి భార్య. 2012లో అర్జున్ తొలి సినిమా ‘ఇషక్జాదే’ రిలీజ్ అవుతున్న సమయంలో మోనా కాన్సర్ కారణంగా చనిపోయింది. బోనీ కపూర్ రెండో భార్య శ్రీదేవి గత సంవత్సరం ఫిబ్రవరిలో మరణించడంతో ఆమె కుమార్తెలైన జాన్వీ, ఖుషి కపూర్ బాధ్యతలను అర్జున్, అన్షులా తీసుకున్నారు. గతంలో అర్జున్ మాట్లాడుతూ వారిద్దరూ ఎంతో పెద్ద మనసుతో నన్ను అన్నయ్యగా అంగీకరించారన్నారు. -
బోని కపూర్‌కు ఎవరంటే ఎక్కువ ఇష్టం
ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకొచ్చిన ‘ఆస్క్ మి ఎనీథింగ్’ ఫీచర్, సెలబ్రిటీల నుంచి ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొస్తోంది. తమ తమ జీవిత విశేషాలు, కెరీర్, ఇష్టఅయిష్టాలను సెలబ్రిటీలు ఈ ఫీచర్ ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల బోని కపూర్ మొదటి భార్య కూతురు అన్హులా కపూర్ కూడా ఈ ఫీచర్‌ను వాడారు. ఈ ఫీచర్ ద్వారా అన్హులా కపూర్ నుంచి పలు ఆసక్తికర విషయాలను అభిమానులు రాబట్టారు. ‘మీ నలుగురు తోబుట్టువుల్లో, బోని కపూర్ ఎక్కువగా ఇష్టపడేది ఎవరూ?’ అని అభిమానులు అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం అందరూ అర్జున్ కపూర్ లేదా జాన్వీ కపూర్ వస్తుందని భావించారు. కానీ వారిద్దరూ కాదంట. అందరి కంటే చిన్న చెల్లి, ఖుషీ కపూర్ అంటే బోని కపూర్‌కు ఎక్కువగా ఇష్టమని అన్హులా రివీల్ చేశారు. బోని కపూర్ మొదటి భార్య మోనా కపూర్ సంతానం అర్జున్, అన్హులాలు కాగ, జాన్వీ, ఖుషీలు అందాల తార, రెండో భార్య శ్రీదేవి సంతానం. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీదేవీ చనిపోయిన తర్వాత వీరి బంధం బాగా బలపడింది. చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలకు అర్జున్, అన్హులాలు ఎల్లవేళలా తోడుంటూ వస్తున్నారు. అన్న అర్జున్ కపూర్, చెల్లెళ్లపై ఈగ కూడా వాలనీయనంత కేరింగ్‌గా చూసుకుంటూ వస్తున్నారు. చాలా మంది బోని కపూర్‌కు తన ఒకానొక కొడుకంటే ఎక్కువగా ఇష్టమని, లేదా జాన్వీని ఎక్కువగా ముద్దు చేస్తారని అనుకునే వారు. కానీ వారందరి కంటే కూడా నలుగురిలో ఎక్కువగా బోనికి తన చిన్న కుట్టి, ఖుషీ అంటే ఎక్కువ ఇష్టమని అన్హులా చెప్పారు. ఇదే విషయాన్ని శ్రీదేవి కూడా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు. ఖుషీ ఎక్కువగా బోనికి క్లోజ్ అని, జాన్వీ తనపై ఎక్కువగా ఆధారపడుతుందని తెలిపారు. అయితే బోని నిజాయితీగా అందర్ని సమానంగా ప్రేమిస్తారని కూడా అన్హులా చెప్పుకొచ్చారు. మరో యూజర్, మీ తోబుట్టువుల్లో మీకు నచ్చే విషయమేమిటని అడుగగా.. ‘వారి హార్ట్, వారి బలం, చీకటి రోజుల్లో కూడా వారు ఎప్పుడూ వెలుతురు వైపే చూసే సామర్థ్యం కలిగి ఉండటం.. కారణం లేకుండా వారు నన్ను నవ్వించగలగడం.. కానీ ఎక్కువగా వారు నా వారు అని చెప్పుకోవడాన్ని ప్రేమిస్తాను’ అని అన్హులా ఎంతో భావోద్వేగంతో చెప్పారు. బోని కపూర్ ఇద్దరూ భార్యలు చనిపోయిన సంగతి తెలిసిందే. మొదటి భార్య మోనా కపూర్ 2012లో క్యాన్సర్‌తో చనిపోగా.. రెండో భార్య శ్రీదేవీ దుబాయ్‌లో బాత్‌టబ్‌లో పడి ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. అప్పటి నుంచి నలుగురు తోబుట్టువులు, తండ్రి తోడుగా, ఆయన్ని నవ్విస్తూ.. ఎంతో సానిహిత్యంతో మెలుగుతున్నారు. -
వైరల్ అవుతున్న బోని కుమార్తెల సెల్ఫీ
అతిలోక సుందరి శ్రీదేవి మరణం తరువాత బోనీ కపూర్ ఫ్యామిలీ చాలా మార్పులే వచ్చాయి. అప్పటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉంటూ వచ్చిన బోని కపూర్ మొదటి భార్య మోనా శౌరి కపూర్, శ్రీదేవీ బిడ్డలు ఇప్పుడు కలిసి పోయారు. శ్రీదేవీ మరణం తర్వాత మొదటి భార్య సంతానం అన్షులా, అర్జున్ కపూర్లు, తమ చెల్లెలు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్లకు తోడుగా నిలుస్తూ వస్తున్నారు. చెల్లలను ఎవరు ఏమన్నా.. అసలు సహించకుండా.. వెంటనే వారికి అర్జున్,అన్షులాలు తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. ఇటీవలే జాహ్నవి కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ‘ధడక్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఆ సమయాన కూడా జాన్హవి కపూర్‌కు, అర్జున్, అన్షులాలు ప్రేమతో శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం బోని కుమార్తెలందరూ కలిసి అందమైన నగరం లండన్‌లో విహరిస్తున్నారు. ధడక్ షూటింగ్ పూర్తయి, విడుదల కాబోతున్న తరుణంలో, ఇప్పుడు దొరికిన కాస్త విరామ సమయాన్ని జాహ్నవి లండన్‌లో సోదరీమణులు అన్షులా, ఖుషీలతో గడుపుతోంది. ఈ విహార యాత్రకు సంబంధించిన ఫోటోలు తాజాగా ఇంటర్నెట్ను బ్రేక్ చేస్తున్నాయి. తమ మధ్య ఉన్న అనుబంధం ఉట్టిపడేటా ఉన్న ఓ సెల్ఫీని బోనీ పెద్ద కుమార్తె అన్షులా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అన్షులా, జాహ్నవి, ఖుషీలతో పాటు ఈ సెల్ఫీలో బాలీవుడ్ నిర్మాత రాజ్‌కుమార్ సంతోషి కూతురు తనీషా సంతోషి కూడా ఉంది. శ్రీదేవీ మరణించిన అనంతరం బోనీకి మాత్రమే సపోర్టుగా నిలువకుండా.. ఇటు చెల్లెల సాధకబాదకాలను అర్జున్, అన్షులాలు పట్టించుకుంటూ.. వారిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చేస్తుండటంతో, బోనీ ఎంతో సంతోషిస్తున్నారు. అన్షులా పోస్టు చేసిన లండన్ వెకేషన్ ఫోటో... -
శ్రీదేవి కూతుళ్లపై అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : తల్లి హఠాన్మరణంతో పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయిన శ్రీదేవి కూతుళ్లకు.. ఆ షాక్ నుంచి కోలుకునే పరిస్థితులు ఇప్పుడప్పుడే కనిపించటం లేదు. శ్రీదేవి బతికున్నంత కాలం దూరంగా ఉన్న సవతి పిల్లలు అర్జున్, అన్షులా కపూర్లు.. ఇప్పుడు బోనీ-జాన్వీ-ఖుషీ వెంటే ఉంటున్నారు. ముఖ్యంగా అర్జున్ శ్రీదేవి మరణ వార్త తెలిసినప్పటి నుంచి చెల్లెళ్లతోనే ఉంటూ వారికి ఊరటనిస్తున్నాడు. ఇదిలా ఉంటే అన్షులా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు ఉంచింది. బాధలో ఉన్న జాన్వీ-ఖుషీలు త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్షతో ఆమె ఆ పోస్టును ఉంచింది. దానికి చాలా మంది పాజిటివ్‌గా స్పందించారు. అయితే అర్జున్ హార్డ్ కోర్ ఫ్యాన్ అని చెప్పుకున్న ఓ వ్యక్తి మాత్రం తేడాగా స్పందించాడు. జాన్వీ, ఖుషీలపై అసభ్య పదజాలంతో కామెంట్లు పోస్ట్ చేశాడు. దీనిపై మండిపడ్డ అన్షులా అతగాడిని చెడామడా వాయించేసింది. నా చెల్లెళ్ల గురించి అలా మాట్లాడితే బాగోదని వార్నింగ్ ఇచ్చేసింది. ఆపై శాంతించిన ఆమె కూల్‌గా మరో పోస్ట్‌ను పెట్టింది. ‘నాపై నా సోదరుడిపై మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్. కానీ, నా సిస్టర్స్ ను అలా అవమానించటం సరికాదు. అందుకే మీ కామెంట్లను నేను తొలగిస్తున్నా. ఇంకోసారి ఇలా చెయ్యొద్దని అభిమానులను వేడుకుంటున్నా’ అంటూ మరో పోస్టును చేసింది. అన్షులా చేసిన విజ్ఞప్తి పోస్ట్ -
నా సోదరి సినిమాలు చేయదు: హీరో
ముంబయి: భాషతో సంబంధం లేకుండా ప్రతి సినీ ఇండస్ట్రీలోనూ వారసుల హవా కొనసాగుతుంటోంది. ఇంకా చెప్పాలంటే వారసురాళ్లు కూడా రంగుల ప్రపంచంలో కాలుమోపి నిరూపించుకున్న సందర్భాలున్నాయి. అయితే తన సోదరి అన్షుల కపూర్ మాత్రం సినిమాల్లో నటించదని బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ స్పష్టం చేశాడు. అయితే ఇందులో కుటుంబసభ్యుల జోక్యం ఎంతమాత్రం లేదన్నాడు. అన్షులకి సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోవడమే ప్రధాన కారణమని అర్జున్ తెలిపాడు. హీరో అర్జున్ కపూర్ నటించిన ముబారకన్ మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నా సోదరి అన్షులకి ఇంటస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేదు. ఆ విషయం నాకు ఎలాగూ మేలు చేస్తుందని భావిస్తాను. తన నా సినిమాలకు ప్రేక్షకురాలు మాత్రమే కాదు, విమర్శకురాలిగా తన అభిప్రాయాలను నేరుగా నాతో పంచుకుంటుంది. దీంతో ప్రేక్షకులు నా నుంచి ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో సులువుగా అర్థం చేసుకుంటాను. తను సాధారణ అమ్మాయిల్లాగే అన్ లైన్లో మూవీ టికెట్లు బుక్ చేసుకుని థియేటర్‌కు వెళ్లి వాటి కోసం క్యూలైన్లో నిల్చుంటుందని’ అర్జున్ వివరించాడు. నిర్మాత, తండ్రి బోని కపూర్‌తో మూవీ ఎప్పుడు చేస్తారన్న ప్రశ్నపై స్పందిస్తూ.. మేమిద్దరం ఇప్పటివరకూ ఒక్కసారి కూడా కూర్చుని సినిమాపై చర్చించలేదు. అయితే భవిష్యత్తులో ఏదైనా మంచి కథ మా ఇద్దరికి నచ్చితే.. కచ్చితంగా సినిమా చేస్తాం. ఇప్పుడు ఈ వార్త చూసి మా నాన్న బోని కపూర్ దీనిపై ఆలోచిస్తారని నవ్వేశాడు నటుడు బోని కపూర్.