సినిమా కోసం లావెక్కడం లేదంటే సన్నబడటం మనం తరచూ చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అయితే స్టార్స్ మాత్రమే కాదు వారి ఫ్యామిలీలోని వారు కూడా జిమ్ముల వెంట తిరుగుతూ బాడీని ఫిట్‌గా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ లుక్‌ను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. బొద్దుగా ఉండే అన్షులా ఇప్పుడు సన్నగా మారిపోయింది.
సాధారణంగా చాలామంది ఆదివారం వర్కవుట్‌కు కూడా సెలవు పెట్టేస్తుంటారు. కానీ అన్షులా మాత్రం సండే కూడా మరింత కష్టపడుతూ జిమ్‌లో చెమటలు చిందిస్తుంటుంది. తాజాగా ఆమె వెయిట్ లాస్ జర్నీని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్ పోస్ట్ పెట్టింది. బాడీని ఇలా మార్చడం అంత సులువు కాలేదని చెప్తూ ఎమోషనలైంది. ఇది రెండేళ్ల లాంగ్ జర్నీ అని, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, కన్నీళ్లు దిగమింగుకున్నానని చెప్పుకొచ్చింది. ఈ జర్నీ ఇంకా కొనసాగుతుందని పేర్కొంది. ఈ పోస్ట్‌పై జాన్వీ కపూర్, శాన్యా కపూర్ సహా పలువురు ప్రముఖులు, ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన మేకోవర్ లుక్‌ను చూసి కపూర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో పాటు నెటిజన్లు సైతం అబ్బురపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment