శ్రీదేవి కూతుళ్లపై అనుచిత వ్యాఖ్యలు | Anshula Steps in Over Abusive Comments on Sridevi Daughters | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 5 2018 3:20 PM | Last Updated on Mon, Mar 5 2018 3:21 PM

Anshula Steps in Over Abusive Comments on Sridevi Daughters - Sakshi

అన్షులా- పక్కనే జాన్వీ, ఖుషీలు

సాక్షి, ముంబై : తల్లి హఠాన్మరణంతో పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయిన శ్రీదేవి కూతుళ్లకు.. ఆ షాక్‌ నుంచి కోలుకునే పరిస్థితులు ఇప్పుడప్పుడే కనిపించటం లేదు. శ్రీదేవి బతికున్నంత కాలం దూరంగా ఉన్న సవతి పిల్లలు అర్జున్‌‌, అన్షులా కపూర్‌లు.. ఇప్పుడు బోనీ-జాన్వీ-ఖుషీ వెంటే ఉంటున్నారు. ముఖ్యంగా అర్జున్‌ శ్రీదేవి మరణ వార్త తెలిసినప్పటి నుంచి చెల్లెళ్లతోనే ఉంటూ వారికి ఊరటనిస్తున్నాడు.

ఇదిలా ఉంటే అన్షులా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు ఉంచింది. బాధలో ఉన్న జాన్వీ-ఖుషీలు త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్షతో ఆమె ఆ పోస్టును ఉంచింది. దానికి చాలా మంది పాజిటివ్‌గా స్పందించారు. అయితే అర్జున్‌ హార్డ్‌ కోర్‌ ఫ్యాన్‌ అని చెప్పుకున్న ఓ వ్యక్తి మాత్రం తేడాగా స్పందించాడు. జాన్వీ, ఖుషీలపై అసభ్య పదజాలంతో కామెంట్లు పోస్ట్‌ చేశాడు. 

దీనిపై మండిపడ్డ అన్షులా అతగాడిని చెడామడా వాయించేసింది. నా చెల్లెళ్ల గురించి అలా మాట్లాడితే బాగోదని వార్నింగ్‌ ఇచ్చేసింది. ఆపై శాంతించిన ఆమె కూల్‌గా మరో పోస్ట్‌ను పెట్టింది. ‘నాపై నా సోదరుడిపై మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్‌. కానీ, నా సిస్టర్స్‌ ను అలా అవమానించటం సరికాదు. అందుకే మీ కామెంట్లను నేను తొలగిస్తున్నా. ఇంకోసారి ఇలా చెయ్యొద్దని అభిమానులను వేడుకుంటున్నా’  అంటూ మరో పోస్టును చేసింది.

                                       అన్షులా చేసిన విజ్ఞప్తి పోస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement