
Boney Kapoor Emotional Post On Her Late Wife Sridevi: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇటీవలే ఇన్‌స్టా గ్రామ్‌లో చేరారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన కుటుంబ సభ్యుల ఫొటోలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం (డిసెంబర్ 18) తన ఇన్‌స్టా గ్రామ్ హ్యాండిల్‌లో తన దివంగత భార్య, నటి శ్రీదేవితో సన్నిహితంగా కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో శ్రీదేవి నల్లటి కోటు, కండువా ధరించి బ్లాక్ షేడ్స్ పెట్టుకుని ఉన‍్నారు. అలాగే బోనీ కపూర్, శ్రీదేవి ఒకరి చేతులను ఒకరు చుట్టుకుని అందంగా నవ్వుతూ ఫొటోకు ఫోజిచ్చారు. ఈ పోస్ట్‌కు రెడ్ హార్ట్ ఎమోటికాన్‌లతో 'మై హార్ట్' అనే క్యాప్షన్‌ను యాడ్ చేశారు బోనీ కపూర్.
ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై అభిమానులు ప్రేమతో కామెంట్లు కురిపించారు. 'ఉత్తమ జంట' అని ఒక యూజర్ రాయగా, 'మిస్ యూ మేడమ్ ఎప్పటికీ' అని మరొకరు కామెంట్ చేశారు. గతంలో కూడా బోనీ తన కుటుంబం మొత్తం ఉన్న ఫొటోను పోస్ట్ చేసి దానికి 'నా బలం' అని క్యాప్షన్ ఇచ్చారు. అంతుకుముందు అతని పిల్లలైన అన్షులా, అర్జున్, జాన్వీ, ఖుషీలతో కలిసి ఫోజులిచ్చిన ఫొటోను షేర్ చేశారు బోనీ కపూర్. ఈ పోస్ట్‌కు 'నా ఆస్తి' అని క్యాప్షన్ యాడ్ చేశారు. బోనీ కపూర్, శ్రీదేవి 1996లో వివాహం చేసుకున్నారు. వీరికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఇద్దరు కుమార్తెలు. ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లో జరిగిన కుటుంబ కార్యక్రమానికి హాజరైన తర్వాత శ్రీదేవి మరణించారు.
ఇదీ చదవండి: పెళ్లికి ముందు శ్రీదేవి ఎవర్ని ప్రేమించిందో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment