
– బోనీ కపూర్
ప్రముఖ దివంగత నటి శ్రీదేవి బయోపిక్ గురించి బాలీవుడ్‌లో అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కాగా శ్రీదేవి బయోపిక్ గురించి ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ తాజాగా స్పందించారు. ‘‘శ్రీదేవి చాలా ప్రైవేట్ పర్సన్. ఆమె జీవితం కూడా ప్రైవేట్‌గానే ఉండాలి. అందుకే నేను బతికి ఉన్నంతవరకు శ్రీదేవి బయోపిక్‌ను తెరకెక్కించేందుకు అనుమతి ఇవ్వను’’ అంటూ ఓ ఆంగ్ల మీడియాతో బోనీ కపూర్ మాట్లాడినట్లుగా బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. అజయ్ దేవగన్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’కు బోనీ కపూర్ ఓ నిర్మాత. ఈ నెల 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీదేవి బయోపిక్ ప్రస్తావన వచ్చినప్పుడు బోనీ పై విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్‌లో మరణించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment