vulgar comments
-
చంద్రబాబును బూతులు తిడుతున్న టీడీపీ నేత విద్యాసాగర్
-
పబ్జీ మొనగాడు.. బూతులతో బుక్కయ్యాడు
చెన్నై: పబ్జీ.. మన దేశంలో యువతను బాగా అతుక్కుపోయేలా చేసుకున్న గేమ్. బ్యాన్ విధించినప్పటికీ వీపీఎన్ సౌలత్‌తో ఇంకా ఆడుతూనే ఉన్నారు. అలాంటి గేమ్‌లో మదన్ ఘనాపాటి. తమిళనాడుకు చెందిన మదన్ ఓపీ.. గేమర్, వ్లోగర్ కూడా. యూత్‌లో ముఖ్యంగా కాలేజీ అమ్మాయిల్లో ఇతనికి మంచి క్రేజ్ ఉంది. అంతెందుకు కొందరు సెలబ్రిటీలు కూడా ఇతని అభిమానులే. అలాంటి కుర్రాడిపై లైంగిక ఆరోపణల కింద కేసు బుక్ అయ్యింది. అసలు మదన్‌కి ఇంతలా పేరు రావడానికి ముఖ్య కారణం.. పబ్జీ గేమింగ్‌లో అతను ఉపయోగించే భాష. కో-ప్లేయర్స్ గనుక బాగా ఆడకపోతే బండబూతులు తిడతాడు. లైవ్‌లో ఉన్నాననే సంగతి మర్చిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాడు. ఆ ఆటిట్యూడ్ అతనికి మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది. అంతేకాదు ఆటలో అతను ఇచ్చే టిప్స్.. ఇంటర్నేషనల్ వైడ్‌గా అతనికి గుర్తింపు ఇచ్చింది. అయితే రీసెంట్గా ఓ వీడియోలో అతను అమ్మాయిలను ఉద్దేశిస్తూ అసభ్య పదజాలం వాడాడు. దీంతో ఇతగాడి వ్యవహారం చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చేరింది. శృతి మించారు నిజానికి ఈ కుర్రాడు పబ్లిక్‌కి తెలిసేలా తప్పులన్నీ చేస్తుంటాడు. అతనికి ఉన్న అభిమానుల్లో అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. ఎలాగోలా వాళ్ల అమ్మాయిల నెంబర్లు సంపాదించి.. వాళ్లతో మాటలు కలుపుతాడు. అసభ్యంగా మాట్లాడుతూ.. తేడాగా వ్యవహరిస్తాడు. ఇన్స్టాగ్రామ్ పేజీలలో న్యూడ్‌గా వీడియో ఛాట్ చేయాలని ఒత్తిడి చేస్తాడు. ఆ ఛాటింగ్‌లను, స్క్రీన్ షాట్లను పబ్లిక్‌గానే పోస్ట్ చేస్తాడు. దీంతో ఈ వ్యవహారంలో బాధిత యువతులనూ ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇవన్నీ తాను బహిరంగంగానే చేస్తున్నానని, తన ఎదుగుదలను ఓర్వలేక కొందరు తన మీద కుట్రపన్నారని మదన్ చెప్తున్నాడు. చర్యలు తప్పవా? ఇక తాజాగా విమర్శల నేపథ్యంలో మదన్ దూకుడు తగ్గించాడు. తన సోషల్ మీడియా అకౌంట్లకు కామెంట్ సెక్షన్‌కు ప్రైవసీ పెట్టాడు. అతని యూట్యూబ్ పేజీలో 8 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్లలో చాలామంది 18 ఏళ్లలోపు వాళ్లే. అందుకే చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ గరం అయ్యింది. కొందరు తల్లిదండ్రులు, విద్యావేత్తలు సోషల్ మీడియాలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కేసు చెన్నై పోలీసులు కేసు రిజిస్ట్రర్ చేయడంతో.. త్వరలోనే మదన్‌పై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారంతా. ఇది #arrestmadanop పేరుతో ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్ కథ. -
మీ అమ్మ అలానే చేసిందా అంటూ రకుల్ ఫైర్
తారలూ మనుషులే. సెలబ్రిటీలు కావచ్చు. అయితే అందరిలానే వారికి మనసు ఉంటుందని, అది నొచ్చుకునేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోరన్నది తెలుసుకోవాలి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్గా వెలుగుతున్న నటి రకుల్‌ప్రీత్‌సింగ్. అభినయాన్ని ప్రదర్శించే అవకాశాలు పెద్దగా రాకపోయినా, కమర్శియల్ చిత్రాల్లో గ్లామరస్‌గా నటించి ఆ తరహా ముద్రవేసుకున్న ఈ అమ్మడికి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోయినా, తమిళం, హిందీ భాషల్లో రెండేసి చిత్రాలతో బిజీగానే ఉంది. కోలీవుడ్‌లో కమలహాసన్‌తో కలిసి ఇండియన్–2 చిత్రంలో నటిస్తోంది. అదేవిధంగా శివకార్తికేయన్‌కు జంటగా ఐలాన్ చిత్రంలో నటిస్తోంది. రకుల్‌ప్రీత్‌సింగ్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. చదవండి: హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నయన తన ఇన్‌స్ట్ర్రాగామ్‌లో 13 మిలియన్ల అభిమానులు ఈ అమ్మడిని ఫాలో అవుతున్నారు. కాగా రకుల్ తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. రకుల్‌ప్రీత్‌సింగ్ ఫొటోలను చూసిన కొందరు అభిమానులు చాలా అందంగా ఉన్నావంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రకుల్ ఫోజులను చూసి విమర్శిస్తున్న వారు ఉన్నారు. కొందరు చేసే అసభ్యకరమైన కామెంట్లు మనసును బాధిస్తాయని రకుల్ చెప్పింది. మహిళలను భోగవస్తువుగా చూసే సమాజం దృష్టి మారాలని అంది. అలా ఒక నెటిజన్ తన ఫొటో చూసి చొక్కా మాత్రమే ధరించి ఫోజు ఇచ్చారు. కింద ఏమీ ధరించలేదా అని కారులో ఉల్లాసంగా ఉండి అలానే బయటకు వచ్చారా? అని చాలా అసభ్యంగా కామెంట్ చేశారని చెప్పింది. దీంతో కోపం తన్నుకొచ్చిన తాను అంతే స్ట్రాంగ్‌గా మీ అమ్మ అలా చేసి ఉంటుందని, అందుకే దాన్ని తలచుకుని నన్ను కామెంట్ చేశావు అని బదులిచ్చినట్లు పేర్కొంది. ఇలాంటి కామెంట్లు చేసే వారిలో చాలా వరకు నకిలీ ఫేస్బుక్ ఐడీలనే వాడుతుంటారన్నారు. అసలు ముఖాలను చూపడానికి ధైర్యం లేని పిరికివారే అసభ్యంగా కామెంట్స్ చేస్తుంటారని అంది. ఇలా నకిలీ ఫేస్బుక్ ఐడీలను రూపొందించలేని విధంగా టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పుడే ఇలాంటి పోకిరోళ్ల కామెంట్లను అరికట్టడం సాధ్యం అవుతుందని రకుల్ అంటోంది. చదవండి: 50 ఏళ్లవయస్సులో ఫ్రెంచ్ నేర్చుకుంది.. -
తమిళిసైపై అనుచిత పోస్టులు
సాక్షి, చెన్నై : తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై ఫేస్బుక్లో అనుచిత పోస్టులు చేసిన సహాయ నటుడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. తిరువారూరు జిల్లా, మన్నార్గుడి అరిసికడై వీధికి చెందిన సాధిక్‌బాషా (39). ఇతను కలవాణి–2 చిత్రంలో సహాయ నటుడిగా నటించాడు. అలాగే, మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సాధిక్‌బాషా తన ఫేస్బుక్లో తెలంగాణా గవర్నర్ తమిళిసైకు పరువునష్టం కలిగించే విధంగా పోస్టులు చేసినట్లు సమాచారం. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిగురించి బీజేపి నేత రఘురామన్ మన్నార్గుడి నగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణా గవర్నర్ తమిళిసైను సాధిక్‌బాషా అనే వ్యక్తి తన ఫేస్బుక్లో అనుచిత పదజాలం ఉపయోగించి పోస్టులు చేశారని, అందువల్ల అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తూ వచ్చారు. ఇలావుండగా తిరుత్తురైపూండి సమీపం కట్టిమేడు గ్రామంలో తన అత్తగారింట్లో ఉన్న సాధిక్బాషాను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. -
అపరకాళిగా మారి హతమార్చింది
సాక్షి ప్రతినిధి, చెన్నై: వరుసకు సోదరుడైన వ్యక్తి లైంగిక వేధింపులకు ఆమె తట్టుకోలేకపోయింది. అపరకాళిగా మారి అంతమొందించింది. తేనీ జిల్లా ఉత్తమపాళయంకు చెందిన అరటి ఆకుల వ్యాపారి మణికంఠన్ (38)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మణికంఠన్ బావమరిది పాండీశ్వరన్ (30) భార్య నిరంజన (25)లకు ఇద్దరు పిల్లలున్నారు. మణికంఠన్, పాండీశ్వరన్ కొన్నేళ్ల క్రితం టీ బంకు నడిపారు. ఈ సమయంలో నిరంజనపై కన్నేసిన మణికంఠన్ తరచూ సెల్ఫోన్లో ఇబ్బందికరమైన సంభాషణ చేసేవాడు. అనేకసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో భర్తకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం కారణంగా టీ బంకును ఎత్తివేసి ఇరువురూ వేర్వేరు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. అయినా బుద్ధి మార్చుకోని మణికంఠన్ నిరంజనకు సెల్‌ఫోన్ ద్వారా అసభ్య సంభాషణలు కొనసాగించాడు. దీంతో విసిగిపోయిన నిరంజన శనివారం ఉదయం భర్తతో కలిసి మణికంఠన్ దుకాణానికి వెళ్లి నిలదీసింది. ఈ సమయంలో ఘర్షణ వాతావారణం చోటుచేసుకోగా నిరంజన తన వెంట తెచ్చుకున్న కొడవలితో మణికంఠన్‌ను హతమార్చింది. రక్తం మడుగులో ఉన్న మణికంఠన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. భార్యాభర్తలిద్దరూ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోగా వారిని అరెస్ట్ చేశారు. -
దిశ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు.. మరొకరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా.. కొందరు యువకులు మాత్రం విజ్ఞత మరచి ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బాధితురాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడేవారిపై సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే శ్రీరామ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దిశ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా అమరావతి కొండయ్య కాలనీకి చెందిన సాయినాథ్ ఆలియాస్ నాని అనే వ్యక్తిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బాధితురాలి పేరిట సోషల్ మీడియాలో అసభ్యకర ప్రచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులు ఫేస్బుక్లో గ్రూప్‌గా ఏర్పడి దిశపై అసభ్య కామెంట్లు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఇద్దరిని( శ్రీరామ్, సాయినాథ్) అరెస్ట్ చేశామని.. త్వరలోనే మరికొంతమందిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ రోజు అరెస్ట్ అయిన నానిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. -
‘దిశ’పై అనుచిత పోస్టులు.. వ్యక్తి అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : దిశపై జరిగిన దారుణాన్ని ఓ పక్క యావద్భారతం ముక్త కంఠంతో ఖండిస్తుంటే... కొందరు పోకిరీలు మాత్రం విజ్ఞత మరిచి ప్రవర్తిస్తున్నారు. మరణానంతరమూ ఆమెను ఉద్దేశించి ఫేస్బుక్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేస్తున్నారు. ఈ తరహాలో శనివారం నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న శ్రీరామ్‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. నిజామాబాద్‌లోని నవీపేట్ మండల ఫకీరాబాద్‌కు చెందిన చవన్ శ్రీరామ్ ఐటీఐ పూర్తి చేశాడు. కొన్నాళ్ల పాటు ఓ హోటల్లో కార్మికుడిగా పని చేసినా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఇతడికి ఫేస్బుక్లో స్టాలిన్ శ్రీరామ్ పేరుతో ఖాతా ఉంది. దిశ ఉదంతం నేపథ్యంలో ఆమెను ఉద్దేశించి తన వాల్‌పై శ్రీరామ్ అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు పోస్ట్ చేశాడు. వీటిని వ్యతిరేకిస్తూ పలువురు చేసిన కామెంట్స్‌తో ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో స్పందించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారంపై శనివారం సుమోటోగా కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు నేతృత్వంలోని బృందం ఈ కేసును సాంకేతికంగా దర్యాప్తు చేసింది. ఆ ఆధారాలను బట్టి శ్రీరామ్ నిందితుడిగా గుర్తించి నిజామాబాద్ జిల్లా ఫకీరాబాద్లో ఉండగా మంగళవారం అరెస్టు చేసింది. ఈ తరహాలోనే మరికొందరు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కామెంట్స్ చేస్తున్నట్లు గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం
న్యూఢిల్లీ: లోక్‌సభ డెప్యూటీ స్పీకర్, బీజేపీ ఎంపీ రమాదేవిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగాను సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎదుట హాజరై, అనంతరం సభలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఆజం ఖాన్‌కు స్పీకర్ కార్యాలయం తెలిపినట్లు సమాచారం. క్షమాపణ చెప్పకపోతే ఆజం ఖాన్‌పై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు అధికారమిస్తూ సభలో ఓ తీర్మానం చేసేందుకు అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయి. అన్ని పార్టీల నాయకులతో స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఓ సమావేశం నిర్వహించి ఆజం ఖాన్ అంశంపై చర్చించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఆజం ఖాన్ క్షమాపణ చెప్పకపోతే ఆయనపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్‌కు లోక్‌సభ ఇస్తుందని తెలిపారు. డీఎంకే ఎంపీ కనిమొళి, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, తృణమూల్ ఎంపీ మిమి చక్రవర్తి, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ తదితర మహిళా ఎంపీలతోపాటు బీజేపీ నాయకురాలు జయప్రద కూడా ఆజంఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆజం ఖాన్‌ను ఈ లోక్‌సభ నుంచి పూర్తిగా బహిష్కరించేలా ఆయనను ఐదేళ్లపాటు సస్పెండ్ చేయాలని రమాదేవి డిమాండ్ చేశారు. -
బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్‌తో అసభ్యంగా...
నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సోఫియా హయత్‌కు సోషల్ మీడియాలో మళ్లీ చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ వ్యక్తి ఆమెకు అసభ్య సందేశాలు పంపాడు. తరచూ ఆమె చేసే పోస్టులు.. వాటికి కొందరు చేసే కామెంట్లు... ప్రతిగా ఆమె ఇచ్చే కౌంటర్... ఆ సంభాషణలంతా వెగటును పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ వ్యక్తికి ఆమెకు మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో మాటల తుటాలు పేలాయి. సోఫియాపై అనుచిత కామెంట్.. ‘హాయ్ డియర్.. ఒక్క రాత్రికి నీ బుకింగ్ రేట్లు చెప్పగలవా?’ అంటూ ఓ వ్యక్తి ఆమె ఫోటోకు కామెంట్ చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సోఫియా‘ముందు మీ అమ్మను.. తర్వాత నీ చెల్లిని.. ఆ తర్వాత నీ భార్యను రేట్లు ఎంతో కనుక్కో.. తర్వాత నా రేటు చెప్తా’ అంటూ ఆమె బదులిచ్చారు. అయితే ఆ సంభాషణ అక్కడితో ఆగలేదు. ‘వాళ్లేం నీలాగ మొత్తం విప్పుకుని తిరగట్లేదు. గో టూ హెల్’ అంటూ అతగాడు మళ్లీ బదులిచ్చాడు. దానికి సోఫియా మళ్లీ బదులిస్తూ... ‘నిన్ను కనే సమయంలో మీ అమ్మ తన శరీరాన్ని చూపించే ఉంటుంది కదా. ఆ సంగతి నీకు ఎప్పుడూ చెప్పలేదా? ముందు నీ బుర్రను, ఆలోచల్ని సరిగ్గా ఉంచుకోరా..’ అంటూ ఆమె సమాధానమిచ్చారు. ఆ తర్వాత ఆ మాటల యుద్ధం మరింత ముదరటంతో ఆమె ఫ్యాన్స్ సాయం కోరింది. దీంతో ఆ వ్యక్తి తన చివరకు అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేసేశాడు. -
శభాష్ బేటీ!
ఎవరో వచ్చి కాపాడే వరకు ఎదురు చూసేలా అమ్మాయిల్ని పెంచకూడదు. తమను తాము కాపాడుకోగలిగేలా ధైర్యాన్ని ముద్దముద్దకూ కలిపి తినిపించాలి. ఏప్రిల్ 18. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ఏరియా. ఓ టీనేజ్ అమ్మాయి ఒంటరిగా ఇంటికి నడిచి వెళ్తోంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంగణం నుంచి జూడో ప్రాక్టీస్ చేసి వస్తోందామె.రోజూ రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తుంది. బ్లూ బెల్ట్ కూడా ఉందామెకి. ఆ రోజు ప్రాక్టీస్ పూర్తయ్యే సరికి బాగా ఆలస్యమైంది. తన కాలనీలోకి వచ్చేటప్పటికే చీకట్లు ముసురుకున్నాయి. త్వరగా ఇంటికి వెళ్లితే తప్ప హోమ్‌వర్క్ పూర్తికాదు. వేగంగా నడుస్తోంది. అకస్మాత్తుగా.. వెనుక నుంచి అబ్బాయిల కామెంట్స్ వినిపించాయి! ఘటన.. ప్రతిఘటన మొదట ఆమె పట్టించుకోలేదు. వాళ్లు అగలేదు! ఒకరి తర్వాత ఒకరుగా కామెంట్ చేస్తున్నారు. కామెంట్ల జోరు పెరిగింది. గేలి నవ్వులు కూడా. ఆ కామెంట్లు తనను ఉద్దేశించేనని తెలిసి చుట్టూ చూసింది. ఒక్కొక్కరుగా ఆమె ముందుకొచ్చారు. మొత్తం ఐదుగురున్నారు. ఒకడు ఒంటి మీద చేయి వేశాడు. వీధి దీపాలు అక్కడొకటి అక్కడొకటి వెలుగుతున్నాయి. రెండో వాడు, మూడో వాడు కూడా చేతులేశాడు. చీకటిలో తనను నిర్మానుష్యమైన ప్రదేశానికి మళ్లించాలని వారు ప్రయత్నిస్తున్నట్లు క్షణాల్లోనే అర్థమైందామెకి. ఒక్కసారిగా బాడీని పొజిషన్లోకి తెచ్చుకుని ఆకతాయిల్ని తోసేసింది. జూడో పంచ్‌లతో ఒక్కొక్కరినీ దూరంగా ఉంచగలిగింది. వాళ్లేమీ పారిపోలేదు. వాళ్ల బారి నుంచి తప్పించుకుని తనే ఇంటికి పరుగు తీసింది. ఇలా రోజూ వేధిస్తే..?! ఆ అమ్మాయి తండ్రి దేవాలయంలో పూజారి. కూతురిని ఏడిపించిన వాళ్లెవరో తెలుసుకుందామని వెళ్లాడు. ‘నాన్న వచ్చాడ్రోయ్’ అంటూ చెప్పలేని మాటలతో ఆయన్ని అవమానించారు. సహనం నశించి ఆయన ఆగ్రహించడంతో ఆకతాయిలు మరీ రెచ్చి పోయి ఆయన్ను కొట్టి పారిపోయారు. ఇప్పుడు ఆ తండ్రి ముందు రెండే రెండు మార్గాలున్నాయి. జరిగిన అవమానాన్ని దిగమింగుకుని మరిచిపోవడమా? పోలీస్ కంప్లయింట్ ఇచ్చి రౌడీ మూక ఆట కట్టించడమా? బాధను గుండెల్లో దాచుకుందామంటే ఒకరోజు సరే, రోజూ వాళ్ల బెడద ఉంటుంది. అదే దారిలో కూతురు రోజూ ప్రయాణించాలి. తన మౌనంతో ఆ అసాంఘిక శక్తుల్ని పెరగనిస్తే... అవి సమాజంలో వేళ్లూనుకుంటాయి. ఈ సమయంలోనే వాటిని కూకటి వేళ్లతో తీసి పారేయాలి! రెండో దారినే ఎంచుకున్నాడాయన. పోకిరీలపై తొలి కంప్లైంట్ తండ్రీకూతుళ్లు పోలీస్ స్టేషన్‌కెళ్లి కేసు పెట్టారు. పోలీసులు రంగంలోకి దిగి గంటల్లో ఆ వీధిరౌడీలను అరెస్ట్ చేశారు. వాళ్లు ఎవరో ఎక్కడ ఉంటారో తెలుసని, వాళ్ల మీద కంప్లయింట్ ఇచ్చే వాళ్లు లేక ఇంతకాలం ఉపేక్షించాల్సి వచ్చిందని బిదాన్ నగర్ డిప్యూటీ కమిషనర్ అమిత్ జల్వాగి.. ఆ తండ్రీకూతుళ్లతో చెప్పారు. పూజారి ఇంటి ఇరుగుపొరుగు మహిళలు కూడా బయటికొచ్చారు. ధైర్యంగా ముందుకు రాలేక అన్నాళ్లూ ఆ రౌడీమూక చేష్టల్ని భరించేవాళ్లమని, సాయంత్రం దాటి చీకట్లు ముసిరితే ఆ దారి వెంట నడిచే పరిస్థితి ఉండదని వాపోయారు. జూడో నేర్చుకున్న ఆ అమ్మాయిని కాలనీ అంతా మెచ్చుకుంటోందిప్పుడు. టీనేజ్‌లో ఉన్న అమ్మాయి కావడంతో ఆమె పేరును మీడియాకు అధికారికంగా వెల్లడించడం లేదు పోలీసులు. ఆగడం లేదని సాగనిస్తామా? అల్లరి మూకను పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెండర్స్ యాక్ట్) చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆ బ్యాచ్‌లో బిజోయ్ దాస్ ఒక్కడే పెద్దవాడు. మిగిలిన నలుగురూ మైనర్లే. బిజోయ్‌కి ఈ నెల 30 వరకు కస్టడీ విధించింది కోర్టు. మైనర్లను మంగళవారం నాడు జువైనల్ బోర్డు ముందు హాజరు పరిచి ఆ తర్వాత అబ్జర్వేషన్ హోమ్‌కి తరలించారు. ఆడపిల్లలను భద్రంగా కాపాడుకోవడానికి జాతియావత్తూ బేటీ బచావో, బేటీ పఢావో... నినాదంతో పనిచేస్తోంది. అయినా నిర్భయ ఘటనలు తప్పడం లేదు. అలాగని వాటిని సాగనివ్వకూడదు. ధైర్యాన్ని కలిపి తినిపించాలి అమ్మాయిల్ని ఎవరో వచ్చి కాపాడే వరకు ఎదురు చూసేటట్లు పెంచకూడదు. తమను తాము కాపాడుకోగలిగేటట్లు పెంచాలి. ఒంటి మీద చేయి వేసిన వాడి ముఖం మీద ఒక్క పంచ్ ఇవ్వగలిగేటట్లు.. మన అమ్మాయిలకు ధైర్యాన్ని ముద్దముద్దకూ కలిపి తినిపించాలి. అప్పుడు మనం.. వార్తల్లో అఘాయిత్యాల బారిన పడిన అమ్మాయిల కథనాలకు బదులు... అరాచకాన్ని ఎదిరించి బయటపడిన అమ్మాయిల కథనాలను చదవగలుగుతాం. ఉదయాన్నే సంతోషంగా, ధీమాగా ఒక అందమైన ప్రపంచం గురించి తెలుసుకోడానికి పేపర్‌ను తెరవగలుగుతాం. – మంజీర -
మాట జారి.. సారీ చెప్పి!
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ శాఖ ఆపరేషన్స్ ఎస్ఈ భార్గవరాముడి దురుసు వైఖరిపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. కింది స్థాయి ఏడీఈలు, డీఈల పట్ల ఆయన తీరు బాగాలేదని ఇప్పటి వరకు ఆరోపణలు వెలువెత్తగా.. తాజాగా క్లరికల్ స్టాఫ్, ఉద్యోగినుల పట్ల ఆయన నోరు పారేసుకున్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్యాలయంలో బాత్రూమ్ సరిగా లేదు మరమ్మతులు చేయండి అని కన్స్ట్రక్షన్ విభాగంలోని ఓ ఉద్యోగిని ఫిర్యాదు చేస్తే ‘అందులో పడుకుంటారా’ అని అవమానించారు. అలాగే మరో ఉద్యోగిని అనారోగ్య సమస్య ఉండటంతో లిఫ్ట్ వాడుకునే అవకాశం కల్పించాలని కోరితే ‘సెలవు పెట్టి వెళ్లిపో’ అన్నట్లు తెలిసింది. ‘పని చేతకాని మహిళలకు సెంట్లు, గిఫ్ట్‌లు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారంటూ’ మెడికల్ బిల్స్ చేసే సీనియర్ అసిస్టెంట్‌తో అన్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కార్యాలయంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన ఉన్నతాధికారే బాధ్యతారహితంగా ప్రవర్తించడంతో ఉద్యోగ సంఘాలు నిలదీశాయి. ఆగ్రహించిన ఉద్యోగినులు, 1104, తెలుగునాడు, బీసీ, బహుజన సంఘాల నాయకులు శనివారం ఎస్ఈని కలసి ఆయన తీరును ఖండించారు. ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, దురుసుతనాన్ని మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎస్ఈ అందరి సమక్షంలో ఉద్యోగినులను క్షమించమని కోరారు. కార్యక్రమంలో 1104, తెలుగునాడు, బీసీ, బహుజన సంఘాల నాయకులు గణేష్, చారి, కృష్ణమూర్తి, చంద్రబోస్, సాల్మన్‌రాజు తదితరులు పాల్గొన్నారు. మహిళలన్న గౌరవం లేదు మా శాఖలో మహిళల పట్ల గౌరవం లేదు. అధికారులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. బాత్రూమ్ బాగోలేదంటే మరమ్మతులు చేయించకుండా అసభ్యకరంగా మాట్లాడటం సరికాదు. గిఫ్ట్‌లు తీసుకొని పనులు చేస్తున్నారని చెప్పడం బాధ కలిగిస్తోంది. – యు.ఎం. శాంతి, బీసీ మహిళా ఉద్యోగుల ప్రతినిధి. -
శ్రీదేవి కూతుళ్లపై అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : తల్లి హఠాన్మరణంతో పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయిన శ్రీదేవి కూతుళ్లకు.. ఆ షాక్ నుంచి కోలుకునే పరిస్థితులు ఇప్పుడప్పుడే కనిపించటం లేదు. శ్రీదేవి బతికున్నంత కాలం దూరంగా ఉన్న సవతి పిల్లలు అర్జున్, అన్షులా కపూర్లు.. ఇప్పుడు బోనీ-జాన్వీ-ఖుషీ వెంటే ఉంటున్నారు. ముఖ్యంగా అర్జున్ శ్రీదేవి మరణ వార్త తెలిసినప్పటి నుంచి చెల్లెళ్లతోనే ఉంటూ వారికి ఊరటనిస్తున్నాడు. ఇదిలా ఉంటే అన్షులా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు ఉంచింది. బాధలో ఉన్న జాన్వీ-ఖుషీలు త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్షతో ఆమె ఆ పోస్టును ఉంచింది. దానికి చాలా మంది పాజిటివ్‌గా స్పందించారు. అయితే అర్జున్ హార్డ్ కోర్ ఫ్యాన్ అని చెప్పుకున్న ఓ వ్యక్తి మాత్రం తేడాగా స్పందించాడు. జాన్వీ, ఖుషీలపై అసభ్య పదజాలంతో కామెంట్లు పోస్ట్ చేశాడు. దీనిపై మండిపడ్డ అన్షులా అతగాడిని చెడామడా వాయించేసింది. నా చెల్లెళ్ల గురించి అలా మాట్లాడితే బాగోదని వార్నింగ్ ఇచ్చేసింది. ఆపై శాంతించిన ఆమె కూల్‌గా మరో పోస్ట్‌ను పెట్టింది. ‘నాపై నా సోదరుడిపై మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్. కానీ, నా సిస్టర్స్ ను అలా అవమానించటం సరికాదు. అందుకే మీ కామెంట్లను నేను తొలగిస్తున్నా. ఇంకోసారి ఇలా చెయ్యొద్దని అభిమానులను వేడుకుంటున్నా’ అంటూ మరో పోస్టును చేసింది. అన్షులా చేసిన విజ్ఞప్తి పోస్ట్ -
ప్రభుత్వాన్నే నిలదీస్తా..
సాక్షి, తాడేపల్లిగూడెం: ‘ఈ రామన్నగూడెంలో ఏ కార్యక్రమాలకు నన్ను పిలవడంలేదు.. నా పాత్ర లేకుండా ఇక్కడ ఏ పనీ జరగదు.. నా నియోజకవర్గంలో నన్నో అంటరానివాడిగా చూసే పరిస్థితి ఏర్పడింద’ని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘నన్ను నిలదీయాలని ప్రయత్నిస్తే ప్రభుత్వాన్నే నిలదీస్తా.. నన్ను కట్ చేయాలని ప్రయత్నిస్తే ఆంధ్రప్రదేశ్‌ను కూడా కట్ చేస్తా’ అని దురుసుగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పక్కనే మహిళా తహసీల్దార్, సభలో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంలో బుధవారం జరిగిన జన్మభూమి సభలో మంత్రి పై విధంగా నోరు జారారు. అసభ్య పదజాలంతో మాట్లాడారు. గ్రామ సభలో జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజుపై మంత్రి మాణిక్యాలరావు ఇలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
టీచకుడు..!
అతడొక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇన్చార్జ్ హెచ్ఎం కూడా. అతడి బుద్ధి వక్రించింది. కీచకుడిగా మారాడు. పదోతరగతి మార్క్స్ మెమో కోసం పాఠశాలకు వచ్చిన బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తికి, ఉపాధ్యాయ లోకానికి తలవంపులు తెచ్చాడు. ‘తులసి వనంలో గంజాయి మొక్క’గా మారాడు. వేంసూరు: మండలంలోని కల్లూరుగూడెం గ్రామానికి చెందిన ఆ విద్యార్థిని స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పదోతరగతి ఉత్తీర్ణురాలైంది. సత్తుపల్లిలోని ప్రయివేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. పదోతరగతి లాంగ్ మెమో కోసం సోమవారం పాఠశాలకు వెళ్లింది. ప్రధానోపాధ్యాయుడు (మండల ఇన్చార్జ్ ఎంఈఓ) సిహెచ్.వెంకటేశ్వరరావు లేరు. ఖమ్మంలో సమావేశానికి వెళ్లారు. ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు డి.వెంకటేశ్వరరెడ్డి ఉన్నాడు. ఆపీస్ రూమ్‌కు వచ్చిన ఆ విద్యార్థినితో అతడు అసభ్యకరంగా ప్రవర్తించసాగాడు. ఆమె భయపడింది. తప్పించుకుని పరుగు పరుగున ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో చెప్పింది. వారు పాఠశాలకు చేరుకునేసరికి వెంకటేశ్వరరెడ్డి వెళ్లిపోయాడు. వారు అదే రోజున (ఇన్చార్జ్) ఎంఈఓకు ఫోన్ చేసి జరిగింది చెప్పారు. ఆ ఉపాధ్యాయుడిని మంగళవారం ఉదయం పిలిపించి మాట్లాడతానని హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం ఆ విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్తులు కలిసి పాఠశాలలో ఉన్న (ఇన్చార్జ్) ఎంఈఓ వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లారు. డి.వెంకటేశ్వరరెడ్డిని పిలిపించకపోవడంతోపాటు సర్దిపుచ్చేందుకు వెంకటేశ్వరరావు ప్రయత్నించారు. దీనిపై తల్లిదండ్రులు, 150మంది గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశంతో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఎంఈఓ నిర్బంధం కీచకుడిగా మారిన డి.వెంకటేశ్వరరెడ్డిని పాఠశాలకు పిలిపించాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇన్చార్జ్ ఎంఈఓను గ్రామస్తులు నిర్బంధించారు. ‘‘గతంలో కూడా ఇదే పాఠశాలలోని అమ్మాయిలతో వేరొక ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని మీ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు మరొకడు తయారయ్యాడు. ఇదంతా మీ చాతగానితనంతోనే టీచర్లు ఇలా తయారవుతున్నారు’’ అంటూ నిర్బంధించారు. ఆ కీచకోపాధ్యాయుడు వచ్చేదాకా వదిలేది లేదన్నారు. ఈ సమాచారంతో ఎస్సై వెంకన్న, తహసీల్దార్ ఎన్టీ ప్రకాష్‌రావు వచ్చారు. చర్యలు తీసుకుంటామని వారు చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. పురుగుల మందు డబ్బాతో అన్న ఆందోళన తన చెల్లితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని పాఠశాలకు రప్పించకపోతే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానంటూ బాధితురాలి అన్న, పాఠశాల భవనం పైకి ఎక్కాడు. అతడికి గ్రామస్తులు నచ్చచెప్పి కిందకు దించారు. తన కూతురుతో ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ (ఇన్చార్జ్) ఎంఈఓ వెంకటేశ్వరరావుకు బాలిక తండ్రి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరెడ్డిపై చర్యలు తీసుకుంటానని బాధితురాలి తండ్రికి లిఖితపూర్వక హామీ పత్రాన్ని (ఇన్చార్జ్) ఎంఈఓ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు వెళ్లిపోయారు. -
టీడీపీ ఎమ్మెల్యే జుగుప్సాకర వ్యాఖ్యలు..
►‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కిన మాజీ మంత్రి ►ఎమ్మెల్యే రోజాపై బూతుల పంచాగం ►జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు విశాఖపట్నం: మూడుసార్లు ఎమ్మెల్యే చేశారు.. పైగా మంత్రిగా పనిచేశారు... సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇటీవల జుగుప్సాకరమైన రీతిలో చేస్తున్న వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్రికల్లో రాయలేని భాషను వాడుతూ నీచాతినీచంగా ఆయన మాట్లాడుతున్న తీరు సొంత పార్టీ నేతలే ఈసడించుకుంటున్నారు. ఇటీవలే రాజ్యసభసభ్యుడు వి. విజయసాయిరెడ్డిపై నోటి కొచ్చినట్టు నానాదుర్భాషలాడిన బండారు తన బండారాన్ని ఉతికి ఆరేస్తున్న ‘సాక్షి’పై బుధవారం తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై కూడా ఒంటికాలిపై లేస్తూ అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ పాల వ్యాన్‌లో టీడీపీ స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా చిత్తూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకోగా ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఎన్టీఆర్ గృహకల్ప లబ్ధిదారుల అవగాహనా సదస్సుకు వచ్చిన ఎమ్మెల్యే బండారు దీనిపై స్పందిస్తూ మరోసారి తన బూతుల పంచాంగాన్ని విప్పారు. హెరిటేజ్ కంపెనీ వ్యాన్‌ను స్మగ్లర్లు దొంగ స్టిక్కర్లు అంటించుకుని వాడుకున్నారని చెబుతూ ఈ విçషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’ పత్రిక, టీవీలపై అక్కసు వెళ్లగక్కారు. నోటికి వచ్చినట్టుగా తిట్ల పురాణం లంకించుకున్నారు. ‘సాక్షి’ పత్రిక, టీవీలను బ్యాన్ చేయాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. మహిళా లబ్ధిదారులు, పార్టీ మహిళానేతల సమక్షంలోనే ఎమ్మెల్యే రోజా పట్ల రాయలేని భాషలో జుగుప్సాకరంగా మాట్లాడడంతో వారు నివ్వెరపోయారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. బండారు దిష్టిబొమ్మ దహనం ఎమ్మెల్యే ఆర్కే రోజాపై పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేసిన అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం జీవీఎంసీ గాంధీబొమ్మ వద్ద నిరసన వ్యక్తం చేశారు. మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో బండారు దిష్టిబొమ్మను దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. -
మహిళలపై రాజకీయ దౌర్జన్యాలు
మహిళలను కించపరచే వ్యాఖ్యలతో రాజకీయ నాయకులు నోరు పారేసుకుంటున్న సందర్భాలు మాత్రమే కాదు, వారిపై యథేచ్ఛగా దౌర్జన్యకాండ సాగిస్తున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. అధికార బలం, రాజకీయ ప్రాబల్యం గల కొందరు నాయకులు మహిళలపై భౌతిక దాడులకు సైతం తెగబడుతున్నారు. మహిళా అధికారులు కూడా ఇలాంటి దాడులకు గురవుతున్నారంటే సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటోందో అర్థం చేసుకోవాల్సిందే. మహిళలపై రాజకీయ దౌర్జన్యాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న కొన్ని సంఘటనలు... మహిళా తహశీల్దారుపై దాడి కృష్ణా జిల్లాలో తహశీల్దారు దోనవల్లి వనజాక్షిపై ఇసుక మాఫియా దాడికి తెగబడిన సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన 2015 జూలైలో జరిగింది. నూజివీడు నియోజకవర్గం పరిధిలోని ముసునూరు మండలం రంగంపేట వద్ద తమ్మిలేరులోని ఇసుకను ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ముసునూరు తహశీల్దార్ అక్కడకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియన్నను పంపారు. చింతమనేని మనుషులు తనను నిర్బంధించడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఈ విషయాన్ని తహశీల్దారుకు, పోలీసులకు ఫోన్లో తెలిపారు. తొలుత పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రికార్డులు చూపమని పోలీసుల సమక్షంలోనే ఆర్ఐని చింతమనేని నిలదీశారు. తన వద్ద సరిహద్దుల రికార్డులు లేకపోవడంతో ఆయన మిన్నకుండిపోయారు. దాంతో ఇసుక రవాణాను మళ్లీ కొనసాగించారు. విషయం తెలిసిన తహశీల్దారు అక్కడకు చేరుకుని ఇసుక రవాణాను ఆపాలని ఆదేశించారు. వారు వినకపోవడంతో ఆమె ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లకు అడ్డంగా కూర్చున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులకు ఫోన్ ద్వారా విషయాన్ని వివరించారు. ఈలోగా అక్కడకు చేరుకున్న చింతమనేని తహశీల్దారును, రెవెన్యూ సిబ్బందిని తొలగించాలంటూ వారిపైకి తన అనుచరులను ఉసిగొల్పారు. దీంతో డ్వాక్రా మహిళలు మూకుమ్మడిగా తహశీల్దారుపై పడి, చేతులు పట్టుకుని ఈడ్చుకుంటూ పక్కకు లాగేసి, ఆమెపై దాడి చేశారు. ఈ సంఘటనపై ముసునూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత సంఘటనా స్థలం పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోనిదని నిర్ధారించడంతో కేసును పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు పోలీస్ స్టేషన్‌కు బదలాయించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, స్వయంగా వనజాక్షితో మాట్లాడి వివాదాన్ని ముగించారు. లావణ్యను పొట్టన పెట్టుకున్నారు విశాఖపట్నం జిల్లా గాజువాక మండలంలోని వడ్లపూడి ప్రాంతానికి చెందిన లావణ్యను పోకిరీలు పొట్టన పెట్టుకున్నారు. భర్త మాటూరు అప్పలరాజు, ఆయన చెల్లెలు దివ్యలతో కలసి లావణ్య అనకాపల్లి నూకాంబిక ఆలయానికి వెళ్లింది. దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలోనే వారు భోజనాలు చేశారు. ఆ సమయంలో అక్కడ తప్పతాగి ఉన్న కొందరు పోకిరీలు లావణ్య, దివ్యలతో అసభ్యంగా ప్రవర్తించారు. మహిళలను వేధించడం తగదంటూ అప్పలరాజు వారికి హితబోధ చేశారు. దీనిని మనసులో పెట్టుకున్న వారు తిరుగు ప్రయాణంలో అప్పలరాజు వాహనాన్ని కారులో వెంబడించారు. సాలాపువాని ప్రాంతం వద్దకు వచ్చే సరికి కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. గత ఏడాది మే నెలలో జరిగిన ఈ సంఘటనలో లావణ్య అక్కడికక్కడే మృతి చెందగా, దివ్య తీవ్ర గాయాలపాలైంది. తల్లి మరణంతో పిల్లలు శశాంక్ (4), విశాల్ (1) అనాథలుగా మిగిలారు. కారు నడిపిన వ్యక్తిని దాడి హేమకుమార్గా గుర్తించారు. ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్యేనన్నది లావణ్య కుటుంబ సభ్యుల ఆరోపణ. ‘అనంత’ అరాచకాలు అనంతపురం జిల్లాలో మహిళలపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తల అరాచకాలు హద్దూ అదుపూ లేకుండా సాగుతున్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం జల్లిపల్లిలో ఇటీవల సుధమ్మ అనే మహిళపై సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర అత్యంత పాశవికంగా దాడి చేశారు. ఈ సంఘటనను ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. తన ఇంటి ఎదుట నీటి ట్యాంకు నిర్మాణానికి అభ్యంతరం చెప్పిందనే కోపంతో సర్పంచ్ నాగరాజు ఈ దారుణానికి తెగబడ్డారు. ఈ సంఘటనపై ప్రజా సంఘాల నుంచి కూడా నిరసనలు వెల్లువెత్తడంతో పోలీసులు నాగరాజుపై రౌడీషీట్ తెరిచారు. ఇది జరిగిన రెండు రోజులకే పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం ఎల్జీబీ నగర్లో తోట పని చేసుకుంటున్న ఒక మహిళపై టీడీపీ కార్యకర్త వెంకటేశ్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం పాళ్లూరులో గిరిజన మహిళ వన్నూరమ్మ, ఆమె కుటుంబ సభ్యులపై టీడీపీ నేత నాగరాజు దాడి చేశారు. గోదావరి ప్రాంతంలో మహిళల గోడు అక్కా చెల్లెళ్లయిన శ్రీగౌతమి, పావని స్కూటీపై పాలకొల్లు నుంచి నర్సాపురం వెళుతుండగా కొందరు దుండగులు వారిని వెంటాడి, వేధించి కారుతో ఢీకొన్నారు. శ్రీగౌతమి అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాలైన పావని జరిగిన సంఘటన ప్రమాదం కాదని తన అక్కను కుట్రపూరితంగా హత్య చేశారని ఆరోపించింది. నర్సాపురానికి చెందిన తెలుగుదేశం నేత సజ్జా బుజ్జి తన అక్కను రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడని, ఆయన భార్య తన అక్కను చంపించిందని ఆరోపించింది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు బుజ్జికి అండగా నిలవడంతో పోలీసులు ఈ కేసును ప్రమాదంగా మూసేశారు. భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న గోదావరి మెగా అక్వా ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమించిన పాపానికి ఆరేటి సత్యవతి అనే మహిళపై హత్యాయత్నం కేసు బనాయించారు. ఆమెతో పాటు ఆమె కుమారుడిని కూడా ఈ కేసులో అరెస్టు చేసి, దాదాపు 40 రోజులు జైలులో పెట్టారు. సత్యవతి భర్త కేన్సర్‌తో బాధపడుతున్నాడని తెలిసినా, ఆమెకు బెయిల్ దొరక్కుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి తణుకు జైలుకు వెళ్లి సత్యవతిని పరామర్శించారు. ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చిన సత్యవతి భయపడకుండా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఎంపీ కుమార్తెకే రక్షణ కరువు చిత్తూరు జిల్లాలో సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ కుమార్తెకే రక్షణ కరువైన సంఘటన జరిగింది. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బంధువు ఒకరు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కుమార్తె డాక్టర్ మాధవీలత కారు డ్రైవర్‌ను కొట్టి, ఆమెపై అమానుషంగా ప్రవర్తించారు. పోలీసులు బొజ్జల బంధువుకు అన్ని విధాలా సాయం చేశారు. ఎంపీ కూతురినైన తనకు అవమానం జరిగిందని, పోలీసుల నుంచి గాని, ప్రభుత్వం నుంచి గాని తనకు రక్షణ కరువైందని డాక్టర్ మాధవీలత రోడ్డుపైనే విలపించారు. బాసటగా నిలిచేవారూ ఉన్నారు... కొందరు ప్రముఖులు అక్కడక్కడా మహిళలను కించపరచే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నా, మహిళలకు బాసటగా నిలిచేవారూ లేకపోలేదు. మహిళలపై నోటి దురుసుతనాన్ని చాటుకుంటున్న వారిలో ఎక్కువమంది శాసన, అధికార యంత్రాంగాలలో ఉంటుంటే, మహిళలకు బాసటగా గళం వినిపిస్తున్న వారు ఇతరేతర రంగాలలో కొనసాగుతున్నారు. మహిళలను కించపరుస్తూ రాజకీయ, అధికార ప్రముఖులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా గళం వినిపిస్తున్నారు. మహిళలకు అండగా, వారి పట్ల జరుగుతున్న అన్యాయాలకు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా కొందరు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు... ‘మహిళలపై నేరాలు జరుగుతున్న ప్పుడు సంఘంలోని పెద్దలు, రాజకీయ నేతలు, మంత్రులు... నేరం చేసిన వాళ్లను వదిలేసి బాధితులనే తప్పుపట్టడం కంటే అసహ్యకరమైనది మరొకటి ఉండదు’ – షబనా అజ్మీ, బాలీవుడ్ నటి, రాజ్యసభ మాజీ ఎంపీ ‘కళ్ల ముందే అనాగరిక చర్యలు, ఘోరాలు జరుగుతున్నా చూస్తూ మౌనంగా ఉండటం మహానేరం’ – మహేశ్ భట్, బాలీవుడ్ దర్శక–నిర్మాత ‘ముందుకు వెళ్లాల్సిందిపోయి అంతకంతకూ వెనక్కు వెళుతున్నాం. మన కంటే జంతువులు నయం. పూర్తిగా పశువుల్లా ప్రవర్తిస్తున్నాం. సిగ్గుపడాల్సిన పరిణామం’ – అక్షయ్ కుమార్, బాలీవుడ్ నటుడు ‘అమ్మాయిల మీద దాడి జరగగానే అధికారంలో ఉన్న ఇంగితంలేని మనుషులు జరిగిన దాన్ని ఖండించాల్సింది పోయి, అమ్మాయిలు ధరించే దుస్తులు, వాళ్లు రాత్రివేళ బయటకు వెళ్లడం గురించి వ్యాఖ్యలు చేయడం దారుణం... మగపిల్లలను వంశోద్ధారకుడంటూ నెత్తికెత్తుకోకండి. వాళ్లు పశువులుగా మారకుండా చూడండి. వాళ్ల బారిన పడకుండా అమ్మాయిలను కాపాడండి’ – అనుష్క శర్మ, బాలీవుడ్ నటి ‘మహిళల మీద జరుగుతున్నవి ఉత్త లైంగిక దాడులు కాదు... ఇవి స్త్రీద్వేషులు కొనసాగిస్తున్న లైంగిక ఉగ్రవాద చర్యలు’ – ఫర్హాన్ అక్తర్, బాలీవుడు నటుడు, దర్శకుడు ఇలాంటి వ్యాఖ్యలను చేసే వాళ్లను పట్టించుకోవడం దండగ. వాళ్లంతా మధ్యయుగానికి చెందిన వాళ్లు. ప్రజాస్వామ్యం, సమానత్వం అంటే అర్థం తెలియని వాళ్లు. యాంటీ ఇంటలెక్చువల్స్, యాంటీ డెమోక్రాట్స్.. – రమామేల్కొటే, రిటైర్డ్ ప్రొఫెసర్, అన్వేషి ఫౌండర్ రాజకీయ నాయకులు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లు అలా మాట్లాడడం బాధాకరం. ఇది తిరోగామి సంస్కృతి. అంటే స్త్రీలను ఇంట్లో, బ్యాంక్ లాకర్లలో భద్రంగా దాచుకునే వస్తువుల్లా చూడ్డమే ఇది. – బిందు నాయుడు, దర్శకురాలు అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలి. అబ్బాయి ఎక్కువ, అమ్మాయి తక్కువ అనే భావనలోనే ఉన్నాం. అలాగే పెంచుతున్నాం. ఈ సంప్రదాయాన్ని ఇంటి దగ్గరే బ్రేక్ చేయాలి. అంటే పెంపకంలో మార్పు రావాలన్నమాట. అమ్మాయిని, అబ్బాయిని ఈక్వల్‌గా పెంచాలి. అబ్బాయిలు అమ్మాయిలను గౌరవంగా చూసేలా పెంచాలి. ఇద్దరినీ మంచి మనుషులుగా రెయిజ్ చెయ్యాలి. – ఆనంద శంకర్ జయంతి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి -
ఇంకా మట్టిముద్దలేనా..?
మన దేశంలో మహిళలు ఇంకా మట్టిముద్దల్లానే ఉంటున్నారా? లేకుంటే వాళ్ల గురించి చట్టాలు చేస్తున్న మగాళ్లు అలాగే అనుకుంటున్నారా? అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రాల్లోనూ గౌరవనీయమైన చట్టసభల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగుతున్న పురుషపుంగవులు నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తూ మహిళలను చులకన చేస్తున్న ఉదంతాలు తరచు వార్తలకెక్కుతూనే ఉన్నాయి. మహిళల సాధికారితకు కట్టుబడి ఉన్నామంటూ బహిరంగ వేదికలపై ప్రగల్భాలు పలికే నేతల నోటనే ఏదో ఒక సందర్భంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలూ వెలువడుతున్నాయి. చట్టసభల్లోని వారే కాదు, అధికార యంత్రాంగంలో ఉన్నత పదవుల్లో ఉంటున్న వారు, వివిధ రంగాల్లో పేరుప్రఖ్యాతులు పొందిన ప్రముఖులు సైతం మహిళల పట్ల నోరు జారిన ఉదంతాలు ఉన్నాయి. గడచిన కొన్నేళ్లలో మహిళలపై ప్రముఖులు నోరుజారిన సందర్భాలు మచ్చుకు కొన్ని... తెలుగునాట తాజా దుమారం ‘ఒక వాహనం కొని షెడ్డులో ఉంచితే ప్రమాదాలు జరగవు. అదే వాహనాన్ని బయటకు తీసుకువెళితే ప్రమాదాలు జరుగుతాయి. స్పీడు ఎక్కువైతే ప్రమాదాలు జరిగే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి... మహిళల పరిస్థితి కూడా అంతే. వారు పాత రోజుల్లో మాదిరిగా వంటింటికే పరిమితమైతే వేధింపులు ఉండవు. ప్రస్తుతం మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలంటూ బయట తిరుగుతూ సమాజానికి ఎక్స్పోజ్ అవుతున్నారు. అందుకే వేధింపులకు గురవుతున్నారు...’ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యలివి. విజయవాడలో జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మీడియాకు వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో కూర్చున్న పాత్రికేయుల ముఖకవళికలు ఇబ్బందికరంగా మారడంతో పరిస్థితిని గ్రహించి, అప్పటికప్పుడే దిద్దుబాటు వ్యాఖ్యలనూ సంధించారు. అలాగని మహిళలు చదువుకోవద్దు, ఉద్యోగాలు చేయవద్దు అని కాదని... స్వీయరక్షణ కోసం మహిళలు కుంగ్‌ఫూలాంటి మార్షల్ ఆర్ట్స్‌లో తర్ఫీదు తీసుకోవాలని, అప్పుడే మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు తగ్గుముఖం పడతాయని అన్నారు. అయితే, స్పీకర్ కోడెల వ్యాఖ్యలపై దుమారం రేగనే రేగింది. జాతీయ మీడియా కూడా ఆయన వ్యాఖ్యలపై కథనాలను ప్రచురించింది. ఈ దుమారం సద్దుమణగక ముందే జాతీయ మహిళా పార్లమెంటులో పాల్గొనాల్సిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా గన్నవరం విమానాశ్రయంలో అడుగుపెట్టడమే తడవుగా పోలీసులు ఆమెను అడ్డుకుని, నిర్బంధంలోకి తీసుకున్నారు. జాతీయ మహిళా పార్లమెంటులో పాల్గొనకుండా ఒక శాసనసభ్యురాలిని అడ్డగించడం ఏమాత్రం సబబు కాదంటూ విమర్శలు చెలరేగాయి. శాసన, అధికార వ్యవస్థలు సైతం మహిళలపై వివక్ష ప్రదర్శిస్తున్నాయనేందుకు ఇదొక తాజా ఉదాహరణ.ఎందరో ‘మగా’నుభావులుమహిళలపై నోరు పారేసుకుని వివాదాల్లో చిక్కుకున్న ‘మగా’నుభావులు మన దేశంలో చాలామందే ఉన్నారు. ఉన్నత స్థాయిలో ఉంటూ మహిళలను కించపరచేలా, లింగవివక్షను ప్రోత్సహించేలా కొందరు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు కొన్ని... ‘కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో విమర్శలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇక ఎమ్మెల్యే హోదాలో కొనసాగుతున్న ఆయనగారి వియ్యంకుడు, తెలుగు సినీకథానాయకుడు బాలకృష్ణ మరీ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ... ‘అమ్మాయిలు కనిపిస్తే ముద్దయినా పెట్టాలి... కడుపైనా చేయాలి...’ అంటూ తన వాక్ప్రతాపాన్ని ప్రదర్శించడంపై సిటిజన్లు, నెటిజన్లు విమర్శలతో విరుచుకుపడిన వైనం కూడా తెలిసిందే. ఇలాంటి ‘మగా’నుభావులు దేశవ్యాప్తంగా ఉన్నారు. వారిలో కొందరు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు... ‘అమ్మాయిలకు పదహారేళ్లకే పెళ్లిళ్లు చేసేయాలి. వాళ్ల లైంగికావసరాలకు భర్తలు అందుబాటులో ఉంటారు. వాళ్లకు ఇంకెక్కడికీ వెళ్లాల్సిన అవసరం రాదు. అలాగైతేనే వారిపై అత్యాచారాలు జరగకుండా ఉంటాయి’ అని హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా వ్యాఖ్యానించారు. మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న వార్తలను కొందరు పాత్రికేయులు ఆయన దృష్టికి తెచ్చినప్పుడు ఆయన ఇలా స్పందించారు. పద్దెనిమిదేళ్ల లోపు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడం చట్టవిరుద్ధమని దేశంలోని చట్టాలు స్పష్టంగా చెబుతుంటే, ఆయన మాత్రం చట్టాలూ గిట్టాలూ జాన్తా నై అన్నట్లుగా తనకు తోచిన విరుగుడు అప్పటికప్పుడు చెప్పేసి, విమర్శలకు గురయ్యారు. ‘అత్యాచారాలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే జరుగుతాయి. పట్టణాల్లోని పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే అందుకు కారణం. గ్రామీణ భారతంలో ఇలాంటి సంఘటనలు జరగవు’ ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలివి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను, ఆ సంఘటనలకు అద్దం పడుతున్న జాతీయ నేర గణాంకాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన యథాలాపంగా చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగాయి.‘అబ్బాయిలు ఎంతైనా అబ్బాయిలే... వాళ్లిలాంటి పొరపాట్లు చేయడం సహజం’ అంటూ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ సెలవిచ్చారు. ‘అమ్మాయిలకు, అబ్బాయిలకు ఏవో గొడవలున్నాయి. అమ్మాయి వెళ్లి తనపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేసింది... పాపం ఆ అబ్బాయిల్లో ముగ్గురికి ఉరిశిక్ష పడింది. అత్యాచారం కేసులు ఉరిశిక్షకు దారితీయాలా..? ఇలాంటి చట్టాలను మార్చడానికి ప్రయత్నిస్తాం’ అని అన్నారు. ముంబైలో జరిగిన గ్యాంగ్‌రేప్ సంఘటనలో నిందితులకు ఉరిశిక్ష పడిన సందర్భంగా ఆయన ఒక బహిరంగ సభలో చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ మీడియాలో దుమారం రేపాయి. బొత్తిగా అర్థంలేని వ్యాఖ్యలు మహిళలపై కొందరు నాయకులు, ఉన్నతాధికారులు చేసే వ్యాఖ్యలు బొత్తిగా అర్థంలేనివిగా ఉంటున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు మహిళా సంఘాలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. విమర్శల జడివానకు దారితీస్తున్నాయి. అయినా, ఇలా నోరు పారేసుకుంటున్న వారి ధోరణిలో పెద్దగా మార్పు కనిపించకపోవడం దురదృష్టకరం. మహిళలపై కొందరు చేసిన మరీ దారుణమైన అర్థంలేని వ్యాఖ్యలకు కొన్ని ఉదాహరణలు... ‘అత్యాచారాన్ని అడ్డుకోలేనప్పుడు దానిని ఆస్వాదించాలి’... మరీ వికృతంగా అనిపిస్తున్న ఈ మాటలు ఏదో వికృత హాస్యానికి సినిమా విలన్ పలికిన డైలాగులు కావు... సాక్షాత్తు సీబీఐ మాజీ అధినేత రంజిత్ సిన్హా చేసిన వ్యాఖ్యలివి. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థలో సీనియర్ అధికారి హోదాలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్రంగానే విమర్శలు వెల్లువెత్తాయి. ‘అత్యాచారం కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే ఏం చెప్పమంటారు? దీనికి మా దగ్గర సమాధానాలు లేవు. నక్షత్రాలు అనుకూలంగా లేవు’ అంటూ నెపం నక్షత్రాల మీదకు, గ్రహగతుల మీదకు నెట్టేసిన పెద్దమనిషి ఏ జ్యోతిషుడో కాదు... సాక్షాత్తు ఛత్తీస్‌గఢ్ మాజీ హోంమంత్రి నాన్కీరామ్ కన్వర్ చేసిన వ్యాఖ్యలివి. మహిళల్లోనూ కొందరున్నారు... అత్యాచారాలు, లైంగిక వేధింపుల వంటి సంఘటనల్లో నెపం బాధితులపైకి నెట్టేసి అర్థంలేని వ్యాఖ్యలతో వార్తలకెక్కిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న కొందరు మహిళలు సాటి మహిళల పట్ల ఏమాత్రం సానుభూతి లేకుండా నోటి దురుసుతనాన్ని చాటుకున్న ఉదంతాలు మచ్చుకు కొన్ని... ‘మహిళలపై జరిగే నేరాలకు మహిళలు కూడా సమాన బాధ్యులే’ అని సాక్షాత్తు ఛత్తీస్‌గఢ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ హోదాలో విభారావు అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు విమర్శలు గుప్పించాయి. ‘ఇదివరకటితో పోలిస్తే మహిళలు, పురుషులు పరస్పరం స్వేచ్ఛగా కలిసి తిరుగుతున్నందు వల్లనే దేశంలో అత్యాచార సంఘటనలు పెరుగుతున్నాయి’ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఇవీ వాస్తవాలు మన దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలకు సురక్షితమైన పరిస్థితులను కల్పించలేకపోతున్నాయి. మహిళలపై జరుగుతున్న నేరాల్లో ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అందుబాటులో ఉన్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలను పరిశీలిస్తే, 2015లో దేశవ్యాప్తంగా మహిళలపై 3,37,922 కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల తీరు తెన్నులివీ... -
ఎమ్మెల్యే రోజాపై మాగంటి అసభ్య వ్యాఖ్యలు
కైకలూరు: ఎమ్మెల్యే రోజాపై ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)... మహిళాలోకం తలదించుకునేలా వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా కైకలూరులో శుక్రవారం జరిగిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామకృష్ణ ఎన్నికల ప్రచార సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లతోపాటు మాగంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజాపై ఆయన పత్రికల్లో రాయలేనిరీతిలో అసభ్య పదజాలంతో దూషిం చారు. ఆయన మాటలు విన్న కైకలూరు టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు బి. విజయలక్ష్మి కంగుతిన్నారు. మంత్రి కామినేని సైతం ఆ మాటలు వద్దంటూ వారిం చారు. ఆవేశంలో ఉన్న ఎంపీ మాగంటి...మీరు చెవులు మూసుకోండంటూ జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మికి సలహా ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకుండానే సభను నడిపించాలనేది తన ఉద్దేశమన్నారు.