
సాక్షి, హైదరాబాద్ : దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా.. కొందరు యువకులు మాత్రం విజ్ఞత మరచి ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బాధితురాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడేవారిపై సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే శ్రీరామ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా దిశ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా అమరావతి కొండయ్య కాలనీకి చెందిన సాయినాథ్ ఆలియాస్ నాని అనే వ్యక్తిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బాధితురాలి పేరిట సోషల్ మీడియాలో అసభ్యకర ప్రచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులు ఫేస్‌బుక్‌లో గ్రూప్‌గా ఏర్పడి దిశపై అసభ్య కామెంట్లు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఇద్దరిని( శ్రీరామ్, సాయినాథ్) అరెస్ట్ చేశామని.. త్వరలోనే మరికొంతమందిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ రోజు అరెస్ట్ అయిన నానిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment