ఎమ్మెల్యే రోజాపై ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)... మహిళాలోకం తలదించుకునేలా వ్యాఖ్యలు చేశారు.
కైకలూరు: ఎమ్మెల్యే రోజాపై ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)... మహిళాలోకం తలదించుకునేలా వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా కైకలూరులో శుక్రవారం జరిగిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామకృష్ణ ఎన్నికల ప్రచార సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లతోపాటు మాగంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజాపై ఆయన పత్రికల్లో రాయలేనిరీతిలో అసభ్య పదజాలంతో దూషిం చారు.
ఆయన మాటలు విన్న కైకలూరు టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు బి. విజయలక్ష్మి కంగుతిన్నారు. మంత్రి కామినేని సైతం ఆ మాటలు వద్దంటూ వారిం చారు. ఆవేశంలో ఉన్న ఎంపీ మాగంటి...మీరు చెవులు మూసుకోండంటూ జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మికి సలహా ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకుండానే సభను నడిపించాలనేది తన ఉద్దేశమన్నారు.