maganti Venkateswara Rao
-
ఎమ్మెల్యే రోజాపై మాగంటి అసభ్య వ్యాఖ్యలు
కైకలూరు: ఎమ్మెల్యే రోజాపై ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)... మహిళాలోకం తలదించుకునేలా వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా కైకలూరులో శుక్రవారం జరిగిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామకృష్ణ ఎన్నికల ప్రచార సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లతోపాటు మాగంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజాపై ఆయన పత్రికల్లో రాయలేనిరీతిలో అసభ్య పదజాలంతో దూషిం చారు. ఆయన మాటలు విన్న కైకలూరు టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు బి. విజయలక్ష్మి కంగుతిన్నారు. మంత్రి కామినేని సైతం ఆ మాటలు వద్దంటూ వారిం చారు. ఆవేశంలో ఉన్న ఎంపీ మాగంటి...మీరు చెవులు మూసుకోండంటూ జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మికి సలహా ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకుండానే సభను నడిపించాలనేది తన ఉద్దేశమన్నారు. -
విచారణ జరిపి న్యాయం చేయండి
ఎమ్మెల్యే తాటిపై జరిగిన దాడిపై గవర్నర్‌కు వైఎస్సార్సీపీ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: అశ్వారావుపేట వైఎస్సార్సీపీ గిరిజన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు నేతృత్వంలోని టీడీపీ కార్యకర్తలు జరిపిన దాడిపై సమగ్ర విచారణ జరిపి, తగిన న్యాయం చేయాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడేందుకు.. మళ్లీ ఇలాంటి హింసాయుత చర్యలకు పాల్పడకుండా ఉండేలా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార టీడీపీకి సలహా ఇవ్వాలని కోరింది. ఈ మేరకు శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వైఎస్సార్సీపీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు వినతిపత్రాన్ని సమర్పించారు. వీరితోపాటు సీపీఎం ఎమ్మెల్యే రాజయ్య, వైఎస్సార్సీపీ నేతలు జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్ తదితరులున్నారు. ప్రాం తీయ విభేదాలు రెచ్చగొట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని.. హింసాయుత పద్ధతులకు దిగుతోందని వారు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని కూడా వైఎస్సార్సీపీ బృందం కలిసింది. గవర్నర్ న్యాయం చేస్తానన్నారు: ఎంపీ తమ వినతిని స్వీకరించిన గవర్నర్ నరసింహన్ తాము చెప్పిన విషయాలను విన్నారని తమకు న్యాయం చేస్తారని ఎంపీ పొంగులేటి శ్రీని వాసరెడ్డి మీడియాకు తెలిపారు. -
‘గీతాంజిలి’కి సీక్వెల్ తీస్తా..
స్టోరీ, డెరైక్టర్ రాజ్‌కిరణ్ రూ.4కోట్లు ఖర్చు పెట్టాం.. రూ.12కోట్లు సంపాదించాం.. కథను శ్మశానంలో కూర్చుని రాశా.. అమలాపాల్, స్వాతి చెయ్యనంటేనే.. అంజలిని ఎంచుకున్నాం.. ఘన విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది.. ఘనవిజయం సాధించిన హర్రర్, కామెడీ చిత్రం గీతాంజలికి తర్వలో సీక్వెల్ తీస్తానని రాజ్‌కిరణ్ చెప్పారు. తనను సినీ రంగానికి పరిచయం చేసిన ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)ను గురువారం ఆయన ఆటపాకలోని ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాగంటి బాబు దర్శకుడు రాజ్‌కిరణ్‌కు స్వీటు తినిపించి అభినందించారు. అనంతరం రాజ్‌కిరణ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందిన గీతాంజలి సినిమా నిర్మాణానికి రూ.4 కోట్లు ఖర్చు చేశామని, ఇప్పటికి రూ.12 కోట్లు వసూలు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో తాను చూసిన ఓ యదార్థ సంఘటనను గీతాంజలి సీక్వెల్-2గా తెరకెక్కించనున్నట్లు రాజ్‌కిరణ్ తెలిపారు. గీతాంజిలి కథను ఓ శ్మశానంలో కూర్చుని రాశానని చెప్పారు. మొదట్లో టూలెట్, తర్వాత బాలాత్రిపురసుందరి పేర్లు అను కున్నామని, చివరికి అంజలి కథనాయిక కావడంతో గీతాంజలిగా మార్చామని తెలిపారు. తొలుత సినిమా హీరోయిన్గా అమలాపాల్, కలర్ స్వాతిలను అడిగితే, వారు శ్రీనివాసరెడ్డితో నటించడానికి సుముఖత చూపలేదన్నారు. నిర్మాత కోన వెంకట్ తనకెంతో సహాయం చేశారన్నారు. తాటికాయంత టాలెంట్‌కు ఆవగింజంత అదృష్టం ఉండాలి గీతాంజలి సినిమాలో చెప్పినట్టుగా ‘తాటికాయంత టాలెంట్‌కు ఆవగింజంత అదృష్టం ఉండాలి..’ అని రాజ్‌కిరణ్ చెప్పారు. స్థానిక డిగ్రీ కాలేజీ, విద్యాంజజి జూనియర్ కాలేజీ విద్యార్థులతో గురువారం ఆయన ముచ్చటించారు. తాను ఇదే ఊరిలో బాలాజీగా వినాయక స్డూడియోను నడిపానని, సినిమాలపై మోజుతో వెంకటరమణ థియేటర్ ప్రొజక్టర్ ఆపరేటర్ దగ్గర పనిచేశానన్నారు. కొద్దికాలం బాలాజీ మ్యూజికల్స్ నైట్స్ పేరుతో కచేరీలు కూడా చేశానని ఆయన వివరించారు. -
క్రీడాస్ఫూర్తిని నింపిన రన్
4వేల మంది హాజరు కిక్కిరిసిన కైకలూరు రహదారులు రన్లో పాల్గొన్న ఎంపీ మాగంటి కైకలూరు :అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా కైకలూరులో సోమవారం నిర్వహించిన ఒలింపిక్ రన్ క్రీడా స్ఫూర్తిని నింపింది. జిల్లా క్రీడాధికార సంస్థ, ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్లో పలు విద్యాసంస్థలకు చెందిన సుమారు 4వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉదయం డిగ్రీ కాలేజీకి చెందిన ఒక బ్యాచ్‌ను ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), ఏలూరురోడ్డు వద్ద మరో బ్యాచ్‌ను మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ప్రారంభించారు. రెండు బ్యాచ్‌ల్లోని నాయకులు, విద్యార్థులు కాగడాలతో తాలూకా సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాగంటి మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. జిల్లా క్రీడాధికారి రామకృష్ణ మాట్లాడుతూ కైకలూరులో స్టేడియం నిర్మాణానికి రూ.2.10 కోట్ల నిధులు మంజూరయ్యూయని చెప్పారు. స్థల సేకరణ జరిగితే పనులు ప్రారంభిస్తామన్నారు. జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి ప్రతీకలన్నారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు మాట్లాడుతూ కైకలూరు నుంచి వడ్లమన్నాటి పాండురంగారావు, మండవల్లి నుంచి మార్తమ్మ వంటి వారు జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపారని, వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కేపీ రావు మాట్లాడుతూ 2018లో నిర్వహించే ఒలింపిక్ గేమ్స్‌ను మన రాష్ట్రంలో నిర్వహించాలంటూ బిడ్ వేయనున్నట్లు చెప్పారు. కైకలూరులో రాష్ట్రస్థాయి పోటీలు త్వరలో నిర్వహిస్తామన్నారు. స్థానిక ఒలింపిక్ నిర్వహణ కమిటీ సభ్యుడు కేవీఎన్‌ఎం నాయుడు మాట్లాడుతూ కైకలూరులో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారన్నారు. కైకలూరు కరాటే మాస్టర్ ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో రన్లో పాల్గొన్నవారికి తాగునీరు, బిస్కెట్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ రన్ నిర్వహణ కమిటీ సభ్యులు గురజాడ ఉదయశంకర్, ఎంఏ రహీమ్, పీఈటీలు లూయిస్, లక్ష్మణరావు, శ్రీనివాసరావు, పీడీ సత్యనారాయణ, సర్పంచి నర్సిపల్లి అప్పారావు, జెడ్పీటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మి, నాయకులు చలమలశెట్టి రామానుజయ్య, మార్కెట్‌యార్డు చైర్మన్ సామర్ల శివకృష్ణ, న్యాయవాది కారి శరత్‌బాబు, సయ్యపురాజు గుర్రాజు, నేషనల్, జాగృతి, భాష్యం, చైతన్య, హోలిక్రాస్, కేపీఎస్, భుజబలపట్నం, కానుకొల్లు, కైకలూరు ప్రభుత్వ బాలుర, బాలికల హైస్కూళ్లు, ఓరియంటల్ హైస్కూల్, వికాస్, విద్యాంజలి కాలేజీలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.