
సాధిక్‌బాషా
సాక్షి, చెన్నై : తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై ఫేస్‌బుక్‌లో అనుచిత పోస్టులు చేసిన సహాయ నటుడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. తిరువారూరు జిల్లా, మన్నార్‌గుడి అరిసికడై వీధికి చెందిన సాధిక్‌బాషా (39). ఇతను కలవాణి–2 చిత్రంలో సహాయ నటుడిగా నటించాడు. అలాగే, మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సాధిక్‌బాషా తన ఫేస్‌బుక్‌లో తెలంగాణా గవర్నర్ తమిళిసైకు పరువునష్టం కలిగించే విధంగా పోస్టులు చేసినట్లు సమాచారం.
ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిగురించి బీజేపి నేత రఘురామన్ మన్నార్‌గుడి నగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణా గవర్నర్ తమిళిసైను సాధిక్‌బాషా అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌లో అనుచిత పదజాలం ఉపయోగించి పోస్టులు చేశారని, అందువల్ల అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తూ వచ్చారు. ఇలావుండగా తిరుత్తురైపూండి సమీపం కట్టిమేడు గ్రామంలో తన అత్తగారింట్లో ఉన్న సాధిక్‌బాషాను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment