Mannargudi
-
తమిళిసైపై అనుచిత పోస్టులు
సాక్షి, చెన్నై : తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై ఫేస్బుక్లో అనుచిత పోస్టులు చేసిన సహాయ నటుడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. తిరువారూరు జిల్లా, మన్నార్గుడి అరిసికడై వీధికి చెందిన సాధిక్‌బాషా (39). ఇతను కలవాణి–2 చిత్రంలో సహాయ నటుడిగా నటించాడు. అలాగే, మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సాధిక్‌బాషా తన ఫేస్బుక్లో తెలంగాణా గవర్నర్ తమిళిసైకు పరువునష్టం కలిగించే విధంగా పోస్టులు చేసినట్లు సమాచారం. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిగురించి బీజేపి నేత రఘురామన్ మన్నార్గుడి నగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణా గవర్నర్ తమిళిసైను సాధిక్‌బాషా అనే వ్యక్తి తన ఫేస్బుక్లో అనుచిత పదజాలం ఉపయోగించి పోస్టులు చేశారని, అందువల్ల అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తూ వచ్చారు. ఇలావుండగా తిరుత్తురైపూండి సమీపం కట్టిమేడు గ్రామంలో తన అత్తగారింట్లో ఉన్న సాధిక్బాషాను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
సాక్షి, చెన్నై : తమిళనాడులోని తిరువార్ జిల్లా మన్నార్గుడిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వివరాలు.. సింగారవేలు అనే వ్యక్తికి మన్నేనగర్లో బాణాసంచా తయారీ కర్మాగారం ఉంది. రోజువారీ దినచర్యలో భాగంగా బుధవారం కూడా సింగారవేలుతో సహా మరో ఏడుగురు కార్మికులు కర్మాగారానికి వచ్చారు. ఈ క్రమంలో బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వారు పనిచేస్తున్న భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో యజమాని సింగారవేలు సహా సురేష్, బాబు, మోహన్, వీరయ్యన్లతో పాటు మరో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రులను మన్నార్గుడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా వేసవికాలం కావడంతో ఎండలు విజృంభిస్తుండటంతో కర్మాగారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవటం తమిళనాట ఆందోళన కలిగిస్తోంది. -
సినీ నటి మనోరమ ఇక లేరు
-
సినీ నటి మనోరమ ఇక లేరు
చెన్నై: ప్రముఖ సినీ నటి మనోరమ (78) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా గుండెపోటు రావడంతో శనివారం అర్థరాత్రి మనోరమ తుదిశ్వాస విడిచారు. 1958 లో మాలిట్టా మంగై అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన మనోరమ వెయ్యి సినిమాలకు పైగా నటించి గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించారు. (ఫోటో గ్యాలరీ ...) 1980లో శుభోదయం సినిమాతో తెలుగు రంగంలోకి ప్రవేశించారు. తమిళం, తెలుగు, మళయాళం, హిందీ భాషల్లో మనోరమ నటించారు. 1955 లో ఫిలిం ఫేర్ లైఫ్ అఛీవ్మెంట్ అవార్డు సాధించారు. 2002లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1937, మే 26న తమిళనాడులోని మన్నార్ గుడిలో మనోరమ జన్మించారు. మనోరమ అసలు పేరు గోపీశాంత. మనోరమకు ఒక కుమారుడు. ఆమె నటించిన చివరి చిత్రం సింగం-2. మనోరమ నటించిన తెలుగు చిత్రాలు: ♦ శుభోదయం ♦ జెంటిల్‌మేన్ ♦ రిక్షావోడు ♦ పంజరం ♦ బావనచ్చాడు ♦ మనసున్నమారాజు ♦ అరుంధతి ♦ నీప్రేమకై ♦ కృష్ణార్జున