
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై : తమిళనాడులోని తిరువార్ జిల్లా మన్నార్‌గుడిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వివరాలు.. సింగారవేలు అనే వ్యక్తికి మన్నేనగర్‌లో బాణాసంచా తయారీ కర్మాగారం ఉంది. రోజువారీ దినచర్యలో భాగంగా బుధవారం కూడా సింగారవేలుతో సహా మరో ఏడుగురు కార్మికులు కర్మాగారానికి వచ్చారు. ఈ క్రమంలో బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వారు పనిచేస్తున్న భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో యజమాని సింగారవేలు సహా సురేష్, బాబు, మోహన్, వీరయ్యన్‌లతో పాటు మరో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు.
ప్రస్తుతం క్షతగాత్రులను మన్నార్‌గుడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా వేసవికాలం కావడంతో ఎండలు విజృంభిస్తుండటంతో కర్మాగారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవటం తమిళనాట ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment