బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌తో అసభ్యంగా... | Former Bigg Boss Contestant Sofia Hayat Befitting Reply | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 11 2018 11:53 AM | Last Updated on Mon, Jun 11 2018 3:24 PM

Former Bigg Boss Contestant Sofia Hayat Befitting Reply - Sakshi

నటి సోఫియా హయత్‌

నటి, బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ సోఫియా హయత్‌కు సోషల్‌ మీడియాలో మళ్లీ చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ వ్యక్తి ఆమెకు అసభ్య సందేశాలు పంపాడు.  తరచూ ఆమె చేసే పోస్టులు.. వాటికి కొందరు చేసే కామెంట్లు... ప్రతిగా ఆమె ఇచ్చే కౌంటర్‌... ఆ సంభాషణలంతా వెగటును పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ వ్యక్తికి  ఆమెకు మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో మాటల తుటాలు పేలాయి. 

సోఫియాపై అనుచిత కామెంట్‌.. ‘హాయ్‌ డియర్‌.. ఒక్క రాత్రికి నీ బుకింగ్‌ రేట్లు చెప్పగలవా?’ అంటూ ఓ వ్యక్తి ఆమె ఫోటోకు కామెంట్‌ చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సోఫియా‘ముందు మీ అమ్మను.. తర్వాత నీ చెల్లిని.. ఆ తర్వాత నీ భార్యను రేట్లు ఎంతో కనుక్కో.. తర్వాత నా రేటు చెప్తా’ అంటూ ఆమె బదులిచ్చారు. అయితే ఆ సంభాషణ అక్కడితో ఆగలేదు.  ‘వాళ్లేం నీలాగ మొత్తం విప్పుకుని తిరగట్లేదు. గో టూ హెల్‌’ అంటూ అతగాడు మళ్లీ బదులిచ్చాడు.

దానికి సోఫియా మళ్లీ బదులిస్తూ... ‘నిన్ను కనే సమయంలో మీ అమ్మ తన శరీరాన్ని చూపించే ఉంటుంది కదా. ఆ సంగతి నీకు ఎప్పుడూ చెప్పలేదా? ముందు నీ బుర్రను, ఆలోచల్ని సరిగ్గా ఉంచుకోరా..’ అంటూ ఆమె సమాధానమిచ్చారు. ఆ తర్వాత ఆ మాటల యుద్ధం మరింత ముదరటంతో ఆమె ఫ్యాన్స్‌ సాయం కోరింది. దీంతో ఆ వ్యక్తి తన చివరకు అకౌంట్‌ను డీ యాక్టివేట్‌ చేసేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement