మీ లిప్‌ సైజ్‌ ఎంత ?.. శ్రుతి హాసన్‌ స్ట్రాంగ్ కౌంటర్‌.. | Shruti Haasan Epic Reply To Who Asked Lip Size | Sakshi
Sakshi News home page

Shruti Haasan: మీ లిప్‌ సైజ్‌ ఎంత ?.. శ్రుతి హాసన్‌ స్ట్రాంగ్ కౌంటర్‌..

Published Fri, Apr 15 2022 9:19 PM | Last Updated on Fri, Apr 15 2022 9:20 PM

Shruti Haasan Epic Reply To Who Asked Lip Size - Sakshi

Shruti Haasan Epic Reply To Who Asked Lip Size: హీరోయిన్‌ శ‍్రుతి హాసన్‌ ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. తర్వాత కొన్ని రోజులు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ క్రాక్‌ మూవీతో మాసివ్‌ హిట్‌ అందుకుంది. ప్రస్తుతం సలార్‌, ఎన్‌బీకే 107, మెగా154 చిత్రాలతో ఫుల్‌ బిజిగా ఉంది. వరుస సినిమాలతో అలరిస్తూనే సోషల్‌ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్‌ ఫొటోలతో, సినిమా అప్‌డేట్‌లతో అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 'క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌' సెషన్‌ను నిర్వహించింది శ్రుతి హాసన్‌. ఈ సెషన్‌లో శ్రుతి హాసన్‌కు ఒక వింత ప్రశ్న ఎదురైంది. 

ఈ సెషన్‌లో ఓ నెటిజన్‌ శ్రుతి హాసన్‌ను 'మీ పెదాల సైజు ఎంత?' అని అడిగాడు. ఈ ప్రశ్నకు ధీటుగా స్పందించింది శ్రుతి హాసన్. 'లిప్‌ సైజ్‌ కూడా ఉంటుందా ?' అని నెటిజన్‌ను తిరిగి ప్రశ్నించింది. అలాగే 'నువ్వే కొలుచుకో' అని ఒక సెల్ఫీ ఫోటో కూడా పోస్ట్‌ చేసింది. శ్రుతి హాసన్‌ రిప్లైకి నెటిజన్‌కు నోటమాట రానుట్టుంది. శ్రుతి హాసన్‌ ఎపిక్‌ రిప్లై పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు. శ్రుతి హాస్‌ ఎప్పటిలానే తనకు ఎదురయ్యే పరిస్థితులకు చాలా కూల్‌గా సమాధానమిస్తూ ఉంటుంది. ఇంతకుముందు ట్రోలింగ్‌, బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నట్లు శ్రుతి హాసన్‌ చెప్పిన విషయం తెలిసిందే.  

చదవండి: భయంతోనే ఇండస్ట్రీకి వచ్చాను, ఐరన్‌ లెగ్‌ అన్నారు: శ్రుతి హాసన్‌



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement