Lip
-
ఎల్ఈడీ లిప్ మెషిన్
ఏ ఛాయలో ఉన్నా, ఏ వయసు వారైనా తమ పెదవులు మృదువుగా, చూడచక్కగా ఉండాలనే కోరుకుంటారు. అలాంటి వారికి చిత్రంలోని ఈ డివైస్ చాలా చక్కగా పని చేస్తుంది. ఈ ఎల్ఈడీ లిప్ మెషిన్ అధరాలను అందంగా మార్చేస్తుంది.పదవులపై ముడతలు, పగుళ్లు, గీతలు ఇలా అన్నింటినీ పోగొట్టి, ‘అధర’హో అన్నట్లుగా మెరిపిస్తుంది. ఈ మెషిన్ నాలుగు వేరువేరు మోడ్స్‌తో, 56 డీప్ పెనిట్రేటింగ్ ఎల్ఈడీ టెక్నాలజీతో యూజర్ ఫ్రెండ్లీగా ఉపయోగపడుతుంది. దీన్ని పెదవులకు ఆనించి, బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సుమారు 8 వారాల పాటు రోజుకు 3 నిమిషాలు ఈ లిప్ డివైస్‌తో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఈ మెషిన్ని మీ మేకప్ కిట్‌లో భాగం చేసుకుంటే పెదవులను అందంగా, సహజంగా దొండపండులా మలచుకోవచ్చు. సురక్షితమైన సిలికాన్ తో రూపొందిన ఈ డివైస్‌తో ఎలాంటి నొప్పి కలుగదు. వేడి తీవ్రత ఇబ్బందికరంగా ఉండదు. ఈ పరికరం కొలాజన్ ఉత్పత్తిని ప్రేరేపించడంతో పాటు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనితో ట్రీట్మెంట్ ఎవరికి వారు స్వయంగా చేసుకోవచ్చు. అయితే దీన్ని వినియోగించిన ప్రతిసారి పెదవులకు ఆనించే సిలికాన్ భాగాన్ని టిష్యూతో లేదా క్లాత్‌తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. డివైస్‌కి ముందే చార్జింగ్ పెట్టుకుని వైర్‌లెస్‌గా వాడుకోవచ్చు. చార్జింగ్ బేస్ వేరుగా, ట్రీట్మెంట్ వైబ్రేషన్ మసాజర్ వేరుగా ఉండటంతో వాడకం సులభంగా ఉంటుంది. -
దుపట్టా డ్యాన్స్... దుమ్ము రేపింది
సంజూ రాథోడ్ పాడిన మరాఠీ సాంగ్ ‘గులాబి శాదీ’ సూపర్ హిట్ కావడమే కాదు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ సాంగ్‌ను బేస్ చేసుకొని డ్యాన్సింగ్ నుంచి లిప్–సింకింగ్ వరకు సోషల్ మీడియా యూజర్లు రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఒక వీడియో వైరల్ అయింది.‘గ్రూమ్స్ ఫ్రెండ్స్ ఆన్ ఫైర్’ అనే కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 4.5 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. గులాబీ రంగు దుపట్టా వేసుకొని వరుడి ఫ్రెండ్స్ చేసిన డ్యాన్స్ ‘వారేవా’ అనేలా ఉంది. -
లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!
సెలబ్రెటీల దగ్గర నుంచి సాధారణ యువతీ యువకులు వరకు అందరూ అందం వెంట పరుగులు పెడుతున్నారు. అందుకోసం ఎలాంటి సర్జరీలైన చేయించుకునేందుకు అయినా వెనుకాడటం లేదు. తీరా అవి శరీరానికి పడక ఫైయిలై ప్రాణాల మీదకు తెచ్చకున్న సందర్భాలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అచ్చం అలాంటి ఘటనే యూకేలో ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. యూకేకి చెందిన 24 ఏళ్ల షౌన్నా హారిస్ అనే మహిళ తన పెదాలు అందంగా కనిపించేందుకు లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్ చేయించుకుంది. ఈ ట్రీట్మెంట్ని మొదటగా 18 ఏళ్ల వయసులో 0.51ఎంఎల్ లిప్ ఫిల్లర్ పొందింది. ఆ తర్వాత హారిస్ 24 ఏళ్ల వయసులో మరోక 1ఎంఎల్ ట్రీట్మెంట్ అందుకుంది. మొదటగా చేయించుకున్నప్పుడు బాగానే ఉంది. కానీ రెండోసారి అది తీవ్రమైన దుష్పరిణామాలకు దారితీసింది. సాధారణంగా ఈ ట్రీట్మెంట్ ఫెయిలైతే పెదాలు ఉబ్బడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆమెకు పెదాలు ఒక విధమైన మంటతో లావుగా అయ్యిపోవడమేగాక శ్వాస సంబంధ సమస్యలు, ముఖమంతా మంట, దద్దర్లు వంటి సమస్యలు ఉత్ఫన్నమయ్యాయి. ఆ బాధ తాళ్లలేక చనిపోతానేమో అనేంత భయానక నరకాన్ని అనుభవించింది. ఓ మూడు రోజుల వరకు బయటకు రాలేకపోయింది. వైద్యులు వెంటనే ఆమె పరిస్థితిని గమనించి చికిత్స చేయగా శ్వాస పీల్చుకోగలిగింది. ఆ సమస్యలు తగ్గుతాయా లేదా అనేది వైద్యలు వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఏదీ ఏమైనా దేవుడిచ్చిన అందం చాలు అనుకుంటే సమస్యలు ఉండవు. ఇలా అందం కోసం ఆర్రులు చాచి లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుని పడరాని పాట్లు పడుతుంటారు చాలామంది. అందం మాట దేవుడెరుగు అస్సలు బతుకుతామా అనే సందేహాలు తెప్పించే ఈ కాస్మోటిక్ సర్జరీల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకు చేస్తారంటే.. పెదాలు బొద్దుగా కనిపించేందుకు ఈ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మొదటగా 0.5ఎంఎల్ డెర్మల్ ఫిల్లర్ (సగం సిరంజి) తో ప్రారంభిస్తారు. రెండువారాల తర్వాత ఇంకాస్త లావుగా కావాలనుకుంటే మరోసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ తర్వాత పెదాల ఆకృతి శాశ్వతం ఉండిపోదు. ఆ లిప్ ఫిల్లర్లు సాధారణంగా 12 నుండి 18 నెలల వరకు ఉంటాయి. మన శరీరం శక్తి ఎంత వేగంగా బర్న్ చేసే దాన్న బట్టి వాటి సైజు తగ్గిపోవడం జరుగుతుంది. ఈ ట్రీటెమెంట్కు కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. అలాగే పెదాలు లావు తగ్గిపోయాక మళ్లీ వైద్యుడిని సంప్రదించి చేయించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో పెదాలకు ఇంజెక్షన్లు పడకపోతే శరీరంపై తీవ్ర దుష్పరిణామాలు చూపించే ప్రమాదం కూడా ఉంది. ఈ కాస్మోటిక్ సర్జరీలు ఎంత లగ్జరీయస్తో కూడికున్నవైనా.. తేడా కొడితే ప్రాణం మీదకు వస్తుందనే విషయం మరువద్దు. ఇక ఇక్కడ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్లో ఇచ్చే హైలురోనిడేస్ అనే ప్రోటీన్ ఎంజైమ్ ప్రతిచర్య ఫలితంగానే ఒక్కోసారి ఫెయిలై శరీరంపై పలు దుష్పరిణామాలు చూపిస్తుంది. ఇది పెదవుల్లో సాధారణంగా ఉండే హైలురోనిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేసి కావల్సినంత ఆకృతిలో పెదవులు ఉండేలా చేసుకునేందుకు ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. గతంలో ఇలానే యూఎస్‌కి చెందిన మహిళ ఇలాంటి శస్త్ర చికిత్స చేయించుకుని కార్టూన్ క్యారెక్టర్ మాదిరిగా ఫేస్ మారిపోయింది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ఆ బాధను వెల్లబోసుకుంది. ఈ లిప్ ఇంజెక్షన్ పడకపోతే మనిషి కోలుకోలేనివిధంగా ఆరోగ్యం దెబ్బతినడం, ముఖం వికృతంగా మారిపోవడం వంటివి జరుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. అసలు అవి పడతాయని నిర్థారించక గానీ ఆ ట్రీట్మెంట్ని చేయకూడదని చెబుతున్నారు. (చదవండి: ఐశ్వర్య అందమంతా చీరలోనే.. ధరెంతో తెలుసా?) -
మీ లిప్ సైజ్ ఎంత ?.. శ్రుతి హాసన్ స్ట్రాంగ్ కౌంటర్..
Shruti Haasan Epic Reply To Who Asked Lip Size: హీరోయిన్ శ్రుతి హాసన్ ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. తర్వాత కొన్ని రోజులు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ క్రాక్ మూవీతో మాసివ్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సలార్, ఎన్బీకే 107, మెగా154 చిత్రాలతో ఫుల్ బిజిగా ఉంది. వరుస సినిమాలతో అలరిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలతో, సినిమా అప్డేట్లతో అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 'క్వశ్చన్ అండ్ ఆన్సర్' సెషన్‌ను నిర్వహించింది శ్రుతి హాసన్. ఈ సెషన్లో శ్రుతి హాసన్‌కు ఒక వింత ప్రశ్న ఎదురైంది. ఈ సెషన్లో ఓ నెటిజన్ శ్రుతి హాసన్‌ను 'మీ పెదాల సైజు ఎంత?' అని అడిగాడు. ఈ ప్రశ్నకు ధీటుగా స్పందించింది శ్రుతి హాసన్. 'లిప్ సైజ్ కూడా ఉంటుందా ?' అని నెటిజన్ను తిరిగి ప్రశ్నించింది. అలాగే 'నువ్వే కొలుచుకో' అని ఒక సెల్ఫీ ఫోటో కూడా పోస్ట్ చేసింది. శ్రుతి హాసన్ రిప్లైకి నెటిజన్‌కు నోటమాట రానుట్టుంది. శ్రుతి హాసన్ ఎపిక్ రిప్లై పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు. శ్రుతి హాస్ ఎప్పటిలానే తనకు ఎదురయ్యే పరిస్థితులకు చాలా కూల్‌గా సమాధానమిస్తూ ఉంటుంది. ఇంతకుముందు ట్రోలింగ్, బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నట్లు శ్రుతి హాసన్ చెప్పిన విషయం తెలిసిందే. చదవండి: భయంతోనే ఇండస్ట్రీకి వచ్చాను, ఐరన్ లెగ్ అన్నారు: శ్రుతి హాసన్ -
Beauty Tips: పెదవులు ఎర్రగా, సహజ కాంతితో మెరవాలంటే.. ఇవి పాటిస్తే సరి!
అరిచేతులు, అరికాళ్లు, పెదాలపై చమట గ్రంథులు ఉండవనే విషయం అందరికీ తెలుసు. అలాగే సహజ నూనెలు ఉత్పత్తి చేసే సేబాషియస్ గ్రంథులు కూడా ఉండవు. అందుకే వాటి సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఐతే శరీరంలోని ఇతర భాగాలకంటే పెదవులు త్వరగా పొడిబారిపోతాయి. సూర్యరశ్మి నుంచి వెలువడే యూవీ కిరణాలు వల్ల పెదవులు త్వరగా పొడిబారి దెబ్బతింటాయి. అదరాలు ఎల్లప్పుడు తేమగా, ఆరోగ్యంగా ఉండాలంటే నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలు మీకోసం.. ►ఆరెంజ్ రసం కలిగిన లిప్‌బామ్ సూర్యుని నుంచి వెలువడే ప్రమాధకర కిరణాల నుంచి రక్షణ కల్పించి సహజ కండిషనింగ్‌లా పనిచేస్తుంది. ►పెదాలపై డెడ్ స్కిన్ పొరను తొలగించాలంటే వారానికి ఒకసారైనా టూత్ బ్రష్‌తో షుగర్ స్క్రబ్‌ను అప్లై చేయాలి. ►వెన్నను పెదాలపై రాయడం వల్ల ఎల్లప్పుడూ తేమగా, మృదువుగా కనిపిస్తాయి. ►విటమిన్లు పుష్కలంగా ఉండే పండ్లు ఆకుకూరలు తినాలి. అలాగే అధికంగా నీళ్లు తాగడం మంచిది. ►వేసవి వేడిలో పెదవులు నల్లగా మారతాయి. కాబట్టి మీ సహజమైన పెదాల రంగును కాపాడుకోవాలంటే.. కుంకుమపువ్వు, పెరుగును కలిపి రోజుకి 2, 3 సార్లు అప్లై చేస్తే, మీ పెదాల సహజ కాంతి చెక్కుచెదరదు. ►అర టీస్పూన్ గ్లిజరిన్, ఆముదం, నిమ్మరసం తీసుకుని, వీటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఇలా చేయడం ద్వారా పెదాలపై పేరుకుపోయిన ట్యాన్ తొలగిపోతుంది. ►రోజుకి 12 గ్లాసుల నీరు త్రాగడం వలన మీ శరీరం మాత్రమేకాకుండా పెదవులు హైడ్రేట్ అవుతాయి. చర్మం రక్త ప్రసరణను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది కూడా. చదవండి: Health Tips: జంక్‌ఫుడ్ తింటున్నారా? అల్జీమర్స్, డిప్రెషన్.. ఇంకా.. -
వినబడని ఆడియోలకు లిప్ రీడింగ్ టెక్నాలజీ..
లండన్: ఇక వీడియోలో మాటలు వినిపించకపోయినా నష్టం లేదని, లిప్ రీడింగ్ టెక్నాలజీతో తెలుసుకోవచ్చని అంటున్నారు ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయం అధ్యయనకారులు. వినికిడి లోపం ఉన్నవారికి విషయాలను కమ్యూనికేట్ చేయడంతోపాటు , నేర పరిశోధనకు ఈ కొత్త టెక్నాలజీ మరింత ప్రయోజనకరంగా ఉండేట్టుగా అభివృద్ధి చేసినట్లు చెప్తున్నారు. ధ్వని సరిగా వినిపించని సమయంలో సదరు వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు విజువల్ స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీ ని ఉపయోగించి మాటలను గుర్తించేందుకు ఈ కొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచినట్లు ప్రొఫెసర్ రిచర్డ్ హార్వే, డాక్టర్ హెలెన్ ఎల్ బీర్ లు చెప్తున్నారు. రికార్డు చేసిన ఆడియోలు, ధ్వని, మాటలు, సీసీ టీవీ ఫుటేజ్ లోని ఆధారాలు... సంభాషణలు సరిగా అర్థంకాని సమయంలో ఈ టెక్నాలజీ వినియోగించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. లిప్ రీడింగ్ టెక్నాలజీని మరింత అభివృద్ధి పరచి, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు దృశ్య సంభాషణ శాస్త్రంలో తాము మరింత పరశోధన జరుపుతున్నామని సైంటిస్టులు చెప్తున్నారు. శిక్షణా పద్ధతి ద్వారా మునుపటి లిప్ రీడింగ్ పద్ధతులను మెరుగు పరిచేందుకు తాము ప్రయత్నిస్తున్నామని డాక్టర్ బేర్ వివరించారు. సమర్థవంతంగా పెదాల కదలికలను చదివే వ్యవస్థ (లిప్ రీడింగ్) ను నేర పరిశోధన నుంచీ ఎంటర్ టైన్ మెంట్ వరకు ప్రతి విషయానికీ వినియోగించవచ్చని పరిశోధకులు తెలిపారు. పిచ్ లో ఉన్నపుడు ఫుడ్ బాల్ క్రీడాకారుల అరుపులు, సంభాషణ తదితర ధ్వనులను సులభంగా గుర్తించేందుకు ఇప్పటికే లిప్ రీడింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. అయితే కార్లు, ఎయిర్ క్రాఫ్ట్ కాక్ పిట్లు వంటి శబ్దాల స్థాయి ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో ఈ కొత్త టెక్నాలజీ అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. వినికిడి శక్తి లేనివారు వినియోగించే స్పీచ్ ఇంపెయిర్మెంట్స్ కు ప్రత్యామ్నాయంగా ఈ లిప్ రీడింగ్ టెక్నాలజీతో అత్యధిక ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్ బేర్ చెప్తున్నారు. పెదవుల కదలికల ద్వారా రూపాన్ని, ఆకారాన్ని గుర్తించడం అనేది పెద్ద సమస్యగా కనిపించినా ఓ క్రమ పద్ధతిలో ఈ మెషీన్ల కు పెదాల కదలికలు, ఆకారాన్ని బట్టి శిక్షణ ఇవ్వడం ద్వారా అది సాధ్యమౌతుందని హార్వే అన్నారు. ధ్వనిశాస్థ్రం, స్పీచ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ పై షాంఘై లో జరిగే అంతర్జాతీయ సదస్సులో తమ పరిశీలనలను సమర్పించనున్నారు. ఐఈఈఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అకౌస్టిక్స్ - స్పీచ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ 2016 జర్నల్ ప్రొసీడింగ్స్ లో పరిశోధనా వివరాలను ప్రచురించారు. -
'లిప్ టూ లిప్ కిస్ పెట్టబోయింది'
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌కు ఓ అమ్మాయి షాక్ ఇచ్చింది. ఓ కార్యక్రమానికి హాజరైన అతడి పెదాలపై ఓ అమ్మాయి బలవంతంగా ముద్దుపెట్టుకోబోయింది. దీంతో తొలుత అవాక్కయిన అతడు తర్వాత తేరుకుని ఆమెను తన చెంపలపై ముద్దు పెట్టేందుకు అనుమతించి అక్కడి నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయాడు. ఇప్పటికే తన పాప్ గీతాలతో హాలీవుడ్ ప్రపంచంలో యువకులను హుషారెత్తించే బీబర్ అంటే అక్కడి యువతకు మహా పిచ్చి. ఇతడు మంచి అందగాడు కావడంతో అమ్మాయిలు తెగ ఇష్టపడిపోతుంటారు. లాస్ ఎంజెల్స్‌లో తన ఫ్యాన్స్‌తో చిన్న కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో ఒకమ్మాయి బీబర్ ను ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. దీంతో దూరం జరిగిన ఆయన నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నావా? అయితే లిప్ టు లిప్ కుదరదు.. చెంపపై మాత్రం పెట్టవచ్చు అని చెప్పాడు. దీంతోపాటు తన అభిరుచులను ఫ్యాన్స్‌కు చెబుతూ తనకు కాటన్ క్యాండీ, తుల్సా ఐస్ క్రీంలు అంటే ఇష్టమని, ఓక్లామా తనకు ఇష్టమైన టూరింగ్ స్పాట్ అని తెలిపారు. -
లాలాజల ప్రళయం
ముద్దంటే చేదా? నీకా ఉద్దేశం లేదా? అన్న పాట సరే... కానీ పెదవితో పెదవి కలిపి అధరామృతాన్ని గ్రోలుతూ పెట్టుకునే ముద్దుతో వచ్చే ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు పరిశోధకులు. అధరామృతం అన్న మాటలో అది అమృతం ఎంతమాత్రం కాదని చెబుతున్నారు. మన నోట్లోనూ, గొంతులోనూ అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరో ఫేరింజియల్ బ్యాక్టీరియా అంటారు. ఒకసారి పెదవులతో పెదవులు కలిపి 10 సెకన్ల పాటు ముద్దు పెడితే ఒకరి నోట్లోంచి మరొకరి నోట్లోకి దూరిపోయే బ్యాక్టీరియా సంఖ్య అక్షరాలా ‘ఎనిమిది కోట్ల’ పైమాటే. ఈ బ్యాక్టీరియాతో ప్రమాదం ఉండదు గానీ ఒకవేళ ఎవరి నోట్లోనైనా ఎప్స్టీన్బార్ వైరస్ అనే తరహా సూక్ష్మక్రిమి ఉంటే దాని వల్ల ‘కిస్సింగ్ డిసీజ్’ వస్తుంది. దీన్నే వైద్యపరిభాషలో ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోసిస్ డిసీజ్ అని కూడా అంటారు. దీనికే ఫీఫర్స్ డిసీజ్ అనీ, ఫిలటోవ్స్ డిసీజ్ అని కూడా పేర్లున్నాయి. ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోసిస్ వ్యాధి వచ్చిన వారిలో లింఫ్ గ్రంథులు వాచి, జ్వరం వస్తుంది. ఈ జ్వరానికి ‘గ్లాండ్యులార్ ఫీవర్’ అని పేరు. ఈ మోనోన్యూక్లియోసిస్ డిసీజ్‌లో వ్యాప్తి చెందే వైరస్లు తెల్ల రక్తకణాల్లోని ఒక బి-లింఫోసైట్లో నివాసం ఏర్పరచుకున్న తర్వాత వచ్చిన వ్యాధి ఒక్కోసారి కొన్ని రకాల ప్రాణాంతక జబ్బులకు దారితీసే ప్రమాదం ఉంది. పైగా ముద్దు పెట్టుకునే వారిలో చాలామందికి ‘క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్’ అని నిత్యం అలసటగా ఉండే వ్యాధి కూడా రావచ్చు. అందుకే అధరామృతం బదిలీ అయ్యే గాఢమైన ముద్దులకు బదులు, పొడి పొడి ముద్దులే ముద్దు అంటున్నారు పరిశోధకులు.