'లిప్ టూ లిప్ కిస్ పెట్టబోయింది' | an attempts to kiss Bieber during surprise meet | Sakshi
Sakshi News home page

'లిప్ టూ లిప్ కిస్ పెట్టబోయింది'

Published Fri, Sep 4 2015 9:23 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

'లిప్ టూ లిప్ కిస్ పెట్టబోయింది'

'లిప్ టూ లిప్ కిస్ పెట్టబోయింది'

లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్కు ఓ అమ్మాయి షాక్ ఇచ్చింది. ఓ కార్యక్రమానికి హాజరైన అతడి పెదాలపై ఓ అమ్మాయి బలవంతంగా ముద్దుపెట్టుకోబోయింది. దీంతో తొలుత అవాక్కయిన అతడు తర్వాత తేరుకుని ఆమెను తన చెంపలపై ముద్దు పెట్టేందుకు అనుమతించి అక్కడి నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయాడు. ఇప్పటికే తన పాప్ గీతాలతో హాలీవుడ్ ప్రపంచంలో యువకులను హుషారెత్తించే బీబర్ అంటే అక్కడి యువతకు మహా పిచ్చి.

ఇతడు మంచి అందగాడు కావడంతో అమ్మాయిలు తెగ ఇష్టపడిపోతుంటారు. లాస్ ఎంజెల్స్లో తన ఫ్యాన్స్తో చిన్న కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో ఒకమ్మాయి బీబర్ ను ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. దీంతో దూరం జరిగిన ఆయన నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నావా? అయితే లిప్ టు లిప్ కుదరదు.. చెంపపై మాత్రం పెట్టవచ్చు అని చెప్పాడు. దీంతోపాటు తన అభిరుచులను ఫ్యాన్స్కు చెబుతూ తనకు కాటన్ క్యాండీ, తుల్సా ఐస్ క్రీంలు అంటే ఇష్టమని, ఓక్లామా తనకు ఇష్టమైన టూరింగ్ స్పాట్ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement