పాప్ స్టార్ మరోసారి మాట తప్పాడు..
లాస్ ఏంజెలిస్: పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ఈ ఏడాది మరోసారి మాటతప్పాడు. స్మోకింగ్ కు దూరంగా ఉంటానని బహిరంగంగానే ప్రకటించిన పాప్ సంచలనం బీబర్.. కొన్ని రోజులకే పొగతాగుతూ కెమెరాకు చిక్కి తొలిసారి మాట తప్పాడు. ఈ న్యూ ఇయర్ నుంచి స్మోక్ చేయనని నిర్ణయించుకున్నానని చెప్పిన కొద్ది రోజులకే.. జనవరి 9న సాయంకాలం ఓ హోటల్ బయట సిగరెట్ కాలుస్తూ కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే. మరోసారి తాను పదేపదే చెప్పిన మాట తప్పాడు బీబర్.
అభిమానులతో సెల్ఫీలు, ఫొటోలు దిగనని చెప్పిన బీబర్.. మే 10న ఓ హోటల్ మేనేజర్ తో సెల్ఫీలు దిగాడు. దీంతో రెండోసారి మాట తప్పినట్లయింది. బోస్టన్, మసాచుసెట్స్ లో హాయిగా పర్యటిస్తున్న బీబర్ గతంలో తానిచ్చిన నో సెల్ఫీ ప్రామిస్ కు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. మేనేజర్ తో సెల్ఫీ దిగడం, అది సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఫ్యాన్స్ తనను కలిసినప్పుడు కనీసం పలకరించరని, కేవలం ఫొటోలకు మాత్రమే ఫోజులిస్తారని కాస్త అప్ సెట్ అయ్యాడు. అయినా సరే అభిమానులు కోరడంతో సెల్ఫీలకు సై అంటున్న పాప్ స్టార్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.