పాస్‌పోర్టు మర్చిపోయిన పైలట్‌.. విమానం వెనక్కి.. | Pilot forgets passport United Airlines flight forced to divert | Sakshi
Sakshi News home page

ఇంట్లో పాస్‌పోర్టు మర్చిపోయిన పైలట్‌.. విమానం యూ–టర్న్‌

Published Wed, Mar 26 2025 1:01 PM | Last Updated on Wed, Mar 26 2025 1:25 PM

Pilot forgets passport United Airlines flight forced to divert

విమానంలో ప్రయాణించే ప్రయాణికులకే కాదు.. విమానం నడిపించే పైలట్‌కు కూడా పాస్‌పోర్టు ఉండాల్సిందే. లేకపోతే ఇబ్బందులు తప్పవు. అలాంటి ఇబ్బందే ప్రయాణికులకు అనుభవంలోకి వచ్చింది. ఎయిర్‌పోర్టు (Airport) నుంచి బయలుదేరిన విమానం పైలట్‌ పాస్‌పోర్టు (Passport) మర్చిపోవడంతో వెనక్కి మళ్లింది. అసలేం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అసలు విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. 

ఈ నెల 22వ తేదీన ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ (Los Angeles) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం 257 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం చైనాలోని షాంఘైకి బయలుదేరింది. టేకాఫ్‌ అయిన 2 గంటల తర్వాత పైలట్‌ వద్ద పాస్‌పోర్టు లేదని గుర్తించారు. అతడు పాస్‌పోర్టు ఇంట్లో మర్చిపోయి వచ్చాడు. దీంతో చేసేది లేక ఎయిర్‌పోర్టు అధికారుల ఆదేశాల మేరకు విమానాన్ని వెనక్కిమళ్లించాడు. యూ–టర్న్‌ తీసుకున్న విమానం సాయంత్రం 5 గంటలకు మళ్లీ లాస్‌ ఏంజెలెస్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది.

ప్రయాణికుల కోసం అధికారులు మరో విమానాన్ని, పైలట్‌ను సిద్ధం చేశారు. రాత్రి 9 గంటలకు అది టేకాఫ్‌ అయ్యింది. 12 గంటలు ప్రయాణించి ఎట్టకేలకు షాంఘైకి చేరుకుంది. పైలట్‌ వద్ద పాస్‌పోర్టు లేకపోవడంతో విమానాన్ని వెనక్కి మళ్లించిన సంగతి నిజమేనని యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ అధికార ప్రతినిధి నిర్ధారించారు. లాస్‌ ఏంజెలెస్‌లో ల్యాండైన వెంటనే ప్రయాణికులకు ఆహార కూపన్లు, పరిహారం అందించామని చెప్పారు. ఒక్కో కూపన్‌ విలువ 15 డాలర్లు (రూ.1,283) అని తెలిపారు.  

యూఎస్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ రాజీనామా
వాషింగ్టన్‌: డిపార్టుమెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ(డోజ్‌) చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌తో విభేదాల నేపథ్యంలో యూఎస్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ లూయిస్‌ డిజాయ్‌ రాజీనామా చేశారు. తన శాఖకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందివ్వాలన్న మస్క్‌ నిర్దేశాలను ఆయన ఖాతరు చేయలేదని ఇటీవల వార్తలు వచ్చాయి. నష్టాలను తగ్గించేందుకు యూఎస్‌ పోస్టల్‌ సర్వీస్‌ను ప్రైవేటీకరించాలని అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. ఈ విభాగాన్ని కామర్స్‌ విభాగంలో ఆధ్వర్యంలో ఉంచాలని ప్రకటించారు కూడా.

చ‌ద‌వండి: ట్రంప్ అనాలోచిత నిర్ణ‌యాలు.. అమెరికాకు భారీ షాక్ 

రిపబ్లికన్‌ పార్టీకి విరాళాలిచ్చే ప్రముఖుల్లో ఒకరైన లూయిస్‌ను ట్రంప్‌ మొదటి సారి అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు 2020లో యూఎస్‌పీఎస్‌ చీఫ్‌గా నియమించారు. డోజ్‌ సిఫారసుతోనే పోస్టల్‌ శాఖలో కనీసం 10 వేల మందిని తొలగించేందుకు ఈ నెల ప్రారంభంలోనే లూయిస్‌ అంగీకరించారు. ఇతర మార్పులను కాంగ్రెస్‌ ద్వారా చేయాలని ఆయన వాదిస్తున్నారు. ఈ విషయంలో మస్క్‌తో తలెత్తిన విభేదాల నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లుగా భావిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement