United Airlines Flight
-
నా కాస్ట్లీవిస్కీ మాయం: విమాన ప్రయాణికుడి ఆక్రోశం, ధర తెలిస్తే!
న్యూఢిల్లీ: విమాన ప్రయాణాల్లో అనుకోని ఉదంతాలు, సంఘటనలు ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేస్తాయి. లగేజీ మిస్ అవ్వడం, తారుమారు కావడం, ఒక్కోసారి బంగారం లాంటి ఇతర విలువైన సామాగ్రి మాయమై పోవడం లాంటి సంఘటలను విమాన ప్రయాణికులకు షాక ఇస్తూంటాయి. తాజాగా ఒక ప్రయాణికుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని నూటికి నూరుపాళ్లు నిర్ధారించుకుని పదిలంగా లగేజీలో పెట్టుకున్న ఖరీదైన విస్కీ బాటిల్ మూడింట ఒకవంతు ఖాళీ అవడం చూసి అవ్వాక్కయ్యాడో వ్యక్తి. దీనిపై సంబంధిత ఎయిర్‌లైన్‌కి ఫిర్యాదు చేయడంతోపాటు, తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నుంచి క్రిస్టోఫర్ ఆంబ్లర్ అనే ప్రయాణికుడు అందించిన వివరాల ప్రకారం చెక్-ఇన్ లగేజీలో ప్యాక్ చేసిన ఖరీదైన గ్లెన్మోరాంగీ 'ఎ టేల్ ఆఫ్ కేక్' విస్కీ బాటిల్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత బాటిల్ సీల్ తెరిచి ఉండటంతో షాక్ అయ్యాడు. అంతేకాదు మూడింట ఒక వంతు ఖాళీ అయిపోయింది. ఎలాంటి లీకేజీ కూడా లేదు. దీంతో హే..యునైటెడ్ ఎయిర్‌లైన్స్..మీ బ్యాగేజ్ హ్యాండ్లర్లు దొంగలు అంటూ ఫోటోతో సహా ఆంబ్లర్ ట్వీట్ చేశాడు. దీని ధర కెనడాలో (అమెజాన్) రూ. 45,556 అట. దీనిపై నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందించారు. కొందరు తమ అనుభావాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఈ ఘటనపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. తమ బ్యాగేజీ రిజల్యూషన్ సెంటర్లో రిపోర్ట్‌ను ఫైల్ చేయమని కోరింది. Hey @united - bottle of expensive scotch in checked bag. Arrived opened and a third gone. No leakage. It was sealed new when packed and seal broken by opening. Your baggage handlers are thieves. pic.twitter.com/UHzTLzF4Eu — Though it be not written down, I am an ass. (@TheDogberry) March 28, 2023 -
విమానంలో భారీగా మంటలు.. వీడియో వైరల్
-
విమానంలో భారీగా మంటలు.. వీడియో వైరల్
వాషింగ్టన్ : అమెరికాలో త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఇంజిన్‌లో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. విమానం నుంచి శకలాలు విరిగి నేలపైన పడ్డాయి. అయితే అప్రమత్తమైన పైలట్లు ఫ్లైట్‌ను సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బోయింగ్ 777-200 విమానం 231 మంది ప్రయాణికులు, 10మంది సిబ్బందితో హోనొలులు బయలుదేరింది. ఈ క్రమంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. విమానంలో మంటలు చెలరేగి శకలాలు విరిగిపడ్డాయి. బ్రూమ్‌ఫీల్డ్, కొలరాడోలోని పలు నివాస ప్రాంతాల్లో ఇంజిన్ కౌలింగ్, టర్ఫ్ ఫీల్డ్‌లోని భాగాలను అధికారులు గుర్తించారు. అలాగే విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరస్‌లా మారింది. విమానంలో మంటల ఘటనపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ స్పందించింది. విమాన సిబ్బంది చొరవతో ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొంది. ‘ డెన్వర్ విమానాశ్రయం నుంచి యూనైటెడ్ ఫ్లైట్ 328 విమానం టేకాప్ అయిన కొద్ది నిమిషాలకే ఇంజన్లో మంటలు చెలరేగాయి. పైలట్లు అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు.కారణాలు తెలుసుకునేందు ఎఫ్ఏఏ(FAA), ఎన్టీఎస్బీ(NTSB)తో విచారణ జరిపిస్తున్నాం’అని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ట్వీట్ చేసింది. -
విమానంలో వింత అనుభవం!
సిడ్నీ : ఏడుస్తున్న చిన్నపిల్లలను సముదాయించడం శక్తికి మించిన పని. ఇక ఏడాదిలోపు పసికందులైతే మరీ కష్టం. తన 8 నెలల బాబు, భర్తతో కలిసి సిడ్నీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు యునైటెడ్ ఎయిరెలైన్స్ ఫ్లైట్‌లో బయలు దేరిన ఫేస్బుక్ ఉద్యోగి కృపా బాలకు వింత అనుభవం ఎదురైంది. విమానంలో తన కొడుకు గుక్కపట్టి ఏడ్వడంతో బిజినెస్ క్లాస్ సీట్లో కూర్చున్న ఓ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో విమాన సహాయకుడు ఆమె దగ్గరకు వచ్చి చిన్నపిల్లను 5 నిమిషాల కంటే ఎక్కవ ఏడిస్తే అనుమతించమని తెలిపారు. ఈ వ్యాఖ్యలకు ఖంగుతిన్న ఆ ఫేస్బుక్ ఉద్యోగి.. ఇదెక్కడి నిబంధన అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్.. ఆ ఫ్లైట్ శాన్ ఫ్రాన్సిస్కో చేరుకోగానే క్షమాపణలు తెలియజేసింది. అంతేకాకుండా టికెట్స్‌ను రిఫండ్ చేసింది. కానీ ఈ ఘటన చిన్నపిల్లలతో విమానంలో ప్రయాణించడం ఎంత కష్టమో తెలియచేసింది. అటు తల్లి తండ్రులు, తోటి ప్రయాణీకులు, విమాన సిబ్బందికి ఇబ్బందే అని తెలిసింది. పిల్లలతో విమాన ప్రయాణం చేసేముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
విమానంలోకి ఇంత పెద్ద నెమలా?
న్యూజెర్సీ, అమెరికా : కుక్క, పిల్లి తదితర పెంపుడు జంతువులను యజమానులు తమతో పాటు ఊర్లకు తీసుకెళ్లడం మన అందరం చూశాం. నెమలిని పెంచుకుంటున్న ఓ మహిళ దాన్ని కూడా ఊరికి తీసుకెళ్దామని ఎంచక్కా ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చేసింది. ఇందుకోసం నెమలికి సైతం ప్రత్యేకంగా టికెట్‌ను కూడా తీసింది. ఈ ఘటన నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. అయితే, నెమలి విమానంలో ప్రయాణించేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థ ఒప్పుకోలేదు. గత నెలలో అమెరికాకు చెందిన విమానయాన సంస్థలు పెట్స్‌ను క్యారీ చేయడంపై కఠిన నిబంధనలు తీసుకొచ్చాయి. దీంతో నెమలికి కూడా ప్రత్యేకంగా టికెట్ తీసుకున్నానని, దయచేసి దాన్ని కూడా ప్రయాణించనివ్వాలన్న మహిళ అభ్యర్థనను ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు తోసిపుచ్చారు. దీంతో ‘ఎమోషనల్ సపోర్ట్ యానిమల్’ నిబంధనల ప్రకారం తన పక్షిని విమానంలో తీసుకెళ్లే హక్కుందని మహిళ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులతో వాదనకు దిగారు. ఈ సంఘటన మొత్తాన్ని చిత్రీకరించిన ఓ వ్యక్తి సదరు మహిళ, నెమలి ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీంతో అవి ఫోటోలు వైరల్ అయ్యాయి. ‘ఎమోషనల్ సపోర్ట్ ఎనిమల్’ షరతులతో నెమలి ప్రయాణించడం సాధ్యం కాదని ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. నెమలి ఆకారంలో, బరువులో నిబంధనలకు మించి ఉందని వెల్లడించారు. ఇదిలావుండగా అంతపెద్ద సైజు ఉన్న నెమలి విమాన సీట్లో ఎలా పడుతుందని?, టికెట్లో నెమలి పేరును ఏం రాశారని?, ఎమోషనల్ సపోర్ట్ పికాక్ ఎక్కడ దొరుకుతుందంటూ? నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
అమెరికా విమానంలో అనుకోని అతిథి!
అమెరికాలోని హ్యూస్టన్ నగరం నుంచి ఈక్వెడార్‌లోని క్విటో నగరానికి వెళ్లాల్సిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం మూడు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. విమానంలోకి ఒక అనుకోని అతిథి దూరడమే అందుకు కారణమని విమానయాన సంస్థ వర్గాలు తెలిపాయి. విషయం ఏమిటంటే.. విమానంలో కూర్చున్న ఒక ప్రయాణికుడి దుస్తుల మీదుగా ఓ తేలు పాక్కుంటూ వెళ్లింది. విమానంలో తేలు కనిపించడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా గగ్గోలు పెట్టారు. అదృష్టవశాత్తు అది విమానంలో ఉన్న ఎవరినీ కుట్టలేదు కాబట్టి సరిపోయింది. ఆ తేలు ఎక్కడుందో గుర్తించి, దాన్ని విమానం నుంచి కిందకు దించి మళ్లీ బయల్దేరడానికి మాత్రం మూడు గంటల సమయం పట్టింది. నిజానికి ఈ ఘటన జరిగే సమయానికి విమానం గేటు నుంచి కొద్ది దూరం వెళ్లింది. కానీ, తేలు విషయం తెలియగానే మళ్లీ దాన్ని వెనక్కి తీసుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికులందరినీ కిందకు దించేసి వాళ్లను వేరే విమానంలోకి ఎక్కించారు. ఇటీవలి కాలంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ తరచు వార్తల్లో నిలుస్తోంది. తమ కుందేలు చనిపోవడానికి ఈ సంస్థే కారణమంటూ దాని యజమానులు కేసు పెడతామని కూడా ఇటీవల హెచ్చరించారు. అంతకుముందు ఓ ప్రయాణికుడిని విమానంలోంచి లాక్కుంటూ తీసుకెళ్లిన వీడియో బయటకు వచ్చింది. ఏప్రిల్ 14న అయితే ఇదే విమానయాన సంస్థకు చెందిన ఓ విమానంలో హ్యూస్టన్లోనే ఓ ప్రయాణికుడిని తేలు కుట్టింది. -
పొరపాటున వేరే విమానమెక్కి..
న్యూయార్క్: అమెరికాలో ఒక విమానయాన సంస్థ తప్పిదంతో ఒక మహిళ దాదాపు 4,800 కిలోమీటర్లు తప్పు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. అమెరికాలోని నెవార్క్ నుంచి పారిస్ వెళ్లేందుకు ఏప్రిల్ 24న విమానమెక్కిన లూసీ చివరకు శాన్ఫ్రాన్సిస్కోలో దిగింది. అసలేం జరిగిందంటే.. చివరి నిమిషంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ పారిస్ వెళ్లే విమానం బోర్డింగ్ గేట్‌ను మార్చింది. మైక్ ద్వారా ప్రకటించినా.. లూసీకి ఇంగ్లిషు రాకపోవడంతో ఆ విషయం తెలియలేదు. బోర్డింగ్ సిబ్బంది కూడా టికెట్‌ను సరిగా చూడకుండా స్టాంప్ వేయడంతో ఆమె శాన్ఫ్రాన్సిస్కో వెళ్లే విమానం ఎక్కేసింది. తన సీటులో ఎవరో కూర్చోవడంతో విషయాన్ని సిబ్బందికి తెలిపింది. వారు కూడా టికెట్‌ను సరిగా పరిశీలించకుండా వేరే సీటును కేటాయించారు. దీంతో ప్యారిస్ బదులు శాన్ఫ్రాన్సిస్కో చేరుకోవడంతో పాటు అక్కడ 11 గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు అధికారులు క్షమాపణ చెప్పి ఆమెను గమ్యస్థానానికి చేర్చారు. -
2017లో టేకాఫ్... 2016లో ల్యాండింగ్!!
యునైటెడ్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులు న్యూ ఇయర్ రోజు వినూత్న అనుభూతిని పొందారు. తాము ప్రయాణించిన విమానం 2017లో బయలుదేరి చేరుకోవాల్సిన ప్రదేశాన్ని 2016లో చేరింది. ఇక వారి అనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. న్యూ ఇయర్ రోజు అది చేద్దాం.. ఇప్పటి నుంచి ఇలా ఉందాం అని కొందరు అనుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఆ రోజు తమకు ఎదురైన మంచి అనుభూతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. కొత్త ఏడాది బయలుదేరి పాత ఏడాదిలో అడుగుపెట్టడం విమాన ప్రయాణికులలో ఉత్సాహాన్ని నింపింది. ఈ విమాన జర్నీకి సంబంధించి ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఆ వివరాల ప్రకారం.. యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం యూఏ890 (బోయింగ్ 787-909) విమానం 2017 జనవరి 1వ తేదీన వేకువజామున చైనాలోని షాంఘైలో బయలుదేరింది. ఆ బోయింగ్ విమానం 2016 డిసెంబర్ 31న రాత్రి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకుంది. ఇది ఎలా సాధ్యమంటే.. ఈ రెండు ప్రాంతాల మధ్య టైమ్ వ్యత్యాసం దాదాపు 16 గంటలు. శాంఘై నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లడానికి దాదాపు 11 గంటల 5 నిమిషాలు పడుతుంది. టైమ్ వ్యత్యాసం గమనించినట్లయితే ఇది సాధ్యపడుతుందని చెప్పవచ్చు. ఎలా అంటే ఉదాహరణకు షాంఘైలో 2017 జనవరి 1న టైమ్ మధ్యాహ్నం 12 గంటలు అనుకుంటే.. సరిగ్గా అదే సమయంలో శాన్ ఫ్రాన్సిస్కోలో టైమ్ 2016 డిసెంబర్ 31 రాత్రి 8 గంటలు ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారి విపరీతంగా షేర్ అవుతోంది. ఏ సమయానికి షాంఘై నుంచి బయలుదేరి శాన్ ఫ్రాన్సిస్కో చేరుకుందన్న వివరాలు ఆ పోస్ట్ లో పేర్కొనలేదు. -
ఫ్లైట్‌లో జిహాద్ అంటూ కాక్ పీట్ వైపు దూసుకెళ్లి..
అలెగ్జాండ్రియా(వర్జీనియా): విమానం వెళుతుండగా జిహాద్ అంటూ అరుస్తూ కాక్‌పీట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తికి అమెరికా కోర్టు తొమ్మిది నెలల జైలు శిక్షను విధించింది. గత ఏడాది మార్చి 2015న 36 ఏళ్ల డేవిడ్ ప్యాట్రిక్ డియాజ్ అనే వ్యక్తి డల్లెస్ నుంచి డెన్వెర్కు బయలుదేరాడు. తొలుత అందరితోపాటు కుదురుగా కూర్చున్న అతడు ఫ్లైట్ బయలుదేరి గగనతలానికి వెళ్లిన కాసేపటికి జిహాద్ అంటూ బిగ్గరగా కేకలు పెడుతూ కాక్ పీట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన సిబ్బంది ఉన్నపలంగా అతడిని బంధించి తిరిగి విమానాన్ని వెనక్కితిప్పి వర్జీనియాలోని డల్లెస్ ఎయిర్ పోర్ట్ లో దింపేశారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు. అయితే, అతడి తరుపు న్యాయవాది అలెగ్జాండ్రియా కోర్టులో వాదిస్తూ అతడు ఆ సమయంలో మద్యం సేవించిన కారణంగా మానసికంగా బలహీనుడయ్యాడని అందుకే అలా ప్రవర్తించాడని చెప్పారు. అయితే, ఎయిర్ లైన్స్ తరుపు న్యాయవాది మాత్రం అతడికి కనీసం 21 నెలలు జైలు శిక్ష విధించాలని కోరారు. కాగా, న్యాయమూర్తి మాత్రం తొమ్మిది నెలల శిక్ష విధించడంతోపాటు 22 వేల డాలర్ల ఫైన్ వేశారు. -
విమానంలో ఓ ముద్దు... జైలు పాలు చేసింది !
న్యూయార్క్: ఆయన వయస్సు 62 ఏళ్లు... విమానంలో ప్రయాణిస్తూ... తన పక్కనే కూర్చుని నిద్రిస్తున్న మహిళకు ముద్దు పెట్టేశాడు. అక్కడితో ఆగకుండా... ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. దాంతో వెంటే నిద్ర నుంచి మొల్కొన్న సదరు మహిళ భయపడిపోయింది. వెంటనే ఆమె విమానంలోని సిబ్బంది వద్దకు వెళ్లి తోటి ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసింది. దాంతో విమానం ఎయిర్పోర్ట్ చేరగానే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటన అమెరికాలో హ్యూస్టన్ నుంచి నెవార్క్‌కు యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో వెళ్తుండగా చోటు చేసుకుంది. నిందితుడి ఎన్నారై దేవేందర్ సింగ్‌గా గుర్తించామని... అతడి స్వస్థలం ల్యూసియానా అని చెప్పారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో దేవేందర్ సింగ్‌కు రెండేళ్ల జైలు శిక్షతోపాటు 250,000 అమెరికన్ డాలర్లు జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు. నిందితుడు దేవేందర్ సింగ్‌ను కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
38 వేల అడుగుల నుంచి విమానం జారింది!
షికాగో: గాల్లో ప్రయాణిస్తున్న అమెరికా విమానం ఒక్కసారిగా 38 వేల అడుగుల నుంచి 11 వేల అడుగులకు జారి పోవడంతో ప్రయాణికులు తమ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకున్నారు. అంతేకాకుండా ఆకాశంలోనే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ కావడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురైనట్టు సమాచారం. అయితే పైలట్ చాకచక్యంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో 101 మంది ప్రయాణీకులు ఊపిరి తీసుకున్నారు. లాస్ ఎంజెలెస్ నుంచి షికాగోకు ప్రయాణిస్తున్న విమానం కేవలం 12 నిమిషాల్లో 38 వేల అడుగుల నుంచి 11 వేల అడుగులకు జారి పోయింది. దాంతో అత్యవసర ల్యాండింగ్ కోసం కాన్సస్ లోని విచితాకు విమానాన్ని మళ్లించారు. స్థానిక కాలమానం ప్రకారం నిన్న ఉదయం 10.30 నిమిషాలకు యునైటెడ్ ఎయిర్ లైన్స్ 1463 ఫ్లైట్ మిడ్ కాంటినెంట్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా దిగింది. అత్యవసరంగా ల్యాండింగ్ అయిన అనంతరం ఓ గంట తర్వాత ప్రయాణీకులను వేరే విమానంలో తరలించారు. ఈ ఘటన జరిగినపుడు 96 మంది ప్రయాణీకులు, ఐదుగురు విమాన సిబ్బంది విమానంలో ఉన్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. విమానం జారి పోవడానికి కారణమైన లోపాలపై నిపుణులు దృష్టి పెట్టారు.