న్యూఢిల్లీ: విమాన ప్రయాణాల్లో అనుకోని ఉదంతాలు, సంఘటనలు ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేస్తాయి. లగేజీ మిస్ అవ్వడం, తారుమారు కావడం, ఒక్కోసారి బంగారం లాంటి ఇతర విలువైన సామాగ్రి మాయమై పోవడం లాంటి సంఘటలను విమాన ప్రయాణికులకు షాక ఇస్తూంటాయి. తాజాగా ఒక ప్రయాణికుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని నూటికి నూరుపాళ్లు నిర్ధారించుకుని పదిలంగా లగేజీలో పెట్టుకున్న ఖరీదైన విస్కీ బాటిల్ మూడింట ఒకవంతు ఖాళీ అవడం చూసి అవ్వాక్కయ్యాడో వ్యక్తి. దీనిపై సంబంధిత ఎయిర్‌లైన్‌కి ఫిర్యాదు చేయడంతోపాటు, తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నుంచి క్రిస్టోఫర్ ఆంబ్లర్ అనే ప్రయాణికుడు అందించిన వివరాల ప్రకారం చెక్-ఇన్ లగేజీలో ప్యాక్ చేసిన ఖరీదైన గ్లెన్‌మోరాంగీ 'ఎ టేల్ ఆఫ్ కేక్' విస్కీ బాటిల్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత బాటిల్ సీల్ తెరిచి ఉండటంతో షాక్ అయ్యాడు. అంతేకాదు మూడింట ఒక వంతు ఖాళీ అయిపోయింది. ఎలాంటి లీకేజీ కూడా లేదు. దీంతో హే..యునైటెడ్ ఎయిర్‌లైన్స్..మీ బ్యాగేజ్ హ్యాండ్లర్లు దొంగలు అంటూ ఫోటోతో సహా ఆంబ్లర్ ట్వీట్ చేశాడు. దీని ధర కెనడాలో (అమెజాన్) రూ. 45,556 అట. దీనిపై నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందించారు. కొందరు తమ అనుభావాలను గుర్తు చేసుకున్నారు.
అయితే ఈ ఘటనపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. తమ బ్యాగేజీ రిజల్యూషన్ సెంటర్‌లో రిపోర్ట్‌ను ఫైల్ చేయమని కోరింది.
Hey @united - bottle of expensive scotch in checked bag. Arrived opened and a third gone. No leakage. It was sealed new when packed and seal broken by opening. Your baggage handlers are thieves. pic.twitter.com/UHzTLzF4Eu
— Though it be not written down, I am an ass. (@TheDogberry) March 28, 2023
Comments
Please login to add a commentAdd a comment