whisky bottle
-
రూ .50 కోట్ల విస్కీ బాటిల్
ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన మద్యం సీసా! ఆ ఏముందిలే... మహా అయితే దీని ధర రూ. వేలల్లోనో లేదా ఇంకా ఎక్కువనుకుంటే రూ. కొన్ని లక్షలు ఉండొచ్చనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్లే..!! ఎందుకంటే దీని ధర ఏకంగా రూ .50 కోట్లపైనే!! ఈ సీసాను 8,500 వజ్రాలు, 300 కెంపులతో పొదగడంతోపాటు వైట్ గోల్డ్‌తో మెరుగులు దిద్దారు. యూకేకు చెందిన ద లగ్జరీ బెవరేజ్ కంపెనీ... ఇసబెల్లా ఐలా ఒరిజినల్ విస్కీ పేరుతో ప్రీమియం సింగిల్ మాల్ట్ విస్కీని ఈ సీసాలో విక్రయిస్తోంది. పైగా దీన్ని ఓ అందమైన చిన్న పెట్టెలో భద్రపరిచి కొనుగోలుదారులకు అందిస్తోంది. -
నా కాస్ట్లీవిస్కీ మాయం: విమాన ప్రయాణికుడి ఆక్రోశం, ధర తెలిస్తే!
న్యూఢిల్లీ: విమాన ప్రయాణాల్లో అనుకోని ఉదంతాలు, సంఘటనలు ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేస్తాయి. లగేజీ మిస్ అవ్వడం, తారుమారు కావడం, ఒక్కోసారి బంగారం లాంటి ఇతర విలువైన సామాగ్రి మాయమై పోవడం లాంటి సంఘటలను విమాన ప్రయాణికులకు షాక ఇస్తూంటాయి. తాజాగా ఒక ప్రయాణికుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని నూటికి నూరుపాళ్లు నిర్ధారించుకుని పదిలంగా లగేజీలో పెట్టుకున్న ఖరీదైన విస్కీ బాటిల్ మూడింట ఒకవంతు ఖాళీ అవడం చూసి అవ్వాక్కయ్యాడో వ్యక్తి. దీనిపై సంబంధిత ఎయిర్‌లైన్‌కి ఫిర్యాదు చేయడంతోపాటు, తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నుంచి క్రిస్టోఫర్ ఆంబ్లర్ అనే ప్రయాణికుడు అందించిన వివరాల ప్రకారం చెక్-ఇన్ లగేజీలో ప్యాక్ చేసిన ఖరీదైన గ్లెన్మోరాంగీ 'ఎ టేల్ ఆఫ్ కేక్' విస్కీ బాటిల్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత బాటిల్ సీల్ తెరిచి ఉండటంతో షాక్ అయ్యాడు. అంతేకాదు మూడింట ఒక వంతు ఖాళీ అయిపోయింది. ఎలాంటి లీకేజీ కూడా లేదు. దీంతో హే..యునైటెడ్ ఎయిర్‌లైన్స్..మీ బ్యాగేజ్ హ్యాండ్లర్లు దొంగలు అంటూ ఫోటోతో సహా ఆంబ్లర్ ట్వీట్ చేశాడు. దీని ధర కెనడాలో (అమెజాన్) రూ. 45,556 అట. దీనిపై నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందించారు. కొందరు తమ అనుభావాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఈ ఘటనపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. తమ బ్యాగేజీ రిజల్యూషన్ సెంటర్లో రిపోర్ట్‌ను ఫైల్ చేయమని కోరింది. Hey @united - bottle of expensive scotch in checked bag. Arrived opened and a third gone. No leakage. It was sealed new when packed and seal broken by opening. Your baggage handlers are thieves. pic.twitter.com/UHzTLzF4Eu — Though it be not written down, I am an ass. (@TheDogberry) March 28, 2023 -
The Intrepid: బాప్రే.. మనిషి ఎత్తులో భారీ విస్కీ బాటిల్!
రికార్డుల కోసం రకరకాల ప్రయత్నాలు సాగుతుంటాయి. అలాంటిదే ఇది. ప్రపంచంలోనే ఇప్పటి వరకు భారీ విస్కీ బాటిల్‌ను తయారు చేసింది మాకల్లన్ కంపెనీ. 32 సంవత్సరాల కింద తయారుచేసిన ఈ బాటిల్ సామర్థ్యం 311 లీటర్లు. త్వరలోనే ఈ స్కాచ్ విస్కీ బాటిల్ వేలానికి రాబోతోంది. స్కాట్‌ల్యాండ్‌కు చెందిన మాకల్లన్ కంపెనీ ఈ భారీ స్కాచ్ విస్కీ బాటిల్‌ను తయారు చేసింది. ది ఇంట్రెపిడ్గా గుర్తింపు పొందిన ఈ బాటిల్ ఐదు అడుగుల 11 అంగులాల పొడవు ఉంది. అంటే సగటు మనిషి ఎత్తు(5.5 ఫీట్స్) కంటే ఎక్కువే!. ఈ కంపెనీ ఇదే పేరుతో తయారు చేసే 444 రెగ్యులర్ బాటిల్స్ కలిస్తే ఎంతో.. ఈ బాహుబలి విస్కీ బాటిల్ అంత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. స్కాట్‌ల్యాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌కు చెందిన ప్రముఖ ఆక్షన్ హౌజ్.. లైఆన్ అండ్ టర్న్‌బుల్ ఈ వేలంపాటను మే 25వ తేదీన నిర్వహించనుంది. ఇప్పటివరకు ప్రపంచంలో ఒక విస్కీబాటిల్ అత్యధికంగా 1.9 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో దాదాపు పద్నాలుగున్నర కోట్ల రూపాయల పైమాటే) అమ్ముడుపోయింది. ఈ రికార్డును ది ఇంట్రెపిడ్ బద్ధలు కొట్టే అవకాశం కనిపిస్తోంది. కిందటి ఏడాది గిన్నిస్ బుక్‌లో ఇంట్రెపిడ్కు చోటు దక్కింది. ఇప్పుడు వేలం ద్వారా మరో రికార్డుకు సిద్ధం అవుతున్నారు. వేలంపాటలో ప్రారంభ ధరనే 1.3 మిలియన్ పౌండ్లుగా అనుకుంటున్నారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తంలో.. 25 శాతాన్ని మేరీ క్యూరీ చారిటీకి ఇవ్వాలని భావిస్తున్నారు. నిజానికి ఈ బాటిల్‌ను రికార్డుల కోసం పదిలపర్చాలని సదరు కంపెనీ అనుకుంది. కానీ, ఒక మంచి పనికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు వేలానికి ముందుకు వచ్చింది. చదవండి: అక్కడేం లేదు.. అయినా నాలుగు కోట్లు! -
రూ 4.14 కోట్లు పలికిన విస్కీ బాటిల్! వేలంలో నమోదైన అరుదైన రికార్డ్
అరుదైన వస్తువులకు వేలం పాట వేయడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇలాంటి వేలం పాట చరిత్రలో అరుదైన ఘట్టం నమోదైంది. సింగిల్ మాల్ట్ విస్కీని దక్కించుకునేందుకు కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఓ వ్యక్తి వెనుకాడకపోవడంతో ఈ రికార్డు చోటు చేసుకుంది. కోట్ల రూపాయలు టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో ఉన్న డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాపులో జపాన్‌కి చెందిన లిక్కర్ తయారీ సంస్థ సుంటోరీ తయారు చేసిన ది యమజాకీ 55 ఇయర్స్ ఓల్డ్ విస్కీని వేలం పాటలో పెట్టారు. మొత్తం ఎనిమిది మంది ఈ అరుదైన విస్కీని సొంతం చేసుకునేందుకు పోటీ పడగా చివరకు చైనాకు చెందిన ఓ ప్రయాణికుడు రికార్డు స్థాయిలో 4,88,000 పౌండ్లు ఇండియన్ కరెన్సీలో రూ.4.14 కోట్లు చెల్లించి ఈ విస్కీని దక్కించుకున్నాడు. ఈ మేరకు ఎయిర్పోర్ట్ వరల్డ్ కథనం ప్రచురించింది. ఇవీ ప్రత్యేకతలు సుంటోరీ వ్యవస్థాపకుడు షింజిరో టోర్రి ఈ ది యమజాకి విస్కీని ప్రత్యేకంగా రూపొందించాడు. 1960లో మూడు అరుదైన రకాలకు చెందిన సింగిల్ మాల్ట్ విస్కీలను బ్లెండ్ చేసి యమజాకీ స్కాచ్‌ని తయారు చేశారని ఆ కంపెనీ చీఫ్ బ్లెండర్ షింజిరో ఫికియో తెలిపారు. ఇంకా ఈ స్కాచ్ గురించి ఆయన చెబుతూ.. ఇదొక అందమైన గ్రీకు శిల్పం వంటిదన్నారు. సుంటోరీ సంస్థ అరుదైన రకానికి చెందిన విస్కీని తయారు చేసి లిమిలెడ్‌గా మార్కెట్లోకి తెస్తుంది. ప్రత్యేకమైన వ్యక్తులకే వాటిని సరఫరా చేస్తూ ఉంటుంది. 2020లో కేవలం వంద విస్కీ బాటిల్స్‌ని మార్కెట్లో రిలీజ్ చేసింది. చదవండి: ఉద్యోగుల కోసం వేల కోట్ల ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసిన గూగుల్..! -
డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా? హీరోయిన్‌పై ట్రోలింగ్
Regina Cassandra Trolled For Promoting Whiskey: సాధారణంగా సెలబ్రిటీలు ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు యాడ్స్ చేస్తూ రెండు వైపులా సంపాదిస్తుంటారు. అయితే ఒక్కోసారి వాళ్లు చేసే ప్రమోషన్స్ వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా హీరోయిన్ రెజీనా కసాండ్రాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఓ కంపెనీ అల్కహాల్ను ప్రమోట్ చేస్తూ చేతిలో మందు గ్లాసు పట్టుకొని స్టైల్‌గా ఫోజిచ్చిన రెజీనా ఇన్‌స్టా పోస్ట్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా అంటూ ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. మధ్యపానం అనారోగ్యమని తెలిసినా డబ్బుల కోసం ఇలా ప్రమోట్ చేస్తారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో నెటిజన్ అయితే.. ఈ ఫోటో చూశాక మీ మీద గౌరవం పోయింది. ఇప్పుడే మిమ్మల్ని అన్‌ఫాలో అవుతున్నాను అంటూ కామెంట్ చేశారు. ఇక ఇటీవలె పొగాకు బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నందుకు అమితాబ్‌పై విమర్శలు రావడంతో ఆ యాడ్ నుంచి ఆయన తప్పుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) -
రూ.4 లక్షల విస్కీ బాటిల్ ఏమైనట్లు?
వాషింగ్టన్: అగ్రరాజ్యమైన అమెరికాను ప్రసన్నం చేసుకుని తమ సొంత పనులు, సొంత దేశ పనులు విజయవంతంగా పూర్తిచేసుకోవాలని చాలా ప్రపంచ దేశాల నేతలు ఉవ్విళ్లూరుతుంటారు. ఆ ఘన కార్యంలో భాగంగానే తమ దేశాలకు పర్యటన పేరిట విచ్చేసిన అగ్రరాజ్య ముఖ్యనేతలకు జ్ఞాపికలతో సత్కరిస్తాయి. ప్రత్యేక ‘కానుక’లతో మెప్పిస్తారు. అదే తరహాలో అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్నకాలంలో మైక్ పాంపియోకు ఒక ఖరీదైన విస్కీ బాటిల్‌ను జపాన్ ప్రభుత్వం 2019 జూన్ 24న బహూకరించినట్లు అమెరికా ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఆ విస్కీ బాటిల్ ఖరీదు దాదాపు రూ.4,32,085. ఖరీదైన బహుమానాలను ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తులు తమ సొంతానికి తమ వద్ద అట్టిపెట్టుకోవడానికి వీల్లేదు. అమెరికా చట్టాల ప్రకారం దాదాపు రూ.29వేలలోపు విలువైన వస్తువులనే అధికారులు/మంత్రులు తమ వద్ద ఉంచుకోవచ్చు. అంతకుమించి విలువైనవి అమెరికా ప్రభుత్వానికి చెందుతాయి. కనీసం ముట్టుకోలేదు ‘కనీసం నేను ఆ బాటిల్‌ను తాకనైనా తాకలేదు. ఎందుకంటే.. ఆ బాటిల్ సంగతే నాకు తెలియదు. నాకు ఎవరూ బహూకరించలేదు. అయినా, అంతటి ఖరీదైన బాటిల్‌ను స్వాధీనం చేసుకోవడంలో విదేశాంగ విభాగ సిబ్బంది ఎలా మిస్ చేస్తారు?’అని పాంపియో వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఆ తేదీన ఆయన జపాన్‌లో లేరని, సౌదీ అరేబియాకు వెళ్తున్నారని న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. బాటిల్‌ను ఎవరు మాయం చేశారనే దానిపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. -
విస్కీ బాటిల్ ఎక్కడుంది? విచారణ చేపట్టిన అమెరికా
వాషింగ్టన్: విస్కీ బాటిల్ కనిపించడం లేదని అమెరికా విచారణ చేపట్టింది. ఈ విస్కీ ఖరీదు 5800 డాలర్లు (రూ.4.30 లక్షలు) కాగా, దాన్ని 2019 లో అప్పటి విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోకు జపాన్ ప్రభుత్వం బహుకరించిందని ట్రెజరీ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఆ బాటిల్ అధికారిక లెక్కల్లో కనిపించడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని సంబంధిత అధికారులు మాయమైన ఆ విస్కీ బాటిల్ ఆచూకీ కోసం విచారణ చేపట్టారు. విదేశాంగ కార్యదర్శిగా పాంపియో పని చేస్తున్నప్పుడు జూన్ 24, 2019 న సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో జపాన్ అధికారులు అమెరికా విదేశాంగ శాఖకు బహుమతి ఇవ్వగా అది పాంపియో స్వీకరించాడా లేదా అనేది అస్పష్టంగా ఉందని టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే ఈ అంశంపై పాంపియో న్యాయవాది స్పందిస్తూ.. మిస్టర్ పాంపియోకి అప్పట్లో ఈ విస్కీ బాటిల్ అందుకున్న జ్ఞాపకం లేదు, అలానే ఆ బాటిల్ ఎలా మాయమైందనేది కూడా తనకు తెలియదని వెల్లడించారు. ప్రభుత్వ అధీనంలో ఉండే ఒక వస్తువు మాయంకావడంతో ఈ వార్త అక్కడ వైరల్‌గా మారింది. -
రూ. కోటి పెట్టి కొన్న విస్కీ.. కానీ తాగలేరు
బోస్టన్/వాషింగ్టన్: వస్తువులు, దుస్తులు, ఇతరాత్ర ఏవి తీసుకున్న ఎంత పాతవైతే అంత తక్కువ ధర పలుకుతాయి. కానీ మద్యం విషయంలో మాత్రం ఇది రివర్స్‌లో జరుగుతుంది. ఏళ్ల నాటి మద్యం ఖరీదు ఎక్కువ చేస్తుంది. గతంలో ఓ వైన్ బాటిల్ ఏడు కోట్లు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ విస్కీ బాటిల్ కూడా ఇదే రేంజ్లో భారీ ధర పలికింది. ఒక్క విస్కీ బాటిల్ కోసం ఏకంగా కోటి రూపాయలకు పైగా చెల్లించారు. అంత ఖరీదు ఎందుకు.. దాన్నేమైన స్వర్గం నుంచి తీసుకువచ్చారా ఏంటి అని భావిస్తే.. తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ విస్కీ బాటిల్ చాలా పురాతనమైనది. దాదాపు 250 ఏళ్ల క్రితం నాటిది కావడంతో ఈ విస్కీ బాటిల్ ఇంత ధర పలికింది. అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత ఖరీదు పెట్టి కొన్న విస్కీని తాగలేరు. ఎందుకో తెలియాలంటే ఇది చదవండి.. వేలం పాట నిర్వహించే అమెరికా బోస్టన్‌కు చెందిన హౌస్ స్కిన్నర్ ఇంక్. అనే కంపెనీ ఈ విస్కీ బాటిల్‌ని వేలం వేసింది. ఇక దీని ధర 20-40 వేల డాలర్ల మధ్య అమ్ముడవుతుందని భావించింది. కానీ అది అనూహ్యంగా అంతకు ఆరింతలు పలికింది. ఈ ఏడాది జూన్ 30న ముగిసిన వేలంలో ఈ బాటిల్‌ను మిడ్‌టౌన్ మాన్హాటన్లోని మ్యూజియం, పరిశోధనా సంస్థ ది మోర్గాన్ లైబ్రరీకి 1,37,500 డాలర్లకు (1,02,63,019 రూపాయలకు) విక్రయించారు. విస్కీ బాటిల్ చరిత్ర ఏంటి.. డెయిలీ మెయిల్ కథనం ప్రకారం... ఇంగ్లెడ్యూ విస్కీని 1860లో బాటిల్లో నింపారు. ఆ తర్వాత దీన్ని మోర్గాన్ లైబ్రరీకి అమ్మారు. ఆ కాలపు ప్రసిద్ధ ఫైనాన్షియర్ జాన్ పియర్ పాయింట్ మోర్గాన్ ఈ విస్కీ బాటిల్‌ను కొనుగోలు చేశారు. సీసా వెనుక భాగంలో ఉన్న లేబుల్ మీద ఇలా ఉంది ‘ఈ బౌర్బన్ బహుశా 1865 కి ముందే తయారు చేసి ఉండవచ్చు. ఇది మిస్టర్ జాన్ పియర్‌పాయింట్ మోర్గాన్ గదిలో ఉంది. అతని మరణం తరువాత ఆయన ఎస్టేట్ నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నాం’’ అని ఉంది. నిపుణలు ప్రకారం జేపీ మోర్గాన్ ఈ బాటిల్‌ని 1900 లలో జార్జియా పర్యటనలో కొన్నారని నిపుణులు భావిస్తున్నారు. ఆయన తరువాత బాటిల్ మోర్గాన్ కొడుకుకు చేరింది. అతను దానిని 1942 -1944 మధ్య దక్షిణ కెరొలిన గవర్నర్ జేమ్స్ బైర్నెస్‌కు ఇచ్చాడు. జేమ్స్ బైర్నెస్ ఆ బాటిల్‌ని తెరకుండా అలానే ఉంచాడు. 1955 లో పదవీవిరమణ చేసిన తరువాత బైర్నెస్ తెరవని బాటిల్‌ని స్నేహితుడు, ఆంగ్ల నావికాదళ అధికారి ఫ్రాన్సిస్ డ్రేక్‌కు పంపాడు. అతను దానిని మూడు తరాల పాటు భద్రంగా దాచాడు. ఈ విస్కీ దాదాపు రెండు శతాబ్దాల క్రితం తయారు చేసినది కావున దీన్ని తాగేందుకు కుదరదు. సాధారణంగా మూత తెరవకుండా ఉంటే విస్కీ పది సంవత్సారాల పాటు అలానే ఉంటుంది. అప్పుడు కూడా దాన్ని తాగలేం. -
మా మంచి ఎమ్మెల్సీనే: కరోనా కిట్‌తో విస్కీ మందు
సాక్షి, మహబూబాబాద్ : లీడరా.. మజాకా! ఈ ఎమ్మెల్సీ రూటే సెపరేటు. కరోనా కష్టకాలంలో ప్రజలకు కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన సాయం చేస్తున్నారు కదా! అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాత్రం మరో అడుగు ముందుకేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించినవారికి కిట్బ్యాగులను పంపించారు. అయితే ఇందులో విశేషమేముందని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జెడ్పీ, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లకు ‘ఇంట్లోనే ఉందాం.. క్షేమంగా ఉందాం’ అనే నినాదంతోపాటు శ్రీనివాస్‌రెడ్డి ఫొటోతో ఉన్న కిట్‌బ్యాగ్‌ను గురువారం ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పంపిణీ చేశారు. మెడికల్ కిట్లు అనగానే శానిటైజర్, మాస్కులు, పల్స్ ఆక్సీమీటర్.. మహా అయితే డ్రైఫ్రూట్స్ ఉంటాయని అంతా భావించారు. కానీ, ఆ ప్యాక్ తెరిచి చూసినవారు అవాక్కయ్యారు. ఎందుకంటారా?! పైన చెప్పినవే కాకుండా ఆ ప్యాక్‌లో టీచర్స్ విస్కీ బాటిల్ కూడా ఉంది మరి! దీంతో ప్యాక్ తీసుకున్న వారందరూ ‘మా మంచి లీడర్’ అంటూ మురిసిపోతూ ఇళ్లకు బయలుదేరారు. -
వందేళ్ల నాటి గోడలో.. 66 విస్కీ బాటిల్స్
వాషింగ్టన్: సాధారణంగా వందల ఏళ్ల క్రితం నాటి కట్టడాల పట్ల ఓ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే పూర్వం అక్కడ ఏమైనా విలువైన వస్తువులు, నిధి నిక్షేపాలు వంటివి దాచారేమోననే అనుమానం ఉంటుంది. వాటిని వెలికి తీయడం కోసం చాలా మంది రహస్యంగా తవ్వకాలు జరుపుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథనం కూడా ఇలాంటిదే. అయితే తవ్వకాలు జరిపింది నిషేధిత ప్రాంతంలో కాదు. సొంత ఇంట్లోనే. ఇక గోడలో వెలుగు చూసిన వస్తువులను చూసి ఆ దంపతులు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు. తమకు లభించిన వస్తువులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అవి తెగ వైరలవుతున్నాయి. ఇంతకు వారికి గోడలో ఏం కనిపించాయి అంటే 66 విస్కీ బాటిళ్లు. అవును అది కూడా స్మగుల్డ్ బాటిల్స్. వివరాలు.. న్యూయార్క్‌కు చెందిన దంపతులు నిక్ డ్రమ్మండ్, పాట్రిక్ బక్కర్ పోయిన నేలలో వారి కొత్త ఇంటికి మారారు. అయితే అక్కడ ఇంటి గోడలో తమకు మద్య నిషేద యుగం కాలానికి చెందిన విస్కీ బాటిళ్లు లభ్యమవుతాయని వారు కలలో కూడా ఊహించలేదు. ఈ సంఘటన ఈ ఏడాది అక్టోబర్‌లో చోటు చేసుకుంది. నిక్ డ్రమ్మండ్ దంపతులు ఈ ఇంటిని ఓ నటోరియస్ స్మగ్లర్ దగ్గర నుంచి కొనుగోలు చేశారు. వందేళ్ల నాటి ఇల్లు కావడంతో మరమత్తులు చేపించాలని భావించారు. ఆ క్రమంలో క్షీణించిన ఇంటి గోడలను బాగు చేసేందుకు గాను తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో వారికి వరుసగా విస్కీ బాటిళ్లు దర్శనమిచ్చాయి. వీటిని చూసిన వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని తమకు దక్కిన అదృష్టాన్ని తలచుకుని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం అవి తెగ వైరలవుతున్నాయి. (చదవండి: 10 లాటరీలు ఒకేసారి తగిలాయా, ఏంటి? ) View this post on Instagram A post shared by Nick Drummond (@bootleggerbungalow) ‘మా ఇంటిని మద్యంతో నిర్మించారు’ అనే క్యాప్షన్‌తో ఫోటోలని ఫేర్ చేశాడు నిక్. ఇక విస్కీ బాటిళ్లు మధ్యనిషేధం నడిచిన 1920 కాలానికి చెందినవి. వాటి మీద తయారీ తేదీ అక్టోబర్ 23, 1923గా ఉంది. ఇక మొత్తం 66 బాటిళ్లలో 13 ఫుల్‌గా ఉండగా.. 9 మంచి పరిస్థితిలో ఉన్నాయి.. నాలుగు పూర్తిగా క్షీణించాయి. ఇక కొన్నింటిలో విస్కీ సగమే ఉంది. ఇన్నేళ్లు గోడలోపల ఉండటంతో ఆవిరి అయి ఉండవచ్చు అన్నాడు నిక్. ఈ ఫోటోలు చేసిన నెటిజనులు ‘మీరు ఆ విస్కీని ట్రై చేశారా’.. ‘వేలం వేసే ఆలోచన ఉంటే చెప్పండి.. నేను కొంటాను’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన మద్యం ప్రియులు మాత్రం ‘అదృష్టం అంటే నీదే పో’ అంటూ ఈర్షపడుతున్నారు. -
విస్కీ బాటిళ్లు, చిప్స్.. విశ్రాంతి కావాలి
న్యూఢిల్లీ: గురువారం దేశ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎమ్హెచ్ఏ) ఫేస్బుక్ పేజిలో దర్శనమిచ్చిన ఓ ఫోటోపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజనులయితే కేంద్ర ప్రభుత్వాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఇన్ని విమర్శలు మూటగట్టుకోవడానికి ఆ ఫోటోలో ఏముందబ్బా అని చూస్తే.. రెండు విస్కీ బాటిళ్లు, పక్కనే స్నాక్స్ ప్లేట్ ఉన్నాయి. ఇంకా దారుణం ఏంటంటే.. ‘తుఫానుతో దెబ్బతిన్న బెంగాల్లో చేపట్టిన సహాయక చర్యలు’ అనే పోస్ట్‌లో ఈ విస్కీ బాటిళ్ల ఫోటో దర్శనమిచ్చింది. ఇంకేముంది.. ఇది చూసిన నెటిజనులు విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘ప్రతి ఒక్కరికి విశ్రాంతి కావాలి. అందుకు నిదర్శనం ఈ ఫోటో’.. ‘ఏంటి ఇదంతా.. ఎవరు బాధ్యత వహించాలి’.. ‘కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్ చేశారు నెటిజనులు. 15 నిమిషాల తర్వాత ఈ ఫోటోను తొలగించారు. ఈ సందర్భంగా హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘అనుకోకుండా జరిగిన తప్పిదం ఇది. ఈ రోజు ఓ జూనియర్ ఉద్యోగి ఈ పేజిని ఆపరేట్ చేశాడు. అయితే తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేయాల్సిన ఫోటోను.. పొరపాటున ఎమ్హెచ్ఏ అకౌంట్లో పోస్ట్ చేశాడు. మా దృష్టికి రావడంతో వెంటనే దాన్ని తొలగించాము. సదరు ఉద్యోగి రాతపూర్వకంగా క్షమాపణలు కూడా తెలిపాడు’ అన్నారు. ఎమ్హెచ్ఏ ఫేస్బుక్ పేజిని 2.79 లక్షలకు పైగా ప్రజలు అనుసరిస్తున్నారు. -
ట్రంప్ విస్కీ బాటిల్ అ‘ధర’హో!
లండన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆయన బ్రాండ్ ఇమేజ్ అమాంతంగా పెరిగింది. ఆయన పేరుతో తయారైన విస్కీ బాటిల్ అత్యధిక ధరకు అమ్ముడుపోవడమే ఇందుకు నిదర్శనం. 2012లో ట్రంప్ పేరుతో తయారైన విస్కీ బాటిల్‌ను స్కాట్లాండ్లోని గ్లాస్గోలో మెక్ టియర్స్ సంస్థ వేలం వేసింది. కెనడాకు చెందిన ఓ వ్యక్తి దీనిని ఏకంగా ఆరు వేల పౌండ్లు (దాదాపు రూ.5 లక్షలు) చెల్లించి సొంతం చేసుకున్నాడు. వేలం నిర్వాహకుల అంచనా ధర కంటే రెండింతలు ఎక్కువ ధర పలకడం విశేషం. ఆబర్దీన్ షైర్ ప్రాంతంలో 2012లో ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ లింక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా గ్లెన్ డ్రోనార్క్ సంస్థ పరిమిత సంఖ్యలో ఈ విస్కీ బాటిళ్లను తయారు చేసింది. బాటిల్ కవర్ పై ట్రంప్ సంతకం కూడా ఉంది. ‘గ్లెన్ డ్రోనార్క్ తయారు చేసే సింగిల్ మాల్ట్ విస్కీ అద్భుతంగా ఉంటుంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆయన పేరుతో తయారుచేసిన విస్కీ బాటిల్ కు రికార్డు ధర వచ్చింద’ని విస్కీ నిపుణుడు లారీ బ్లాక్ పేర్కొన్నారు. ఆబర్దీన్ షైర్, టర్న్ బెరీ ప్రాంతాల్లో ట్రంప్ కు గోల్ఫ్ కోర్టులు ఉన్నాయి. -
తాగేసి సెట్లో చిందులు...
సోనమ్ కపూర్... పూటుగా తాగేసి సెట్టంతా చిందులు తొక్కారట. అనిల్‌కపూర్ లాంటి సూపర్‌స్టార్ కూతురయ్యుండి... ఇంత చౌకబారుగా ప్రవర్తిస్తుందా? అని లొకేషన్లో అందరూ చెవులు కొరుక్కున్నారు. అయితే, ఇక్కడ ట్విస్టు వేరే ఉంది. ఏమిటంటే, ఈ ముద్దుగుమ్మ ‘డాలీ కి డాలీ’ అనే సినిమా చేస్తున్నారు. అభిషేక్ డోగ్రా దర్శకుడు. సల్మాన్ సోదరుడు అర్బాజ్‌ఖాన్ నిర్మాత. ఈ సినిమాలో కథ రీత్యా సోనమ్ తాగి తూలుతూ పాడే ఓ పాట ఉంది. ఆ పాట షూటింగ్ నిమిత్తం నిజమైన విస్కీ బాటిల్‌ని తెప్పించారు దర్శకుడు. పాట షూటింగ్ ప్రశాంతంగా జరిగిపోయింది. అయితే... షూటింగ్ పూర్తయ్యాక కూడా సోనమ్ ప్రవర్తనలో మార్పు లేదు. అది గమనించిన కొందరు... ‘ఇంకా పాత్ర నుంచి బయటకు రాలేదనుకుంట’ అనుకున్నారు. ఇంకేముంది! ఎవరికి తోచినట్లు వారు మాట్లాడటం మొదలుపెట్టారు. పరిస్థితి చూసి అర్బాజ్‌ఖాన్ కంగారు పడుతుండగా, అసలు విషయాన్ని అప్పుడు బయటపెట్టారు సోనమ్. కాసేపు అందర్నీ ఫూల్స్ చేయాలనిపించి అలా నటించినట్లు చెప్పింది. ఆమె చెప్పేది నిజమని సెట్లో చాలామంది నమ్మలేకపోయారు. అంత గొప్పగా నటించారట సోనమ్. ఎంతైనా గొప్ప నటుడి కూతురు కదా!