రూ .50 కోట్ల విస్కీ బాటిల్‌ | A bottle of whiskey worth Rs 50 crore | Sakshi
Sakshi News home page

రూ .50 కోట్ల విస్కీ బాటిల్‌

Published Wed, Oct 4 2023 3:53 AM | Last Updated on Wed, Oct 4 2023 5:34 AM

A bottle of whiskey worth Rs 50 crore - Sakshi

ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన మద్యం సీసా! ఆ ఏముందిలే... మహా అయితే దీని ధర రూ. వేలల్లోనో లేదా ఇంకా ఎక్కువనుకుంటే రూ. కొన్ని లక్షలు ఉండొచ్చనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్లే..!! ఎందుకంటే దీని ధర ఏకంగా రూ .50 కోట్లపైనే!! ఈ సీసాను 8,500 వజ్రాలు, 300 కెంపులతో పొదగడంతోపాటు వైట్‌ గోల్డ్‌తో మెరుగులు దిద్దారు. యూకేకు చెందిన ద లగ్జరీ బెవరేజ్‌ కంపెనీ... ఇసబెల్లా ఐలా ఒరిజినల్‌ విస్కీ పేరుతో ప్రీమియం సింగిల్‌ మాల్ట్‌ విస్కీని ఈ సీసాలో విక్రయిస్తోంది. పైగా దీన్ని ఓ అందమైన చిన్న పెట్టెలో భద్రపరిచి కొనుగోలుదారులకు అందిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement