rubi
-
అరుదైన పెన్ను రూ.66.6 కోట్లు! ప్రపంచంలో అత్యంత ఖరీదైన కలం ఇదే..
World's most expensive pen: ప్రపంచ వ్యాప్తంగా అరుదైన వస్తువులను వేలం వేస్తుంటారు. ఆయా వస్తువులు కోట్లాది రూపాయలు పలకడం గురించి వింటుంటాం. ఇలాగే ఓ అరుదైన పెన్నును వేలం వేయగా 8 మిలియన్ డాలర్లు (రూ.66.6 కోట్లు) పలికింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. టిబాల్డి కంపెనీ తయారు చేసిన ఈ పెన్ను పేరు ‘ఫుల్గోర్ నోక్టర్నస్’. ఇది లాటిన్ పేరు. దీనికి అర్థం నైట్ గ్లో. నల్ల వజ్రాలు పొదిగిన ఈ అసాధారణ ఫౌంటెన్ పెన్‌కి ఇది సముచితమైన పేరు. 123 కెంపులు, 945 నల్ల వజ్రాలు, బంగారం అసాధారణమైన ఫుల్గోర్ నోక్టర్నస్ పెన్ నిర్మాణం, డిజైన్ ఫై రేషియోలో ఉంటాయి. దీన్ని దైవిక నిష్పత్తిగా పేర్కొంటారు. ఫుల్గోర్ నోక్టర్నస్ బాడీ, క్యాప్‌పై నల్ల వజ్రాలు విలాసంగా పొదిగి ఉంటాయి. అలాగే అద్భుతమైన బ్లడ్ రెడ్ కెంపులు పెన్ను క్యాప్‌ని అలంకరించి ఉంటాయి. మొత్తంగా ఇందులో 945 నల్ల వజ్రాలు, 123 కెంపులు పొదిగారు. 18-క్యారెట్ల బంగారంతో దాని నిబ్‌ను తయారు చేశారు. అత్యంత ఖరీదైన పెన్ను ఈ పెన్నును ప్రత్యేక ఉంచేది దాని దైవిక ఫై నిష్పత్తి. ఈ పెన్నును క్యాప్తొ మూసేసినప్పుడు అవి 1.618 ఫై నిష్పత్తిలో ఉంటాయి. ఇలాంటి పెన్ను మరొకటి లేదు. 2020లో ఫుల్గోర్ నోక్టర్నస్ పెన్ను షాంఘైలో వేలం వేయగా అది 8 మిలియన్ డాలర్లు పలికింది. ఇంతవరకూ ఏ పెన్ను కూడా ఈ స్థాయిలో ధర పలకలేదు. దీంతో ఇదే ప్రపంచ అత్యంత ఖరీదైన పెన్నుగా నిలిచింది. ఇదీ చదవండి: Dr Ranjan Pai: నాడు అద్దె ఇల్లు.. నేడు 6 యూనివర్సిటీలు, 28 ఆస్పత్రులు -
రూ .50 కోట్ల విస్కీ బాటిల్
ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన మద్యం సీసా! ఆ ఏముందిలే... మహా అయితే దీని ధర రూ. వేలల్లోనో లేదా ఇంకా ఎక్కువనుకుంటే రూ. కొన్ని లక్షలు ఉండొచ్చనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్లే..!! ఎందుకంటే దీని ధర ఏకంగా రూ .50 కోట్లపైనే!! ఈ సీసాను 8,500 వజ్రాలు, 300 కెంపులతో పొదగడంతోపాటు వైట్ గోల్డ్‌తో మెరుగులు దిద్దారు. యూకేకు చెందిన ద లగ్జరీ బెవరేజ్ కంపెనీ... ఇసబెల్లా ఐలా ఒరిజినల్ విస్కీ పేరుతో ప్రీమియం సింగిల్ మాల్ట్ విస్కీని ఈ సీసాలో విక్రయిస్తోంది. పైగా దీన్ని ఓ అందమైన చిన్న పెట్టెలో భద్రపరిచి కొనుగోలుదారులకు అందిస్తోంది. -
రొమ్ములు కోసి.. పళ్లు రాలగొట్టారు!
మహారాష్ట్రలో వ్యభిచారం చేయనన్న మహిళపై అకృత్యం థానే: వ్యభిచారం చేయనని ఎదిరించిన మహిళపై సదరు వ్యభిచార కూపానికి నేతృత్వం వహిస్తున్న మరో మహిళ ఆధ్వర్యంలో పాశవిక దాడి జరిగింది. బాధితురాలి రొమ్ములు కోసేసి, పళ్లను రాలగొట్టారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీ నగరంలో ఈ నెల 19న జరిగిన ఈ ఉదంతంపై పోలీసులు తెలిపిన వివరాలు.. గుజరాత్‌కు చెందిన 24 ఏళ్ల యువతి పొట్టచేతబట్టుకుని భివాండీ నగరానికి వచ్చింది. మాయ మాటలతో కొందరు ఆమెను వ్యభిచార కూపానికి అమ్మేశారు. ఈ క్రమంలో వ్యభిచార కూపానికి నేతృత్వం వహిస్తున్న రూబీ(34) సదరు యువతిని వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చింది. దీనికి ఆమె తిరస్కరించి ఎదరుతిరిగింది. దీంతో రూబీ మరో ఇద్దరు నిందితులు ఆలాం, అఫ్రాజ్లతో కలసి బాధితురాలి రొమ్ములు కోసి, పళ్లు ఊడేలా ముఖంపై బలమైన దెబ్బలు వేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కొందరు ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని శనివారం అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరో ఘటనలో థానే జిల్లాలోని అభిత్గఢ్లో స్నేహితుణ్ని చూసేందుకు అతని ఇంటికి వెళ్లిన లఖన్ యాదవ్ అనే వ్యక్తి సదరు స్నేహితుడు ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్యపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు.