అరుదైన వస్తువులకు వేలం పాట వేయడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇలాంటి వేలం పాట చరిత్రలో అరుదైన ఘట్టం నమోదైంది. సింగిల్ మాల్ట్ విస్కీని దక్కించుకునేందుకు కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఓ వ్యక్తి వెనుకాడకపోవడంతో ఈ రికార్డు చోటు చేసుకుంది.
కోట్ల రూపాయలు
టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో ఉన్న డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాపులో జపాన్‌కి చెందిన లిక్కర్ తయారీ సంస్థ సుంటోరీ తయారు చేసిన ది యమజాకీ 55 ఇయర్స్ ఓల్డ్ విస్కీని వేలం పాటలో పెట్టారు. మొత్తం ఎనిమిది మంది ఈ అరుదైన విస్కీని సొంతం చేసుకునేందుకు పోటీ పడగా చివరకు చైనాకు చెందిన ఓ ప్రయాణికుడు రికార్డు స్థాయిలో 4,88,000 పౌండ్లు ఇండియన్ కరెన్సీలో రూ.4.14 కోట్లు చెల్లించి ఈ విస్కీని దక్కించుకున్నాడు. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్ వరల్డ్ కథనం ప్రచురించింది.
ఇవీ ప్రత్యేకతలు
సుంటోరీ వ్యవస్థాపకుడు షింజిరో టోర్రి ఈ ది యమజాకి విస్కీని ప్రత్యేకంగా రూపొందించాడు. 1960లో మూడు అరుదైన రకాలకు చెందిన సింగిల్ మాల్ట్ విస్కీలను బ్లెండ్ చేసి యమజాకీ స్కాచ్‌ని తయారు చేశారని ఆ కంపెనీ చీఫ్ బ్లెండర్ షింజిరో ఫికియో తెలిపారు. ఇంకా ఈ స్కాచ్ గురించి ఆయన చెబుతూ.. ఇదొక అందమైన గ్రీకు శిల్పం వంటిదన్నారు. సుంటోరీ సంస్థ అరుదైన రకానికి చెందిన విస్కీని తయారు చేసి లిమిలెడ్‌గా మార్కెట్‌లోకి తెస్తుంది. ప్రత్యేకమైన వ్యక్తులకే వాటిని సరఫరా చేస్తూ ఉంటుంది. 2020లో కేవలం వంద విస్కీ బాటిల్స్‌ని మార్కెట్‌లో రిలీజ్ చేసింది.
చదవండి: ఉద్యోగుల కోసం వేల కోట్ల ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసిన గూగుల్..!
Comments
Please login to add a commentAdd a comment