Duty Free Shop
-
విమానాశ్రయాల్లో డ్యూటీ ఫ్రీ షాపులకూ పరోక్ష పన్ను వర్తింపు
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లోని డ్యూటీ ఫ్రీ షాపుల నుంచి ఎలాంటి పరోక్ష పన్నులు వసూలు చేయరాదని ఏప్రిల్ 10వ తేదీన ద్విసభ్య ధర్మాసనం ఇచి్చన తీర్పును తాజాగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెనక్కు తీసుకుంది. అంతర్జాతీయ విమానాశ్రయాలలో అరైవల్, డిపార్చర్ టెరి్మనల్స్ వద్ద డ్యూటీ ఫ్రీ షాపులు కస్టమ్స్ చట్టాల పరిధిలోనికి రావని, సేవా పన్ను వంటి పరోక్ష పన్ను విధింపు కూడదని ద్విసభ్య ధర్మాసనం ఏప్రిల్ 10న రూలింగ్ ఇచ్చింది. అయితే ఈ రూలింగ్‌లో లోపాలున్నాయని సెంటర్ అండ్ కమీషనర్ ఆఫ్ సెంట్రల్ గూడ్స్ అండ్ సరీ్వస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఆఫ్ ముంబై ఈస్ట్ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకట్రామన్ చేసిన వాదనలతో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఏకీభవించింది. వారు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అనుమతించింది. ఈ కేసులో ప్రభుత్వ వాదనలను ద్విసభ్య ధర్మాసనం వినలేదని, తద్వారా ‘‘సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన’’ జరిగిందని అదనపు సొలిసటర్ జనరల్ చేసిన వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది. తీర్పును రీకాల్ చేసినందున ప్రభుత్వం సేవా పన్నుగా వసూలు చేసిన రూ.200 కోట్లను తిరిగి పొందే ప్రయత్నాలను (పన్ను రిఫండ్ క్లెయిమ్) విరమించుకోవాలని కూడా ఈ కేసులో పారీ్టగా ఉన్న ఫ్లెమింగో ట్రావెల్ రిటైల్‌కు సుప్రీం సూచించింది. -
రూ 4.14 కోట్లు పలికిన విస్కీ బాటిల్! వేలంలో నమోదైన అరుదైన రికార్డ్
అరుదైన వస్తువులకు వేలం పాట వేయడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇలాంటి వేలం పాట చరిత్రలో అరుదైన ఘట్టం నమోదైంది. సింగిల్ మాల్ట్ విస్కీని దక్కించుకునేందుకు కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఓ వ్యక్తి వెనుకాడకపోవడంతో ఈ రికార్డు చోటు చేసుకుంది. కోట్ల రూపాయలు టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో ఉన్న డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాపులో జపాన్‌కి చెందిన లిక్కర్ తయారీ సంస్థ సుంటోరీ తయారు చేసిన ది యమజాకీ 55 ఇయర్స్ ఓల్డ్ విస్కీని వేలం పాటలో పెట్టారు. మొత్తం ఎనిమిది మంది ఈ అరుదైన విస్కీని సొంతం చేసుకునేందుకు పోటీ పడగా చివరకు చైనాకు చెందిన ఓ ప్రయాణికుడు రికార్డు స్థాయిలో 4,88,000 పౌండ్లు ఇండియన్ కరెన్సీలో రూ.4.14 కోట్లు చెల్లించి ఈ విస్కీని దక్కించుకున్నాడు. ఈ మేరకు ఎయిర్పోర్ట్ వరల్డ్ కథనం ప్రచురించింది. ఇవీ ప్రత్యేకతలు సుంటోరీ వ్యవస్థాపకుడు షింజిరో టోర్రి ఈ ది యమజాకి విస్కీని ప్రత్యేకంగా రూపొందించాడు. 1960లో మూడు అరుదైన రకాలకు చెందిన సింగిల్ మాల్ట్ విస్కీలను బ్లెండ్ చేసి యమజాకీ స్కాచ్‌ని తయారు చేశారని ఆ కంపెనీ చీఫ్ బ్లెండర్ షింజిరో ఫికియో తెలిపారు. ఇంకా ఈ స్కాచ్ గురించి ఆయన చెబుతూ.. ఇదొక అందమైన గ్రీకు శిల్పం వంటిదన్నారు. సుంటోరీ సంస్థ అరుదైన రకానికి చెందిన విస్కీని తయారు చేసి లిమిలెడ్‌గా మార్కెట్లోకి తెస్తుంది. ప్రత్యేకమైన వ్యక్తులకే వాటిని సరఫరా చేస్తూ ఉంటుంది. 2020లో కేవలం వంద విస్కీ బాటిల్స్‌ని మార్కెట్లో రిలీజ్ చేసింది. చదవండి: ఉద్యోగుల కోసం వేల కోట్ల ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసిన గూగుల్..! -
విమాన ప్రయాణికులకుతీపి కబురు..
రూ.25వేల వరకు డ్యూటీ ఫ్రీ షాపింగ్ న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులు ఇకపై దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని డ్యూటీ ఫ్రీ షాపుల్లో రూ.25వేల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ పరిమితి రూ.5 వేలుగానే ఉండగా... దీన్ని పెంచాలంటూ ప్రయాణికుల నుంచి పలు అభ్యర్థనలొచ్చాయి. దీంతో డ్యూటీ ఫ్రీ షాపింగ్ పరిమితిని ఐదు రెట్లు పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) ఆదేశాలు జారీ చేసింది. అలాగే, బ్యాంకులు ప్రకటించే విదేశీ కరెన్సీ మారకపు రేట్లను డ్యూటీ ఫ్రీ షాపుల్లో ప్రదర్శించాలని కూడా కోరినట్టు సీబీఈసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని డ్యూటీ ఫ్రీ షాపులు, విమానాశ్రయాలు తమ వెబ్ సైట్లలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కూడా ఆదేశించామన్నారు. -
పైలట్ చేతివాటం
ఎయిర్ ఇండియాకు చెందిన ఓ సీనియర్ పైలట్ ముంబై విమానాశ్రయంలో చేతివాటం ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు. అందుకు తగిన మూల్యం కూడా చెల్లించుకొని... బతుకుజీవుడా అంటూ బయటపడ్డాడు. గురువారం జరిగిందీ సంఘటన. ముంబై విమానాశ్రయంలో డ్యూటీ ఫ్రీ షాపులోకి వెళ్లి రెండు జతల కళ్లద్దాలు ఖరీదు చేశాడు సదరు పైలట్. అయితే చడీచప్పుడు కాకుండా మూడో కళ్లజోడును జేబులో పెట్టేసుకున్నాడు. అనంతరం డ్యూటీలో భాగంగా విమానం నడుపుతూ తిరువనంతపురం వెళ్లిపోయాడు. సీసీ టీవీల్లో ఫుటేజీ చూసిన షాపు సిబ్బంది జరిగిన చోరీని గుర్తించారు. సదరు పైలట్ తిరువనంతపురం నుంచి తిరిగి ముంబై రాగానే అడ్డగించారు. ఫుటేజీ చూపించేసరికి గతుక్కుమన్న పైలట్ పరువు పోకుండా ఉండటానికి రాజీకి వచ్చాడు. చోరీ చేసిన కళ్లద్దాల ఖరీదు 24 వేల రూపాయలు కాగా... దానికి పది రెట్లు 2.4 లక్షలు జరిమానా కట్టి బయటపడ్డాడు. విషయం బయటకు పొక్కి ఎయిర్ ఇండియా సంస్థను సంప్రదించగా... ‘ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వ్యవహారం. ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో సమస్య సద్దుమణిగింది’ అని వివరణ ఇచ్చింది.