![SC recalls its verdict upholding no indirect taxes on from duty free shops at airports - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/19/DUTY-FREE.jpg.webp?itok=lsSvYumT)
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లోని డ్యూటీ ఫ్రీ షాపుల నుంచి ఎలాంటి పరోక్ష పన్నులు వసూలు చేయరాదని ఏప్రిల్ 10వ తేదీన ద్విసభ్య ధర్మాసనం ఇచి్చన తీర్పును తాజాగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెనక్కు తీసుకుంది. అంతర్జాతీయ విమానాశ్రయాలలో అరైవల్, డిపార్చర్ టెరి్మనల్స్ వద్ద డ్యూటీ ఫ్రీ షాపులు కస్టమ్స్ చట్టాల పరిధిలోనికి రావని, సేవా పన్ను వంటి పరోక్ష పన్ను విధింపు కూడదని ద్విసభ్య ధర్మాసనం ఏప్రిల్ 10న రూలింగ్ ఇచ్చింది.
అయితే ఈ రూలింగ్‌లో లోపాలున్నాయని సెంటర్ అండ్ కమీషనర్ ఆఫ్ సెంట్రల్ గూడ్స్ అండ్ సరీ్వస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఆఫ్ ముంబై ఈస్ట్ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకట్రామన్ చేసిన వాదనలతో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఏకీభవించింది. వారు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అనుమతించింది.
ఈ కేసులో ప్రభుత్వ వాదనలను ద్విసభ్య ధర్మాసనం వినలేదని, తద్వారా ‘‘సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన’’ జరిగిందని అదనపు సొలిసటర్ జనరల్ చేసిన వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది. తీర్పును రీకాల్ చేసినందున ప్రభుత్వం సేవా పన్నుగా వసూలు చేసిన రూ.200 కోట్లను తిరిగి పొందే ప్రయత్నాలను (పన్ను రిఫండ్ క్లెయిమ్) విరమించుకోవాలని కూడా ఈ కేసులో పారీ్టగా ఉన్న ఫ్లెమింగో ట్రావెల్ రిటైల్‌కు సుప్రీం సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment