united airlines
-
విమానం టేకాఫ్ అయిన క్షణాలకే ఊడిపోయిన టైర్.. వీడియో వైరల్
అమెరికాలోని ఓ విమానాశ్రయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే దాని టైర్ ఊడిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాలు.. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుంచి జపాన్‌కు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది. విమానంలో 235 ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. అయితే టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే విమానం ఎడమవైపు ఉన్న ఓ టైర్ ఊడిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానం నుంచి టైర్ ఊడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే విమానంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఘటనపై ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా స్పందించింది. ఇలాంటి సందర్భాల్లో సురక్షితంగా ల్యాండయ్యేలా విమానాన్ని డిజైన్ చేసినట్లు వెల్లడించింది. అయితే ఊడిన విమానం టైర్ శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలోని ఎంప్లాయిస్ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న కార్లపై పడింది. దీంతో పలు కార్లు ధ్వంసమయ్యాయి. 🚨 #BREAKING: A United Airlines Boeing 777 has lost a wheel while taking off San Francisco Several cars have been CRUSHED by the falling wheel WHAT’S GOING ON WITH BOEING AND THE AIRLINES? pic.twitter.com/zu7s5YJixg — Nick Sortor (@nicksortor) March 7, 2024 -
నా కాస్ట్లీవిస్కీ మాయం: విమాన ప్రయాణికుడి ఆక్రోశం, ధర తెలిస్తే!
న్యూఢిల్లీ: విమాన ప్రయాణాల్లో అనుకోని ఉదంతాలు, సంఘటనలు ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేస్తాయి. లగేజీ మిస్ అవ్వడం, తారుమారు కావడం, ఒక్కోసారి బంగారం లాంటి ఇతర విలువైన సామాగ్రి మాయమై పోవడం లాంటి సంఘటలను విమాన ప్రయాణికులకు షాక ఇస్తూంటాయి. తాజాగా ఒక ప్రయాణికుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని నూటికి నూరుపాళ్లు నిర్ధారించుకుని పదిలంగా లగేజీలో పెట్టుకున్న ఖరీదైన విస్కీ బాటిల్ మూడింట ఒకవంతు ఖాళీ అవడం చూసి అవ్వాక్కయ్యాడో వ్యక్తి. దీనిపై సంబంధిత ఎయిర్‌లైన్‌కి ఫిర్యాదు చేయడంతోపాటు, తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నుంచి క్రిస్టోఫర్ ఆంబ్లర్ అనే ప్రయాణికుడు అందించిన వివరాల ప్రకారం చెక్-ఇన్ లగేజీలో ప్యాక్ చేసిన ఖరీదైన గ్లెన్మోరాంగీ 'ఎ టేల్ ఆఫ్ కేక్' విస్కీ బాటిల్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత బాటిల్ సీల్ తెరిచి ఉండటంతో షాక్ అయ్యాడు. అంతేకాదు మూడింట ఒక వంతు ఖాళీ అయిపోయింది. ఎలాంటి లీకేజీ కూడా లేదు. దీంతో హే..యునైటెడ్ ఎయిర్‌లైన్స్..మీ బ్యాగేజ్ హ్యాండ్లర్లు దొంగలు అంటూ ఫోటోతో సహా ఆంబ్లర్ ట్వీట్ చేశాడు. దీని ధర కెనడాలో (అమెజాన్) రూ. 45,556 అట. దీనిపై నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందించారు. కొందరు తమ అనుభావాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఈ ఘటనపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. తమ బ్యాగేజీ రిజల్యూషన్ సెంటర్లో రిపోర్ట్‌ను ఫైల్ చేయమని కోరింది. Hey @united - bottle of expensive scotch in checked bag. Arrived opened and a third gone. No leakage. It was sealed new when packed and seal broken by opening. Your baggage handlers are thieves. pic.twitter.com/UHzTLzF4Eu — Though it be not written down, I am an ass. (@TheDogberry) March 28, 2023 -
ఇంజిన్‌లో మంటలు..24 విమానాలు బంద్!
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలోని డెన్వర్, నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్లో చోటుచేసుకున్న బోయింగ్ విమాన ప్రమాదాలు కలకలం రేపాయి. డెన్వర్‌లో బయలుదేరిన కొద్దిసేపటికే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన విమానం ఇంజిన్ నుంచి కొన్ని భాగాలు నేలపై పడడం, అత్యవసర ల్యాండింగ్ ఘటనలపై అమెరికా ప్రభుత్వ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) దర్యాప్తుకు ఆదేశించింది. ప్రమాదానికి గురైన ఆ బోయింగ్–777 రకం విమానానికి ప్రాట్ అండ్ విట్నీ సంస్థ తయారీ ఇంజిన్ ఉందని గుర్తించింది. ఈ రకం ఇంజిన్ ఉన్న అన్ని బోయింగ్–777 విమానాలను తనిఖీ చేయాలనీ, వాటిని తాత్కాలికంగా పక్కనబెట్టాలని ఆదేశించింది. సోదాలు పూర్తయ్యే వరకు ఆ మోడల్ ఇంజిన్ ఉన్న విమానాలను ఉపయోగించరాదని బోయింగ్ కూడా విమానయాన సంస్థలకు ఎఫ్ఏఏ సూచించింది. విమానయానసంస్థలు, అధికారులతో సహకరించేందుకు తమ బృందాన్ని పంపిస్తున్నట్లు ప్రాట్ అండ్ విట్నీ సంస్థ తెలిపింది. డెన్వర్ ఘటనతో 24 విమానాలను వినియోగించరాదని నిర్ణయించినట్లు ఆ సంస్థ తెలిపింది. డెన్వర్ శివారు ప్రాంతంలో ఆదివారం యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్–777 విమానం ఇంజిన్ నుంచి పొగలు రావడంతోపాటు, రెక్క, తదితర భాగాలు నేలపై పడిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసి, పరీక్షించగా విమానం ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు రెండు విరిగిపోగా మిగతా వాటికి పగుళ్లు వచ్చినట్లు తేలింది. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు 231 మంది, 10 మంది సిబ్బంది సహా ఎవరికీ హాని జరగలేదని అధికారులు తెలిపారు. ఈ రకం ఇంజిన్ ఉన్న బోయింగ్ విమానాలు యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు మాత్రమే ఉన్నాయి. డెన్వర్ ఘటన నేపథ్యంలో జపాన్ ఎయిర్వేస్, ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ సంస్థలు తమ 32 బోయింగ్ రకం విమానాలను ప్రస్తుతానికి నడపరాదని నిర్ణయించాయి. నెదర్లాండ్స్ ఘటన.. నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్లో బోయింగ్–747 రకం సరకు రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానంలోనూ డెన్వర్ ఘటనకు కారణమైన ప్రాట్ అండ్ విట్నీ సంస్థ తయారీ ఇంజిన్ ఉండటం గమనార్హం. లాంగ్ టెయిల్ ఏవియేషన్‌కు చెందిన ఈ విమానం మాస్ట్రిచ్ నుంచి న్యూయార్క్‌కు ఆదివారం సాయంత్రం బయలుదేరి కొన్ని నిమిషాలకే పొగలు రేగి, ఇంజిన్ నుంచి కొన్ని భాగాలు పడిపోవడం మొదలైంది. వీటి కారణంగా వృద్ధురాలు, బాలుడు గాయపడ్డారు. ఇంజిన్ భాగాల తాకిడికి మీర్సెన్లోని పలు గృహాలు దెబ్బతిన్నాయి. ఈ విమానాన్ని పొరుగునే ఉన్న బెల్జియంలోని లీజ్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. విమానం బయలుదేరిన కొద్ది సేపటికే అందులోని నాలుగు ఇంజిన్లలో ఒకదాని నుంచి మంటలు లేచాయని డచ్ ఎయిర్ సేఫ్టీ అధికారి తెలిపారు. ఇంజిన్లోకి ఒక వస్తువు అడ్డుపడటంతో టర్బైన్ బ్లేడ్లు విరిగి ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన అన్నారు. మా గగనతలంలోకి రావద్దు డెన్వర్ ఘటన నేపథ్యంలో యూకే స్పందించింది. ప్రాట్ అండ్ విట్నీ తయారీ ఇంజిన్లున్న బోయింగ్–777 విమానాలు తమ గగనతలంలో ప్రయాణించరాదంటూ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విమానాలు యూకే ఎయిర్‌లైన్స్‌లో లేవనీ, వీటి వినియోగాన్ని అమెరికా, జపాన్, ద.కొరియా అధికారులు నిలిపివేశారని తెలిపింది. చదవండి: విమానంలో మంటలు.. 231 మంది ప్రయాణికులు! -
విమానంలో మహిళకు భయంకర అనుభవం!
అట్లాంటా: విమానంలో ప్రయాణించేటపుడు కొన్ని అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. దీనివల్ల ప్రయాణికులు బెంబేలెత్తిపోయిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళకు భయంకర అనుభవం ఎదురు కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. వివరాలు.. ఓ మహిళ గురువారం ఉదయం పూట శాన్ఫ్రాన్సిస్కో నుంచి అట్లాంటా బయలు దేరింది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ తేలు ఆమె కాలిపై అదేపనిగా కాట్లు వేసింది. దీంతో మహిళకు నొప్పి భరించలేకుండా ఉండటంతో బాత్రూంలోకి వెళ్లింది. ఇంకా ఏదో కుడుతున్నట్టుగా అనిపించడంతో మహిళ ప్యాంటు చెక్ చేసుకోగా.. అందులో నుంచి ఓ తేలు బయటపడింది. అది కూడా సజీవంగా ఉండటంతో ఆమె భయభ్రాంతులకు లోనైంది. ఈ క్రమంలో ఎయిర్‌లైన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. విమానం ల్యాండ్ అయ్యాక సదరు మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక బాధితురాలికి విమానంలోనే ప్రాథమిక చికిత్స అందించామని ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ప్రస్తుతం ఆ మహిళ క్షేమంగా ఉంది. -
అక్కడకు విమానాలు నడపలేం
న్యూఢిల్లీ : ఢిల్లీ ఆవరించిన పొగమంచు, వాతావరణ కాలుష్యం విమాన సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం అధికంగా ఉండడంతో పాటు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపుతున్న ప్రమాదకర గణాంకాలతో యునెటైడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ న్యూయార్క్- ఢిల్లీ విమానసేవలను తాత్కాలికంగా నిలిపేసింది. మరో వారం రోజుల పాటు ఢిల్లీలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాలతో యెనైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. పలు క్లిష్టపరిస్థితుల్లోనపూ విమాన సేవలు అందిస్తున్న పలు సంస్థలు.. విమాన సర్వీసులును రీ షెడ్యూల్ చేయడం. ఆలస్యంగా నడడం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న నిర్ణయం మిగిలిన విమాన సంస్థలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయోనని పౌర విమానయాన శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. -
ఢిల్లీకి విమానాలు రద్దు
సాక్షి, న్యూఢ్లిలీ : దేశ రాజధానిలో కాలుష్య స్థాయిలు, పొగమంచు విపరీతంగా పెరుగడంతో గాలి నాణ్యతలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు యునిటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. నవంబర్ 9కు తీసుకున్న టిక్కెట్లను నవంబర్ 13న రీ-బుక్ చేసుకోవాలని, ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా నవంబర్ 18కు ముందు తీసుకువెళ్లేలా చూస్తామని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కింద ఈ ప్రాంతాన్ని ఎప్పడికప్పుడూ అడ్వయిజరీలతో పర్యవేక్షిస్తున్నామని, సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రమాదకరమైన వాతావారణ పరిస్థితులు తమ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయని, కొన్ని సార్లు ప్రయాణికులు ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించాల్సినవసరం లేకుండానే ప్రత్యామ్నాయ విమానాలకు అనుమతి ఇచ్చేలా ప్రయాణ ఉపసంహరణలు ఆఫర్ చేస్తామని కంపెనీ తెలిపింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా విమానాలు కూడా ఢిల్లీకి ప్రయాణించడం లేదు. ఇతర ప్రత్యర్థి విమానయాన సంస్థలు కేఎల్ఎం, వెర్జిన్ అట్లాంటిక్, ఇతిహాద్లు కూడా ప్రయాణ ఉపసంహరణలు ఆఫర్ చేయనున్నాయో లేదో తెలుపలేదు. -
విమానంలో ఇండియన్ డాక్టర్ అసభ్య ప్రవర్తన
న్యూయార్క్: విమానంలో టీనేజీ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఇండియన్ డాక్టర్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. న్యూయార్క్ పోలీసుల కథనం ప్రకారం.. గత జూలై 23న వాషింగ్టన్కు చెందిన 16 ఏళ్ల బాలిక సీటెల్ నుంచి యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో న్యూజెర్సీకి ప్రయాణించింది. విమానం ఎక్కిన కొద్దిసేపటికే బాలిక నిద్రపోయింది. ఆమె పక్కసీట్లో భారత్‌కు చెందిన 28 ఏళ్ల డాక్టర్ విజకుమార్ క్రిష్ణప్ప ఉన్నాడు. బాలిక నిద్రపోయినట్లు గమనించిన డాక్టర్ ఆమెను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. తనను ఎవరో తడుముతున్నట్లు గమనించిన బాలిక వెంటనే నిద్ర నుంచి మేల్కొంది. ఆ సమయంలో విజకుమార్ నిద్రిస్తున్నట్లు నటించాడు. కానీ ఆ వ్యక్తి మరోసారి అసభ్యంగా తనను తడమడంతో మేల్కొన్న బాలిక ఎయిర్‌లైన్స్ సిబ్బందికి చెప్పి వేరే సీట్లోకి మారింది. నేవార్క్ లిబర్టీ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవగానే పేరేంట్స్‌కు కాల్ చేసి విషయాన్ని చెప్పింది. వారు అక్కడికి చేరుకునేలోగా విజకుమార్ వెళ్లిపోయాడని గుర్తించింది. తమ కూతురు ఫిర్యాదు చేయగా నిందితుడు క్రిష్ణప్పను అరెస్ట్ చేయకుండా, అతడిపై చర్య తీసుకోకుండా వదిలేసిన యూనైటెడ్ ఎయిర్‌లైన్స్‌పై కూడా బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎఫ్‌బీఐ, ఎయిర్‌లైన్స్ వారి సహకారంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ డాక్టర్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు తన క్లయింట్ క్రిష్ణప్ప అమాయకుడని, అతడిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని డాక్టర్ తరఫు న్యాయవాది జాన్ యాక్ చెప్పారు. -
మళ్లీ వివాదంలో యూఎస్ ఎయిర్‌లైన్స్
న్యూయార్క్: అమెరికా విమానయాన సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎంగేజ్మెంట్ పూర్తయ్యి త్వరలో వివాహం చేసుకోబోతున్న ఓ జంటను యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో నుంచి దింపేసింది. విమానంలోని సెక్యూరిటీ సిబ్బందితో బలవంతంగా బయటకు తోయించింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతకుముందు వైద్యుడైన ఓ ప్యాసింజర్‌ను రక్తం వచ్చేలాగా కొట్టి విమానంలో నుంచి ఈడ్చి పారేసిన ఘటనతో యూఎస్ విమానయాన సంస్థ ఇబ్బందుల్లో పడగా వారం తిరగకుండానే ఇది మరో ఘటన. వివరాల్లోకి వెళితే.. మైఖెల్ హాల్, అంబర్ మ్యాక్స్‌వెల్ అనే ఇద్దరికీ ఇటీవలె నిశ్చితార్థం అయింది. వారిద్దరు కలిసి హ్యూస్టన్ నుంచి టెక్సాస్‌కు బయలుదేరారు. ఆ క్రమంలో ఇద్దరు యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కోస్టారికా విమానం ఎక్కారు. అయితే, అనూహ్యంగా వారిద్దరి ప్రవర్తన బాగాలేదని, నిబంధనలు పాటించలేదనే కారణంతో వారిని బలవంతంగా దించివేశారు. దీనిపై విమానయాన సంస్థ వివరణ ఇస్తూ వారిద్దరు తాము తీసుకున్న సీట్లలో కాకుండా వేరే సీట్లలో కూర్చున్నారని, పైగా నిబంధనలు పాటించలేదని చెప్పారు. దీంతో ప్రవర్తన సరిగా లేదని దిగిపోవాలని చెప్పారే తప్ప వారినెవరూ బలవంతంగా దించివేయలేదని అన్నారు. పైగా వారికి రాత్రి పూట ప్రత్యేకంగా బస ఏర్పాటు చేసి మరో విమానం టికెట్లు ఇచ్చి ఉదయాన్నే పంపిచామని వివరణ ఇచ్చారు. అయితే, తమకు అప్‌గ్రేడ్ సీట్లు ఇవ్వమన్నా ఇవ్వలేదని, తమ సీట్లలో ఎవరో వ్యక్తి కాళ్లు పెట్టి నిద్రపోయాడని, అందుకే తాము వేరే సీట్లలో కూర్చున్నట్లు చెప్పారు. -
లెగ్గింగ్స్ వేసుకున్నారని..
ఇద్దరు అమ్మాయిలు లెగ్గింగ్స్ వేసుకున్నారని అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ వారిని విమానం ఎక్కనివ్వలేదు. లెగ్గింగ్స్ వేసుకొచ్చిన మరో అమ్మాయిని కూడా విమానంలో వెళ్లాలంటే ఆ దుస్తులు మార్చుకోవాల్సిందిగా ఆదేశించారు. డెన్వర్ నుంచి మిన్నీపొలిస్ వెళ్లే విమానంలో ఈ ఘటన జరిగినట్లు షానన్ వాట్స్ అనే ప్రత్యక్ష సాక్షి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ విషయమై ఆమె పెద్ద యుద్ధమే మొదలుపెట్టారు. దానికి మద్దతుగా అనేకమంది నెటిజన్లు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తీరు మీద మండిపడ్డారు. ఆ విమానయాన సంస్థ మాత్రం, ఎవరైనా సరిగా దుస్తులు వేసుకోకపోతే వాళ్లను విమానం ఎక్కనివ్వకుండా అడ్డుకునే హక్కు తమకుందని వాదిస్తోంది. ఎవరైనా ప్రయాణికులు కాళ్లకు చెప్పులు వేసుకోకపోయినా, సరిగా దుస్తులు వేసుకోకపోయినా తాము విమానం ఎక్కనిచ్చేది లేదని స్పష్టం చేస్తోంది. అయితే.. సరైన దుస్తులంటే ఏంటో మాత్రం చెప్పలేదు. సాధారణ ప్రయాణికులనైతే లెగ్గింగ్స్ లేదా యోగా ప్యాంట్లు ధరించినా తాము అనుమతిస్తామని, కానీ పాస్ మీద ప్రయాణించేవాళ్లు మాత్రం తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి జొనాథన్ గెరిన్ అన్నారు. ఆ అమ్మాయిలు ఇద్దరూ యునైటెడ్ ఉద్యోగుల పాస్ మీద ప్రయాణిస్తున్నారని, అందుకే తగిన డ్రస్ కోడ్ పాటించాల్సిందిగా చెప్పామని వివరించారు. కానీ, యునైటెడ్ వాదనను అమెరికన్లు కొట్టిపారేస్తున్నారు. ఎవరికైనా తమకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఉంటుందని, దాని మీద విమానయాన సంస్థలు మోరల్ పోలీసింగ్ ఎలా చేస్తాయని మండిపడుతున్నారు. ఇది చాలా చికాకు వ్యవహారమని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు లెగ్గింగ్స్ అనేవి సరైన దుస్తులు కావని ఎలా చెబుతారని.. ప్రయాణం చేసేటప్పుడు సుఖంగా ఉండేందుకు చాలామంది మహిళలు లెగ్గింగ్స్, యోగా దుస్తులు, అథ్లెటిక్ దుస్తులు ధరిస్తారని, ఇది కొత్తేమీ కాదని వాదిస్తున్నారు. తన పక్కనే కూర్చున్న అమ్మాయిని కూడా లెగ్గింగ్స్ వేసుకుని ప్రయాణించడానికి వీల్లేదని భయపెడితే.. ఆమె అప్పటికప్పుడు తన బ్యాక్‌ప్యాక్‌లోంచి వేరే డ్రస్ తీసుకుని మార్చుకుందని కూడా వాట్స్ చెప్పారు. Girls wearing LEGGINGS reportedly forced to change before @united would let them board and this...is...United's response... pic.twitter.com/KHJgau8tRE — Elizabeth Minkel (@elizabethminkel) 26 March 2017 -
మెంటలెక్కినట్లు మహిళా పైలట్.. ప్రయాణికులు షేక్
-
మెంటలెక్కినట్లు మహిళా పైలట్.. ప్రయాణికులు షేక్
వెల్లింగ్టన్: ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాకుండా ఆ మాటల మధ్య పొందిక లేకుండా ఉండటం, మానసిక పరిస్థితి ఆందోళనకరంగా కనిపించిన నేపథ్యంలో అమెరికాలో ఓ మహిళా పైలట్‌ను టేకాఫ్‌కు ముందు దింపేశారు. అయితే, ఆమె ఎవరనే వివరాలు చెప్పేందుకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నిరాకరించింది. ప్రయాణీకులంతా భయపడేలా ఆమె ప్రవర్తించిందని, దీంతో విమానం నుంచి కొంతమంది ప్రయాణికులు దిగిపోయారని కూడా ఎయిర్‌లైన్స్ తెలిపింది. యూఎస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ 455 ఆస్టిన్ నుంచి టెక్సాస్ మీదుగా శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాల్సి ఉంది. ఓ పురుషుడు, ఓ మహిళ దీనికి పైలట్లుగా ఉన్నారు. ఇందులో మహిళా పైలట్ తన విధుల నిమిత్తం వేసుకునే దుస్తులు కాకుండా.. సాధారణ పౌరులాలుగా వచ్చింది. అంతేకాకుండా డోనాల్డ్ ట్రంప్‌కు గానీ, హిల్లరీ క్లింటన్కుగానీ తాను ఓటు వేయలేదని, వారిద్దరు అబద్ధాల కోరులని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు తాను విడాకులు తీసుకుంటున్నానంటూ చెప్పింది. ఆ తర్వాత ఇంకేవో మాటలతో ప్రయాణీకులు బెంబేలెత్తిపోయేలా చేసింది. దీంతో కొంతమంది ప్రయాణీకులు దిగిపోతుండటంతోపాటు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ పైలెట్‌ను దింపేశారు. 90 నిమిషాలు ఆలస్యంగా కొత్త పైలెట్ ను పంపించారు. -
చికాగో విమానం దారి మళ్లింపు
టోక్యో: అమెరికాలోని చికాగో నుంచి చైనా బయల్దేరిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానాన్ని ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన కారణంగా దారి మళ్లించారు. జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని నరిటా విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారు. విమానంలో 241 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి చెప్పారు. చికాగోకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం చైనాలోని ఓ హరె అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాల్సివుంది. అయితే విమానంలో ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన వల్ల దారి మళ్లించాల్సి వచ్చింది. 12 గంటల తర్వాత విమానం జపాన్ నుంచి చైనాకు బయల్దేరింది. -
విమానంలో గొడవ.. వైరల్ వీడియో!
-
విమానంలో గొడవ.. వైరల్ వీడియో!
అమెరికా అధక్ష ఎన్నికల ఫలితాలపై కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా అసంతృప్తి ఉంది. ఆ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంపై ఓ విమానంలో ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా గొడవకు కారణమని తెలుస్తోంది. ఎంతసేపటికీ రెండు వర్గాల వారు వెనక్కి తగ్గిన పరిస్థితుల్లో పైలట్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఈ వాగ్వివాదం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి మెక్సికో(ప్యుయెర్టా వాల్లార్టా)కు వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటుచేసుకుంది. జాన్ బ్యుయర్ అనే వ్యక్తి విమానంలో జరిగిన తతంగాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో స్థానికంగా ఎంతో కలకలం రేపింది. ఆఫ్రో-అమెరికన్ మహిళను అగౌరవపరిచే వ్యాక్యలు చేయడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ విషయం పైలట్ వద్దకు చేరింది. 'మనం 35,000 అడుగుల ఎత్తులో వెళ్లబోతున్నాం. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిప్రాయం ఉండటం మంచిదే. కానీ ఇలాంటి సమయాలలో ఇవి తగవు' అని పైలట్ సర్దిచెప్పాడు. ఈ విషయంపై యునైటెడ్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి మెక్ కార్తే మాట్లాడుతూ.. గొడవ జరిగిన విసయం వాస్తవమే. ఈ విషయంపై మా పైలట్ జోక్యం చేసుకుని అంతా సర్దుకునేలా చేశాడన్నారు. ఎవరికైనా సమస్య ఉంటే చెప్పండి.. మరుసటి రోజు ఫ్లయిట్లో వెళ్లవచ్చు అని సూచించారు. విమానం నుంచి ఎవరినీ దింపి వేయలేదని మెక్ కార్తే చెప్పారు. -
ప్రపంచంలోనే పెద్ద ట్విన్ జెట్.. బోయింగ్ 777
మానవుడి మేధస్సుకు అద్దం పట్టే ఆవిష్కరణల్లో విమానం ఒకటి. రైట్ సోదరులు దీనికి రూపకల్పన చేసినప్పటి నుంచి ఇందులో ఎన్నో మార్పులు వచ్చాయి. విమానం వెళ్తున్న చప్పుడు వినగానే ఇంటి బయటకు వచ్చి దాన్ని చూస్తూ కేరింతలు కొట్టని బాల్యం ఉండదంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఒక్కసారైనా ఇందులో విహరించాలని కోరిక ఉంటుంది. ప్రపంచాన్నే కుగ్రామంగా మార్చేసిన ఆవిష్కరణల్లో ఇదీ ఒకటి. ప్రపంచంలో అతి పెద్ద విమానంగా ప్రసిద్ధి చెందిన బోయింగ్-777 సేవలు ఈ రోజు నుంచే ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఈ భారీ విమానం విశేషాలు మీ కోసం! ప్రత్యేకతలు: బోయింగ్ ఎయిర్‌లైన్స్ ప్రపంచంలోనే అతి పెద్ద ట్విన్జెట్ (రెండు ఇంజన్లతో నడిచే) విమానం. దీన్ని సాధారణంగా ‘ట్రిపుల్ సెవెన్’ అని పిలుస్తారు. ఇందులో సుమారు 300 మందికి పైగా ప్రయాణించొచ్చు. దీని వేగం సుమారు గంటకు 10,000 నుంచి 17,000 కి.మీ. ఇది పూర్తిగా కంప్యూటర్‌తో డిజైన్ చేసిన తొలి వాణిజ్య విమానం. భారీ పరిమాణంలో చేసిన టర్బో ఫ్యాన్ ఇంజన్లు, ల్యాండింగ్ గేర్‌పై ఆరు చక్రాలు, ఒక వృత్తాకారపు ఫ్యూజ్‌లేజ్ (సిబ్బంది, ప్రయాణికులుండే ప్రాంతం), బ్లేడ్ ఆకారంలో చేసిన తోక భాగం.. ఇందులో ప్రత్యేక విశిష్టతలు. తొలిసారిగా: యునెటైడ్ ఎయిర్‌లైన్స్ 1995లో దీన్ని తొలిసారిగా వాణిజ్య సేవలకు వినియోగించింది. 2010 మే నాటికి దీనిలో వివిధ మోడళ్లకు సంబంధించి 59 నిర్వాహక సంస్థలు 1,148 విమానాల కోసం ఆర్డరు చేయగా 864 విమానాలు సరఫరా అయ్యాయి. దీనిలో సాధారణ మోడల్లో మొత్తం 413 విమానాలను డెలివరీ చేశారు. ఈ మోడల్ విమానాలు అత్యధికంగా ఎమిరేట్స్ సంస్థ వద్ద 78 ఉన్నాయి. నేపథ్యం: 1970 ప్రారంభంలో బోయింగ్ 747, మెక్‌డోనెల్ డౌగ్లస్ డీసీ-10, లాకీడ్ ఎల్-1011 ట్రైస్టార్ విమానాల సేవలు ప్రారంభమయ్యి తొలి తరం వైడ్ బాడీ ప్రయాణ విమానాలుగా అవతరించాయి. 1978లో బోయింగ్ సంస్థ మరో మూడు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. వీటిలో ఎయిర్‌బస్ ఎ-300ను సవాలు చేసే రెండు ఇంజన్లు కలిగిన విమానాలతో పోటీ పడే విధంగా తయారు చేసిన ఒక ట్రైజెట్ విమానమే 777 మోడల్. డిజైన్: బోయింగ్ కొత్త ట్విన్జెట్ రూపకల్పన గత వాణిజ్య జెట్ విమానాలకు భిన్నమైంది. తొలిసారిగా ఎనిమిది అతిపెద్ద వైమానిక సంస్థలు ఆల్ నిప్పన్ ఎయిర్వేస్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, బ్రిటిష్ ఎయిర్వేస్, కేథె పసిఫిక్, డెల్టా ఎయిర్‌లైన్స్, జపాన్ ఎయిర్‌లైన్స్, సంతాస్, యునెటైడ్ ఎయిర్‌లైన్స్‌లు.. బోయింగ్ కొత్త ట్విన్జెట్ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించాయి. ఉత్పత్తి: బోయింగ్ జెట్ విమాన తయారీ కాంట్రాక్ట్ కోసం అంతర్జాతీయ సంస్థలు ఊహించని రీతిలో పోటీపడ్డాయి. వీటిలో మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్, కవాసాకి హెవీ ఇండస్ట్రీస్, ఫుజి హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హాకర్ డి హావిల్లాండ్, ఎయిరోస్పేస్ టెక్నాలజీస్ ఆఫ్ ఆస్ట్రేలియా వంటి అంతర్జాతీయ సంస్థలున్నాయి. సేవల ప్రారంభం: తొలి 777 విమానాన్ని 1995 మే 15న బోయింగ్ సంస్థ డెలివరీ చేసింది. 1995 మే 30న ప్రాట్ అండ్ వైట్నీ పీడబ్ల్యూ 4084 ఇంజన్ కలిగిన విమానానికి 180 నిమిషాల ఈటీఓపీ క్లియరెన్స్‌ను ఎఫ్ఏఏ ఇచ్చింది. తద్వారా ఈటీఓపీఎస్ 180 రేటింగ్‌తో సేవలు ప్రారంభించిన మొట్టమొదటి విమానంగా గుర్తింపు పొందింది. పురోగతి: తొలి మోడల్ తర్వాత, బోయింగ్ 777-200ఈఆర్ను అభివృద్ధి చేసింది. ఇది విస్తృత శ్రేణి కలిగిన మోడల్. 1996 అక్టోబర్ 7న ట్రైల్ రన్‌ను నిర్వహించారు. 1997 జనవరి 17న జేఏఏ సర్టిఫికెట్‌ను అందుకుంది. 1997 ఫిబ్రవరి 9న బ్రిటిష్ ఎయిర్‌వేస్‌తో సేవలు ప్రారంభించింది. అత్యంత సుదూర ప్రయాణాలు చేసే ఈ మోడల్ 2000 ప్రారంభంలో వైమానిక సంస్థలు అత్యధికంగా ఆర్డర్ చేసిన వెర్షన్‌గా రికార్డుల కెక్కింది. సాంకేతిక పరిజ్ఞానం: 777 డిజైన్ ద్వారా బోయింగ్ అసంఖ్యాక అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలకు ఆవిష్కరించింది. పూర్తిస్థాయి డిజిటల్ ఫ్లై బై వైర్ నియంత్రణలు, పూర్తి సాఫ్ట్వేర్ కాన్ఫిగడబుల్ అవియోనిక్స్, అధునాతన కాక్పిట్లు వీటిలో ముఖ్యమైంది. రద్దు చేసిన బోయింగ్ 7జే7 మోడల్‌పై జరిపిన పరిశోధనను బోయింగ్ కంపెనీ వినియోగించుకుంది. రెక్కల నిర్మాణం: 777 రెక్కలు సూపర్ క్రిటికల్ ఎయిర్ఫోయిల్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. రెక్కలు 31.6 డిగ్రీలతో తయారు చేశారు. మేక్ 0.83 వద్ద ప్రయాణించేందుకు అనుకూలంగా ఉంటాయి. రెక్కలను మరింత మందంగా, అంతకు ముందు విమానాల కంటే సుదీర్ఘ వెడల్పుగానూ రూపొందించారు. ఫలితంగా రవాణా సామర్థ్యం, దూరం, టేకాఫ్ సామర్థ్యాలు పెరిగాయి. ప్రమాదాలు: 2010 మే నాటికి బోయింగ్-777 మొత్తం ఏడు ప్రమాదాలకు గురైంది. అందులో ఒకటి వైమానిక ప్రమాదం. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. 2001 సెప్టెంబర్ 5న డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఇంధనం తిరగ పోసుకునేటప్పుడు ఒక ట్విన్ జెట్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ఈ విమానం రెక్కలు కాలిపోయాయి. తర్వాత దీన్ని బాగుచేసి తిరిగి సేవలకు వినియోగించారు. -
అమెరికా విమానం అత్యవసర ల్యాండింగ్
ముంబై:అమెరికా ఎయిర్‌లైన్స్ విమానాన్నిఅత్యవసరంగా ముంబై విమానాశ్రయంలో దించేశారు. యునైటైడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 777 విమానం ఇంజిన్ లో సాంకేతికలోపం సంభవించడంతో విమానాన్ని అత్యవసరంగా దించేసినట్లు డీజీసీఏ అధికారిక వర్గాలు తెలిపాయి. అమెరికా కు బయల్దేరే క్రమంలో విమానాన్ని పరిక్షీంచిన ఇంజినీర్లు లోపాన్ని గుర్తించారు. విమానానికి కుడివైపున ఉన్న ఇంజిన్ కవర్ దెబ్బతినడంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఇంజిన్ లో సంభవించిన లోపం తీవ్రమైనదిగా తెలుస్తోంది. టేకాఫ్ అయ్యే సమయంలోనే ఇంజిన్ కవర్ కు దెబ్బతిని ఉంటుందని భావిస్తున్నారు.