ముంబై:అమెరికా ఎయిర్లైన్స్ విమానాన్నిఅత్యవసరంగా ముంబై విమానాశ్రయంలో దించేశారు. యునైటైడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 777 విమానం ఇంజిన్ లో సాంకేతికలోపం సంభవించడంతో విమానాన్ని అత్యవసరంగా దించేసినట్లు డీజీసీఏ అధికారిక వర్గాలు తెలిపాయి. అమెరికా కు బయల్దేరే క్రమంలో విమానాన్ని పరిక్షీంచిన ఇంజినీర్లు లోపాన్ని గుర్తించారు.
విమానానికి కుడివైపున ఉన్న ఇంజిన్ కవర్ దెబ్బతినడంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఇంజిన్ లో సంభవించిన లోపం తీవ్రమైనదిగా తెలుస్తోంది. టేకాఫ్ అయ్యే సమయంలోనే ఇంజిన్ కవర్ కు దెబ్బతిని ఉంటుందని భావిస్తున్నారు.