విమానంలో ఇండియన్ డాక్టర్ అసభ్య ప్రవర్తన | Indian Doctor Arrested For Groping Sleeping Teen On United Flight | Sakshi
Sakshi News home page

ఇండియన్ డాక్టర్ అసభ్యంగా తాకాడు!

Published Sun, Aug 6 2017 7:31 PM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM

విమానంలో ఇండియన్ డాక్టర్ అసభ్య ప్రవర్తన - Sakshi

విమానంలో ఇండియన్ డాక్టర్ అసభ్య ప్రవర్తన

న్యూయార్క్: విమానంలో టీనేజీ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఇండియన్ డాక్టర్‌ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. న్యూయార్క్ పోలీసుల కథనం ప్రకారం.. గత జూలై 23న వాషింగ్టన్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక సీటెల్ నుంచి యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో న్యూజెర్సీకి ప్రయాణించింది.

విమానం ఎక్కిన కొద్దిసేపటికే బాలిక నిద్రపోయింది. ఆమె పక్కసీట్లో భారత్‌కు చెందిన 28 ఏళ్ల డాక్టర్ విజకుమార్ క్రిష్ణప్ప ఉన్నాడు. బాలిక నిద్రపోయినట్లు గమనించిన డాక్టర్ ఆమెను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. తనను ఎవరో తడుముతున్నట్లు గమనించిన బాలిక వెంటనే నిద్ర నుంచి మేల్కొంది. ఆ సమయంలో విజకుమార్ నిద్రిస్తున్నట్లు నటించాడు. కానీ ఆ వ్యక్తి మరోసారి అసభ్యంగా తనను తడమడంతో మేల్కొన్న బాలిక ఎయిర్‌లైన్స్ సిబ్బందికి చెప్పి వేరే సీట్లోకి మారింది. నేవార్క్ లిబర్టీ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవగానే పేరేంట్స్‌కు కాల్ చేసి విషయాన్ని చెప్పింది. వారు అక్కడికి చేరుకునేలోగా విజకుమార్ వెళ్లిపోయాడని గుర్తించింది.

తమ కూతురు ఫిర్యాదు చేయగా నిందితుడు క్రిష్ణప్పను అరెస్ట్ చేయకుండా, అతడిపై చర్య తీసుకోకుండా వదిలేసిన యూనైటెడ్ ఎయిర్‌లైన్స్‌పై కూడా బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎఫ్‌బీఐ, ఎయిర్‌లైన్స్ వారి సహకారంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ డాక్టర్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు తన క్లయింట్ క్రిష్ణప్ప అమాయకుడని, అతడిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని డాక్టర్ తరఫు న్యాయవాది జాన్ యాక్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement