indian doctor
-
వైద్యుడి రూపంలోని రాక్షసుడు
వాషింగ్టన్: చికిత్స కోసం వచ్చే రోగుల పట్ల అభిమానం, వాత్సల్యం ప్రదర్శిస్తూ సాంత్వన చేకూర్చాల్సిన వైద్యుడు రాక్షసంగా ప్రవర్తించాడు. తాను పనిచేసే ఆసుపత్రిలో రహస్యంగా కెమెరాలు అమర్చి మహిళలు, చిన్నారుల నగ్న వీడియోలు, ఫొటోలు చిత్రీకరించాడు. కొందరు మహిళలకు మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నాక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను సైతం రికార్డు చేసి, తన కంప్యూటర్లో భద్రపర్చాడు. ఆఖరికి సొంత ఇంట్లో కూడా కెమెరా అమర్చి వీడియోలు చిత్రీకరించాడంటే అతడెంత ఉన్మాదో అర్థం చేసుకోవచ్చు. చివరికి పాపం పండడంతో కట్టుకున్న భార్యే అతడి బాగోతాన్ని పోలీసులకు తెలియజేసింది. పోలీసులు రంగంలోకి దిగి ఆ దుర్మార్గుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అతడొక భారతీయ వైద్యుడు కావడం గమనార్హం. భారతీయుడైన ఒమెయిర్ ఎజాజ్(40) స్వదేశంలో వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత 2011లో వర్క్ వీసాపై అమెరికా చేరుకున్నాడు. తొలుత అలబామాలో నివసించాడు. 2018లో మిషిగాన్‌కు మకాం మార్చాడు. మొదట రెండు ఆసుపత్రుల్లో డాక్టర్‌గా పనిచేశాడు. తర్వాత ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని వేర్వేరు ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. డాక్టర్‌గా విధుల్లో చేరినప్పటి నుంచే తనలోని మరో కోణం బయటపడకుండా జాగ్రత్తపడ్డాడు. బాత్రూ మ్లు, బట్టలు మార్చుకొనే గదులు, హాస్పి టల్లో మహిళా రోగులు ఉండే గదుల్లో రహస్యంగా కెమెరాలు అమర్చేవాడు. కెమె రాల్లోని దృశ్యాలను రికార్డు చేసి, ఎప్పటి కప్పుడు కంప్యూటర్లో భద్రపర్చేవాడు. మహిళలు, చిన్నారులే అతడి టార్గెట్. రెండేళ్ల పసిపాప వీడియోలు సైతం రికార్డు చేశాడు. అలాగే తనవద్దకు చికిత్స కోసం వచ్చే మహిళలపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ వ్యవహారమంతా చాలా ఏళ్లపాటు కొనసాగింది. ఇంట్లో కూడా రహస్యంగా కెమెరా ఏర్పాటు చేసినట్లు ఒమెయిర్ ఎజాజ్ భార్య కొన్ని రోజుల క్రితమే గుర్తించింది. అందులో రికార్డయిన దృశ్యాలను చూసి నిర్ఘాంతపోయింది. తన భర్త నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్ష్యాధారాలు కూడా అందజేసింది. దీంతో ఈ నెల 8వ తేదీన ఒమెయిర్ ఎజాజ్‌ను ఓక్లాండ్ కౌంటీ పోలీసులు అతడి ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంట్లో సోదా చేయగా పెద్ద సంఖ్యలో ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్కులు లభ్యమయ్యాయి. వాటిలో అభ్యంతరకరమైన వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక హార్డ్ డిస్క్‌లో 13 వేల వీడియోలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. -
Australia: ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలి మృతి
కృష్ణా జిల్లా: ఆస్ట్రేలియాలో లోయలో పడి కృష్ణా జిల్లాకు ఉంగుటూరుకు చెందిన యువ వైద్యురాలు మృతి చెందింది. తనకు ఇష్టమైన విభాగంలో పీజీ చేసి ఉన్నత స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇంతలోనే విధి ఆమెను చిన్నచూపు చూసింది. స్నేహితులతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తు మృతిచెందిన సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల(23) ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఈనెల 2వ తేదీ సరదాగా తోటి స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఉజ్వల ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో ఆమె మరణించడం తల్లిదండ్రులు, బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులైన వేమూరు మైథిలి, వెంకటేశ్వరరావు కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. శనివారం అంత్యక్రియల నిమిత్తం భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్య (మూల్పూరు రమేష్)ల ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
స్వాతి నాయక్‌కు నార్మన్ బోర్లాగ్ అవార్డు
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్– 2023 అవార్డుకు భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (ఐఆర్ఆర్ఐ)లో పనిచేస్తున్న ఆమెను అద్భుతమైన మహిళా శాస్త్రవేత్తగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అభివర్ణించింది. చిన్న రైతులు సాగు చేసేందుకు వీలయ్యే ప్రశస్తమైన వరి వంగడాల రూపకల్పనలో విశేషమైన కృషి చేశారని కొనియాడింది. ఆహారం, పోషక భద్రత, ఆకలిని రూపుమాపేందుకు ప్రత్యేకమైన కృషి సల్పే 40 ఏళ్లలోపు శాస్త్రవేత్తలకు డాక్టర్ నార్మన్ బోర్లాగ్ పేరిట రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేస్తుంది. అక్టోబర్‌లో అమెరికాలోని అయోవాలో జరిగే కార్య క్రమంలో డాక్టర్ స్వాతి పురస్కా రాన్ని అందుకోనున్నారు. అమెరికాకు చెందిన హరిత విప్లవం రూపశిల్పి, నోబెల్ గ్రహీత నార్మన్ బోర్లాగ్. కాగా, డాక్టర్ స్వాతి నాయక్ ఒడిశాకు చెందిన వారు. ఈమె 2003– 07లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదివారు. -
భార్యను చంపాలన్న ప్లాన్ బెడిసికొట్టి.. ఇప్పుడు మెంటల్ ప్లాన్
కాలిఫోర్నియా: అతడు అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారై. చాలా పేద్ద డాక్టర్. కాలిఫోర్నియాలో మంచి పేరున్న వైద్య నిపుణుడు. అయితే ఏం లాభం. బుద్ధి గడ్డి తిని భార్యా పిల్లలను చంపాలనుకున్నాడు. చివర్లో కథ అడ్డం తిరగడంతో ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. శిక్ష తప్పించుకునేందుకు మెంటల్ అంటూ నాటకం ఆడుతున్నాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక డాక్టర్ తన కుటుంబాన్ని హతమార్చాలన్న ప్రణాళిక పసిఫిక్ తీరం వద్ద 250 అడుగుల ఎత్తుకు టెస్లా కారులో తీసుకుని వెళ్ళాడు. కొండ మీదకు తీసుకెళ్లింది తడవు అక్కడినుంచి కారును ముందుకు తోసేశాడు. అదృష్టవశాత్తు ఆ కారులో ఉన్న కుటుంబ సభ్యులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. సహాయక సిబ్బంది వెంటనే స్పందించి ఇద్దరు చిన్నారులను ఆ దంపతులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. భారత సంతతికి చెందిన డాక్టర్ ధర్మేశ్ పటేల్ కాలిఫోర్నియాలో రేడియాలజిస్టుగా పనిచేస్తున్నాడు. తన భార్య నేహా పటేల్ ను ఇద్దరు పిల్లలను టెస్లా వై మోడల్ కారులో ఎక్కించుకుని శాన్ ఫ్రాన్సిస్కో వెలుపల పసిఫిక్ సముద్ర తీరానికి తీసుకుని వెళ్ళాడు. పక్కా ప్లాన్ తో మంచి వాడిగా నటిస్తూ.. వారిని కారులోనే కూర్చోబెట్టి వెనకనుంచి ముందుకు తోసేశాడు. ఇంకేముంది కారు కాస్తా కొండపై నుంచి కిందికి పడింది. జరిగింది పెద్ద ప్రమాదమే కానీ వారంతా చిన్న చిన్న గాయాలతో బయట పడ్డారు. అనంతరం విచారణ సమయంలో ధర్మేశ్ అతని కారు టైర్ సరిగ్గా పని చేయడం లేదని దాని వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులకు వివరించారు. పోలీసులు మాత్రం నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా ధర్మేశ్ తరపు లాయర్లు తన క్లయింట్ మానసిక పరిస్థితి బాగాలేదని అర్జంటుగా అతడికి ట్రీట్మెంట్ అవసరమని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. Indian-Origin Doctor Dharmesh Patel Who Drove Tesla Off Cliff With Family in California Asks Court for Mental Health Treatment #DharmeshPatel #US #California https://t.co/VCzHQSZm0O — LatestLY (@latestly) July 10, 2023 దీనిపై అతడి భార్య నేహా వాంగ్మూలం ఇస్తూ.. నా భర్త మానసిక పరిస్థితి ఎలా ఉన్నా కానీ మమ్మల్ని మాత్రం ఉద్దేశపూర్వకంగానే కొండ మీదకు తీసుకెళ్లాడని, పైశాచిక ఆనందాన్ని కనబరుస్తూ ఆయనే స్వయంగా ఆ విషయాన్ని చెప్పినట్లు తెలిపింది. కాలిఫోర్నియా హైవే అధికారులు మాట్లాడుతూ ధర్మేశ్ తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయంతోనే కారు డ్రైవ్ చేశాడని. ప్రమాదం జరిగే సమయానికి కారు ఆటోమేటిక్ మోడ్ లో లేదని తెలిపారు. ప్రమాదంలో నేహా పటేల్, ఏడేళ్ల కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి కాని వారికెలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. Doctor who drove family off cliff asks court for mental health treatment #dharmeshpatel https://t.co/9PvxnK3jfx — Eerie News (@EerieNewsToday) July 9, 2023 నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడిని రిమాండుకు తరలించాల్సిందిగా ఆదేశించినాట్లు తెలిపారు. శిక్ష నుండి తప్పించుకునేందుకే ఇప్పుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు కొత్త డ్రామాకు తెరతీశాడని వారు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: అశ్లీల చిత్రాలను పంపించమని కోరాడు.. ఉద్యోగం గోవిందా.. -
194 కేజీల బరువున్న వైద్యుడు 110 కిలోల బరువు తగ్గాడు.. తన సీక్రెట్ ఇదేనంటూ...
శరీరానికి అవసరమైనంత మేరకే కేలరీలు తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీని కొనసాగించడం ద్వారా ఎవరైనా బరువు తగ్గవచ్చని చెబుతుంటారు. దీనిని తూచా తప్పకుండా పాటించడం ద్వారా ఒక వైద్యుడు ఏకంగా 110 కిలోల బరువు తగ్గారు.ఈ వైద్యుని పేరు డాక్టర్ అనిరుద్ధ్ దీపక్. ఆయన సర్టిఫైడ్ న్యూట్రిషనిస్టు కూడా. చెన్నైకి చెందిన ఈయన 5 అడుగుల 7 ఇంచుల ఎత్తు కలిగివున్నారు. డాక్టర్ అనిరుద్ధ్ బరువు ఒకప్పుడు 194 కిలోలు ఉండేది. అయితే ఇప్పుడు అతని బరువు 80 కిలోల కన్నా తక్కువగానే ఉంది. 194 కిలోల నుంచి 80 కిలోలకు తగ్గిన అతని ఫిట్ నెస్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ అనిరుద్ధ్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి తింటూవుండటం అలవాటు. ఈ కారణంగానే నా శరీర బరువు మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. ఈ విషయన్ని నేనెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ ఫుడ్ మొదలైనవాటిని ఎంతో ఇష్టపడేవాడిని. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ పొట్ట నింపేసేవాడిని’ అని తెలిపారు. 2018లో అతని ఎంబీబీఎస్ పూర్తయ్యింది. అయితే ఇంతలోనే అనిరుద్ధ్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆసుపత్రిలో చేరాల్సివచ్చింది. ఆ సమయంలో వైద్యులు అనిరుద్ధ్తో ఇదే శరీర బరువుతో ఉంటే మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఇదే అతని జీవితంలో టర్నింగ్ పాయింట్‌గా మారింది. బరువు తగ్గాలని అనిరుద్ధ్ నిర్ణయించుకున్నారు. తాను బరువు తగ్గిన విధానం గురించి అనిరుద్ధ్ మాట్లాడుతూ ‘ఒక ట్రైనర్ నాకు డైట్, వర్కవుట్ ప్లాన్ చెప్పారు. దీనిని క్రమం తప్పకుండా అనుసరిస్తూ రెండేళ్లలో 110 కిలోల బరువు తగ్గాను. రోజులో కేవలం 5 మిల్లీలీటర్ల వంట నూనెను మాత్రమే తీసుకునేవాడిని. 2000 కేలరీలు మాత్రమే ఉండేలా చూసుకున్నాను.బ్రేక్ ఫాస్ట్‌లో పోహా లేదా చపాతీ, సోయా చంక్స్, సలాడ్ తీసుకునేవాడిని. స్నాక్స్‌లో పండ్లు, బాదాం మాత్రమే తినేవాడిని. మధ్యాహ్నం భోజనంలో రైస్ లేదా రోటీ, పప్పు లేదా రాజ్మా, కూర, పెరుగు తీసుకున్నాను.ఈవెనింగ్ స్నాక్స్‌లో ప్రొటీన్, రాత్రి ఆహారంలో రైస్ లేదా రోటీ, పన్నీర్, కూర ఉండేలా చూసుకునేవాడిని. నేను ఫిట్నెస్ జర్నీ ప్రారంభించినప్పుడు లాక్డౌన్ నడుస్తోంది.దీంతో హోమ్ వర్క్అవుట్ మాత్రమే చేయగలిగాను. ఈ సమయంలో నేను డంబెల్స్, ఫ్లోస్‌తో వ్యాయామాలు చేసేవాడిని. హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, జంప్ రోప్, సర్కిట్ ట్రైనింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్ మొదలైనవి చేసేవాడిని’ అని డాక్టర్ అనిరుద్ధ్ తెలిపారు. -
‘ఉక్రెయిన్ నుంచి రాలేను.. నా ప్రాణం కంటే చిరుత పులుల ప్రాణాలే ముఖ్యం’
Indian Doctor Refuses To Leave Ukraine: ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాక్రమణ దాడి కారణంగా వేలాదిమంది ఉక్రెయిన్ వాసుల, విదేశీయులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వలసల బాట పట్టారు. ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం కూడా ఆపరేషన్ గంగా సాయంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ పౌరులను, విద్యార్థులను తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తోంది. ఇప్పటికే చాలా మంది పౌరులను తరలించింది కూడా. ఈ క్రమంలో కొంతమంది బంకర్ల ఉన్నాముంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో విదేశాంగ కార్యాలయం రష్యాతో సంప్రదింపుల జరిపి వారిని తరలించే ప్రయత్నాలు కూడా చేసింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన డాక్టర్ గిరి కుమార్ పాటిల్ ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌లో చిక్కుకున్నాడు. ఆయన మెడిసిన్ చదవడానికి 15 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ వెళ్లాడు. ఆ తర్వాత డాన్‌బాస్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం అతను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌గా పనిచేస్తున్నారు. అయితే అతని వద్ద రెండు చిరుత పులులు ఉన్నాయి. అయితే వాటిని వదిలి తాను రాలేనని అంటున్నాడు. తన ప్రాణం కోసం పెంపుడు జంతువులను వదులుకోలేను అని చెబుతున్నాడు. ప్రస్తుతం అతను తన పులులతో కలిసి బంకర్లలో తలదాచుకుంటున్నాడు. వాటి ఆహారం కోసం మాత్రమే బయటకు వస్తున్నట్లుగా చెబుతున్నాడు. అంతేకాదు తన పెంపుడు జంతువులన్నింటినీ ఇంటికి తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం అనుమతిస్తుందని ఆశిస్తున్నాని డాక్టర్ పాటిల్ చెప్పారు. ఇలాగే గత వారం, భారతీయ విద్యార్థి రిషబ్ కౌశిక్ తన పెంపుడు కుక్కతో వచ్చేందుకు భారత ప్రభుత్వం అనుమతివ్వాలని అభ్యర్థించాడు. దీంతో అతను కేంద్ర ప్రభుత్వ చేపట్టిన ఆపరేషన్ గంగా సాయంతో తన పెంపుడు కుక్కతో సహా భారత్‌కి సురక్షితంగా తిరిగి వచ్చాడు. (చదవండి: వాషింగ్టన్లో జెలెన్స్ స్కీ పేరుతో రహదారి! వైరల్ అవుతున్న ఫోటో) -
అమెరికాలో భారతీయుడి ఘాతుకం
హూస్టన్: అమెరికాకు చెందిన భరత్ నారుమంచి అనే భారతీయ డాక్టర్ మరో మహిళా డాక్టర్‌ను కాల్చి చంపాడు. అనంతరం భరత్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే భరత్‌కు టెర్మినల్ క్యాన్సర్ నిర్ధారణైందని పోలీసులు తెలిపారు. టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరం చిల్డ్రన్స్ మెడికల్ గ్రూప్ ఆఫీసుల్లోకి డాక్టర్ భరత్ తుపాకీతో వచ్చి ఐదుగురిని బందీలుగా పట్టుకున్నాడు. అందరూ తప్పించుకోగలిగినా కాథరిన్ డాడ్సన్ అనే డాక్టర్ మాత్రం చిక్కుకుపోయారు. పోలీసులు బలవంతంగా బిల్డింగ్‌లోకి ప్రవేశించగా డాడ్సన్, భరత్ చనిపోయి కనిపించారు. డాడ్సన్‌ను కాల్చిచంపిన అనంతరం భరత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. -
విమానంలో ఇండియన్ డాక్టర్ అసభ్య ప్రవర్తన
న్యూయార్క్: విమానంలో టీనేజీ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఇండియన్ డాక్టర్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. న్యూయార్క్ పోలీసుల కథనం ప్రకారం.. గత జూలై 23న వాషింగ్టన్కు చెందిన 16 ఏళ్ల బాలిక సీటెల్ నుంచి యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో న్యూజెర్సీకి ప్రయాణించింది. విమానం ఎక్కిన కొద్దిసేపటికే బాలిక నిద్రపోయింది. ఆమె పక్కసీట్లో భారత్‌కు చెందిన 28 ఏళ్ల డాక్టర్ విజకుమార్ క్రిష్ణప్ప ఉన్నాడు. బాలిక నిద్రపోయినట్లు గమనించిన డాక్టర్ ఆమెను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. తనను ఎవరో తడుముతున్నట్లు గమనించిన బాలిక వెంటనే నిద్ర నుంచి మేల్కొంది. ఆ సమయంలో విజకుమార్ నిద్రిస్తున్నట్లు నటించాడు. కానీ ఆ వ్యక్తి మరోసారి అసభ్యంగా తనను తడమడంతో మేల్కొన్న బాలిక ఎయిర్‌లైన్స్ సిబ్బందికి చెప్పి వేరే సీట్లోకి మారింది. నేవార్క్ లిబర్టీ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవగానే పేరేంట్స్‌కు కాల్ చేసి విషయాన్ని చెప్పింది. వారు అక్కడికి చేరుకునేలోగా విజకుమార్ వెళ్లిపోయాడని గుర్తించింది. తమ కూతురు ఫిర్యాదు చేయగా నిందితుడు క్రిష్ణప్పను అరెస్ట్ చేయకుండా, అతడిపై చర్య తీసుకోకుండా వదిలేసిన యూనైటెడ్ ఎయిర్‌లైన్స్‌పై కూడా బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎఫ్‌బీఐ, ఎయిర్‌లైన్స్ వారి సహకారంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ డాక్టర్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు తన క్లయింట్ క్రిష్ణప్ప అమాయకుడని, అతడిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని డాక్టర్ తరఫు న్యాయవాది జాన్ యాక్ చెప్పారు. -
విమానంలో వైద్యం చేసిన భారతీయ డాక్టర్
కైలాలంపూర్: గాల్లో విమానం ఉంది. అందులో అత్యవసరంగా వైద్య సదుపాయం కావాల్సి వచ్చింది. ఆసమయంలో ఓభారతీయ వైద్యురాలు స్పందించి ప్రాధమిక వైద్య సదుపాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే మలేషియ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం న్యూజిలాండ్ ఎక్లాండ్ నుంచి మలేషియా కైలాలంపూర్ వెళ్తోంది. ఉన్నట్టుండి ఎయిర్ హోస్టస్ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో తనకు అత్యవసర వైద్యసహాయం అందించాల్సి వచ్చింది. చికిత్స అనంతరం ఎయిర్‌హోస్టెస్ కళ్లు తెరిచింది. దీంతో ప్రయాణికులంతా చప్పట్లతో అంచితను అభినందించారు. ఎమర్జెన్సీ లాండింగ్‌కు పైలట్ సిద్దమయ్యారు. ఎమర్జెన్సీ లాండింగ్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్లడానికి రెండుగంటలు, ఆక్లాండ్ వెళ్లడానికి గంట సమయం పడుతుందని భావించిన సిబ్బంది విమానంలో ఎవరైనా డాక్టర్ ఉంటే సహాయం అందించాలని కోరారు. దీంతో భారత్‌కు చెందిన డాక్టర్ అంచిత స్పందించారు. ఎయిర్ హోస్టెస్ కు ప్రాధమిక వైద్యం అందించారు. ఈ సంఘటన గురించి అంచిత భర్త కుమార్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అత్యవసర సమయంలో వైద్యమందించిన వ్యక్తి తన భార్య కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని పోస్ట్ చేశారు. -
నేను రేప్ చేయలేదురా నాయనో!!
చికిత్స చేయించుకోడానికి వచ్చిన ఇద్దరు మహిళలపై తాను అత్యాచారం చేయలేదంటూ ఓ భారత సంతతి వైద్యుడు ఆస్ట్రేలియా కోర్టుకు మొరపెట్టుకున్నాడు. కేరళలోని కొచ్చికి చెందిన మను మైంబిల్లీ గోపాల్ ఆస్ట్రేలియాలో వైద్యుడిగా ఉన్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో సన్బరీ క్లినిక్‌కు కడుపునొప్పితో వచ్చిన ఇద్దరు మహిళలపై ఆయన అత్యాచారం చేశారని ఆరోపణలొచ్చాయి. మార్చి ఒకటో తేదీన భారత్ వెళ్లే విమానం ఎక్కేందుకు మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేచి చూస్తుండగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 29న పోలీసులు ఆయనను ఆరోపణలపై ప్రశ్నించగా, కొచ్చి వెళ్లేందుకు రాత్రి ఒంటిగంట సమయంలో ఉన్న విమానాన్ని ఉదయం 11 గంటలకు మార్చుకున్నారని స్థానిక పత్రికలలో కథనం వచ్చింది. అరెస్టు నుంచి తప్పించుకోడానికే ఇలా చేశారని పేర్కొన్నారు. అయితే, తాను చాలా భయపడిపోయానని, ఏం చేయాలో సరిగా ఆలోచించలేకపోయానని డాక్టర్ గోపాల్ తెలిపారు. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలన్నది మాత్రమే తన ఆలోచన అన్నారు. కేవలం తన లైంగిక వాంఛలు తీర్చుకోడానికే గోపాల్ ఆ ఇద్దరు మహిళలకు వైద్య పరీక్షలు చేయాలనుకున్నట్లు ప్రాసిక్యూటర్ లెస్లీ టేలర్ కోర్టులో వాదించాచు. డాక్టర్ గోపాల్ వృత్తిపరంగా మంచి వైద్యుడా కాదా అన్నదాని గురించి ఈ విచారణ జరగట్లేదని, కేవలం ఆ సంఘటన మీదే జరుగుతోందని టేలర్ అన్నారు. నలుగురు బిడ్డల తల్లి అయిన రెండో బాధితురాలిని పరీక్ష చేసే సమయంలో డాక్టర్ గోపాల్ చాలా అసభ్యంగా మాట్లాడారని, అది సరికాదని టేలర్ చెప్పారు. కానీ డిఫెన్స్ లాయర్ మైఖేల్ టోవీ మాత్రం ఈ వాదనలను ఖండించారు. ఒకవేళ డాక్టర్ గోపాల్ నిజంగానే అసభ్యంగా ప్రవర్తించి ఉంటే కేవలం ఒకరిద్దరు వ్యక్తులు మాత్రమే ఎందుకు ఇబ్బంది పడతారని ఆయన అడిగారు. ఆయన సాధారణ ఒత్తిడికి సంబంధించిన కేసులను ఆస్ట్రేలియాలో చూస్తుంటారని, దీంతోపాటు క్లినిక్ బాధ్యతలు కూడా ఆయనమీదే ఉన్నాయని తెలిపారు. గోపాల్ భార్యా బిడ్డలు భారతదేశంలో ఉంటారని, ఇక్కడ ఆయన ఒంటరిగా మిగిలిపోయారని అన్నారు. ఉద్యోగం లేక, కుటుంబ లేక దారుణమైన పరిస్థితిలో ఆయన చిక్కుకున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయం తప్పేమీ కాదని వాదించారు. అసలు వారిద్దరిపైనా డాక్టర్ గోపాల్ అత్యాచారానికి ప్రయత్నించనే లేదని.. కచ్చితంగా చెప్పారు.