అమెరికాలో భారతీయుడి ఘాతుకం | Indian-origin pediatrician fatally shoots another doctor | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారతీయుడి ఘాతుకం

Published Sat, Jan 30 2021 5:35 AM | Last Updated on Sat, Jan 30 2021 7:01 AM

Indian-origin pediatrician fatally shoots another doctor - Sakshi

హూస్టన్‌: అమెరికాకు చెందిన భరత్‌ నారుమంచి అనే భారతీయ డాక్టర్‌ మరో మహిళా డాక్టర్‌ను కాల్చి చంపాడు. అనంతరం భరత్‌ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే భరత్‌కు టెర్మినల్‌ క్యాన్సర్‌ నిర్ధారణైందని పోలీసులు తెలిపారు. టెక్సాస్‌ రాష్ట్రం ఆస్టిన్‌ నగరం చిల్డ్రన్స్‌ మెడికల్‌ గ్రూప్‌ ఆఫీసుల్లోకి డాక్టర్‌ భరత్‌ తుపాకీతో వచ్చి ఐదుగురిని బందీలుగా పట్టుకున్నాడు. అందరూ  తప్పించుకోగలిగినా కాథరిన్‌ డాడ్సన్‌ అనే  డాక్టర్‌ మాత్రం చిక్కుకుపోయారు. పోలీసులు బలవంతంగా బిల్డింగ్‌లోకి ప్రవేశించగా డాడ్సన్, భరత్‌ చనిపోయి కనిపించారు. డాడ్సన్‌ను కాల్చిచంపిన అనంతరం భరత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement