Female doctor
-
మరో వైద్యురాలిపై దాడి.. నిందితులు పరార్
దేశంలో ఎక్కడో ఒకచోట వైద్యులపై దాడులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ముంబైలోని సియోన్ ఆస్పత్రిలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. ఓ వైద్యురాలిపై రోగి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ ఉదంతంలో ఆ వైద్యురాలు గాయపడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈరోజు(ఆదివారం) తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై బీఎంసీ ఎంఏఆర్డీ అసోసియేషన్ వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వైద్యురాలిపై దాడి చేసిన వారంతా మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. వీరు ఆమెపై దాడికి పాల్పడిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.కాగా కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన తర్వాత, దేశవ్యాప్తంగా వైద్యులు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. తాజాగా సియోన్ ఆస్పత్రిలో జరిగిన ఘటనతో వైద్యుల భద్రతపై మరోసారి పలు సందేహాలు తలెత్తుతున్నాయి. -
చిన్నారి మహిళ
ఆనందీబాయి పాశ్చాత్య వైద్యశాస్త్రంలో పట్టా పొందిన తొలి భారతీయ వనిత. పుణెకు చెందిన ఒక సంపన్న శ్రోత్రియ కుటుంబంలో ఆనందీ జన్మించారు. ఆమెకు తొమ్మిదో ఏటనే వివాహం చేశారు. ఆనందీ తన 14వ ఏట ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డ పదిరోజులకే కన్నుమూయడం ఆమెను కలచివేసింది. బిడ్డకు సరైన వైద్యం అందలేదు. ఆ బాధ నుంచే ఆమెకు తానే వైద్య విద్యను అభ్యసించి, భారతదేశ చిన్నారులకే కాదు, తల్లులకు కూడా వైద్యసేవలు అందించాలన్న గొప్ప సంకల్పం కలిగింది. ఆమె భర్త గోపాల్‌రావు వైద్య విద్య కోసం పరిచయస్థుల ద్వారా ఆమెకు అమెరికాలో సీటు సంపాదించారు. భార్యను దించి రావడానికి జోషి ప్రయాణ సన్నాహాలు ప్రారంభించారు. అప్పుడే ఆనందీ ఆరోగ్యంలో మార్పులు ప్రారంభమయ్యాయి. నిరంతరం నిస్సత్తువగా అనిపించేది. తరచూ శిరోభారం ఒకటి. అడపాదడపా జ్వరం. ఒక్కొక్కసారి ఊపిరి సలపనట్టు ఉక్కిరి బిక్కిరిగా ఉండేది. అమెరికా చలి, ఆహారం ఆనందీ ఆరోగ్యాన్ని కుంగదీయడం మొదలుపెట్టాయి. అయినా ఆమె చదువు విషయంలో అశ్రద్ధ చేయలేదు. ఆమె డిగ్రీ తీసుకునే సమయంలో ‘ఫిలడెల్ఫియా పోస్ట్’ పత్రిక చేసిన వ్యాఖ్య ఇందుకు నిదర్శనం. తరగతిలో ఈ ‘చిన్నారి మహిళ’ ఎంతో ప్రతిభ కనపరిచిందని ఆ పత్రిక రాసింది. 1886 మార్చి 11 న ఆమె ఎం.డి. పట్టా పొందారు. ఈ పట్టా కోసం ఆమె రాసిచ్చిన సిద్ధాంత వ్యాసం ఏమిటో తెలుసా? ‘పురాతన భారతదేశంలో ప్రసూతి పద్ధతులు’. మహారాష్ట్రలో నాడు స్త్రీ విద్య కోసం పాటు పడుతున్న సంస్కర్త పండిత రమాబాయి, గోపాల్రావ్ జోషి కలసి ఆనందీ పట్టా తీసుకున్న స్నాతకోత్సవానికి వెళ్లారు. ఆ ఇద్దరితో కలసి ఆమె ఇండియా బయలుదేరింది. బొంబాయిలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. కానీ ఆమె ఆశయం నెరవేరలేదు. వైద్య విద్యను అభ్యసించినా, పూర్తి స్థాయిలో తన దేశపు మహిళలకు వైద్యం అందించే అవకాశం ఆమెకు రాలేదు. 21 ఏళ్లు దాటి, 22వ సంవత్సరంలోకి ప్రవేశించిన నెలకే ఆనందీ క్షయ వ్యాధి ముదిరి 1887 ఫిబ్రవరి 26 న శాశ్వతంగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. న్యూయార్క్‌లో ఆమెకు ఆశ్రయం ఇచ్చిన మహిళ థియోడిసియా కూడా చలించిపోయారు. ఆనందీ చితాభస్మాన్ని అమెరికాకు తెప్పించుకుని హడ్సన్‌లోని స్మశానవాటికలో తన కుటుంబ సభ్యుల సమాధుల మధ్య ఉంచి, ఆమె పేరున కూడా థియోడిసియా ఒక సమాధిని నిర్మించారు. (చదవండి: మహోజ్వల భారతి: సరెండర్ నాట్ బెనర్జీ ) -
తల్లి, సోదరిని చంపి తానూ చావాలనుకుంది..
సూరత్: తల్లి, సోదరికి ఇంజెక్షన్లు ఇచ్చి చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని గుజరాత్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్ ప్రయత్నించారు. గుజరాత్‌లోని కాటగ్రామ్లో జరిగిన ఈ ఘటనలో తల్లి, సోదరి మరణించగా ఆత్మహత్యాయత్నం చేసిన డాక్టర్ దర్శన ప్రజాపతి (30) మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆమె ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక ఏసీపీ డీజే చద్వా ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి డాక్టర్ దర్శన తన తల్లి మంజులాబెన్ (59), సోదరి ఫాల్గుని (28)లకు డ్రగ్స్‌ను ఇంజెక్షన్ రూపంలో ఇచ్చారు. అనంతరం ఆమె కూడా నిద్రమాత్రలు మింగారు. ఆదివారం ఉదయానికి తల్లీ, సోదరి మరణించగా ఆమె మాత్రం ప్రాణాలతో మిగిలారు. తనకు జీవితంపై విరక్తి కలిగిందనీ, తల్లి్ల, సోదరి తనపైనే ఆధారపడి ఉండటంతో వారిని కూడా అంతం చేయాలని భావించినట్లు దర్శన పోలీసులకు వెల్లడించారు. -
భారత తొలి మహిళ డాక్టర్ ఎవరో తెలుసా...?
కోల్‌కతా: భారత తొలి మహిళ డాక్టర్ కాదంబిని గంగూలీ. ఆనాటి పురుషాధిక్య సమాజంలో గెలిచి, విజయవంతంగా డాక్టర్ విద్యను పూర్తి చేశారు. నేడు గంగూలీ పుట్టినరోజు. కాదంబిని గంగూలీ జూలై 18, 1861 జన్మించారు. కాదంబిని గంగూలీ 160 వ జయంతిని పురస్కరించుకొని గూగుల్ డూడల్ను విడుదల చేసింది. డూడుల్‌లో భాగంగా కోల్‌కతా మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ప్రధాన భవనం చిత్రంతో పాటు గంగూలీ ఫోటో వచ్చేలా గూగుల్ డూడుల్‌ను రూపొందించింది. కాగా ఈ డూడుల్‌ను బెంగళూరుకు చెందిన ఆర్టిస్ట్ ఒడ్రిజా రూపొందించారు. రాజకీయ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు గంగూలీని దేశంలో మహిళల హక్కులకోసం పాటుపడిన వ్యక్తిగా కీర్తించారు. గంగూలీ ఆనాటి సమాజపు పోకడలను పట్టించుకోకుండా ముందుకు సాగింది. కాగా గంగూలీకి సమాజం నుంచి అనేక విమర్శలను ఎదుర్కొంది. ఎడిన్బగ్ నుంచి భారత్‌కి తిరిగి వచ్చి మహిళల హక్కుల కోసం ప్రచారం చేసింది. ఒకానొక సమయంలో బెంగాలీ పత్రిక ఆమెను పరోక్షంగా బంగాబాషిలో 'వేశ్య' అని పిలిచింది. ఆమె భర్త ద్వారకానాథ్ గంగూలీ ఈ కేసును కోర్టుకు తీసుకెళ్లి గెలిచారు, 6 నెలల జైలు శిక్షతో ఎడిటర్ మహేష్ పాల్‌కు శిక్షను విధించారు. -
మూడు గంటలే నిద్ర: సేవలో.. ‘సుగుణావతి’
గుడ్లవల్లేరు (గుడివాడ): ఓ పక్క కరోనా రోగులకు సేవలు అందిస్తూ.. వారిలో ధైర్యాన్ని నింపుతూ.. మరోపక్క వ్యాక్సిన్లు అందజేస్తూ కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు డాక్టర్ చింతపల్లి సుగుణావతి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె పనిచేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో 2 వేల మందికి పైగా పాజిటివ్ కేసులు ఆమె వద్దకు వచ్చాయి. అందులో ఇద్దరు మాత్రమే మృతి చెందారు. 10 మంది ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. గతేడాది 550 పాజిటివ్ కేసుల్లో ఒకే ఒక్క మరణం సంభవించింది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో ఆమె 5 వేల మందికి పైగా కరోనా పరీక్షలు చేశారు. వ్యాక్సిన్ అత్యధికంగా 10 వేల మందికి పైగా వేసిన డాక్టర్‌గా సుగుణావతి రికార్డు సృష్టించారు. మూడు గంటలే నిద్ర.. ఈ కరోనా సంక్షోభంలో బాధితులకు సేవలను అందించకపోతే ఈ వైద్య వృత్తిలో పనిచేయడం అనవసరం. నేను నిద్రపోయేసరికి రోజూ తెల్లవారుజామున 3 గంటలు అవుతోంది. మళ్లీ ఉదయం 6 గంటలకు లేచి హాస్పిటల్‌కు వస్తున్నాను. నాకు తొమ్మిదేళ్ల బాబు ఉన్నాడు. బాబు బాధ్యతను అమ్మ వరలక్ష్మికి అప్పగించి నేను వృత్తికి అంకితమవుతున్నా. వైద్యంతో కోలుకునేలా చేశానని నా కంటే వయసులో పెద్దవారు నా కాళ్లు పట్టుకుంటున్నారు. నమస్కారాలు పెడుతున్నారు. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వైద్య వృత్తిలో ఉండి ఈ సంక్షోభంలో ప్రభుత్వం అంత చేస్తుంటే మనం ఈ మాత్రం ప్రజల్ని బతికించకపోతే ఇంకెందుకు అనే అనుకుంటూ పనిచేస్తున్నాను. – డాక్టర్ సుగుణావతి చదవండి: కరోనా: ఒక్కడే.. ఆ నలుగురై! కరోనాను జయించిన 92 ఏళ్ల బామ్మ -
అమెరికాలో భారతీయుడి ఘాతుకం
హూస్టన్: అమెరికాకు చెందిన భరత్ నారుమంచి అనే భారతీయ డాక్టర్ మరో మహిళా డాక్టర్‌ను కాల్చి చంపాడు. అనంతరం భరత్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే భరత్‌కు టెర్మినల్ క్యాన్సర్ నిర్ధారణైందని పోలీసులు తెలిపారు. టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరం చిల్డ్రన్స్ మెడికల్ గ్రూప్ ఆఫీసుల్లోకి డాక్టర్ భరత్ తుపాకీతో వచ్చి ఐదుగురిని బందీలుగా పట్టుకున్నాడు. అందరూ తప్పించుకోగలిగినా కాథరిన్ డాడ్సన్ అనే డాక్టర్ మాత్రం చిక్కుకుపోయారు. పోలీసులు బలవంతంగా బిల్డింగ్‌లోకి ప్రవేశించగా డాడ్సన్, భరత్ చనిపోయి కనిపించారు. డాడ్సన్‌ను కాల్చిచంపిన అనంతరం భరత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. -
డాక్టర్ ప్రియాంక సూసైడ్ కేసులో పురోగతి
విజయవాడ: విజయవాడలో కలకలం రేపిన డాక్టర్ ప్రియాంక సూసైడ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ నవీన్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 31న భవానీపురంలోని ఇంట్లో వైద్యురాలు ప్రియాంక ఆత్మహత్య చేసుకున్నారు. డాక్టర్ నవీన్ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకొంటున్నట్టు ఆమె సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ప్రియాంక ఆత్మహత్య చేసుకున్న నాటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం మదనపల్లి, నెల్లూరు, కర్నూలులో గాలింపు చేపట్టగా, ఆదివారం కర్నూలులో పోలీసులకు చిక్కాడు. సూసైడ్ లెటర్ ఆధారంగా డాక్టర్ నవీన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డాక్టర్ ప్రియాంక ఆత్యహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. -
మహిళా డాక్టర్‌ను వేధిస్తోన్న వైద్యాధికారి
-
రుయా ఆసుపత్రిలో నిఫా వైరస్ కలకలం
-
మహిళా డాక్టర్‌పై తండ్రి వేధింపులు?
టీనగర్: తిరునెల్వేలిలో మహిళా డాక్టర్‌పై ఆమె తండ్రి లైంగికంగా వేధించి, హోంలో నిర్బంధించారు. ఆమెను తనతో పనిచేస్తున్న డాక్టర్, స్నేహితురాళ్లు విడిపించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే,తూత్తుకుడికి చెందిన లూర్థురాజ్ చెన్నైలో కెమికల్ వ్యాపారం చేస్తున్నారు. ఇతనికి భార్య శాంత ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. ప్రస్తుతం వీరు చెన్నై ఎర్నావూరు రామకృష్ణానగర్‌లో నివసిస్తున్నారు. కుమార్తె నందిని చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో దంత వైద్యురాలిగా పని చే స్తున్నారు. అయితే నందినికి మానసిక స్థితి సరిలేదని చెప్పి ఆమె తండ్రి, బంధువులు పాళయంకోట్టైలోని మానసిక వికలాంగుల కేంద్రంలో చేర్పించారు. బుధవారం ఆమెను చూసేందుకు ఆమెతో పాటు పనిచేసిన డాక్టర్, స్నేహితురాళ్లు వచ్చారు. అయితే నందినిని చూసేందుకు హోం నిర్వాహకులు అనుమతించలేదు. దీనిపై ఐద్వాకు చెందిన న్యాయవాదులు పళని, భాస్కర్‌కు తెలిపారు. వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అనుమతి లభించింది. ఆమెను ప్రత్యేక గదిలో నిర్బంధించి కిటికీ ద్వారా మాత్రమే చూసేందుకు అనుమతినిచ్చారు. అప్పుడు నందిని జరిగిన సంఘటనల వివరాలను వారికి తెలిపి రోదించింది. ఒక లేఖను కూడా వారికి అందజేసింది. దీంతో ఆమెను హోం నుంచి విడిపించేందుకు చర్యలు తీసుకున్నారు. గురువారం ఉదయం 8.30 గంటలకు స్నానం చేసేందుకు వెళ్లిన నందిన హోం నుంచి తప్పించుకుని బయటికి వచ్చింది. అక్కడ సిద్ధంగా వున్న న్యాయవాదులు, స్నేహితురాళ్లు ఆమెను కారులో ఎక్కించుకున్నారు. దీన్ని గమనించిన హోం వార్డెన్లు వారిని అడ్డుకోడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ వారి నుంచి తప్పించుకుని నందినిని పాళయంకోట్టై మహిళా పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అంతలోనే హోం నుంచి నందినిని కిడ్నాప్ చేసినట్లు హోం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ జరిపారు. నందిని వద్ద పోలీసులు జరిపిన విచారణలో అనేక వివరాలు తెలిశాయి. నందిని మానసిక రోగి కాదని, చదువుతున్న సమయంలో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించిందని, తండ్రి లూర్థురాజ్ కుమార్తెను లైంగికంగా వేధించడంతో, ఆమె 15 రోజుల క్రితం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసంది. దీంతో ఆమెను పాళయంకోట్టైలోగల ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ నుంచి పాళయంకోట్టైలో గల మహిళా సంరక్షణాలయంలో చేర్చారు. దీనిపై నందిని పాళయంకోట్టై మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి లూర్థురాజ్ అతనికి సహకరించిన వారి కోసం గాలిస్తున్నారు. తండ్రిపై అభాండాలు: తల్లి వసంత వివాహమైన డాక్టర్‌తో నందినికి సంబంధం వున్నందు న దీనిని దారి మళ్లించేందుకే తండ్రిపై అభాండాలు వేస్తున్నట్లు నందిని తల్లి వసంత ఆరోపించారు. చెన్నై కు చెందిన డాక్టర్ దినేష్ తన మొదటి భార్య వుండగానే ఆస్పత్రిలో పనిచేస్తున్న మరొక మహిళా డాక్టర్‌ను వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా, ఈ వ్యవహారం పోలీసులకు వెళ్లడంతో వివాహం నిలిచిపోయిందన్నారు.అతను తన కుమార్తెను లొంగదీసుకున్నాడని ఆరోపించారు. అతడి ప్రేమ మోహం లో ఉన్న నందిని తన తండ్రిపైనే అభాండాలు వేస్తునట్లు తెలిపారు. -
మహిళా డాక్టర్‌తో అసభ్యప్రవర్తన
వైద్య సదస్సులో పాల్గొనేందుకు ముంబై నుంచి వచ్చిన డాక్టర్ హోటల్లో బస మారు తాళం చెవితో తలుపులు తెరచిన ఐదుగురు నిందితులు నాగోలు: వైద్య సదస్సులో పాల్గొనేందుకు ముంబై నుంచి నగరానికి వచ్చిన ఓ మహిళా డాక్టర్‌పై ఇద్దరు హోటల్ సిబ్బందితో పాటు మరో ముగ్గురు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైకి చెందిన మహిళా డాక్టర్ (35), మరో డాక్టర్‌తో కలిసి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగే వైద్య సదస్సులో పాల్గొనేందుకు ఎల్బీనగర్కు వచ్చారు. నిర్వాహకులు అభినందన గ్రాండ్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. మహిళా డాక్టర్‌కు ఒకగది, ఆమెతో పాటు వచ్చిన డాక్టర్‌కు మరో గది కేటాయించారు. రాత్రి 10.30 గంటలకు అదే హోటల్లో గదిని అద్దెకు తీసుకున్న భూపాల్‌రెడ్డి, యాదగిరి, దిలీప్, హోటల్ సూపర్వైజర్ నర్సింహ్మ మద్యం సేవించి మహిళా డాక్టర్ గది గడియను కొట్టారు. దీంతో ఆమె గది తలుపులు తెరిచింది. ఒంటరిగా ఉన్న విషయాన్ని వారు గుర్తించారు. సారి మేడమ్..మేము వేరే గదికి వెళ్లాలని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అరగంట తరువాత హోటల్ మేనేజర్‌తో కలిసి మొత్తం ఐదుగురు మారు తాళం చెవితో గది తలుపులు తెరిచి లోనికి చొరబడ్డారు. ప్రమాదం పసిగట్టిన బాధితురాలు వెంటనే అవేర్ ఆస్పత్రి డాక్టర్లకు సమాచారం అందించారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పది నిమిషాల్లో హోటల్‌కు చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు పారిపోయేందుకు యత్నించారు. వారిని వెంబడించి పట్టుకుని ఠాణాకు తరలించారు. డాక్టర్ ఫిర్యాదు మేరకు పై ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. అభినందన గ్రాండ్ హోటల్లో సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.