firining
-
Amritsar: భార్య, పిల్లల ఎదుటే ఎన్నారైపై కాల్పులు..
అమృత్సర్: అమెరికా నుంచి వచ్చిన ఓ ఎన్నారైపై పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. డబుర్జి ప్రాంతంలోని అతని నివాసంలో శనివారం .. భార్య పిల్లల ఎదుటే కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అతడికి గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అమెరికా నివాసి అయిన సుఖ్‌చైన్ సింగ్ అనే ఎన్నారై నెల రోజుల క్రితం సొంతూరైన అమృత్‌సర్‌లోని డబుర్జి గ్రామానికి వచ్చాడు. హోటల్, లగ్జరీ కారు కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తలపాగా ధరించిన ఇద్దరు సాయుధ వ్యక్తులు బైక్‌పై సుఖ్‌చైన్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. లోనికి చొరబడి తుపాకీతో బెదిరించి అతడితో వాగ్వాదానికి దిగారు.ఇంట్లో ఉన్న పిల్లలు, అతడి తల్లి ఏమీ చేయవద్దని వారిని ప్రాథేయపడ్డారు. అయితే సుఖ్‌చైన్ సింగ్‌ను బలవంతంగా బెడ్రూమ్లోకి తీసుకెళ్లేందుకు ఆ ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. అతడు ప్రతిఘటించడంతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో తల, మెడపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.రెంబు బెల్లెట్లు తగిలి తీవ్రంగా గాయమవ్వడంతో సింగ్‌ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలసీఉలు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగులు కాల్పులు జరపడం ఆ ఇంట్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ప్రస్తుతం సుఖ్‌చైన్ సింగ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. అత్త వారింటికి సంబంధించిన ఆస్తి వివాదం వల్ల స్థానిక గ్యాంగ్ సభ్యులు అతడిపై కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
Iran Hijab Protest: మరో ఇద్దరు ఆందోళకారులు మృతి
సులిమానియా: ఇరాన్లో నాలుగు వారాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో మరో ఇద్దరు చనిపోయారు. నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కుర్దిష్ ప్రాబల్య సనందాజ్ పట్టణంలో శనివారం ప్రదర్శన చేపట్టారు. నిరసనలో భాగంగా కారు హారన్ మోగించిన ఓ వ్యక్తి భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయారని మానవహక్కుల సంఘాలు తెలిపాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు బలగాలు జరిపిన కాల్పుల్లో మరో వ్యక్తి చనిపోయాడని పేర్కొన్నాయి. హిజాబ్ ధరించలేదనే కారణంతో మోరల్ పోలీసులు అరెస్ట్ చేసిన మహ్సా అమిని(22) అనే కుర్దిష్ మహిళ కస్టడీలో మృతి చెందింది. నిరసనగా సెప్టెంబర్ 17 నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. చదవండి: పాకిస్థాన్ మాజీ ప్రధాని అరెస్టుకు రంగం సిద్ధం! -
పాక్ వ్యతిరేక నినాదాలు.. కాల్పులు జరిపిన తాలిబన్లు
కాబూల్: తాలిబన్ల ఆక్రమణ నాటి నుంచి అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో హై టెన్షన్ నెలకొంది. తాలిబన్లకు పాకిస్తాన్ సహకరిస్తోందని అఫ్గనిస్తాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్ తీరుకు నిరసనగా పలువురు అఫ్గన్ వాసులు పాక్ ఎంబసీ వద్ద ఆందోళనలకు దిగారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. వీరంతా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. అఫ్గన్ వాసుల చర్యల పట్ల తాలిబన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టేందకు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (చదవండి: పాక్ సహా ఏ దేశ జోక్యాన్ని సహించం: తాలిబన్లు) కాబూల్‌లోని పాకిస్తాన్ ఎంబసీ ఎదురుగా స్థానికుల ఆందోళనకు దిగారు. అఫ్గనిస్తాన్ వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యంపై ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల్లో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో ఎంబసీ ప్రాంతం హోరెత్తిపోయింది. అయితే నిరసనలను జీర్ణించుకోలేక పోయిన తాలిబన్లు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. నిరసనకారులు పరుగులు పెట్టారు. తాలిబన్ల తాజా చర్యలతో వారి వైఖరి ఏ మాత్రం మారలేదని.. హింసే వారి ఆయుధమని.. శాంతి మంత్రం వారికి రుచించదని మరోసారి రుజువుయ్యింది. చదవండి: తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి! Kabul Protest started from Pakistani embassy and continued till the presidential palace. The Taliban was seen shooting after that to disperse the crowd. pic.twitter.com/yJuwYWT9vl — Sidhant Sibal (@sidhant) September 7, 2021 -
అమెరికాలో భారతీయుడి ఘాతుకం
హూస్టన్: అమెరికాకు చెందిన భరత్ నారుమంచి అనే భారతీయ డాక్టర్ మరో మహిళా డాక్టర్‌ను కాల్చి చంపాడు. అనంతరం భరత్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే భరత్‌కు టెర్మినల్ క్యాన్సర్ నిర్ధారణైందని పోలీసులు తెలిపారు. టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరం చిల్డ్రన్స్ మెడికల్ గ్రూప్ ఆఫీసుల్లోకి డాక్టర్ భరత్ తుపాకీతో వచ్చి ఐదుగురిని బందీలుగా పట్టుకున్నాడు. అందరూ తప్పించుకోగలిగినా కాథరిన్ డాడ్సన్ అనే డాక్టర్ మాత్రం చిక్కుకుపోయారు. పోలీసులు బలవంతంగా బిల్డింగ్‌లోకి ప్రవేశించగా డాడ్సన్, భరత్ చనిపోయి కనిపించారు. డాడ్సన్‌ను కాల్చిచంపిన అనంతరం భరత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. -
ముంబైలో వాహనాలను తగులబెట్టిన ఆందోళనకారులు
-
ముంబైలో వాహనాలను తగులబెట్టిన ఆందోళనకారులు
ముంబై: మహానగరం ముంబై అట్టుడుకుతోంది. లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంపై కొందరు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. శుక్రవారం నిరసనకు చేపట్టిన ఆందోళన కారులు పలు వాహనాలను తగులబెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్త మారడంతో వారిని పోలీసులు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆందోళనకారులపై లాఠీచార్జికి దిగారు. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లపై కూడా ప్రభావం ఉండటంతో పలు రైళ్లు పాక్షికంగా నిలిచిపో్యాయి. ప్రస్తుతం నాలుగు ట్రాక్ లపై రైళ్లు పూర్తిగా స్తంభించిపోయాయి.