
సులిమానియా: ఇరాన్‌లో నాలుగు వారాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో మరో ఇద్దరు చనిపోయారు. నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కుర్దిష్ ప్రాబల్య సనందాజ్ పట్టణంలో శనివారం ప్రదర్శన చేపట్టారు. నిరసనలో భాగంగా కారు హారన్ మోగించిన ఓ వ్యక్తి భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయారని మానవహక్కుల సంఘాలు తెలిపాయి.
నిరసనకారులను చెదరగొట్టేందుకు బలగాలు జరిపిన కాల్పుల్లో మరో వ్యక్తి చనిపోయాడని పేర్కొన్నాయి. హిజాబ్ ధరించలేదనే కారణంతో మోరల్ పోలీసులు అరెస్ట్ చేసిన మహ్సా అమిని(22) అనే కుర్దిష్ మహిళ కస్టడీలో మృతి చెందింది. నిరసనగా సెప్టెంబర్ 17 నుంచి ఆందోళనలు మొదలయ్యాయి.
చదవండి: పాకిస్థాన్ మాజీ ప్రధాని అరెస్టుకు రంగం సిద్ధం!