అమృత్‌సర్: అమెరికా నుంచి వచ్చిన ఓ ఎన్నారైపై పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. డబుర్జి ప్రాంతంలోని అతని నివాసంలో శనివారం .. భార్య పిల్లల ఎదుటే కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అతడికి గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అమెరికా నివాసి అయిన సుఖ్‌చైన్ సింగ్ అనే ఎన్నారై నెల రోజుల క్రితం సొంతూరైన అమృత్‌సర్‌లోని డబుర్జి గ్రామానికి వచ్చాడు. హోటల్, లగ్జరీ కారు కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తలపాగా ధరించిన ఇద్దరు సాయుధ వ్యక్తులు బైక్‌పై సుఖ్‌చైన్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. లోనికి చొరబడి తుపాకీతో బెదిరించి అతడితో వాగ్వాదానికి దిగారు.
ఇంట్లో ఉన్న పిల్లలు, అతడి తల్లి ఏమీ చేయవద్దని వారిని ప్రాథేయపడ్డారు. అయితే సుఖ్‌చైన్ సింగ్‌ను బలవంతంగా బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లేందుకు ఆ ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. అతడు ప్రతిఘటించడంతో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తల, మెడపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.
రెంబు బెల్లెట్‌లు తగిలి తీవ్రంగా గాయమవ్వడంతో సింగ్‌ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలసీఉలు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగులు కాల్పులు జరపడం ఆ ఇంట్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రస్తుతం సుఖ్‌చైన్ సింగ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. అత్త వారింటికి సంబంధించిన ఆస్తి వివాదం వల్ల స్థానిక గ్యాంగ్ సభ్యులు అతడిపై కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment