కాలిఫోర్నియా: అతడు అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారై. చాలా పేద్ద డాక్టర్. కాలిఫోర్నియాలో మంచి పేరున్న వైద్య నిపుణుడు. అయితే ఏం లాభం. బుద్ధి గడ్డి తిని భార్యా పిల్లలను చంపాలనుకున్నాడు. చివర్లో కథ అడ్డం తిరగడంతో ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. శిక్ష తప్పించుకునేందుకు మెంటల్ అంటూ నాటకం ఆడుతున్నాడు.
శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక డాక్టర్ తన కుటుంబాన్ని హతమార్చాలన్న ప్రణాళిక పసిఫిక్ తీరం వద్ద 250 అడుగుల ఎత్తుకు టెస్లా కారులో తీసుకుని వెళ్ళాడు. కొండ మీదకు తీసుకెళ్లింది తడవు అక్కడినుంచి కారును ముందుకు తోసేశాడు. అదృష్టవశాత్తు ఆ కారులో ఉన్న కుటుంబ సభ్యులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. సహాయక సిబ్బంది వెంటనే స్పందించి ఇద్దరు చిన్నారులను ఆ దంపతులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
భారత సంతతికి చెందిన డాక్టర్ ధర్మేశ్ పటేల్ కాలిఫోర్నియాలో రేడియాలజిస్టుగా పనిచేస్తున్నాడు. తన భార్య నేహా పటేల్ ను ఇద్దరు పిల్లలను టెస్లా వై మోడల్ కారులో ఎక్కించుకుని శాన్ ఫ్రాన్సిస్కో వెలుపల పసిఫిక్ సముద్ర తీరానికి తీసుకుని వెళ్ళాడు. పక్కా ప్లాన్ తో మంచి వాడిగా నటిస్తూ.. వారిని కారులోనే కూర్చోబెట్టి వెనకనుంచి ముందుకు తోసేశాడు. ఇంకేముంది కారు కాస్తా కొండపై నుంచి కిందికి పడింది. జరిగింది పెద్ద ప్రమాదమే కానీ వారంతా చిన్న చిన్న గాయాలతో బయట పడ్డారు.
అనంతరం విచారణ సమయంలో ధర్మేశ్ అతని కారు టైర్ సరిగ్గా పని చేయడం లేదని దాని వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులకు వివరించారు. పోలీసులు మాత్రం నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా ధర్మేశ్ తరపు లాయర్లు తన క్లయింట్ మానసిక పరిస్థితి బాగాలేదని అర్జంటుగా అతడికి ట్రీట్మెంట్ అవసరమని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
Indian-Origin Doctor Dharmesh Patel Who Drove Tesla Off Cliff With Family in California Asks Court for Mental Health Treatment #DharmeshPatel #US #California https://t.co/VCzHQSZm0O
— LatestLY (@latestly) July 10, 2023
దీనిపై అతడి భార్య నేహా వాంగ్మూలం ఇస్తూ.. నా భర్త మానసిక పరిస్థితి ఎలా ఉన్నా కానీ మమ్మల్ని మాత్రం ఉద్దేశపూర్వకంగానే కొండ మీదకు తీసుకెళ్లాడని, పైశాచిక ఆనందాన్ని కనబరుస్తూ ఆయనే స్వయంగా ఆ విషయాన్ని చెప్పినట్లు తెలిపింది.
కాలిఫోర్నియా హైవే అధికారులు మాట్లాడుతూ ధర్మేశ్ తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయంతోనే కారు డ్రైవ్ చేశాడని. ప్రమాదం జరిగే సమయానికి కారు ఆటోమేటిక్ మోడ్ లో లేదని తెలిపారు. ప్రమాదంలో నేహా పటేల్, ఏడేళ్ల కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి కాని వారికెలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు.
Doctor who drove family off cliff asks court for mental health treatment #dharmeshpatel https://t.co/9PvxnK3jfx
— Eerie News (@EerieNewsToday) July 9, 2023
నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడిని రిమాండుకు తరలించాల్సిందిగా ఆదేశించినాట్లు తెలిపారు. శిక్ష నుండి తప్పించుకునేందుకే ఇప్పుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు కొత్త డ్రామాకు తెరతీశాడని వారు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: అశ్లీల చిత్రాలను పంపించమని కోరాడు.. ఉద్యోగం గోవిందా..
Comments
Please login to add a commentAdd a comment