Indian Doctor Refuses To Leave Ukraine: ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాక్రమణ దాడి కారణంగా వేలాదిమంది ఉక్రెయిన్ వాసుల, విదేశీయులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వలసల బాట పట్టారు. ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం కూడా ఆపరేషన్ గంగా సాయంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ పౌరులను, విద్యార్థులను తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తోంది.
ఇప్పటికే చాలా మంది పౌరులను తరలించింది కూడా. ఈ క్రమంలో కొంతమంది బంకర్ల ఉన్నాముంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో విదేశాంగ కార్యాలయం రష్యాతో సంప్రదింపుల జరిపి వారిని తరలించే ప్రయత్నాలు కూడా చేసింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన డాక్టర్ గిరి కుమార్ పాటిల్ ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌లో చిక్కుకున్నాడు. ఆయన మెడిసిన్ చదవడానికి 15 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ వెళ్లాడు. ఆ తర్వాత డాన్‌బాస్‌లో స్థిరపడ్డారు.
ప్రస్తుతం అతను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌గా పనిచేస్తున్నారు. అయితే అతని వద్ద రెండు చిరుత పులులు ఉన్నాయి. అయితే వాటిని వదిలి తాను రాలేనని అంటున్నాడు. తన ప్రాణం కోసం పెంపుడు జంతువులను వదులుకోలేను అని చెబుతున్నాడు. ప్రస్తుతం అతను తన పులులతో కలిసి బంకర్లలో తలదాచుకుంటున్నాడు. వాటి ఆహారం కోసం మాత్రమే బయటకు వస్తున్నట్లుగా చెబుతున్నాడు.
అంతేకాదు తన పెంపుడు జంతువులన్నింటినీ ఇంటికి తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం అనుమతిస్తుందని ఆశిస్తున్నాని డాక్టర్ పాటిల్ చెప్పారు. ఇలాగే గత వారం, భారతీయ విద్యార్థి రిషబ్ కౌశిక్ తన పెంపుడు కుక్కతో వచ్చేందుకు భారత ప్రభుత్వం అనుమతివ్వాలని అభ్యర్థించాడు. దీంతో అతను కేంద్ర ప్రభుత్వ చేపట్టిన ఆపరేషన్ గంగా సాయంతో తన పెంపుడు కుక్కతో సహా భారత్‌కి సురక్షితంగా తిరిగి వచ్చాడు.
(చదవండి: వాషింగ్టన్‌లో జెలెన్స్ స్కీ పేరుతో రహదారి! వైరల్ అవుతున్న ఫోటో)
Comments
Please login to add a commentAdd a comment