విమానంలో వైద్యం చేసిన భారతీయ డాక్టర్
కైలాలంపూర్: గాల్లో విమానం ఉంది. అందులో అత్యవసరంగా వైద్య సదుపాయం కావాల్సి వచ్చింది. ఆసమయంలో ఓభారతీయ వైద్యురాలు స్పందించి ప్రాధమిక వైద్య సదుపాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే మలేషియ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం న్యూజిలాండ్ ఎక్లాండ్ నుంచి మలేషియా కైలాలంపూర్ వెళ్తోంది. ఉన్నట్టుండి ఎయిర్ హోస్టస్ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో తనకు అత్యవసర వైద్యసహాయం అందించాల్సి వచ్చింది. చికిత్స అనంతరం ఎయిర్‌హోస్టెస్ కళ్లు తెరిచింది. దీంతో ప్రయాణికులంతా చప్పట్లతో అంచితను అభినందించారు.
ఎమర్జెన్సీ లాండింగ్‌కు పైలట్ సిద్దమయ్యారు. ఎమర్జెన్సీ లాండింగ్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్లడానికి రెండుగంటలు, ఆక్లాండ్ వెళ్లడానికి గంట సమయం పడుతుందని భావించిన సిబ్బంది విమానంలో ఎవరైనా డాక్టర్ ఉంటే సహాయం అందించాలని కోరారు. దీంతో భారత్‌కు చెందిన డాక్టర్ అంచిత స్పందించారు. ఎయిర్ హోస్టెస్ కు ప్రాధమిక వైద్యం అందించారు. ఈ సంఘటన గురించి అంచిత భర్త కుమార్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అత్యవసర సమయంలో వైద్యమందించిన వ్యక్తి తన భార్య కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని పోస్ట్ చేశారు.