అక్కడకు విమానాలు నడపలేం | UA temporarily suspends flights from Newark to Delhi | Sakshi
Sakshi News home page

అక్కడకు విమానాలు నడపలేం

Published Sun, Nov 12 2017 11:34 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

UA temporarily suspends flights from Newark to Delhi - Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ ఆవరించిన పొగమంచు, వాతావరణ కాలుష్యం విమాన సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం అధికంగా ఉండడంతో పాటు, ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ చూపుతున్న ప్రమాదకర గణాంకాలతో యునెటైడ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ న్యూయార్క్‌- ఢిల్లీ విమానసేవలను తాత్కాలికంగా నిలిపేసింది. మరో వారం రోజుల పాటు ఢిల్లీలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాలతో యెనైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

పలు క్లిష్టపరిస్థితుల్లోనపూ విమాన సేవలు అందిస్తున్న పలు సంస్థలు.. విమాన సర్వీసులును రీ షెడ్యూల్‌ చేయడం. ఆలస్యంగా నడడం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ తీసుకున్న నిర్ణయం మిగిలిన విమాన సంస్థలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయోనని పౌర విమానయాన శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement